top of page
Writer's pictureKolla Pushpa

భవిష్య దర్శనం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Youtube Video link

'Bhavishya Darsanam' New Telugu Story


Written BY Kolla Pushpa


రచన: కొల్లా పుష్ప


2050వ సంవత్సరం, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం, పెద్ద అపార్ట్మెంట్స్ సముదాయం, అందులో 250 వ అంతస్తు, అందులో ఒక గదిలో మంచం మీద అవంతి పడుకుని ఉంది.

తలుపు చప్పుడైన శబ్దానికి కళ్ళు తెరిచింది. ఒక రోబో వచ్చి, ప్లేట్లో ఉన్న రొట్టె లాంటి పదార్థాన్ని నోట్లో పెట్టింది. రెండు నిమిషాలాగి వాటర్ పైపు నోట్లో పెట్టింది. నాలుగు చుక్కల నీళ్లు నోటిలో పడ్డాయి.

రోబో వెళ్ళిపోయింది.

గదినిండా పైపులు..

ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ పైపు, నీళ్లకు వాటర్ పైపు, ఏసీ ,అలాగే హీటర్, మలమూత్రాలు పోవడానికి కూడా గొట్టాలు ఉన్నాయి.

'ఇది హాస్పటల్ కాదు, తన గది. కొడుకులు తన కోసం అమర్చిన గది.

కొడుకుల్ని హాస్టల్ లో పెట్టి బాగా చదివిస్తే అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి తను కూడా అక్కడ అన్ని చూడొచ్చు వాళ్లతో పాటు అనుకొని వాళ్లని హాస్టల్ లో పెట్టి చదివించింది.

వాళ్లు బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికా చూద్దామని రెక్కలు కట్టుకుని ఇండియా నుంచి వచ్చింది.

వచ్చిన నెలరోజులకే కీళ్లవాతం తో మంచాన పడింది. అప్పటి నుంచి అన్నీ మంచం మీదే. కసుక్కున పొడిచిన ఇంజక్షన్ నొప్పికి కళ్ళు తెరిచింది.

రోబో నర్స్ వచ్చి ఇంజక్షన్ చేసి బట్టలు మార్చి వెళ్ళిపోయింది .

'అన్నీ ఇక్కడ ఆ రోబోలే కనీసం మనసులో మాట చెప్పుకోడానికి లేదు'..

టిీవి 24 గంటలు ఎదురుగుండా మోగుతూనే ఉంటుంది. అరగంటకో ఛానల్ మారుతుంది దానంతటఅదే. అలా సెట్ చేసారు.

కొడుకులైనా వస్తే వాళ్లతో మాట్లాడదామని అనుకుంటే వాళ్లు కూడా టీవీలోనే నెలకోసారి, "హలో మామ్" అంటూ కనిపిస్తారు.

తిరిగి మాట్లాడే లోపే వాళ్ల బొమ్మ పోయి టీవీ ప్రోగ్రామ్స్ వచ్చేస్తాయి. తన గోడు ఎవరితో చెప్పుకోవాలి అని రోదించింది.

"మేడం! ఎక్కువ ఏడిస్తే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది, దానికి ఎక్కువ ఛార్జి అవుతుంది" అని టీవీ స్క్రీన్ మీద రోబో వచ్చి చెప్పింది.

దేవుడా! ఊపిరి తీసుకోవడానికి కూడా లెక్కకట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారన్నమాట. ఏం దౌర్భాగ్యం వచ్చి పడింది.

తను చేసిన పాపం ఇలా ఈ రూపంలో వచ్చిందా? చిన్నప్పుడు ఎవరో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి "నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది" అని రుజువైంది.

***

ఇండియాలో అత్తగారు, మామగారు పల్లెటూర్లో ఉండేవారు. వాళ్ళకు ఒక్కడే సంతానం శ్రీపతి, అల్లారుముద్దుగా పెంచి చదివించారు .

ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది అప్పుడే తమ ఇద్దరికీ పరిచయం. ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాము. అత్తమామలు అభ్యంతరం చెబుతారేమోనని, వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాము.

కానీ వాళ్లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. ఆ పల్లెటూర్లో ఇమడలేక తిరిగి ఢిల్లీ వెళ్లి పోయాము .

@@@

ఒక రోజు మామగారు చనిపోయారు అని తెలిసి వెళ్లి కార్యక్రమం పూర్తి చేసి, శ్రీపతి అక్కడ ఉన్న పొలాలు ఇల్లు అమ్మి తల్లిని తీసుకొచ్చాడు.

ఆమె పల్లెటూరు వాలకం చూసి మెట్ల కింద స్టోర్ రూమ్ లో ఉంచింది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ముందు అత్తగారు అని చెప్పలేక ఆమెను గదిలోనే ఉంచేది.

తను ఎప్పుడూ వంట చేసేది కాదు. "అమ్మా వంట నేను చేసేదా" అని అడిగింది అత్త సుందరమ్మ.

"మీవి పల్లెటూరి వంటలు. వద్దు"అని చెప్పి చెయ్యనివ్వలేదు.

రోజుా పొద్దున్నే హోటల్ లో ఆర్డర్ ఇచ్చిన టిఫిను పంపేదాన్ని. ఆమె తినలేక పోయేది అనుకుంటా.

పని పిల్ల తో ఎన్నోసార్లు చెప్పేరట ‘నాకు ఒక ఇడ్లీ, కారం పొడి, కొంచెం నెయ్యి వేసి ఇస్తే చాల’ని.

కానీ ఏనాడు తను వినిపించుకోలేదు.

భోజనం కూడా మేము బయట తినేసి ఆమెకు స్విగ్గి లో ఆర్డరు ఇచ్చేది. అలాంటి తిండి తిన లేకపోయేది. ఆ విషయం కూడా పని పిల్ల చెప్పింది. కానీ తను పట్టించుకోలేదు.

***

ఒకరోజు కొడుకు శ్రీపతిని చూడటానికి గదిలోంచి బయటకు వచ్చింది సుందరమ్మ. కానీ తను కసిరి "ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నారు. నీకెందుకు లోనికి వెళ్లండి” అంది కఠినంగా.

"పోనీ దూరం నుంచే చూస్తాను" అని బతిమిలాడి చూసేది.

పిల్లలు బాగా చదివితే అమెరికా పంపొచ్చు అనే ఉద్దేశంతో వాళ్లు వద్దంటున్నా పిల్లల్ని హాస్టల్ లో పెట్టి ఆప్యాయత అనురాగాలకు దూరం చేసింది.

అందుకే ఈనాడు ఇలా బాధపడుతోంది. ఆఖరికి ఆక్సిజన్ కూడా మనం ఎంత పీలిస్తే అంత డబ్బులు చార్జి చేస్తున్నారు.

ఆ రోజుల్లో అత్తగారు "కాసేపు పచ్చని చెట్ల మధ్య కాసేపు కూర్చోనా" అని అనేవారు దానికి తను అడ్డు చెప్పేది.

అందుకని గాలి వెలుతురు లేని ఆ గదిలోనే ఉండి పోయేవారు. 70 ఏళ్ల వరకు బాగున్న మనిషి. ఢిల్లీకి వచ్చిన సంవత్సరానికే క్రుంగి కృశించి పోయారు.

'ఈనాడు తనకు ఈ పరిస్థితికి కారణం ఆరోగ్యమైన తిండి తినకపోవడమే. ఎప్పుడూ స్విగ్గిలో, జమాటో లో ఆర్డర్ ఇచ్చిపిజ్జాలు, బర్గర్లు తినటం వల్ల ఈ పరిస్థితి.

భర్త కూడా బీపీ, షుగర్ వలన 55 ఏళ్లకు చనిపోయాడు . తనకు 50 ఏళ్లకు ఈ పరిస్థితి వచ్చింది. ఏదో అనుభవించేద్దామని కొడుకుల దగ్గరికి రెక్కలు కట్టుకుని వాలింది కానీ వచ్చిన నెలరోజులకే ఇది పరిస్థితి.

ఇదంతా తన స్వయంకృత అపరాధమే అనుకుని వెక్కివెక్కి ఏడుస్తుంది.

"అవంతి.. అవంతి.. ఎందుకు అలా ఏడుస్తున్నావు?"అని శ్రీపతి పిలుస్తుంటే కళ్ళు తెరిచి చూసింది అయోమయంగా!


పిల్లలు, భర్త తనవైపు ఆత్రుతగా చూస్తున్నారు ఆశ్చర్యంగా?

'అమ్మో ! ఇదంతా కల?' ఎంత భయంకరంగా ఉంది.

నిన్నే పిల్లల్ని హాస్టల్ కి పంపాలని భర్తతో వాదించింది.

ఆఖరికి "సరే "అన్నాడు శ్రీపతి. ఇప్పుడు భర్తతో వెంటనే “పిల్లల్ని హాస్టల్ కి పంపను" అన్నది నిశ్చయంగా.

పిల్లలు చాలా ఆనందపడ్డారు.

@@@

మర్నాడు ఉగాది పండుగ. పిల్లలిద్దరికీ తలంటి పోసి కొత్త బట్టలు వేసింది. అత్తగారి గదిలోకి వెళ్లి స్వయంగా ఆమెకు స్నానం పోయించి కొత్త చీర కట్టింది. వేరే గాలి వెలుతురు వచ్చే గదిలోకి ఆమెను మార్చింది.

స్వయంగా ఉగాది పచ్చడిచేసి ఇచ్చింది అందరికీ.

ఇడ్లీ పెట్టి భర్తకు, పిల్లలకు, అత్తగారికి డైనింగ్ టేబుల్ మీద వేడి వేడి ఇడ్లీ , నెయ్యి, కారంపొడి తో వడ్డించింది .

అవంతి లోని మార్పుకి భర్త ,పిల్లలు, అత్త సుందరమ్మ ఆశ్చర్యపోయి చూస్తున్నారు "ఏమిటి అద్భుతం? అని .

కానీ వాళ్ళెవరికీ తెలియని రహస్యం 'తనకు కలలో భవిష్యత్ దర్శనం కలిగిందని, అందుకే ఇలా మారిందని' అవంతికి మాత్రమే తెలిసిన విషయం.

******** *శుభం* *******


కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప




47 views0 comments

Comments


bottom of page