top of page

జోక్స్

1. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్యని " పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ ఈ మూడింటిలో నీకేది ఇష్టం?"అని అడిగాడు.

భార్య ఆశగా " మూడూ ఇష్టమే! మూడు చీరలూ కొనిచ్చెయ్యండి"-అంది.

భర్త మొహం చిట్లించి, " చీరలా? చీరలేమిటి? నేను చెప్పినది ఊళ్ల పేర్లు!

మా ఆఫీసు వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ, ఈ మూడు ఊళ్ళల్లో ఒకటి కోరుకొమ్మన్నారు.

నీ అభిప్రాయం కూడా అడగాలికదా అనిఅడిగా" అన్నాడు.


పంపినవారు : వాడపల్లి పద్మప్రియ

ప్రచురణ తేదీ : 22 /10 /2021



39 views0 comments
bottom of page