top of page

మహిళా ప్రస్థానం


'Mahila Prashtanam' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

‘ఓహ్ షిట్! ఎన్నిసార్లు ఈ మెస్సేజ్లు నాకు పంపొద్దు అని చెప్పినా మానరు. కనిపిస్తే వాళ్ళ చెంపలు వాయించాలనిపిస్తుంది....’ అంటూ విసుక్కుంది సితార .

''ఏమిటా మెసేజ్?” అడిగింది రేణు.

''నేను చూడను. నేను ఇంతకుముందు ఒక ఆర్గనైజషన్ లో వాలంటీరుగా పనిచేసాను. అప్పుడు అవసరం వచ్చినవాళ్ళకు, నాకు నమ్మకం కలిగిన వారికీ కొంత సహాయం చేసేదాన్ని. అదే కారణంగా ఇప్పుడు సాయం చేయమంటూ అబద్ధపు మెసేజులు పెడుతున్నారు. అదీ వేలల్లో.. లక్షల్లో.. డబ్బు సాయం! నాకుతెలుసు. అందులో ఏదీ నిజంకాదు. మన కుటుంబంలోనే కొందరు అసహాయులు వున్నారు. వారికి మనం ఇవ్వగలిగిన సపోర్ట్ ఇస్తున్నాం ఒక లిమిట్లో. బయటివారికి కూడా ఇవ్వలేముకదా...'' అంది సితార .

''అవును. మంచికిపోతే.. అన్నట్టు ఈ అడుక్కోడం 'పేస్బుక్' తో మొదలైంది. అతిగా పోతే అనర్ధమే'' అంది రేణు.

ఈ సారి రేణుకి వచ్చింది కొత్త రకంగా '' అడుక్కునే '' మెసేజు.

అది ఒక వీడియో. ఓల్డ్ ఏజ్ హోమ్ లో వున్న పెద్దాయనను అడుగుతోంది ఒక అమ్మాయి.

“మీరు ఎందుకు ఈ హోముకి వచ్చారు?”

అయన : నేను రాలేదు. నా కూతురు అల్లుడు బలవంతాన

తెచ్చారు. నా ఆస్తిలో డబ్బు కడతారు ఈ హోముకి.

అమ్మాయి : వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వున్నారు ? మీరు వాళ్లకి ఏమి చెబుతారు?

ఆయన : ‘అమ్మాయీ ! మీ అమ్మ కోమాలో వుంది. ట్రీట్మెంట్కి డబ్బుకావాలి . నువ్వు వచ్చిచూడు. లేదా డబ్బు 5 లక్షలు పంపు. ఒకేసారి కుదరకపొతే నెలకో లక్ష పంపు.’ అని చెప్పండి . మా అమ్మాయి ఆస్ట్రేలియాలో వుంది. అల్లుడు మంత్రికి PA గావున్నాడు. అమ్మాయికి నా ఆస్తి వంద ఎకరాలు ఇచ్చేసాను”.

అమ్మాయి : మీరు ఏవూరు నుంచి వచ్చారు?

ఆయన : (కోనసీమలో ఎదో చిన్న ఊరిపేరు చెప్పాడు) . నాపేరు… రాఘవయ్య . దయచేసి మావూరివాళ్ళు కూడా సాయం చేయండి. మా అమ్మాయి డబ్బు పంపగానే మీడబ్బు ఇస్తాను...

అమ్మాయి : మంచిది. ఇప్పుడే వందమంది కోనసీమ వారికి ఈ వీడియో పంపుతున్నా!

ఆ ముసలాయన చీపురు పుల్లలా నీరసంగా వున్నాడు. మధ్యలో ఆయాసపడుతున్నాడు.

ఆయన మాటాడలేదని శ్రద్ధగా చూస్తే తెలిసిపోతోంది.

రేణుభర్త తాతగారిది కోనసీమ . ఆ ప్రాంతంలో ఎవరూ అంత ఆస్తి గలవాడు లేడు. ఈ విషయం రేణుకి బాగా తెలుసు. సితారకి చూపించి డిలీట్ చేసింది.

రోజుకో కొత్త వేషం, కొత్త టెక్నీక్. మాయలో పడే అమాయకులు వున్నారు. నిజమైనా రూపాయి ఇవ్వనివారు వుంటారు. వల్లో పడేవారు ఎక్కువే అని చెప్పవచ్చు.

వెంటనే సితార ఫోనుచేసి ,'' నేను పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. మీ వీడియోకి నాగుండె కరిగి నీరైపోయిన్ది. నేను రెండు లక్షలు మీకు స్వయంగా వచ్చి ఇస్తాను. మీ అడ్రస్ కనుక్కోమని మా డిపార్టుమెంటు వారికి చెప్పాను. మీ వలన నాకు ఈ సహాయం చేసే గొప్పఅవకాశం వచ్చింది. ఇంకా మీలాంటి సంస్థలు ఉంటే చెప్పండి....'' అంది.

''రేణు .... మా పెదనాన్న, మామయ్య, బాబాయి ఇలా కొందరు ఓల్డేజ్ హోముకి పోదాం అని తెగ కొనేశారు అందులో ఫ్లాట్స్ అమ్మకానికి వస్తే నేను చెప్పాను.

‘ఎందుకు బాబాయి? మీరు ఉండేది స్వంత ఫ్లాటు . పిన్ని ఆరోగ్యం బాగానే వుంది. వంట చేస్తుంది. ఎప్పుడైనా అవసరం వస్తే కేటరింగ్ ఉండనే వుంది....’ అని.

నాకు ఈ ఓల్డేజ్ హోం కాన్సెప్ట్ అస్సలు ఇష్టం ఉండదు. భార్య భర్త ఇద్దరూ నిస్సహాయులు ఐతే అదివేరు.

మనవాళ్లుకూడా విదేశీయులనుంచి నేర్చుకోవాలి. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు చేయిన్చుకుంటూ, మందులు వాడుతూ, ఎక్సరసైజు చేస్తూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. భోజనం చేసి, టీవీకి అతుక్కుపోతే అనారోగ్యం వస్తుంది. బద్దకం చేయకూడదు. డబ్బువున్నా ఖర్చు చేయని తత్వం కొందరిది. మనకి మనమే రోగాలు తెచ్చుకుంటాం. ముడుచుకుని మూల కూర్చోడం సరికాదు. విల్ పవర్ పెంచుకోవాలి. అంతేకాని ఎక్కడికోపోయి ఎవరిమీదనో ఆధారపడడం అస్సలు మంచిదికాదు.''అంది సితార.

''ఎంత మంచి మాట చెప్పేవు సితార ! మా బంధువులు కూడా ఇదేమాట. కొడుకులు కూతుళ్లు చూడరు అంటూ రచ్చచేసి ఎదో ఉద్ధరించినట్టు మాటాడుతారు. పిల్లల పెంపకంలో స్వార్థం ఏమిటి? ఎన్నో కష్టాలు పడి పెంచాం అనడం ఏమిటో అర్థంకాదు. అది వారి బాధ్యత. మంచి ఉద్యోగాలు, పెన్షన్స్ తెచ్చుకునేవారు వున్నా స్వంతానికి ఖర్చు చేయరు.

పిల్లలమీద ఆధార పడటం దేనికి? నేనుకూడా నీతో ఏకీభవిస్తాను.''

“అస్సలు రాబడిలేనివారు, అంగవిహీనులు, అనాధలకు ఉండాల్సిన హోములు సీనియర్ సిటిజెన్స్కి అవసరంలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అంతకు మించిన ఆరోగ్యం ఏముంది? అమెరికాలు, విదేశాలు వెళ్ళొచ్చిన వారైనా మీ ఆత్మాభిమానాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు పాటించండి. వూరికే కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఏమీ ఉపయోగం లేదు.

నేను ఎవరిమీదా ఆధారపడను అనుకోండి. ఇంటిపని చేసుకోండి. తోట పని కల్పించుకోండి.

వ్యాయామం చేయండి. మహిళలు అందరికీ స్ఫూర్తిగా నిలవండి.

ఈరోజు మన మీటింగ్లో ఇదే చెబుతాను'' అంది సితార.

''నేను నా రచనల ద్వారా కూడా మహిళను చైతన్య వంతులను చేస్తా” అంది రేణు.

***శుభం ***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

ప్రేమకు సోపానం

పెంపకం

నేరానికి శిక్ష ఏది?

అనుబంధం

అందమైన ప్రకృతికి భాష్యాలెన్నో( కవిత )

నా తప్పు ఏమిటి???

ప్రకృతిని కాపాడుదాం (కవిత)

ప్రేమంటే ఏమిటో తెలియదే

అమ్మ చెప్పిన కమ్మని మాట( కవిత )

అత్త అంటే స్నేహితురాలు

మనసంతా నువ్వే!(కవిత)

మార్గ దర్శకులు

ఝాపక(జ్ఞాపక) పరిమళాల పూల గుచ్ఛం ( కవిత )

విధి చేసే వింత

అంతులేని ఆశ !

ఎందుకు ఈ కలరవము


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.


45 views0 comments
bottom of page