top of page

అనామిక

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Anamika' New Telugu Story


Written By Bhagavathula Bharathi


రచన: భాగవతుల భారతి


"ఇంతవరకూ తెరచాటున ఉండి...

మెసేజెస్ ద్వారా మాట్లాడింది చాలు. మీరెవరో ఇదంతా ఎందుకు చేస్తున్నారూ?... ఫోన్ లో అడిగింది స్వప్న.

అవతలివైపు మౌనం ....

"మౌనం మాట్లాడుతుందని తెలుసు...

కానీ మీరు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లేదు... మీరెవరూ?...రోజూ మెసేజెస్ పెడుతున్నారు?.... అప్పుడప్పుడు డబ్బులూ పంపుతున్నారు... కారణం ఏమిటీ? "

మళ్ళీ మెసేజ్ " టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. అయినా పరస్పరం అభిమానం

సంపాదించటానికి ఆస్తులూ, అంతస్థులతో పాటే, పేరూ, ఊరూ తెలియాల్సిన అవసరమూలేదు "

"మీరు మగవారా? ఆడవారా?"

సమాధానం లేదు కానీ ఐదువేల రూపాయల గూగుల్ పే రసీదు... వాట్సప్ లోకి వచ్చింది. స్వప్న నిట్టూర్చింది దీర్ఘంగా.

కాలం తనపనితను చేసుకొంటూ పోతూనే

స్వప్న పెద్దకూతురు కార్తీకను ఐ. ఎ. యస్ ను చేసింది.

చిన్నకూతురు ప్రదీపను డాక్టర్నూ చేసింది.

కొడుకు షణ్ముఖ.... ఇంకా చదువుతూనే ఉన్నాడు.

గతంలోంచి నడిచివచ్చిన దారిచూసుకుని.... ఇన్ని మైలు రైళ్ళు ఇంత ఒంటరిగానే కష్టపడి దాటి వచ్చానా? అనుకుంటూ గతంలోకి అవలోకనం చేస్తే...

@@@

స్వప్న చిన్న ప్రయివేట్ స్కూల్ టీచర్ గా

పనిచేస్తూ, పిల్లలను చదివించటం తలకుమించిన భారమైపోయింది.

ఆ సమయంలో ఓ మెసేజ్... " మీకు ఇబ్బంది కలిగించకుండా మీతో ఫ్రెండ్ షిప్ చేస్తే మీకేమయినా అభ్యంతరమా?! " అని.

సమాధానం ఇవ్వలేదు స్వప్న.

కొన్నాళ్ళు వాళ్ళే మెసేజెస్ పెట్టేసుకుని మానేస్తారులే అనుకుంది.. మానలేదు.

పైగా అవతలి వారి వల్ల తనకు ఇబ్బందేం లేదు కాబట్టి....కంటిన్యూ చేసింది.

తర్వాత ఫోన్ పే లో చిన్న మెుత్తంలో డబ్బులు రావటం మెుదలయింది.

స్వప్నకి భయం వేసింది. ఒంటరి ఆడదాన్ని ఇలా ఆటపట్టించి... చివరిలో ఎమౌంట్ అంతా ఇమ్మంటే గతేంటి?! ఆలోచనలు పసిగట్టినట్లుగా....

"మీరు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీ శ్రేయోభిలాషినే. " మెసేజ్.

బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ ద్వారా.. వివరాలు సేకరించే తెలివితేటలు, ఓపిక స్వప్నకు లేవు. తన చిన్నసంపాదనకు ఆ చిన్నమెుత్తాలూ జతకూడటంతో కొంత ఊరట....

గతంలోంచి బయటకువచ్చి....

"ఇన్ని సంవత్సరాలుగా,ఆదుకున్న అపరిచితులా (రాలా) మిమ్మల్ని ఓ సారి చూసి, మీకు నమస్కారం చేసుకోవాలని ఉంది. ప్లీజ్ దర్శనం ఇవ్వండి " మెసేజ్ పెట్టింది.

"మీ బాబు చదువు కూడా అయ్యాక మీ ఎదురుగా వద్దామనుకున్నాం కానీ ఆడపిల్లలిద్దరూ ప్రయోజకులయ్యారు కాబట్టి...మమ్మల్ని చూసాక మీరు మమ్మల్ని అసహ్యించుకున్నా... మీరు క్షేమంగానే ఉండగలరు.... అనేధీమాతో...

రేపు 10 గంటలకు మీ ఇంట్లో అడుగుపెడతాం " మెసేజ్ వచ్చింది.

ఆరాత్రి తెల్లవార్లు నిద్దురపోకుండానే గడిపేసింది స్వప్న...

మనసు పరిపరివిధాల పోతోంది .ఎవరై ఉంటారు?! తాను వయసులో ఉన్న భర్తపోయిన ఆడది.....

ఒకవేళ... డబ్బుఆశ చూపి...తనని

లొంగదీయటానికీ!? ....ఆపై ఆలోచించలేకపోయింది... పది ఎప్పుడవుతుందా అని ఎదురుచూసింది.

కాలింగ్ బెల్లు మోగింది.పరుగున తలుపుతీసింది.

ఎదురుగా ఓ నడివయసు దాటుతున్న స్త్రీ.

స్వప్న ఆహ్వానించకుండానే....

లోపలికి వచ్చి కూర్చుంది.

"మీరూ?!"

"నేను శశిశేఖర్ కి అమ్మని...నాకు తెలుసు వాడి పేరు ఎత్తితే నన్ను ఛీ కొడతావని ...

వాడు చేసిందితప్పే... కానీ ఆడదానికి ఆడది శత్రువుకాదు. "

మళ్ళీ ఆమే అంది.

"షణ్ముఖ నీ కడుపులో ఉండగానే నీ భర్త యాక్సిడెంట్ లో పోయాడు. పుట్టింటివారి బీదరికం... అత్తింటివారు తమ కొడుకు పోయాక,కోడలిగా నిన్ను ఆదిరించలేదు "

కాసేపటికి తేరుకున్న స్వప్న...

"అవును! అలాంటి నిస్సహాయ స్థితిలోనేగా మీ అబ్బాయి శశిశేఖర్ ఆఫీసులో, ఉద్యోగానికి వచ్చానూ... కానీ... " అర్ధోక్తితో ఆగింది స్వప్న.

"అవును! అప్పటికే శశీ,పెళ్ళాం గొడవపడి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులకు కేసువేసింది. మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. "

"ఐతే మాత్రం"

"ఆసమయంలో నిన్ను చూసి ఇష్టపడ్డాడు.

ఒంటరితనంతో వేగిపోతున్న వాడు ఆ సమయంలో అదే పరిస్థితి లో ఉన్న నువ్వు ,వాడి ఆఫీసులో ఉద్యోగానికి వచ్చావు...నాకు చెప్పాడు...

నీతో డేటింగ్ చేయాలని... నిన్ను అడిగానని నువ్వు తిరస్కరించావని... "

"నేను చెప్పాను ....

నీ మనసుకు నచ్చింది చేయటంలో తప్పులేదు. కానీ వేరొకరి మనసును

నొప్పించి చేయటం పెద్దతప్పు అని...."

"వాడు వినలేదు. ఆ రాత్రి నిన్ను... రేప్...

చెప్పటానికి నాకే సిగ్గుగా ఉంది. జరిగిందానికి నీకు క్షమాపణ చెప్పి, పిల్లల తల్లివైనా నీకూ వాడికి... పెళ్ళి చేద్దామనుకున్నాను. కానీ నువ్వు వాడిమీద అసహ్యంతో వెళ్ళిపోయావని తెలిసింది.

ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఏమై పోయావోనని తల్లడిల్లిపోయాను. వాడు చేసిన తప్పుకు ప్రయిశ్చిత్తంగా ఇదంతా చేసాను. నా కొడుకును మన్నించక పోయినా ఫర్వాలేదు శపించకు." శశిశేఖర్ తల్లి మాటలకు...

రోషంతో ముఖం తిప్పుకుంది స్వప్న.

"ఆడదానికి ఆడదే శత్రువంటారుగానీ, నేను నీకు శత్రువును కాదు, జరిగిందానికి

శశిశేఖర్ ఎంత కుమిలిపోతున్నాడో నీకు తెలీదు."

"ముగ్గురు పిల్లలతో తన ఆఫీసులో ఉద్యోగం మానేసి, ఈ జనారణ్యంలో తనలాంటి తోడేళ్ళ మధ్యన, నువ్వెలా ఎక్కడ ఉన్నావో నని మానసికంగా నలిగిపోతున్నాడు.

కానీ నువ్వు ఇక్కడున్నావని గానీ, నేను అపరిచితురాలిగా నీకు సాయంచేస్తున్నానని గానీ ఎంతమాత్రం తెలీకుండా జాగ్రత్త పడ్డాను... తెలిస్తే?!....

మళ్లీ ఏదైనా?!.... "

"ఓ అనామిక గా ఇంతకాలం మీరు అందించిన అండదండలకు నిజంగా ధన్యవాదాలు.మీకు వందనాలు" వంగి పాదాలకు నమస్కరించింది,స్వప్న.

"నేను చేసింది కేవలం, నా కొడుకు పాపపరిహారమే, కానీ...

ఈ కుంకుమ భరిణ ఇక్కడ పెడుతున్నాను.

నీకిష్టమైతేనే... నుదుట పెట్టుకుని...రేపు

ఇదే సమయానికి నేనువచ్చినప్పుడు నాకు ఎదురురా ! నీ కిష్టం లేకపోతే వద్దు.

కానీ ఆర్ధికంగా నీకు సాయంగానే ఉంటా.

సహాయం మాత్రం తిరస్కరించవద్దు .

ప్రతిఫలం ఆశించికాదూ!..... " కుంకుమ భరిణ అక్కడపెట్టివెళ్ళిపోయింది.

అక్కడే ఉన్న కుంకుమభరిణకేసే చూస్తూ, ఆలోచిస్తూ ఉండిపోయింది స్వప్న.

@@@@@@@

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
115 views0 comments

Comentários


bottom of page