'Avaniki sweccha' written by Gunda Venkata Lakshmi
రచన : గుండా వెంకటలక్ష్మి
నా పేరు మహతి. నేను నా భర్త శ్రీధర్ ఇద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగస్థులమే. నాకు ఒక పాప తన పేరు వైశాలి ముద్దుగా వైషూ అని పిలుచుకుంటాం. మా పాప వయసు 6 సంవత్సరాలు. ఈ మధ్యే స్కూల్ లో చేర్చాము. పగలంతా ఉరుకులు పరుగులతో పనులు చేసుకోవడం ఎవరి కారియర్ లు వాళ్ళు తీసుకుని పరిగెత్తడం,వచ్చిన వెంటనే పాపకు ఏదైన పెట్టి తన హోంవర్క్ చేయిస్తూ ఇద్దరం కాఫీ తాగటం,ఎదో తిన్నామంటే తిన్నామని నాలుగు మెతుకులు తిని పడుకోవడం. కొంచెం అటు ఇటు గా రోజు ఇదే నా దినచర్య. ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఈ పరుగులు ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు అని. కానీ ఎం చేస్తాం తప్పదు ఈ మహా నగరం లో బ్రతకాలంటే ఇద్దరి సంపాదన అవసరమే. ఐదంకెల జీతం వదిలేసి వచ్చేయలేను కదా.
మా వైషూ ఆడుకుంది అంటే అది ఒక్క ఆదివారం మాత్రమే తనే కాదు మా అపార్ట్మెంట్స్ లో వుండే పిల్లల పరిస్థితి కూడా అదే. వాళ్ళను చూసినప్పుడల్లా చాలా బాధేసేది ఆడుకోవడానికి కూడా స్వాతంత్రం లేదు ఉదయాన్నే మాతో పాటు ఈ పిల్లలు కూడా పరుగందుకోవాల్సిందే, ఎప్పుడో సాయంత్రం వచ్చి వాళ్ళ వర్క్ ఐపోయేసరికి వాళ్ళు కూడా అలసిపోయి నిద్రపోతారు. ఇప్పటి వీళ్ళను చూస్తే నా చిన్నతనం ఎంత అందంగా ఉండేదో కదా అనిపిస్తుంది.
ఒకసారి ఎదో అత్యవసరం అయ్యి వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. మామూలుగా ఐతే ఎవరో ఒకరం వెళ్లి పని చూసుకుని వచేస్తాం కాబట్టి వైషుని ఎవరో ఒకరం ఉండి చూసుకునేవాళ్ళం కానీ ఈ సారి ఇద్దరం వెళ్లాల్సిన పరిస్థితి. పాప స్కూల్ లో మాత్రం సెలవు ఇవ్వము అని తెగేసి చెప్పేసారు. అంతకు ముందు నెలలో చాలా సార్లు అనారోగ్యం కారణంగా వెళ్ళలేదు అందుకే ఈ సారి సెలవు ఇవ్వమన్నారు. చేసేది లేక మా అపర్ట్మెంట్లో వుండే నా స్నేహితురాలి ఇంట్లో పాపను వదిలి వెళ్ళాము. ఇక్కడ ఇదంతా సాధారణమే ఇక్కడ అందరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు. ఎందుకంటే ఉద్యోగస్తుల తిప్పలు ఇక్కడి వాళ్లకు అందరికి తెలుసు చాలా మటుకు అందరూ ఉద్యోగస్తులు మరి.
అలా ఒక్కరోజు కోసం వెళ్లిన మేము మూడు రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. ఇదే విషయం నా స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పాను. తను అర్ధం చేసుకుని సరేనని ఒప్పుకుంది. వైషూ ని వదిలి ఐతే వచ్చాము కానీ నా ధ్యాస అంత తన మీదే ఉండిపోయింది. మూడోరోజు తొందరగానే పని ముగించుకుని ఇంటికి వెళ్ళాము. వచ్చిన వెంటనే నా స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తనకు కృతజ్ఞతలు చెప్పి పాపను తీసుకుని వచ్చాను. రాత్రి ఆలస్యమైంది కాబట్టి తిని వెంటనే నిద్రపోయాం. మళ్ళీ జీవితం మామూలు అయ్యింది అప్పుడే మేము ఊరు వెళ్లి వచ్చి వారం ఐపోయింది. వచ్చిన దగ్గరనుంచి వైషూ ఒకటే అడుగుతుంది అంటీ ఇంట్లో చాలా మంచి వాసన వచ్చింది నాకు కావాలని ఒకటే ఏడుపు. ఏ రోజుకు ఆరోజు సరే అంటూ మాట దాటేస్తూ వచ్చాను కానీ ఈ రోజు ఆదివారం వైషూ బాధ తట్టుకోలేక నా స్నేహితురాలి దగ్గరికి వెళ్లి అడిగాను తనకు కూడా ఏమి అర్ధం కాలేదు వైషూ దేని గురించి అడుగుతుందో. తను వాళ్ళ ఇంట్లో ఉన్న రెండు రోజులు ఎం తిన్నదో తెలుసుకుని అదే చేసాను తను దాని గురించే అడుగుతుందేమో అని కానీ అదికూడా కాదని ఒకటే ఏడుపు. ఎదో మాటలు చెప్పి బొమ్మలు తెచ్చి తనని మాయం చేసాను.
కాలం ఎవరికోసం ఆగదు కదా అలా మరో నెలరోజులు గడిచిపోయింది. అనుకోకుండా ఒకరోజు నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాము నేను పాప. మేము మాట్లాడుతూ ఉండగా పాప వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంది. ఉన్నట్టుండి వర్షం మొదలయింది. వరండా లో ఆడుకుంటున్న వైషూ నా దగ్గరికి వచ్చి దాదాపు నన్ను లాక్కెళ్లినట్లే వరండా లోకి తీసుకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి మనసంతా చాలా హాయిగా అనిపించింది ఒక్కసారిగా నా చిన్నతనం నా కళ్ళ ముందు కనిపించింది వానలో ఆదుకున్న నా చిన్నతనం,ఇప్పటి ఈ పిల్లలు మర్చిపోయిన అనుభూతి. వైషూ కదిపేసరికి అప్పుడు వచ్చాను మనలోకం లోకి. అమ్మ చూడు నేను చెప్పాను కదా మంచి వాసన అని ఇప్పుడు వస్తుంది చూడమ్మ నాకు చాలా నచ్చిందమ్మ అని చాలా సంబరంగా చెప్పుకుంటూ పోతుంది. అదే వాసన ఈ మధ్య నేనె కాదు ఈ కాంక్రీట్ జంగల్ లో అందరూ మర్చిపోతున్న వాసన,మట్టివాసన అప్పుడు గమనించాను ఆ వరండా అంత చాలా రకాల మొక్కలు అక్కడక్కడ పెంచుతున్నారు. అదే నా కూతురుకు నచ్చిన వాసన.
అప్పటినుంచి నేను కూడా మా వరండాలో మొక్కలు పెంచడం మొదలెట్టాను. అందరూ అంటారు ఈ అపార్ట్మెంట్స్ లో వుండే అంతంత మాత్రం స్థలం లో మొక్కలు ఎక్కడ పెంచగలం అని, మనసుంటే మార్గం తప్పక ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఈ కాలం లో మొక్కలు పెంచడం పెద్ద కష్టం కాదు అని నేను పెంచడం మొదలు పెట్టాకనే తెలిసింది. నేను గా ఈ సమాజానికి ఏమి చెయ్యవలసిన అవసరం లేదేమో, మన వంతు బాధ్యతగా వీలైనన్ని మొక్కలు నాటితే చాలేమో.
ఇప్పుడు నా వైషూ చాలా ఆనందంగా ఉంది స్కూల్ నుంచి రాగానే మొక్కల దగ్గర కాస్త సమయం గడపడం మా పరుగుల జీవితం లో ఒక భాగం అయ్యింది. రోజంతా పడిన కష్టం అలసట ఆ మొక్కల మధ్య మర్చిపోతూ మరుసటి రోజు ఓ కొత్త అనుభూతి తో మొదలు అవుతుంది మా ఉదయం.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
ప్రస్తుత ఉరుకుల పరుగుల నాగరికపు జీవితంలో మనం మరచిన ఒక అనుభవమే ఈ మట్టి వాసన. వర్షపు నీటికి తడచిన మట్టి వాసన అద్భుతంగా ఉంటుంది. గత స్మృతులను మీ ఈ కధ ద్వారా చాలా చక్కగా వివరించారు.
Superb sis.. మట్టి నేల పరిమళాలు నేటి పిల్లలకు అందించలేకపోతున్నాం.. చాలా బాగా రాసారు.. jo
చిన్నప్పుడు మనం అనుభవించిన
పుడమితల్లి పరిమళాలు ఈ నాడు మన పిల్లలు కు అందించలేకపోతున్నాం అని చాలా చక్కగా చెప్పారు అండి👌👌👏👏👏💐💐🌹
చిన్ననాటి జ్ఞాపకాలు అవి. మళ్ళీ గుర్తొచ్చాయి.చాలా బాగుంది కథ.అందరూ అలా చేస్తే చాలా బాగుంటుంది.
Nice story 👌💯. Marchipoena matti vaasana telipina kuturiki plants (mokkalu)evadam
♥ okay maduranubhuti. As well as children's likes 👍 telusukovadam, valatho time spend chayadam very important 👩👧