Heroine written by Cheruku Sailaja
రచన : చెరుకు శైలజ
సుచిత్ర పడుకుంది .కాని ఆలోచనలతో నిద్ర రావడం లేదు.అటు,ఇటు, దొర్లుతుంది. పక్కమీద మనసు స్థిమితం గా లేదు.తన కూతురు శృతి గురించి ఆలోచిస్తుంది .శృతి అందమైనది .తెలివైనది.దేనినైన సులభంగా అర్ధం చేసుకోగలదు.తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తుంది.ఆ కోర్సు అంటేనే తనకి ఇష్టం.తన ఫోటోలు, తన అందాన్ని చూసి నువ్వు చాలా అందంగా వున్నావు .పిక్చర్స్ లో ట్రై చేయవచ్చు కదా, అని ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటూ వుంటారని నాతో చాలాసార్లు చెప్పింది.నేను వినేదానిని, కాని ఏం జవాబు ఇచ్చే దానిని కాదు. ఒకరోజు శృతి హడావిడిగా నా దగ్గరకు వచ్చి, నాకు ఒక షార్ట్ ఫిల్మ్ లో ఆఫర్ వచ్చింది .చేయాలా, వద్దా, అని అడిగింది.అలాగే చూస్తుండి పోయాను .చిన్న సినిమా యాభై నిమిషాలే వుంటుంది. అంది. చాలా నీట్ ఫిల్మ్. నాన్న కు చెప్పాలి కదా. అమ్మో! ,నాన్న ఒప్పుకోరు. చెప్పాడానికి నాకు దైర్యం లేదు అంది. వాళ్ళ నాన్న గారు ఉద్యోగరీత్యా వేరే ఊరిలో జాబ్ చేస్తున్నారు .ఈ శనివారం వస్తారు కదా, అడుగుదాం అన్నాను. నేను కాదు, నువ్వు అడుగు అంది.
అలాగే అన్నాను.శనివారం వచ్చారు. కూతురు అంటే ప్రాణం. కాని, ఈ విషయం లో ఎలా స్పందిస్తారో చూడాలి.అందరం భోజనాలు చేసి హాల్లో కూర్చుని వున్నాం .శృతి మెల్లగా నాన్నా మీకు ఒకటి చెపుతాను. మీరు ఒప్పుకుంటేనే అంది . చెప్పమ్మా అన్నారు . నాకు షార్ట్ ఫిల్మ్ లో అవకాశం వచ్చింది. ఓ అలాగే చెయ్యి అయితే అన్నారు ఉషారుగా. ఆ మాటతో ఒకసారే శృతి నేను స్టన్ అయిపోయాం. నిజంగానా నాన్నా సంతోషంగా అంది శృతి. చెయ్యి నీకు ఇంట్రెస్ట్ వుంటే అన్నారు. నీ పాత్ర నీట్ గా వుండేటట్లు గా చూసుకో అన్నారు. అలాగే నాన్నా అంది.మొదటి అవకాశం, చిన్న డైరెక్టర్, డబ్బులు ఇవ్వరు నాన్నా అంది. డబ్బులు దేముంది. నీ ఇంట్రెస్ట్ కదా. బాగా పేరు వస్తే డబ్బులు అవే వస్తాయి అన్నారు.శృతి ఉషారుగా థాంక్యూ నాన్నా అంటు చుట్టేసింది.అమ్మా అంటూ సుచిత్ర ని పట్టుకుని గుండ్రంగా తిప్పింది. అయ్యో! ఏమిటే ఇది పడిపోతాను అంది. ఇప్పుడు వాళ్లకు కాల్ చేసి ఓకే అని చెప్తా అంటూ తన రూంలోకి పరుగెత్తింది.ఏమండీ! ఏమిటండీ ఇది. మీరు సినిమా చేయమని ఒప్పుకోవడం ఏమిటి? ఏమిటి సుచిత్రా మనం ఇంకా ఏ శతాబ్దంలో వున్నాం. ఎవరికి నచ్చింది వాళ్ళను చెయ్యనివ్వాలి కదా అన్నారు.అది ఆడపిల్ల. పెళ్ళి ఎవరు చేసుకుంటారు.అది అప్పుడు ఆలోచిస్తాను.. అంటూ, తన కంప్యూటర్ లో ఏదో వర్క్ చేసుకోసాగారు. సుచిత్ర వంట చేయడానికి కిచెన్లోకి వెళ్లింది. అమ్మా రేపే షార్ట్ ఫిల్మ్ మొదలు అంది. తెల్లవారి శృతి వెళ్తుంటే చాలా జాగ్రత్తలు చెప్పి పంపించాను. ఆయన తన ఉద్యోగానికి వెళ్లిపోయారు .శృతి ఫిల్మ్ అయింది .రీలిజ్ అయింది.లింక్ పంపింది . మా బంధువులు అది చూసి కొందరు ,ఎంకరేజ్ కొందరు మౌనం. ఆ షార్ట్ ఫిల్మ్ వలన నాలుగు, ఐదు అవకాశాలు వచ్చాయి. ఒక షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయింది. ఇంకా తన చదువే పూర్తి కాలేదు, చాలా మంచి పేరు తెచ్చుకుంది.ఒక పెద్ద డైరెక్టర్ శృతి కి మంచి ఆఫర్ ఇచ్చాడు. సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. నా కూతురు ఎలా అని నా భయం ఎక్కువ అయింది. మా ఆయన నాకు దైర్యం చెప్పుతునే వున్నారు.ఒక చిన్న ఫిల్మ్ అని కదా, చెప్పారు. ఇలా పెద్ద పిక్చర్ లో నటిస్తే మన పిల్లకి పెళ్లి ఎలా? భయంగా ఆయనతో అన్నాను. ఓసి, మొద్దు మొఖమా, ఏమీ కాదు. ఎవరు దానిని ఇష్టపడతరో దాని టాలెంట్ ను కూడా ఇష్టపడతారు అన్నారు. ఇంతలో శృతి హడావుడిగా వచ్చి అమ్మా రేపే షూటింగ్.
ఇరవైరోజులు డేట్స్ ఇచ్చాను. నీవు నాతో వస్తావా, అంది .నేనా సుచిత్ర అంది. అవును నువ్వే చూడు, ఎలా వుంటుందో అంది. ఆయన ఉద్యోగం రీత్యా వేరే ఊరిలో వుండడం వలన వెళ్తే బాగుంటుందనిపించింది.అలాగే ఎర్లీ మార్నింగ్ షూటింగ్ కి వెళ్లాను.ఎంత తేడా. బయట భయపడే ఆలోచనలు ఇక్కడ చూస్తే ఆగిపోతాయి. ఎంతో భద్రత,ఎంతో మర్యాద,హీరో హీరోయిన్లులకు, ఇంకా సినీ ఆర్టిస్టులకు. మనం ఏవేవో ఊహించుకొని భయపడుతుంటాం. వాళ్లకి ఒక స్పెషల్ రూం, స్పెషల్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్నీ చేస్తారు. జాబ్ లో ఎలాగైతే భద్రత వుంటుందో.అలాగే వుంటుంది. మనం జీవితంలో నడిపిస్తాం, సినిమా లో కెమెరా ముందు నటిస్తారు అంతే. అన్ని రోజులు శృతి తో కలిసి వెళ్లాను . షూటింగ్గ్ అయిపోయింది. ఈ లోపు మా రిలెటివ్ ఫంక్షన్కి వెళ్ళితే కొందరు మొఖాలు మార్చడం, కొందరు హేళన చేయడం, డబ్బుల కోసం పిల్లని సినిమా లోకి దించారని కామెంట్స్.నాకు కావలిసిన వాళ్లే అలా అనడం చాలా బాధేసింది. శృతి మాత్రం నాకు దైర్యం చెప్పింది. అలాగే అంటారు. నీవు లైట్ తీసుకో, డల్ గావుండకు అంది. ఇప్పుడు అనే వాళ్ళే రేపు పొగుడుతారు అంది. ధైర్యంగా చెప్తుంది నాకిష్టమైన పని చేస్తున్నాను అని. సినిమా రీలీజ్ అయింది . శృతి క్రేజ్ పెరిగింది. వీళ్ల సినిమాకి బెస్ట్ అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ హీరోయిన్ అవార్డ్ కోసం శృతి సెలెక్ట్ అయింది. అవార్డు ఫంక్షన్ కి ముగ్గురం వెళ్ళాం.
ఫంక్షన్ మొదలైంది.ఇంకొకరిని పిలుస్తున్నారు.శృతి బెస్ట్ హీరోయిన్ అని పిలిచారు.శృతి స్టేజ్ పైకి వెళ్ళింది.శృతి మైక్ తీసుకొని అందరికీ నమస్కారం అంది.మొదటిసారిగా తెలుగు మాట్లాడే మన తెలుగు హీరోయిన్, అంతా ఒక్కటే చప్పట్లు.నాకు ఈ అవకాశం ఇచ్చిన, నేను ఇంత దూరం రావడానికి కారణం అయిన నా తల్లిదండ్రులు వారికి నా నమస్కారములు. ఇంకా నేను ఈ అవార్డు గెలుచుకోవడానికి కారణమైన, ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి థాంక్యూ చెప్పుతున్నాను. డైరెక్టర్ తో శృతి అంది .మీకు ఏం అభ్యంతరం లేకపోతే, నేను ఈ అవార్డు మా అమ్మా, నాన్న లకు ఇప్పించాలని అనుకుంటున్నాను అంది.అందరూ చప్పట్లు. అమ్మా నాన్నా స్టేజి మీదకు రండి అంటూ శృతి పిలిచింది. ఇద్దరూ స్టేజ్ మీదకు వెళ్లారు. అవార్డు తీసుకున్నారు.అందరూ చప్పట్లు. మీరు ఏమైనా మాట్లాడుతారా అని అడిగారు . అప్పుడు సుచిత్ర మైక్ తీసుకుంది ఒక నిముషం గొంతు మూగపోయింది. కండ్లలో నీళ్ళు . శృతి మెల్లగా ఏం కాదు అమ్మా మాట్లాడు అంటు భుజం పై తాటించి దైర్యంగా తట్టింది. ఇక్కడికి వచ్చిన అందరి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమిటి అంటే, నా కూతురు మొదట హీరోయిన్ అవుతాను అంటే భయపడ్డాను.కాని ఇప్పుడు అర్థమైంది. వాళ్ళకి ఇష్టమైన ది వాళ్ళను చెయ్యానియ్యాలని. అప్పుడే వాళ్లు సంతోషంగా వుంటారు. వాళ్ళు సంతోషం గా వుంటే మనం కూడా సంతోషంగా వుంటాం అంది. మళ్ళి చప్పట్లు .ఇంక మా వారు మాట్లాడుతారు అంటూ భర్తకి ఇచ్చింది మైక్ . అప్పుడు కేశవరావు మైక్ తీసుకొని అందరికి నమస్కారములు అంటూ, ఒక తండ్రి గా మా అమ్మాాయికి నేను స్వేచ్ఛను ఇచ్చాను తనపై నమ్మకం పెట్టుకున్నాను. అదే ఇప్పుడు ఇంత పేరు తెచ్చింది అన్నాడు. ఆ అవార్డ్ తీసుకొని కిందకు వచ్చారు. ఇంకా శృతి మాట్లాడుతుంది. ఎంతో అనుభవం వున్న దానిలా దయచేసి మీ పిల్లలను వాళ్ళకు ఇష్టమైనది చెయ్యనివ్వండి.సినీ ప్రపంచం అంటే భయపడకండి . అక్కడ మంచి మనుషులు ,పేరు ప్రతిష్టలు వుంటాయి. మీ పిల్లలకు మీరు ఇచ్చే పోత్సాహం వలన మన
తెలుగు అమ్మాాయిలకు అవకాశాలు పెరుగుతాయి.వేరే అమ్మాాయిలు మన వరకు రారు.మనం మన తెలుగు పరిశ్రమను అభివృద్ధి చేసుకుందాం. అందరూ ఎంతో ఉత్సాహంగా శృతిని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు.శృతి స్టేజ్ దిగి కిందకు వచ్చింది. శృతి కి అభినందనలు తెలపడానికి,వాళ్ళ బంధువులు, పేపర్ లో చూశారట వాళ్ళు వచ్చారు. అమ్మా చూసావా! పేరు వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే బంధువులు వస్తారు..చూడు ఎలా వచ్చారో, అంటూ సుచిత్రతో శృతి అంది. శృతిని కౌగిలించుకుని, అలాగే శృతి కండ్ల లోకి చూస్తూ సుచిత్ర, కూతురుతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు చాలా సంతోషంగా వుంది. అంటూ, కూతురుని ముద్దు పెట్టుకుంది.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
Comments