'Kasthuri Ranga Ranga Episode 8' Telugu Web Series
Written By Ch. C. S. Sarma
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
శశాంక కోరికపై కస్తూరి, రంగాలు బెంగళూర్, మైసూర్ టూర్ వెళతారు.
కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి ఆకట్టుకునేలా ఉపన్యసిస్తాడు రంగ..
కేసుకు సంబంధించిన వివరాలు సేకరించడానికి రేపల్లె వెళదామని వసంత్ తో చెబుతాడు.
ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 చదవండి…
మరుదినం ఐదుగంటలకు లేచి స్నానం చేసి... పదినిముషాలు దైవప్రార్థన చేసి, డ్రస్ చేసికొని ఇంటికి తాళం వేసి, గార్డును లేపి అతని చేతికి తాళం ఇచ్చి టొయాటో ఇన్నోవాలో కూర్చున్నాడు. సెక్యూరిటీగార్డుని పిలిచాడు. అతను డోర్ ను సమీపించాడు.
"నీ పేరు హిమామ్ కదూ!..."
"జీసాబ్!..."
"మై దో దిన్ నహీ రహూంగా!.. ఫౌదోంకు, ఝూడోంకు పానీ అచ్చాదాల్ నా!... కోయీ ఆకర్ పూచేతో... సాబ్ క్యాంప్ గయే హై... కహీనా!... సంఝే!..” అడిగాడు యస్.పి కస్తూరిరంగ.
“హీ సాబ్!..." తల ఆడించాడు హిమామ్
"గేట్ ఖోలో!..."
పరుగున వెళ్లి హిమామ్ వీధిగేటు తెరిచాడు...
కస్తూరి రంగా కారు వీధిలో ప్రవేశించింది. ఇరవై నిముషాల్లో రంగా వసంత్ నిలయానికి చేరాడు. వాకిటముందు కారు ఆపాడు.
వసంత్ “గుడ్మార్నింగ్ సర్...." అంటూ సెల్యూట్ చేశాడు.
పక్కకు జరిగి డోర్ తీశాడు రంగా... వసంత్ కార్లో కూర్చున్నాడు... టొయాటో కదిలింది.
రింగ్ రోడ్ వైపుకు కారును మళ్లించి బంజారా హిల్స్ నుండి ఇరవై నిముషాల్లో రింగ్ రోడ్ ఎక్కేశాడు రంగా... అసమయంలో ట్రాఫిక్ లేని కారణం...
ఆ రాత్రి... ఐ.జి. అనంతనాగ్ గారికి తనకు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.
"యస్.పి. కస్తూరి రంగా!..."
"గుడ్ ఈవినింగ్ సార్...... యస్... యస్... సార్ !..."
వినయంగా చెప్పాడు కస్తూరి రంగా.
“క్వార్టర్లో చేరారా!...”
“యస్ సార్!...”
"ఎలా వుంది...?"
"ఇటీజ్ ఓకే... సార్!..."
"మీ గురించి నా మిత్రుడు మనోజ్ చక్రవర్తి చెబితే విన్నాను... ఆయామ్ వెరీ హ్యాపీ... ఐవిల్ గివ్ యు ఫ్రీహ్యాండ్స్... క్రిమినల్స్ ని ఏరి... కాల్చిపారై... డూ ఎన్ కౌంటర్ విత్ ఫ్రూఫ్!..." నవ్వాడు ఐ.జి., అనంతనాగ్....
"థ్యాంక్యూ సార్... ఐవిల్ డూ మై డ్యూటీ స్ట్రిక్ట్లీ సార్!...”
"ఓకే గుడ్... టుమారో యు ఆర్..."
"గోయింగ్ టూ రేపల్లె సార్!..." ఐ.జి. గారు పూర్తి చేయకముందే చెప్పాడు రంగ.
“ఎట్ వాట్ టైమ్ స్టార్టింగ్?..." అడిగాడు ఐ.జి., అనంతనాగ్…
'ఈ వ్యక్తి నా పంక్చ్యుయాలిటీని పరీక్షిస్తున్నట్టున్నాడు' అనుకొని..
“మార్నింగ్ బై ఫైవ్ థర్టీ సార్!... " చెప్పాడు కస్తూరిరంగ.
"సో యర్లీ!..." ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఐ.జి. అనంతనాగ్.
"యస్.. సార్!..."
“ఓకే... గుడ్లక్... టేక్ కేర్!..."
"థ్యాంక్యూ సార్!..."
ఐ.జి. అనంత్ నాగ్ సెల్ కట్ చేశాడు.
“సార్!...”
"వాట్ వసంత్!..."
“దేన్ని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు?....
“అవును...”
"దేన్ని గురించి సార్!!....
"నిన్ను గురించి..." రోడ్డును చూస్తునే కూల్ గా చెప్పాడు యస్.పి. కస్తూరి రంగ…
వసంత్ దేశాయ్ ఉలిక్కిపడ్డారు. ఆత్రంగా వ్యాకుల వదనంతో రంగా ముఖంలోకి చూచాడు... మెల్లగా...
“సార్!...”
"ఆ!..."
“నామీద మీకు సందేహమా!..."
"లేదు..."
"మరి!..."
"స్పీడ్ ను గురించి... అదే వేగం... వేగం... దాన్ని గురించి..."
నవ్వి... "వసంత్!... నాకు కొంచెం స్పీడ్ జాస్తి భయ్యా!...”
"సార్!... ఆశ్చర్యపోయాడు డి.యస్.పి వసంత దేశాయ్... ట్రెయినింగ్లో నేను రన్నింగులో ఫస్ట్ సార్...".
“అలాగా...” రంగాకు ఆశ్చర్యం. ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూచి నవ్వాడు.
"అవును సార్.." మనస్సున ఆనందం... గర్వం... వసంత్ దేశాయికి...
'వసంత్... అమాయకుడు.... భయస్థుడు....’ అనుకొన్నాడు రంగ.
వసంత్ సెల్ మ్రోగింది.
సెల్ లోని నెంబరును చూచి బెరుగ్గా రంగ ముఖంలోకి చూచాడు.
“ఆ... మాట్లాడు వసంత్..." చిరునవ్వుతో చెప్పాడు రంగా.
ఫోన్ చేసింది వసంత్ లవర్.
"వసంత్... మీ అత్త కూతురేగా!... నేను ఏమీ అనుకోను... నిర్భయంగా సాగించు..." చిరునవ్వుతో చెప్పాడు కస్తూరిరంగ.
"ఆ... చెప్పు...." మెల్లగా అన్నాడు వసంత్.....
..........
"క్యాంప్ వెళుతున్నా!..."
..........
"అక్కడికా... ఇప్పట్లో కుదరదు.."
..........
“మా బాస్ తో!...”
..........
"వారి పేరా!... అది నీకు అనవసరం కదూ!...”
..........
"ఆ... చెప్పాను....” పెదాలపై చిరునవ్వు.
..........
“ఆ.. వసంత్... నీ లవర్ పేరేంటి?"... అడిగాడు రంగ.
"ప్రీతి... సార్!" రంగ ముఖంలోకి చూచి జవాబు చెప్పి... తలను ప్రక్కకు తిప్పి... "ఆ... ఆ... వింటున్నా!..."
..........
“ప్రయత్నిస్తాను...”
..........
“ఓకే... ఓకే... డియర్...” బ్రతిమాలినట్టు చెప్పి సెల్ కట్ చేశాడు వసంత్.
"వసంత్!..."
"సార్!..." దీనంగా పలికాడు వసంత్.
"నిన్ను చెన్నై రమ్మంటోంది కదూ!..."
"అవును సార్..." విచారంగా చెప్పాడు వసంత్.
"ఆ... ఈ ఆడవాళ్లు అంతే వసంత్!...”.
"అవును సార్... వాళ్ల మాటే సాగాలంటారు సార్....".
రంగా నవ్వాడు...
"సార్!..."
"ఆ..."
"ఎందుకు సార్!... నవ్వుతున్నారు?...."
"పెండ్లికి ముందే నీకు అన్ని విషయాలు తెలుస్తున్నందుకు...".
"సార్!...” ఆశ్చర్యంతో రంగా ముఖంలోకి చూచాడు వసంత్.
"అవునయ్యా!... నీ సంభాషణను బట్టి నాకు అర్ధం అయిన విషయాన్ని నీకు చెప్పాను...." చిరునవ్వుతో వసంత్ ముఖంలోకి చూచాడు.
" వసంత్!..."
“సార్...”
“హైదరాబాద్లో ఎంత కాలంగా వున్నావ్?...".
“రెండు సంవత్సరాలు సార్...."
"అంతకుముందు?..."
"కర్నూలు సార్..."
"ఈమార్గంలో ఎప్పుడైనా వచ్చివున్నావా?..."
"విజయవాడ దాకా ఐదుసార్లు వచ్చాను సార్...".
"సరే... మంచి టీ ఎక్కడ దొరుకుతుంది?..."
"ఇరవై కిలోమీటర్లలో ఓ హోటల్ వుంది సార్!..."
"ఆ ప్రాంతం రాగానే చెప్పు... అపుతాను... టీ తాగి బయలు దేరుదాం...".
క్షణం తర్వాత... "అక్కడ టిఫిన్ కూడా వుంటుందా?..." ఆడిగాడు రంగా....
“ఆ... హైవే హెూటల్ సార్!... చాలా బాగుంటుంది...".
"ఓకే... ఓకే... అక్కడ టిఫిన్ చేసి టీ త్రాగి వెళదాం...".
"అలాగే సార్...”.
కాలుగంటలో ఆ ప్రాంతానికి చేరారు.
రంగా కారును పార్క్ చేశాడు. ఇరువురూ దిగారు.
రెస్టురూముకు వెళ్లి... హాల్లోకి వచ్చి కూర్చున్నారు. బేరర్ మెనూ కార్డు ఇచ్చాడు.
రంగా వసంత్ ను అడిగి ఇరువురికీ ఆర్డర్ చేశాడు. టిఫిన్ తిని కాఫీ త్రాగి బయలుదేరారు...
యస్.పి. కస్తూరి రంగ మనస్సున ఐ.జి.తో తన మొదటి కలయిక హైదరాబాద్ రాగానే వారిని కలిశారు. వారు తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
"మిస్టర్ కస్తూరి రంగా!..."
“యస్ సార్!...”
"మీకు నేను రెండు కేసులు అప్పగిస్తున్నాను. నెంబర్ వన్... డ్రగ్స్ ఎంటరింగ్ టు హైదరాబాద్... రెండవది బాలికలను సౌదీకి బాంబేకి తరలింపు.... ఇవి రెండు మీరు రాబోతున్నారని తెలిసిన తర్వాత నేను మీకు అప్పగించి నిర్ణయించినవి.
ఇపుడు మూడవది హైవేలో ఇనస్పెక్టర్ సుల్తాన్ వెహికల్ మీద... రేపల్లెలోనూ ఒకేరోజున జరిగిన మూడు బాంబ్ బ్లాస్టింగ్స్... దీన్ని కూడ మీకే అప్పచెబుతున్నాను. కెన్ యు హ్యాండిల్?..." చిరునవ్వుతో అడిగాడు ఐ.జి. అనంత్ నాగ్...
“సార్... విత్ యువర్ కైండ్ సపోర్టు... ఐవిల్ హ్యాండిల్ ఆల్ ది త్రీ సార్!...”. చిరునవ్వుతో చెప్పాడు యస్.పి.కస్తూరిరంగ.
"గుడ్!... దటీజ్ ది స్పిరిట్. మీకు నా సహకారం పూర్తిగా వుంటుంది. నేరస్థులను పట్టుకొనేదానికి మై ఫుల్ సపోర్టు విల్ బి టు యూ.." ఆనందంగా నవ్వాడు ఐ.జి. అనంతనాగ్.
ఆప్యాయంగా భుజం తట్టాడు. చేతిలో చేయి కలిపాడు... "గుడ్లక్ డియర్ ఎస్.పి. కస్తూరి రంగా!...” అది రంగా గారికి వారి ఆశీర్వచనం.
"సార్...." మాటా పలుకూ లేకుండా దీక్షగా డ్రైవ్ చేస్తున్న రంగాను చూచి వసంత్ దేశాయ్ మెల్లగా పిలిచాడు.
రంగా క్షణంసేపు వసంత్ ముఖంలోకి చూచి... “యస్.. వసంత్... చెప్పండి!..." అన్నాడు.
“సార్... మీరు చాలా సేపు మౌనంగా డ్రైవ్ చేస్తున్నారు కదా.. యదార్థంగా... నేను మీ ఆ మౌనాన్ని భరించలేకపోయాను. ఏదో విషయాన్ని గురించి దీర్ఘ ఆలోచన.... అవునా సార్!..." అడిగాడు వసంత్.
“అవును వసంత్... ఐ.జి. గారు నామీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని వున్నారు. మూడు కేసులు నాకు అప్పగించారు. ఫలితాంశం ఎలా వుండబోతోందో!..." సాలోచనగా చెప్పాడు కస్తూరి రంగ.
"సార్!... మీ గురించి నేనూ విన్నాను సార్... మీకు తోడయ్యాను. విజయం మనదే సార్... డోన్ట్ వర్రీ..." అతను చెప్పిన తీరుకు రంగాకు నవ్వొచ్చింది.... ఇరువురూ ఆనందంగా నవ్వుకొన్నారు.
***
కస్తూరి రంగ యస్.పి., వసంతదేశాయ్ డి.యస్.పి. చెప్పిన హెూటల్ ముందు కారును ఆపాడు. ఇరువురూ దిగారు. టిఫిన్ తిన్నారు. కాఫీ త్రాగి కారును సమీపించారు.
"సార్!..."
"ఆ... వసంత్....”
"సార్... మీరు ఫ్రీగా కూర్చోండి సార్. నేను డ్రైవ్ చేస్తాను." అన్నాడు వసంత్…
"చేస్తావా!...".
“చేస్తాను సార్!...”
“సరే!..."
వసంత్ డ్రైవింగ్ సీట్లో... ప్రక్కన కస్తూరి రంగ కూర్చున్నారు. కారు కదిలింది. కస్తూరి రంగ కళ్లు మూసుకొన్నాడు... వసంత్ రోడ్డును తదేకంగా చూస్తూ కారును నడుపుతున్నాడు.
కస్తూరి రంగ మనస్సున గత స్మృతులు... తన వూరు రేపల్లె... అక్కడి తన స్నేహితులు... అమ్మ.. నాన్న... తన యజమాని... వారి ఇల్లాలు అమ్మాయి... ఒకరు
తర్వాత ఒకరు గుర్తుకు వచ్చారు. అతను ఆవూరు వదలి పదిహేను సంవత్సరాలు... కల్లా కపటం తెలియని అమాయకుడు... ఆవూరిని విడచి వెళ్లేనాటికి... అతని వయస్సు పదిహేడు సంవత్సరాలు…
అతని తండ్రి పెనుముడి దరినుండి పులిగడ్డవైపుకు పడవను నడిపేవాడు... అతని పేరు మాధవయ్య. తల్లి తనను కని బాలింతగుణంతో పదవరోజున చనిపోయింది. నాయనమ్మ రంగమ్మ ఆ శిశువుకు 'రంగ' ని పేరు పెట్టింది. రంగను ఎంతో అల్లారుముద్దుగా సాకి పెద్ద చేసింది. తండ్రితో కలసి రేవుకు వెళ్లి పడవను నడపటాన్ని కూడా... చదువుకొంటూ నేర్చుకొన్నాడు రంగ.
రంగ ఏకసంతాగ్రాహి. ఎవరు ఏ విషయాన్ని చెప్పినా వెంటనే గ్రహించి మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకొనేవాడు. మాస్టార్లు 'రంగా!... నీవు బాగా చదివి ఈ ప్రాంతానికి కలెక్టర్ గా రావాలిరా!... పేదలందరికి జీవితాలకు సాయం చేసి బాగు చేయాలిరా!..." అంటూ ఆశీస్సులతో రంగాను అభిమానించేవారు…
గురువుల ఆదరాభిమానాలకు ఎంతగానో సంతసపించేవాడు రంగ. మనస్సులో... తాను బాగా చదివి కలెక్టర్ కావాలని... తాను కలెక్టర్ అవుతానని... కలలు కనేవాడు... అప్పటికి రంగా తొమ్మిదవ క్లాస్ చదువుతున్నాడు... వయస్సు పదిహేను సంవత్సరాలు. తండ్రి మాధవయ్య కృష్ణమ్మ ప్రవాహంతో పడవ తిరగబడి... ఆయన... పడవలోవున్నవారు... ప్రవాహంలో పడిపోయి... నీటకొట్టుకొనిపోయి మరణించారు.
తండ్రి మరణంతో రంగ చదువు... ఆగిపోయిది. నాయనమ్మకు అండగా నిలబడేదానికి కుటుంబపు జరుగుబాటుకు తండ్రిలా రంగడు పడవను నడపడాన్ని ప్రారంభించాడు.
ఆవూరి సంపన్నుడు గోపాలయ్య... రంగడి తండ్రి మాధవయ్య అంటే ఎంతో అభిమానం... పడవ నడపని రోజుల్లో (కృష్ణమ్మ పొంగినపుడు) గోపాలయ్య గారి ఇంట పాలేరు పని చేసేవాడు మాధవయ్య.
అతని మరణానంతరం... రంగాను గోపాలయ్య చేరదీశాడు. తండ్రిలా తన ఇంటి పనులను నిర్వహించవలసిందిగా రంగాకు చెప్పాడు. గోపాలయ్యగారు వారి తమ్ముడు బ్రహ్మయ్య... రంగాను ఎంతో ప్రీతిగా చూచుకొనేవారు. గోపాలయ్య వారి పెదనాన్నగారికి దత్తు.
గోపాలయ్యగారికి ఒక కుమార్తె. పేరు కస్తూరి. వయస్సున రంగా కన్నా ఐదు సంవత్సరాలు చిన్నది.
రంగాకు చిన్నతనం నుంచీ కస్తూరమ్మ అంటే ఎంతో గౌరవం... అభిమానం....
గోపాలయ్య తన తల్లిని కూతుర్ని విజయవాడలో వుంచి... కస్తూరిని చదివించాడు. రంగ రేపల్లెనుండి పడవలో కృష్ణానదిని దాటి... పులిగడ్డ దరిచేరి రెండు ఎడ్లబండ్లలో విజయవాడ చేరి తాను తీసుకొని వెళ్లిన కూరగాయలు... నెయ్యి... పండ్లు... విజయవాడలోని కస్తూరి అమ్మ వాళ్లకు చేర్చి తిరిగి వచ్చేవాడు. ఆ కారణంగా కస్తూరికి... రంగాకు ఎంతో సాన్నిహిత్యం...
కస్తూరికి... యుక్తవయస్సు వచ్చేనాటికి రంగడి వయస్సు పదిహేడేళ్లు... కాయకష్టం చేసిన శరీరం... ధృఢంగా... ఆరోగ్యంగా... ఆకర్షణీయంగా వుండేవాడు రంగ. గ్రామంలో వుండే వయస్సు వచ్చిన ఆడపిల్లలు రంగాను చూస్తే మనసుపడేవారు. రంగ... చాలా భయస్తుడు. పెద్దా చిన్నా గౌరవం... అభిమానం... తండ్రి నేర్చిన నీతి... నిజాయితీలను పాటిస్తూ జీవితాన్ని సాగించేవాడు. వాడి ప్రపంచం నాయనమ్మ...
నాయనమ్మ రంగమ్మ... మనవడికి తమ అయినవారి మధ్యన వున్న మంచిపేరు... గోపాలయ్య బ్రహ్మయ్యగార్ల దృష్టిలో వున్న గౌరవానికి ఎంతగానో సంతోషించేది…
విజయవాడలో ప్లస్ టూ పదిహేడేళ్లకు స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ గా పాసైంది కస్తూరి. పేపర్లలో ప్రశంసలతో ఆమె ఫొటోను ప్రచురించారు.
---------------------------------------------------------------------------------
ఇంకా వుంది...
కస్తూరి రంగ రంగా తొమ్మిదవ భాగం త్వరలో..
----------------------------------------------------------------------------------
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
Comentários