top of page

దూరపు చుట్టం


'Durapu Chuttam' New Telugu Story Written By Penumaka Vasantha

'దూరపు చుట్టం' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"జరగండీ! వెనక వాళ్లకు ప్రసాదం అందాలి కదా!? అందరికీ పెడతాం. ప్రసాదం కోసం కొట్టుకోకండి” అని విసుగుతో కూడిన అరుపులాగా ఉంది కానీ కఠినం గా లేదు.


అదే మృదుత్వం..


ఎక్కడో విన్నట్లుగా ఉంది ఈ గొంతు..

‘హరితది, లాగా ఉందే!' అనుకుంటూ కళ్ల జోడు సరి చేసుకుంటూ చూసాడు అక్కడ ఉన్న స్త్రీని రాంబాబు ఆసక్తిగా..

"అవును! హరితే.. ! కొంచం వొళ్లు చేసింది. చేతికి బంగారు గాజులు అటూఇటూ, మెడ నిండా సొమ్ముల తో, నిండుగా, ఇంకా కళ్ళల్లో మెరుస్తున్న ఆనందం తో నిండుగా ఉంది.

రాంబాబు వెంటనే తన్ను చూసుకున్నాడు. భుజానికి సంచి, పీక్కుపోయిన బుగ్గలు, బక్క చిక్కిన శరీరం, లూజ్ షర్ట్, పాంట్..


జేబులో నుండి దువ్వెన తీసి దువ్వుకుని, సెల్ ఫోన్లో ఒకసారి మొహం చూసుకొంటే!


ఎంత అసహ్యంగా ఉన్నానో! అనుకొంటూ.. క్యూ లో ముందుకు కదిలాడు.

హరిత చేతి ప్రసాదం తీసుకోకుండా వెళ్దాం అనుకుంటే, అమ్మో!? దేవుడి ప్రసాదం తీసుకోకుండా వెళితే! మహా పాపం.


ఇంతలో వెనుక నుండి ఎవరో నెట్టారు రాంబాబును! సరిగా, వెళ్లి హరిత ముందు ఉన్నాడు.

హరిత ప్రసాదం పెడుతూ..


నన్ను చూడలేదు. అమ్మయ్య! అనుకొంటూ ముందుకు కదిలాడు. గుడిలో ఒక మూల కూర్చొని ప్రసాదం తింటూ వెనక నుండి హరిత ను గమనిస్తున్నాడు రాంబాబు.

ఇద్దరు పిల్లలు వచ్చి హరిత ను చుట్టు ముట్టారు ‘అమ్మా!’ అంటూ. వాళ్లకి, ప్రేమ గా ప్రసాదం తినిపించింది.


“అమ్మా! ఇంటికి వెళ్దాం!” అని గోల చేస్తుంటే “ఒక్క పది నిముషాలు ఆగండి నాన్న.. నాన్న వస్తారు.” అంది.

చేతినిండా ఉంగరాలు, బ్రాస్లెట్, మెళ్ళో పెద్ద గొలుసుతో ఉన్న అతను హరిత తో ఏదో మాట్లాడుతున్నాడు. బహుశా భర్త కాబోలు..


అందరూ కారు వైపు నడిచారు.

ఇంతలో..

నా వైపు వస్తుంది ఏంటి?.. అనుకునేలోపు నా పక్కన ఉన్న కొళాయి దగ్గరికి చేయి కడుక్కోవటానికి వచ్చింది.

హరిత, రాంబాబు ను చూసి గుర్తుపట్టి "బాగున్నారా!" అంది.


ఇక ఏమి చేయలేక తల వూపాడు రాంబాబు.


“మీ అమ్మ, తమ్ముళ్లు, బావున్నరా!” అంది.


"అమ్మ పోయింది. తమ్ముళ్లకు పెళ్ళిళ్లు అయీ.. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు”


"బిజినెస్ నడుస్తుందా.. మళ్ళి పెళ్లి చేసుకున్నారా?"


"ఏదో? అలా.. నువ్వు ఎలా ఉన్నావు.. ఆ పిల్లలు..?" అని సందేహంగా అడిగాడు.


“మా పిల్లలే, అదే మావారి పిల్లలు. మీరు నన్ను పిల్లలు లేరనేగా? వదిలేసారు. ఆయనకి భార్య పోయింది. పిల్లలకి తల్లి కావాలి! నన్ను చేసుకున్నారు. ప్రాణం ఒక ఎత్తు గా చూసుకుంటారు నన్ను. ఆయనకు ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చింది. నేను కడుపు తో ఉన్నాను. అందుకే గుళ్ళో ప్రసాదం చేయించి పంచుతున్నాము”

పిల్లలు హరిత దగ్గరికి రావటం తో "ఉంటాను" అని వెళ్లి కారు ఎక్కింది. హరిత వెళ్ళిన వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు రాంబాబు.

ఇంట్లో అందరూ రాంబాబు హరితను పెళ్లి చేసుకున్నప్పుడు వ్యతిరేకించారు. ఎందుకంటే కట్నం తక్కువ, పిల్ల కాస్త లావు గా ఉందని! కానీ హరితనే చేసుకుంటానని పట్టు పట్టడంతో ఏమీ అనలేక పోయారు. సుందరమ్మ ముగ్గురు కొడుకుల్లో రాంబాబు పెద్దవాడు.

హరిత వచ్చిన తర్వాత, బిజినెస్ దెబ్బ తినటం, పెళ్లి అయి రెండు యేళ్లు అయినా పిల్లలు పుట్టకపోవటం తో సుందరమ్మ హరితను ఆడిపోసుకొనేది.

రాంబాబు కూడా అమ్మ చెప్పిన మాట విని హరితను సతాయించటం చేసేవాడు. పిల్లలు పుట్టడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే హరిత వొళ్లు తగ్గాలని, రాంబాబు కూడా మందులు వాడాలన్నారు.

సుందరమ్మ ‘మా పిల్లాడి లో లోపం లేదు. హరిత లోనే లోపం’ అని ప్రచారం చేసింది ఊళ్ళో. హరిత వొళ్లు తగ్గటానికి ప్రయత్నాలు చేస్తున్నది. గుళ్ళు గోపురాలు, తిరుగుతున్నది.

అందరూ.. అంటే రాంబాబు, తల్లి, తమ్ముళ్లు కలిసే ఉంటారు. హరిత వచ్చిన దగ్గరనుండీ ఇంటిని చాలా పొదుపుగా నెట్టుకొస్తున్నదనీ రాంబాబు డబ్బు వ్యవహారాలు, హరితకు కట్టబెట్టాడు. ఇది అమ్మకు, తమ్ముళ్లకు కంటగింపుగా ఉంది.

బీరువాలో డబ్బు పోయింది. ఆ బీరువా కీస్ హరిత దగ్గర ఉంటాయి. సుందరమ్మ ఈ సాకుతో హరిత ను వదుల్చుకోవాలనీ రాంబాబుతో “మీ తమ్ముడు చూసాడుట! నిన్న హరితా వాళ్ల అమ్మ వస్తె బీరువా తీసి డబ్బులు ఇచ్చిందిట” అని చెప్తే రాంబాబు హరిత ను నిలదీశాడు.


"డబ్బులు ఏవని? నేను తీయలేదు..” అని కన్నీళ్ల తో వేడుకుందీ హరిత.

అమ్మా, తమ్ముళ్లు చెప్పిన మాట విని హరిత ను బయటకు నెట్టాడు. ఆ తర్వాత హరిత ఇంటికి వద్దామని చూసినా సుందరమ్మ, తమ్ముళ్లు రానీయలేదు హరితను ఇంటికి.

పెద్దమనుషులతో కూర్చొని ఒప్పందం చేసుకుని హరిత, రాంబాబులు విడిపోయారు. ఆ తర్వాత తెలిసింది. ఆ డబ్బు తమ్ముళ్లు, డూప్లికేట్ తాళం తో తీశారని.

అపుడు తను తప్పు చేశాడని తెలుసుకొని హరిత వాళ్ల ఊరు వెళ్ళాడు రాంబాబు. వాళ్ళు ఆ ఊరి నుండి వెళ్లి పోయారుట. ఆ తర్వాత రాంబాబుకి పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. సుందరమ్మ గయ్యాలితనం, తమ్ముళ్ళ చెడు అలవాట్లు చూసి.


ఆ తర్వాత, పెద్దతమ్ముడు, లతను పెళ్ళి చేసుకున్నాడు. లత ఎపుడు ఇంట్లో గొడవ చేసేది. నేను ఈ ఇంట్లో వాళ్లకి చాకిరీ చేయటానికా?! పెళ్ళి చేసుకుంది, అనీ వచ్చిన, మూడు నెలల్లోనే వేరు కాపురం పెట్టింది.

చిన్న తమ్ముడు, అమ్మ, రాంబాబు ఉండే వాళ్ళు. అమ్మ, రోజు అనుకునేది, ‘ఒక్కమాట ఎదురు చెప్పకుండా పని చేసేది హరిత’ అని..

చిన్న తమ్ముడి పెళ్ళి అవ్వటంతోనే వేరు కాపురం పెట్టాడు. రాంబాబు, అమ్మ వండుకు తినేవాళ్లు. తను హరిత గురించి తెలిసిన వాళ్ల దగ్గర అడుగుతునే ఉన్నాడు.


హరిత గురించి దిగులు పడీ వాళ్ల, నాన్న పోయాడుట! హరిత, తమ్ముడూ, వాళ్లమ్మ సిటీకి వెళ్ళిపోయారు అని కొంతమంది చెప్పారు.

‘పోనీలే! హరిత మంచితనము ఆమెను కాపాడింది. నా దగ్గర ఉంటే ఏముంది!? నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదన్నారు. పిల్లలు లేకుండా, మేము పెట్టే బాధలు పడలేకా! ఏడుస్తూ ఉండేది.

నేను చేసిన ఈ ద్రోహానికి నాకు ఇక ఎటు జన్మలో పెళ్లి అవదు. తీర్థ యాత్రలు చేస్తూ దైవ నామ స్మరణ లో గడపటమే ఈ శేషజీవితం.’ అనుకున్నాడు రాంబాబు.

హరిత ను దూరం గా కారు లో గమనిస్తున్న హరిత భర్త. ఎవరితో హరిత.. మాట్లాడుతున్నావు" అంటే హరిత "అతనా.. 'దూరపుచుట్టం' లెండి. " అంది.

"అవునా! ఇంటికి రమ్మనక పోయావా!" అన్న భర్తతో, "ఇంటికి పిలిచేంత గొప్ప వ్యక్తి కాదులే" అని కారు లో కూర్చుంది హరిత.

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


Podcast Link:


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


33 views1 comment

1 Comment


Tulasidevi Sanka • 5 hours ago

కధ చాలా బాగుందండి

Like
bottom of page