top of page

మహారాజు మహారాణి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Maharaju Maharani' Telugu Story


Written By K. Lakshmi Sailaja


రచన: కే. లక్ష్మీ శైలజ




“ మా వంశానికి యువరాజు," అంటూ ఫోన్ లో గేమ్ ఆడుతున్న పదిహేడేళ్ల రాజేంద్ర నోట్లో చిన్న లడ్డూ కుక్కింది, నాన్నమ్మ భూదేవి.


అది చూస్తూ, "అయ్యా యువరాజావారూ, ఇప్పటికే రెండుసార్లు చెప్పాను, వాషింగ్ మెషీన్ పని చూడమని. ఒక ఐదు నిముషాల్లో నువ్వు ఆ పని చెయ్యలేదనుకో, నీ బట్టలు

వెయ్యకుండా మావి మాత్రమే వేసుకుంటాము," అంది వాళ్ళమ్మ వసుధ బౌల్ లోనుంచి బీన్స్ వలిచి వేరే గిన్నెలో వేసి, పీచులు చిన్న కప్ లో వేస్తూ.


వసుధ వైపుగుర్రుగా చూసి వాషింగ్ మెషిన్ వెయ్యడానికి లోపలికి వెళ్ళాడు రాజేంద్ర.


"నాన్నమ్మా, నేను ఈ ఇంటి యువరాణి నీ, మహాలక్ష్మిని కూడా కదా, మరి నాకు

లడ్డూ ఏదీ?," అంది మహిత వేస్తున్న సైన్స్ రికార్డును పూర్తి చేసి, పక్కన పెడుతూ.


"ఆ.. నువ్వు తీపు ఎక్కువ తినవు కదా!” మనవడితో పని చేయిస్తున్నందుకు చేతులు తిప్పుతూ కినుకగా అంది భూదేవి.


వసుధ, మగపిల్లలు కూడా ఇంట్లో పని నేర్చుకోవాలని కొడుకుతో చిన్న చిన్న పనులు చేయిస్తూ ఉంటుంది.

భోజనాల టైం లో మహిత అందరి ప్లేట్స్ లో కూర, వడ్డిస్తూవుంది.

"రాజా నువ్వు ఫ్రిడ్జ్ లో పెరుగుతీసుకొని మజ్జిగ చెయ్యి,"అంది వసుధ ప్లేట్స్లోఅన్నం పెడ్తూ..

"నేను చేస్తాలేవే," అంది భూదేవి కుర్చీలోంచి లేవబోతూ.


"అదేమీ కష్టమయిన పని కాదు లే అత్తయ్యా," అని వసుధ ఆమెను వారించింది.


"నాకు రాదు, నేనేమైనా ఆడపిల్లనా? "అన్నాడు రాజేంద్ర తల అడ్డంగా ఊపుతూ.

"అయితే నువ్వు ఈ రోజు మజ్జిగ, పెరుగు వేసుకో వద్దు. మజ్జిగ చెయ్యడం నేర్చుకొనీ అప్పుడు మజ్జిగ వేసుకొని తిను," అన్నాడు వాళ్ళ నాన్న విశాల్ అందరికీ మంచి నీళ్ళు పెడ్తూ.

ఇంతలో కిచెన్ లో ఉన్న చిన్న టి.వి.లో నుంచి వస్తున్న ఒక వార్త వాళ్లందరినీ ఆశ్చర్య పరచింది.

'కేరళ ప్రభుత్వం వారు మహిళా అభివృధి శిశు సంక్షేమ శాఖ ద్వారా స్కూల్స్, కాలేజెస్ లందు 'స్మార్ట్ కిచెన్' ప్రోగ్రామ్ పేరిట ఆడపిల్లలతో పాటు, మగపిల్లలకు కూడా కుకింగ్, క్లీనింగ్ లందు శిక్షణ ఇవ్వడానికి డిసెంబర్ ఫస్ట్ 2021 న జీ. ఓ ను ప్రవేశపెట్టారు.' అని సారాంశం.

"రాజా విన్నావా?" తమ్ముణ్ణి ఆట పట్టిస్తూ అంది మహిత, ‘ ఈ జి.ఓ., నీలాంటి వాళ్ళ కోసమే’ అన్నట్లు.


"ఇంటిపనులు ఇంట్లో నేర్చుకోకపోతే, కేరళ కాలేజ్ లో చేర్పిస్తే సరి," అంది వసుధ నవ్వుతూ.


రాజా ఏడుపుమోహం పెట్టాడు, 'నిజంగా చేర్పిస్తారా?' అన్నట్లు .


అది చూసి వాళ్ళ నాన్న కూడా గట్టిగా నవ్వాడు. "భయపడకు,ఇంట్లోనే నేర్చుకుందువులే," అన్నాడు నవ్వుతూనే.

"అయినా అక్కడ ఇంటిపనులు నేర్పిస్తారటే,?" ఆశ్చర్యంగా అంది భూదేవి.


"మరేం చేస్తారత్తయ్యా. ఇంట్లో చెయ్యకుంటే వాళ్లకు పనులు రావు కదా. అమ్మా, నాన్న ఇద్దరూ ఆఫీస్ కెళ్తే ఇంట్లో ఉన్న ఆడపిల్లలే ఇంటిపని చెయ్యాల్సి వస్తుంది . ఆడపిల్లలు చదువు కోలేకపోతున్నారు. అందుకని ఇలా ఆలోచించి ఉంటారు," అంది వసుధ

అందరికీ నెయ్యి వడ్డిస్తూ.

" నిజమేలే. ఇంట్లో పెద్దవాళ్లు లేకుంటే, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఇంటి పనితో ఎంతో కష్టపడుతున్నారు కదా. 'క్షమయా ధరిత్రి ' అని అందరినీ క్షమిస్తూ మొత్తం ఇంటి పని ఆడవాళ్లే చేస్తున్నారు. నిజంగా ఇది ప్రవేశ పెట్టినవారికి మన ఆడవాళ్ళమందరం వందనాలు సమర్పిద్దాము," అంది భూదేవి మనఃపూర్వకంగా.


"నాన్నమ్మా, మగపిల్లలు పనిచేస్తే నీకు ఇష్టమేనా?" ఆశ్చర్యంగా అంది మహిత.


"ఎందుకు ఇష్టం లేదే తల్లీ! మీ నాన్నకు పనులు నేను కాదా నేర్పించింది? అందుకే మీ అమ్మకు కష్టం తప్పింది. రాజాకు చిన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం గారాబం చేశాము, అంతే. మీరిద్దరూ మా ఇంటి మహా రాజు,మహారాణి," అంటూ మనవరాలి తల నిమిరింది,ఆప్యాయంగా భూదేవి.

సమాప్తం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం


128 views0 comments
bottom of page