top of page

కర్తవ్యం - ఎపిసోడ్ 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Karthavyam - Episode 1' Mini Telugu Web Series

Written By Vedurumudu Ramarao

రచన: వెదురుమూడి రామారావు



వెదురుమూడి రామారావు గారి మినీ సీరియల్ ప్రారంభం


‘లాయర్ విశ్వనాథం’ గారికి హై కోర్ట్ లోనే కాదు, సుప్రీమ్ కోర్టు లో కూడా మంచి పేరుంది. సుమతి అయన సతీమణి. మంచి జంటగా, అందరికి మంచి చేసే మంచి మనసు గల పెద్దలుగా, వాళ్లు మహా మంచి వాళ్లుగా పేరు తెచ్చు కొన్నారు. ఎవరు ఢిల్లీ వెళ్లినా వాళ్లను కలవకుండా, వారి ఆతిధ్యం తీసుకోకుండా రారు. పిల్లలు ఆస్ట్రేలియా లో సెటిల్ ఐపోయారు. అందుకని ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్లకు పండగ. వచ్చిన వాళ్ళను ఎంతో ఆప్యా యంగా చూసుకొని వాళ్ళు ఉన్నన్నాళ్ళు సరదాగా గడిపేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండి తీరతారు.


సాయంత్రం కోర్ట్ నుంచి హడావిడిగా ఇంటికి వస్తూనే కాఫీ కూడా తాగకుండా "సుమతీ! నీకు.. మనోహర్, సుధా, హైదరాబాద్ లో కలిసాం.. వాళ్ళు గుర్తు వున్నారా? వాళ్ళ పెళ్లి కి కూడా మనం వెళ్ళాం.. మీ రఘు మావయ్య కొడుకు, కోడలు. వాళ్ళు రేపు పొద్దున్నే వస్తున్నారు. కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకొందాం. ఎలాగూ కోర్ట్ కి కూడా సెలవలు వస్తున్నాయి కదా. అందరం కలసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళచ్చు కూడా" అంటూ గాలి పీల్చుకొన్నారు.


మర్నాడు వాళ్లు వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఆప్యాయంగా వాళ్ళకి అన్నీ అమర్చి, సంతోషంగా చూసుకొన్నారు. ఒక రోజు రెస్ట్ ఇచ్చి తరువాత వాళ్ళ కి కావలసిన విధంగా ప్రోగ్రాము వేద్దాము అని నిర్ణయించారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ , డిన్నర్ అన్నిటికీ మంచి ‘డిషెస్’ చేసి పెట్టారు.


మర్నాడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఢిల్లీ లో తన సాయం ఏమైనా అవసరం వుందా అని అడిగారు విశ్వనాథం గారు.


“లేదు అంకుల్! కొంచం చేంజ్ కోసం, కొన్నాళ్ళు మీతో ఉందాము అని వచ్చాము. అంతకన్నా ఏమీ లేదు” అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు మనోహర్.


వచ్చిన దగ్గరనుంచి వాళ్లని గమనిస్తూనే వున్నారు దంపతులిద్దరూ. ఏదో ముభావంగా, యెడ మొహం పెడమొహంగా వున్నట్టు సూచనగా అనిపించింది. ప్రయాణం బడలికే అని సర్దుకున్నారు. కానీ ఏదో దాస్తున్నారు అని అర్ధమైంది. శాంత పడ్డానికి కొంచం సమయం వాళ్లకి ఇవ్వాలి అని అర్ధమైంది . మరేం మాట్లాడకుండా వాళ్లని రెస్ట్ తీసుకోమని చెప్పి పంపారు.


డిన్నర్ టైంలో, ‘వాతావరణం అనుకూలంగా వుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకొందాం’ అని విశ్వనాథం గారు, భార్య కూడబలుక్కొన్నారు. వాళ్ళు కూడా కొంచం స్థిమిత పడినట్టే వున్నారు.


మిగతా విషయాల తర్వాత మెల్లగా విశ్వనాథం గారు మంద్రస్వరం తో "విషయం ఏమిటో మాతో చెప్పుకొంటే బాగుంటుంది. మీరిద్దరూ ఎందుకిలా వున్నారు? మేము ఏమైనా చేయగలిగితే చేస్తాము. మాకు చెప్పండి " అని అడిగారు.


ఒక్క సారి ఇద్దరూ మా మొహాల కేసి చూసి ఊరుకొన్నారు.

సుమతి గారు సుధ ని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తూ "ఎందుకిలా వున్నారు మీ ఇద్దరు? మాకు చెప్పండి. వీలైనంత సాయం చేస్తాం, కాదా సలహా అయినా ఇస్తాం కదా. మీరిద్దరూ సౌఖ్యంగా సంతోషంగా ఉండాలి అనే కదా మా అందరి తాపత్రయమ్. ఇష్టపడి పెళ్లి చేసుకొన్నవాళ్ళే కదా. మీ తల్లి తండ్రులకి కష్టం కలగకుండా, మీకు ఇష్టమైనట్టు సంతోషంగా ఉండాలనే కదా అందరి కోరిక. మమ్మలిని కూడా అమ్మ నాన్నలుగా తీసుకొని విషయం ఏమిటో చెప్పండి” అని ముద్దు చేశారు.


ఇంక ఉండ బట్టలేక సుధ భోర్ మని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. మనోహర్ కూడా మొహం, అటు తిప్పుకొని కొంచం దూరంగా వెళ్లి నిల్చొన్నాడు. అది విశ్వనాథ దంపతులకి ఒక సున్నితమైన క్షణం.


ఇద్దరూ ఇంచుమించుగా ఒకే సారి "మాకు తొందరగా డివోర్స్ ఇప్పించండి" అని అరిచినంత పని చేసి చెప్పారు. కుప్పలా ఇద్దరు కుర్చీలో ముడుచుకొని పోయారు. సుమతి గారు పూర్తిగా నిస్సత్తువగా నిలబడిపోయారు.


విశ్వనాథం గారు ఇలాంటిదేదో ఉంటుందని ఊహించారు కాబోలు.. తొందరగానే కోలుకొని ఇలా అన్నారు. " అదే మీ కోరిక అయితే అంత కష్టమైన పని కాదు. మన చేతులో వున్న పనే కదా. తొందరేముంది. నేను చేసిపెడతాను. ఈ లోపున కొంత కాలం మాతో సరదాగా గడపండి. మనం అంతా మామూలుగా మంచిగా ఈ కొన్ని రోజులు గడుపుదాం. వీలయితే ఏదయినా మంచి ప్రదేశాలకి వెళ్లి ప్రశాంతంగా ఈ ప్రాబ్లెమ్ కి సమాధానం వెతుకుదాం. ఒక సారి సింహావ లోకనం చేద్దాం. ఒక సమాధానం దొరకొచ్చునేమో. లేదా అప్పుడే డివోర్స్ కి కావలసిన ప్రయత్నాలు అన్ని చేద్దాం. నేను వున్నానుగా.. మీకు కావలసిన విధంగా చేస్తాను. సరేనా?" అని బుజ్జగించారు. “ఈ రోజుకి ప్రశాంతంగా నిద్ర పోండి. రేపు బ్రేక్ఫాస్ట్ మీద ప్రణాళిక సిద్ధం చేద్దాం”.


పెద్ద దంపతులిద్దరికీ ఆలోచనా పరంపరలతో నిద్ర రావటం లేదు.

సుమతి గారు ఆందోళన తో “ఏం చేద్దామండి” అని వాపోయారు.


“మనం పెద్ద వాళ్ళం కదా, మంచి చెప్పి కాపురం నిలబెట్టటం మన బాధ్యత. . అంతే గాని పిచ్చి పిచ్చి ఆలోచనకి మనం మద్దత ఇవ్వకూడదు. వాళ్లకి కావలసిన విధంగా డివోర్స్ ఇప్పిస్తానంటున్నారు . వాళ్ళ తల్లి తండ్రులకి మనం ఏం జవాబు చెపుతాము? ఇది బాగు లేదండి.” అని ప్రాధేయ పడ్డారు.


విశ్వనాథం గారు చిన్నగా గంభీరంగా చిరునవ్వు నవ్వుతూ, “నేను మాత్రం డివోర్స్ కి మద్దతు ఇస్తాను అనుకొంటున్నావా? అందులోను సుధా మనోహర్ మన పిల్లల్లాంటి వాళ్ళు. మనం ఇద్దరం కలసి దీనికంతటికి మూల కారణం తెలుసుకోవాలి. వాళ్లనే వాళ్ళు తెలుసుకొనేటట్టుగా చెయ్యాలి. మనం దానికి దోహదం చేసి, వాళ్లు మళ్ళీ సంతోషంగా కలుసుకొనేలాగా చేద్దాం. దీనికి కొంచం సమయం ఇవ్వాలి కదా” అన్నారు.

“నా ఉద్దేశం లో అక్కడ వీళ్ళకి పరస్పరం మాట్లాడుకోడానికి, పోట్లాడుకోడానికి, టైం, తీరిక, అవకాశం వుండి ఉండదు. ఒకరి కోరికలు, ఇష్టాలు ఒకరి కి అర్ధమయ్యేలా చెప్పుకొనే అవకాశం కూడా వుండి ఉండదు. పైగా ఎవరి ఇగో వాళ్ళది కదా. సర్దుబాటు, రాజి అనేవి కొత్త అనుభవాలు.


ప్రేమ బంధానికి కావలసిన ముఖ్య లక్షణాలు ఒకరి మీద ఒకరికి నమ్మకం, భౌతిక స్పర్శ, నాణ్యమైన సమయం, సరియిన బహుమతులు, సేవా చర్యలు, గుర్తింపు. ఇందులో ఏవి తక్కువైనా అసంతృప్తి మొదలు అవుతుంది . పెళ్లి అయి నాలుగు ఏళ్ళే కదా. జీవితం మీద సరియిన అంచనా, లేని, తెలియని వాటికోసం ఆశించడం, సరి అయిన అవగాహన లేక పోవడం, ఎక్కువగా ఊహల్లో విహరించడం, అంచనాలు వేసుకోడం, అవి ఎంతవరకు నెరవేరతాయి అనే అవగాహన లేకపోవడం, అనవసరమైన సందేహాలు, స్నేహితుల మాటల ప్రభావాలు.. ఈ విధమైన ఆలోచనలకి దారి తీయిస్తున్నాయి.


అందుకని వాళ్లకి ఆత్మపరిశీలనా సమయం, అవసరం మనం కల్పించాలి. తమను తాము పరిశీలించుకుని, ఆలోచించుకొని స్వయంగా సహాయం చేసుకొనేలా పరిసరాల్ని మనం కల్పించాలి. వాళ్లకి ఫ్రీ టైం ఇచ్చి దగ్గరగా వచ్చే సందర్భాలని మనం కల్పించాలి. దాంతో వాళ్లకి వాళ్ళే ఒకరి విలువ ఇంకోళ్ళకి తెలుసుకొంటారు. కలసి ఉంటే వుండే సౌఖ్యం సంతోషం తెలుసుకొంటారు. జీవితo మీద అవగాహన తెచ్చుకొని పరస్పరం ఏ విధంగా సర్దుబాటు చేసుకొని జీవితం ఆనందమయంగా కొన సాగించాలి అనేది తెలుసుకోవాలి.


ఇదే కాకుండా వాళ్ళు మన సంప్రదాయాలు, ఆచారాలు వాటి గుడార్దాలు , వాటి వెనకాల వున్నపరమార్థాలు తెలుసుకోవాలి . ‘పెళ్ళి’, అక్కడ జరిగే తంతు, మంత్రాలు వాటి అర్ధం కూడా తెలుసుకొంటే వాళ్ళ మధ్య నిజమైన బంధం ఏర్పడుతుంది. ‘పెళ్ళి’ అనేది ఒక 'పవిత్ర బంధం" అని, అప్పుడు చేసిన బాసలు నిజమైన బాధ్యతలు అని వాళ్లకి వాళ్ళే అంతర్గతీకరించుకోవాలి.


స్వార్థ పూరిత హక్కులతో పాటు, కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు, కర్తవ్యాలు ఉంటాయి అని ప్రతివారు తెలుసుకోవాలి. చూద్దాం! మనం ఎంత వరకు ప్రయత్నం చెయ్యాలో చేద్దాం. ప్రస్తుతానికి నిద్రపో” . అన్నారు.


“అందుకు మనం కూడా టైం తీసుకొని వాళ్లతో గడుపుతూ మధ్య లో కొంచం కొంచం సూచనలు, అభిప్రాయాలు వాళ్ళ బుర్రల్లో పెట్టాలి. సరియిన టైం టేబుల్ ప్రోగ్రాము వేద్దాము. ప్రస్తుతానికి నిద్రపోదాం” అని సుదీర్ఘమైన ప్రసంగం చేసి నిద్రకి ఉపక్రమించారు. సుమతి మనసు తేలిక పడింది.

--------------------------------------------------------

ఇంకా ఉంది...

కర్తవ్యం ఎపిసోడ్ 2 త్వరలో...

--------------------------------------------------------


వెదురుమూడి రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం: వెదురుమూడి రామారావు. M.Com; LLB;



జననం:- జనవరి1945 విజయనగరం.

Till B.com – M.R college vizianagaram,

M.COM at Andhra university college of commerce –

LL.B at Osmania University Hyderabad.

Some diplomas and certifications.

రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ - గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు / oriental bank of commerce– హైదరాబాద్

(21 years with Andhra Bank )–

4 years with a Bank in Oman and -10 years with a Global trust bank in various capacities.

Rich experience in Banking activities. Retired from active services in 2005.

Team member for campus recruitment of B.Tech students from various colleges for Infosys for 6 years.

Trainer in behavioral sciences. with Andhra bank training college and

Later a resource faculty at many organizations.

Played Tennis/ Hockey and basket ball.

రచనలు;

తెలుగు లో చాలా వ్యాసాలు :- సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం . వాణిజ్యము / న్యాయ శాస్త్రము మొదలైనవి.

ప్రచురణలు –

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ ,హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎచ్ ఆర్ డీ , లింక్డిన్ ,

అల్ ఇండియా రేడియో హైదరాబాద్ లో స్కూల్ విద్యార్థుల కు (telugu) కామర్స్ లో పాఠాలు.

గెస్ట్ లెక్చరర్ గ చాలా కంపెనీస్ అండ్ బిజినెస్ స్కూల్స్.

Study handouts and matters for Bankers in the banker’s training college.

Recently in December 2019, one short story in Telugu was published in ' Aavirbhava" online magazine.

Two short stories in Telugu were published in the online magazine ‘Madhura Vaani’ in 2021-2022


Two stories published in "mana Telugu kadhalu.com"

Trying / pencil sketches/ painting and story writing and being active.

ప్రస్తుతం అమెరికా లో పిల్లల తో .



41 views0 comments
bottom of page