జీవిత చరమాంకంలో మానవ కష్టాలు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jun 6
- 4 min read
#JeevithaCharamankamloManavaKashtalu, #జీవితచరమాంకంలోమానవకష్టాలు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguArticleOnOldAge

Jeevitha Charamankamlo Manava kashtalu - New Telugu Article Written By Kandarpa Murthy Published In manatelugukathalu.com On 06/06/2025
జీవిత చరమాంకంలో మానవ కష్టాలు - తెలుగు వ్యాసం
రచన: కందర్ప మూర్తి
సృష్టిలో మానవుడిగా పుట్టిన వారికి మరణం తప్పనిసరి..
సగటు మనుషుల ఆయు ప్రమాణం వంద సంవత్సరాలని శాస్త్రాలు చెబుతున్నప్పటికీ ఆధునిక మానవుడు అంతకు ముందే మృత్యువు ఒడికి చేరుకుంటున్నాడు. కొద్ది శాతం మంది మాత్రమే పూర్తి జీవన కాలం బ్రతకగలుగుతున్నారు. వారి కుటుంబ పెద్దల జన్యుప్రభావం, జీవన శైలి, వాతావరణ పరిస్థితులు, తినే ఆహారరం, శరీర శ్రమ, ఎటువంటి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవనవిధానం వల్ల జీవిత ప్రయాణం పూర్తి చేయగలుగుతున్నారు.
నేటి నవనాగరిక జీవనయాత్రలో మనిషి పసితనం, బాల్యం, యవ్వనం, ఎలాగడిచినా జీవితచరమాంకం 'వృద్ధాప్యం' మాత్రం అనేక ఒడిదుడుకులతో సాగుతోంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసికాందోళన ఆఖరి మజిలీలో బాధిస్తుంటాయి. పుట్టుకతో వచ్చిన అవయవాలే చరమాంకంలో ఇక మావల్ల కాదని భీష్మించుకుంటాయి.
కాళ్లు చేతులు సరిగ్గా పనిచెయ్యవు. నిగనిగలాడే చర్మం కుంచించుకుపోతుంది. శరీర కీళ్లు బిగుసుకుపోతాయి. నెత్తి మీద జుత్తు నెరిసి రాలిపోతుంది. కంటి చూపు తగ్గుతుంది. చెవుల వినికిడి శక్తి నసిస్తుంది. పళ్లు విరిగి, పుచ్చిపోతాయి.
నాలిక స్పర్సజ్ఞానం తగ్గుతుంది. గుండె, ఊపిరి తిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, మలమూత్రాల విసర్జకావయవాలు అన్నీ పని చేసి చేసి ఇక మావల్ల కాదని సమ్మె చేస్తుంటాయి. అనేక చర్మ వ్యాధులు, నరాల సమస్యలు మొదలవుతాయి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచెయ్యదు. జ్ఞాపకశక్తి నశిస్తుంది.
చిరాకు, అసహనం పెరుగుతుంది. యవ్వనంలో ఉన్న ఆకర్షణ తగ్గుతుంది. అంతర్గత రోగాలు వయసు మీరిన తర్వాత బయటపడి వేధిస్తుంటాయి. శరీర ఆకృతులు మారి గుర్తు పట్టలేనంత స్థితికి వచ్చి అసలు జీవితం అంటే ఏమిటో తెలిసొస్తుంది.
బాల్యంలో ఎముకలు గట్టిదనం లేక పిల్లలు పాకుతుంటారు. పెద్దలు లేక వేరే సాధనాలతో నడవడానికి ప్రయత్నిస్తుంటారు. కింద పడుతుంటారు. పసిపాపలు మాటలు రాక తడబడుతుంటే అలాగే వార్ధక్యంలో నోట్లో దంతాలు ఊడి నాలిక సహకరించక మాటల స్పష్టత ఉండదు వృద్ధులకు..
పసి పిల్లల్లా బోసినవ్వులు నవ్వుతుంటారు. అందుకే పిల్లలు -ముసలి వారు ఒకటేనంటారు. వయసు పెరిగి వృద్ధాప్యంలో అదే పరిస్థితి వస్తుంది. శరీరం మీద పట్టుండదు. కాళ్ళు చేతులు సహకరించవు. లేచి నిలబడాలన్నా, నడవాలన్నా చేతి కర్ర సహాయం అవుసరమవుతుంది. కింద కూర్చోలేని పరిస్థితి వస్తుంది. కర్మ బాగులేక వృద్ధాప్యంలో నడుము, తుంటి, తొడ ఎముకలు విరిగితే ఆ మనిషి జీవితం దుర్భరమవుతుంది.
పాతతరం రోజుల్లో, బాల్యంలో పిల్లల్ని తండ్రులు చేయూత నిచ్చి నడిపిస్తే, వృద్ధాప్యంలో ఆ కొడుకులే చేతి సహాయమిచ్చి తండ్రుల్ని నడిపించవల్సి వచ్చేది. స్త్రీ, పురుషులెవరైనా సరే వార్ధక్యంలో ఈ బాధలు అనుభవించాల్సిందే. గతంతో పోలిస్తే నవతరంలో వృద్ధులకు వైద్య సౌకర్యాలు మెరుగయాయి. ఆర్థికావసరాలు తీరుతున్నాయి కాని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నసించి
మానవసంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. ఆర్థికాంశాలే ముఖ్య భూమిక వహిస్తున్నాయి.
కన్నవారి కడచూపుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వయో వృద్ధ తల్లిదండ్రులకు. నేటి నాగరిక సమాజంలో మనిషికి ఎన్ని వైద్య సదుపాయాలున్నప్పటికీ
అందరికీ అందుబాటులోకి రావడం లేదు. వైద్య పరంగా ఎంత ముందుకు సాగుతున్నా మృత్యువును కొంత సమయానికి కట్టడి చేయగలుగుతున్నారు
తప్ప పూర్తిగా కాదు. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. భూమండలం మీద అందరికీ అందుబాటులో రావడం లేదు. వైద్య పరంగా ఎంత ముందుకు సాగుతున్నా, మృత్యువును కొంత సమయానికి కట్టడి చేయగలుగుతున్నారు తప్ప పూర్తిగా కాదు.
అది ప్రకృతికి విరుద్దం. భూమండలం మీద పుట్టిన జీవి నసించవల్సిందే. కొత్త జీవికి జన్మనివ్వాలి. కొత్త నీరొచ్చి పాత మురుగు నీటిని తోసుకుపోయినట్టు, వృక్షానికున్న పండుటాకులు రాలి కొత్త చిగురుటాకులతో నవనవలాడుతున్నట్టు సృష్టిలో, కొత్తొక వింత పాతొక రోత రీతిలో మానవజన్మ సాగక తప్పదు.
మనిషి యవ్వనంలో కాలు చెయ్యి బాగున్నంతకాలం తనను మించినవారు లేరని విర్ర వీగుతాడు. అదే యవ్వనం పోయి వృద్ధాప్యంలో శరీరం సహకరించక ఇంకొకరి మీద జీవితం ఆధారపడినప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఆగర్భ శ్రీమంతులైనా, కటిక దరిద్రులైనా ఈ స్థితికి రాకతప్పదు.
చేతులు కాలిన తర్వాత విచారించినా ప్రయోజనం ఉండదు.. నేటి మనవలే రేపటి తాతలవుతారని యువత గ్రహించాలి. అంతస్థుల వాతానుకూల భవంతుల్లో పంచభాష్య పరమాన్నాలు ఆరగించినా, ఆకాశంలో విమానాల్లో విహరించినా, సముద్ర గర్భంలో జలకాలాడినా ఏదో ఒకనాడు కట్టెల మీదకు చేరాల్సిందే. మట్టిలో కలియాల్సిందే మానవ శరీరం.
కొన్ని మతాలవారు చనిపోయిన తర్వాత కూడా శరీరం ఉపయోగపడాలనే ఉద్ధేశ్యంతో మృత శరీరాన్ని పక్షులు, జలచరాలకు ఆహారంగా వేస్తుంటారు. ఏ మతం వారైన,
ఏ దేశం, ఏ భాష, తెగ వారైనా వారి సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారం చెయ్యాల్సిందే.
వేల రూపాయలు విలువ చేసే వైన్స్ బాటిల్సుని షెల్ఫులలో, అల్మారాలలో భద్రంగా దాచి అది వినియోగమైనాక కాళీ బాటిల్సును డస్టు బిన్లో పడవేస్తారు. తర్వాత వాటికి విలువుండదు.
అలాగే శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే దానికి విలువ. శరీరంలో ఊపిరి ఆగిన తర్వాత ఆప్తులే పార్థివ శరీరాన్ని ఇంటి బయట పడవేస్తారు. అంతిమ యాత్రలో ఆప్తులు, సన్నిహితులు, స్నేహితులు పాల్గొంటారు. అటుపైన శ్మసానానికి చేర్చి బూడిద చేస్తారు లేదా మట్టిలో కలుపుతారు. కొద్ది రోజులు ఆ వ్యక్తి జ్ఞాపకాలు వెన్నంటినా కాలగమనంలో మసకబారి ఫోటో ఫ్రేములు, శిలా విగ్రహాలుగా మిగులుతారు.
ఇదీ మనిషి చివరి అంకం.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Komentáře