Akali Vyathalu Written By Bora Bharathidevi
రచన : బోర భారతీదేవి
నెలగంటు పెట్టింది మొదలు ఊరంతా ఒకటే సందడి.బజార్లో ఒకటే రద్దీ. తన చూట్టూ ఉన్న వారిని కూడా గమనించ లేనంతగా గొప్పలు చెప్పుకుంటూ బిజీగా తిరిగే జనాలు. వాళ్ళను చూస్తే రాధకు తన చిన్ననాటి ఆనంద క్షణాలు గుర్తుకొచ్చాయి. రామాపురానికి చెందిన రాధ తన తండ్రిని తీసుకొని పట్టణానికి వచ్చింది.
తన తండ్రి కిడ్నీ వ్యాధి తో బాధ పడుతున్నాడు. తనకి నాన్న నాన్నకు తను తప్ప వేర్వేరు లేరు. ఒకప్పుడు చాలా గొప్పగా గడిపిన కుటుంబం. నిత్యం అతిథులతో కళకళలాడుతూ ఉండేది. రామాపురం ఎవరు వచ్చినా తమ ఆతిథ్యము స్వీకరించ వలసిందే.సంక్రాంతి వచ్చిందంటే నెలరోజులు పండగ ఆనందోత్సాహాలతో సందడిగా ఉండేది.కోడి పందేలు, ఎడ్ల పందేలు, పేకాటలు అంటూ వచ్చిన వారికి విందు భోజనాలతో నెలరోజులు ఇంటిల్లిపాదికీ ఖాళీ విరామం దొరికేది కాదు.నేను చిన్నదానిని అవ్వడం వల్ల నాకు ఇల్లంతా అతిథులతో కలకలలాడుతుంటే చాలా ఆనందంగా ఉండేది.తన తండ్రి చేసిన జల్సాలకు నేడు ఇలా ఒంటరై పోతామని ఆనాడు ఊహించనూ లేదు.
నాకు యుక్త వయస్సు వచ్చే సరికి అమ్మకు జబ్బు చేసి నాన్న చేసిన జల్సాలకు ఉన్న ఆస్తి ఏ ఏయేటికాయేడు తరుగుతూ వచ్చింది. అమ్మ అనారోగ్యంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉన్ననాడు ఇంటి నిండా ఉండే బంధువులు, స్నేహితులు ఎక్కడ సాయం అందించ వలసి వస్తుందోనని మా ఇంటి ఛాయలకు కూడా రావడం మానేశారు.ఉన్న ఆధారం కాస్తా ఆవిరి అవుతుందనే దిగులుతో మా అమ్మ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఒంటరిగా చేసింది.
చివరికి నేను, నాన్న, నిత్యం సందడిగా ఉండే మా ఇల్లు తప్ప ఏమి మిగులలేదు. ఆ ఇంటిలో ఉన్నంత సేపు గతం తలచుకొని నాన్న, నాన్నను చూసి నేను బాధ పడడం. అమ్మలేని ఇంటిలో ఉండలేక పెద్ద బట్టల షాపులో పని కుదుర్చుకొని నాన్నను తీసుకొని పట్టణానికి ప్రయాణమయ్యాను.
ఇంతలో పిడుగు పడినట్టు మరో వార్త. నాన్నకు కిడ్నీ సమస్య మొదలైంది. ఆసుపత్రి కి తీసుకుపోదామని బయటకు వస్తే నూక వేస్తే రాలని జనం.
హంగు ఆర్భాటాల కోసం తిరుగుతున్న ఈ ఆనందం ఎన్నాళ్లు ఉంటుందో తెలియక వెనుక తిరుగుతున్న పిల్లలను చూస్తుంటే నాకు చాలా బాధ గా ఉంది. తల్లిదండ్రులు పరువు ప్రతిష్టలంటూ
గొప్ప లకు పోయి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్న విధంగా చేస్తున్న ఈ అనవసరపు ఖర్చులు నాలా ఎంత మంది జీవితాల్లో విషాదాన్ని నింపుతుందో.ఆలోచిస్తే భయం వేస్తుంది. గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది.
కాని ఎవరు వింటారు?.....
మంచి చెపితే వినేవారెవరు. ..మంచి ఎప్పుడూ చేదుగా ఉంటుంది కదా మరి.
అయినా మనసులో మాట చెపుతున్నా వినండి. మీ వ్యసనాలకు, ఆర్భాటాలకు, హంగులకు మీ పిల్లలను బలిచేయకండి.నడి వీధిలో అసమర్థులుగా పడేయకండి.అతి అనర్థమని తెలుసుకొని పొదుపు చేయడంతో జీవితం హాయిగా నడుస్తుందని గమనించండి. నేటి తరానికి ఆదర్శంగా నిలవండి.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
Comments