'Majili' New Telugu Story Written By
A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
"రాజేంద్రా.. రెండు రోజులుగా పార్క్ కి రాలేదు. కారణం ఏమిటి?" అన్నాడు శంకరం, ఇద్దరూ పార్కులో వాకింగ్ పూర్తిచేసి కూర్చున్నాక.
''ఏమీలేదు. హెల్త్ చెకప్ కోసం వెళ్ళాను. ఏడాదికి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయిన్చుకుంటాం- నేను, రేవతి. లేకపోతే లండన్ లో వున్న మా పిల్లలు ఊరుకోరు'' అన్నాడు రాజేంద్ర.
''అవన్నీ వృధా ఖర్చులు. డాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన డయాగ్నసిస్ సెంటర్లు కలిసి మనదగ్గిర చేసే నిలువు దోపిడీ.! ఐ కాంట్ బిలీవ్ ఇట్' 'అన్నాడు శంకర్.
''పోన్లేవోయి ... దూరంగా వుండే పిల్లల సంతృప్తి కోసం ఏమీ ప్రాబ్లమ్ లేదని అనిపించుకుంటే సరిపోతుంది. మనకి ఖర్చు అంటూ వేరే ఏముంటుందిలే .....ఇదొక్కటే!” అన్నాడు రాజేంద్ర.
''ఈ వయసుకి ఏదో ఒక జబ్బురాకుండా ఎలావుంటాం? వంటింటి చిట్కాలు లేదా హోమియో పతీ పిల్స్.. వీటితో మానేజ్ చేసేస్తాను. మా పిల్లలు కూడా పోరుతారు. హెల్త్ చెకప్ చేయిన్చుకోమని.'' అన్నాడు శంకరం.
అంతలో హరిబాబు, కృష్ణమూర్తి కూడా వచ్చి జాయిన్ అయ్యారు.
వాళ్లిద్దరూ వేరే రూటులో వాక్ చేసి, ఇంటికి వెళ్లేముందు కలుస్తారు.
''రాజేంద్ర హెల్త్ చెకప్ కోసం రెండు రోజులు రావడం మానేసాడు. మీరుకూడా చేయిన్చు కుంటారా ?” అన్నాడు శంకరం .
''అవును. అది మంచి అలవాటు. మన తాతా తండ్రుల కాలంలో ఈ పద్ధతులు లేవు..వాళ్ళకి వంశపరంపరగా వచ్చిన ప్రమాద కరమైన జబ్బులు తెలియవు.
కానీ ఇప్పుడు ముందుగా తెలుసుకుంటే చాల వరకు నివారించుకునే అవకాశం వుంది. తప్పనిసరిగా ప్రతి ఏడాది హెల్త్ చెక్ అప్ అవసరం. జబ్బు వచ్చాక డాక్టరు దగ్గిరకి పరుగెత్తడం వాళ్ళు టెస్ట్స్ రాస్తే 'డబ్బు వదిలిస్తున్నాడు’ అని తిట్టుకోవడం సరికాదు. అందరు డాక్టర్లు ఆలా వుండరు. పేషంట్ నమ్మితే సిన్సియర్గా ఆరోగ్యం కాపాడుతారు.'' అన్నాడు హరి.
''ఏమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. నాకు డాక్టర్ అంటే భయమే!" అన్నాడు కృష్ణ మూర్తి.
''ఎవరినీ నమ్మకపోతే నష్టపోయేది మనమే. నేనుమాత్రం ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టుకుంటా . డాక్టర్ చెక్ అప్ కి వెడతాను. ఈ మధ్య చాల రకాల పోస్ట్ కోవిడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ పేస్ చేయాల్సి వస్తోంది. మా బంధువుల్లో ఇద్దరు చనిపోతే మరో ఇద్దరు అంతుచిక్కని జబ్బుతో బాధలు పడుతున్నారు. ముందు జాగ్రత్త అవసరం''అన్నాడు రాజేంద్ర.
''దేవుడు ఇచ్చిన ఆయువు ఉంటే బతుకుతాం. లేదంటే పోతాం.''అన్నాడు శంకరం.
''భలేవాడివే! కర్మ సిద్ధాంతం కుదరదు. ఈరోజుల్లో మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. హాస్పటల్ పాలైతే చూసేవారు వుండరు. ఏ దేముడు రక్షించలేడు. ఏదో వచ్చాక డాక్టర్ చుట్టూ తిరిగేకంటే ముందు మేలుకోడం మంచిది. మన పెద్దవాళ్ళకి లోపాలు ఉంటే మనకి, పిల్లలకు కూడా సంక్రమిస్తాయి. విదేశాల్లో ఫామిలీ హిస్టరీ తెలుసుకుని ట్రీట్ చేస్తారు.డాక్టర్లు … అందుకే.' అన్నాడు రాజేంద్ర.
''ఐతే తప్పనిసరిగా డాక్టర్ దగ్గిరకి వెళ్ళాలి అంటావా?" అన్నారు శంకరం, కృష్ణమూర్తి.....భయంగా .
''వెడితే మంచిది.''
''ఐతే మీరు వెళ్లిన డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళు.''అన్నారు ఇద్దరూ.
''నేను అపాయింట్ మెంట్ తీసుకుని చెబుతాను.''అన్నాడు రాజేంద్ర.
అప్పటివరకు అనారోగ్యం వచ్చినపుడే డాక్టర్ దగ్గిరకు వెళ్లే వాళ్ళు. రాజేంద్ర చెప్పగానే భయపడి అతడినే సాయం అడిగారు.
హరికి అమెరికా గ్రీన్ కార్డు వుంది. అందువల్ల ప్రతి ఏటా అమెరికా వెడతాడు. అక్కడ చెకప్ చేయిన్చు కుంటాడు. ప్రాబలెం లేదు. ఐనా అవసరం ఐతే డాక్టర్ దగ్గిరకు వెడతాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వుంది.
రెండురోజుల తర్వాత డా. ముఖర్జీ దగ్గిరకు తీసుకెళ్లాడు శంకరాన్ని కృష్ణ మూర్తిని.
ముఖర్జీ శ్రద్ధగా చూసి “కొన్ని పరీక్షలు చేయిన్చుకోవాలి . మీరు ఎక్కడైనా చేయిన్చుకోండి. రిపోర్ట్స్ తీసుకురండి” అన్నాడు.
''వీటికి ఖర్చు ఎంత అవుతుంది ? అడిగారు.
''పదిహేను వేలు అవ్వచ్చు ''అన్నారు డాక్టర్.
‘సరే’ అనిచెప్పి వచ్చేశారు.
"అదికూడా నువ్వే చెప్పు. ఎక్కడకి వెళ్ళాలి?"
''అలాగే చెబుతాను. కానీ మీ అబ్బాయికి కంపెనీ మెడికల్ ఎయిడ్ ఇస్తుందేమో కనుక్కో. బిల్ పెట్టచ్చు. నీ భార్యని కూడా చూపించు. నీ పెంక్షన్ ఖర్చు చేయకు. '' అన్నాడు రాజేంద్ర.
''అలాగా! వాడు ఎప్పుడూ చెప్పలేదు. మేము వేరుగా వున్నాము కదా.. అమ్మయిని తీసుకువస్తే సారె చీర నేనే ఇస్తాను....” అన్నాడు కృష్ణమూర్తి.
''మా అల్లుడు చేసేది చిన్న వుద్యోగం. నా పెంక్షన్లో కొంత అమ్మయికి ఇస్తాను. కలిసివుంటే ఖర్చు కలిసి వస్తుందని మా ఇంట్లో వుంచుకున్నాను. అదృష్టం.. అల్లుడు బుద్ధి మంతుడు. అమ్మయి శిరీష బ్యాంకు వుద్యోగం. ఎలాటి ఇబ్బందీ లేదు. నాకు పెంక్షను అరవై వేలు వస్తుంది. ఇండిపెండెంట్ హవుసు వుంది.
కానీ ఇప్పుడు నా ఆరోగ్యం దెబ్బతింటే కష్టమే'' అన్నాడు దిగులుగా.
''ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నావా కనీసం! అమ్మాయిది బ్యాంకు వుద్యోగం కనుక పంజాబ్ నేషనల్ ఇన్సూరెన్స్ ఫామిలీ స్కీమ్ మీకు రక్షణ కల్పిస్తుంది. అడుగు వివరాలు.'' అన్నాడు రాజేంద్ర.
''ఇవేమి నాకు తెలియవు. ఇప్పుడే మీ అమ్మాయి శిరీషను నేను కూడా అడుగుతాను . నాకు పెంక్షన్ లేదు. నేను వున్న ఫ్లాటు కాకుండా రెంటు వచ్చే ఫ్లాటు వుంది. ఇద్దరు అమ్మయిలు. వాళ్ళకి నా అవసరంలేదు, నాకు వాళ్ళ సహాయం అక్కరలేదు'' అన్నాడు శంకరం.
''మనం రిటైర్ అయ్యాక జీవితం సాఫీగా గడవాలంటే ముందుగా జాగ్రత తీసుకోవాలి. పిల్లల మీద ఆధారపడే స్థితి తెచ్చుకో కూడదు. వాళ్ళు మనగురించి ఆలోచిస్తే పర్వాలేదు. లేకుంటే అడిగే స్థితి ఉండరాదని నా పాలసీ.''
''నువ్వు చాల ఉపకారం చేసావు రాజేంద్ర.. థాంక్స్” అన్నారు ఇద్దరు.
కృష్ణమూర్తి కొడుకుని అడిగాడు 'డాక్టర్ ముఖర్జీ టెస్ట్స్ చేయిన్చుకోమన్నారు. నీ కంపెనీ నాకు, అమ్మకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందా?” అని.
''ఎప్పుడు లేనిది ఇప్పుడు డాక్టర్ దగ్గిరకి ఎందుకు వెళ్ళావు?” అన్నాడు చరణ్.
''వాకింగ్ చేస్తుంటే ఆయాసం, ఎడమ చేయి లాగడం అనిపిస్తుంటే రాజేంద్ర అంకుల్ని అడిగాను. వాళ్ళ పిల్లలు డాక్టర్లు కదాని. అంకుల్ వెడతారుట డా.ముఖర్జీ అని … తీసుకెళ్లారు.''
''నాతో చెబితే నేను తీసుకువెళ్ళేవాడిని. అంకుల్తో ఎందుకు చెప్పావు? నా పరువు తీసావు.....” అంటూ చరణ్ అరిచాడు.
''నీకు కాళీవుండదు.. అని చెప్పలేదు. అంకుల్ మంచివాడు. సలహా ఇచ్చాడు. నీ పరువు పోయేది ఏముంది ఇందులో…” అన్నాడు కృష్ణమూర్తి.
తండ్రిపేరుతో మావగారికి, అత్తగారికి కంపెనీ తరపు హెల్త్ బెనిఫిట్ అవకాశం వాడుకున్నట్టు చెప్పలేని చరణ్, పైకి వూరికే హంగామా చేసాడు. అతడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అత్తా మామలను నెత్తిమీద పెట్టుకుని పూజిస్తాడు. వాళ్ళకి ఒక్కటే కూతురు. ఇప్పుడు తండ్రికి ఏమి సమాధానం చెప్పాలో తెలియని అయోమయంలో వున్నాడు.
కేవలం పదిహేను వేలతో సరిపడదు. లక్షలు ఖర్చుచేయాలి.
కనీసం తండ్రికి, తల్లికి ఇన్సూరెన్స్ ఐనా కట్టకుండా నిర్లక్ష్యం చేసాడు. ఆయనకు హెల్త్ బెనిఫిట్ కార్డు ఉందిలే అని. ఇప్పుడు కొంప మునిగేలా వుంది.....అనుకున్నాడు.
ఇదంతా విన్న కోడలు అపరంజి, “ముందు టెస్ట్ చేయిన్చండి. తర్వాత మావగారి ఆరోగ్య భీమాలో బిల్లు పెట్టచ్చు” అని సలహా ఇచ్చింది. టెస్ట్ చేయిస్తే మూడు బ్లాక్స్ ఉన్నాయని, అర్జన్టుగా బైపాస్ చేయాలని డాక్టరు చెప్పారు.
ఎవరు తక్కువ ఖర్చుకి సర్జరీ చేస్తారా అని వాళ్ళని వీళ్ళనీ అడుగుతూ ఆరునెలలు గడిపేశాడు చరణ్.
ఈలోగా కృష్ణమూర్తి బాత్ రూమ్ లో షవర్ చేస్తూ పడిపోయాడు. ఎమర్జన్సీకి వెళ్లాల్సి వచ్చింది .
డా. ముఖర్జీ దగ్గిరకి వెళ్ళక తప్పలేదు. ఆయన కరెక్ట్ గా రోగ నిర్ధారణ చేస్తారని, చాలా కేసులు విజయం సాధించారని మంచిపేరు. బిల్లు కూడా ఎక్కువ వసూలు చేస్తారు.
దురదృష్టం కావచ్చు.. మొదటి నుంచి శ్రద్ధ తీసుకోలేక పోవడం కావచ్చు.. కృష్ణమూర్తి ఒకరోజు బ్రెయిన్ హేమరేజ్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు.
పూర్తిగా ప్రాణంపోతే ఒకటే బాధ. కోమాలోవున్నారంటే పేరుకి ప్రాణం ఉంటుంది.... కానీ ఎలాటి కదలికా ఉండదు. వాళ్లకి తెలివి వస్తుందో రాదో ఎవ్వరూ చెప్పలేరు.
వేచి చూడ వలసిందే . హాస్పటల్ బిల్లు పెరిగిపోతుంది. ఇంటిదగ్గిర ఎవరూ చేసేవారు వుండరు. పనివారిని పెట్టినా కష్టమే. త్వరగా పొతే బాగుండును … అని భార్యా పిల్లలు విసిగిపోతారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.
''అయ్యో మన టీములో కృష్ణ మూర్తిని మిస్ అయ్యాం....అని స్నేహితులు బాధపడ్డారు. అప్పుడప్పుడు వెళ్లి చూసి వచ్చేవారు.
కృష్ణమూర్తి కుటుంబం ఆశ వదులుకున్నారు. అతడి ఖర్చు మించి పోవడంతో ప్రభుత్వ సహాయం ఆగి పోయిన్ది. చివరికి చరణ్ మెర్సీ కిల్లింగ్ కి అప్లికేషన్ పెట్టాడు, భార్య సలహామీద!
కనీసం మరో మూడు నెలలు పడుతుందని చెప్పారు.
శంకరం జాగ్రత్త పడి తన ఆహార నియమాలు మార్చుకున్నాడు.
హరి అమెరికాలో డాక్టర్ ట్రీట్ మెంట్ లో తన అనుభవాలు చెప్పేవాడు.
‘నలుగురం ముగ్గురు అయ్యాం.....’
కర్మ సిద్ధాంతం నమ్మే శంకరం క్రమశిక్షణ నేర్చుకున్నాడు.
''అనవసర ఖర్చులు తగ్గించాలి .....అవేమిటో చెప్పు నీ దృష్టిలో ..!.” అని రాజేంద్రను అడిగాడు.
''నేను పాటించేది చెబుతాను. ఎందుకంటే మీకు ముఖ్యం అనుకున్నది నాకు వృధా కావచ్చు. నాకు తప్పనిసరి అయినది మీకు నచ్చకపోవచ్చు.
నేను పార్టీలకు పెళ్లిళ్ళకు వెళ్ళను. దేముడు పుణ్య క్షేత్రాలు వ్రతాలు మొక్కులు నాకు నచ్చవు. రేవతి మొదట్లో నా పద్దతి వ్యతిరేకించేది. తరువాత అర్ధం చేసుకుని ఇంటికే పరిమితం చేసుకుంది.''
''ఎవరిని కలవకుండా మాటాడకుండా ఇక మార్పు ఏముంటుంది? విసుగురాదా!” అన్నాడు హరి.
''ఫోనులో వారానికీ నెలకీ మాటాడుకుంటాం. ఈ హైదరాబాదులో అందరం తలో మూలా ఉంటాం, కలవడం కష్టం కనుక.
ఇక పెళ్లిళ్లు అంటే భోజనాలు ఎంతకని తినగలం. గిఫ్ట్ పెద్ద సమస్య. వాళ్లకి నచ్చేది ఇవ్వలేం. అసలు ఇవ్వకపోతే ‘తేరగా తిని పోయాడు’ అంటారు.
ట్రాఫిక్లోపడి చచ్చి చెడీ వెళ్లిన బాధ వాళ్లకి అక్కరలేదు. ఇప్పుడు చిన్న వయసులో అనారోగ్యాలు వస్తున్నాయి. ఫామిలీ ఫంక్షన్స్ అంటే తప్పదు. వేరే వూరు ఐతే అదీ వెళ్ళను.
ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కట్టుకుంటాను మా ఇద్దరికీ.
కోవిడ్ వచ్చి తగ్గాక అన్ని బంద్ చేస్తారు అనుకున్నా. మళ్ళీ మొదలు పెట్టేసారు వృధా పార్టీలు ఖర్చులు.''
నేను ఎప్పుడూ వ్యతిరేకిని వృథాఖర్చులకు, ఆడంబరాలకు. మా పిల్లలకి రిజిస్టర్ మ్యారేజ్ చేసాను. అప్పుడు ఉద్యోగంలో వున్నాను కనుక పార్టీ ఇచ్చాను .అంతే. నాకు నచ్చినట్టు చేస్తాను. ఎవరికోసమో స్టేటస్ కోసమో ఏమి చేయను.
మా అమ్మ, నాన్నగారు పోయిన రోజున అనాధలకు సీనియర్ సిటిజన్ లకు కొత్తబట్టలు, భోజనం, వైద్య సహాయానికి కొంత డొనేషను ఇస్తాను. అంటే ప్లాన్డ్ గా ఖర్చు చేస్తాను. అదీ వాళ్ళ ఆస్తే. నాది కాదు. మీరుకూడా ఏదో ఒక ప్లాన్ చేసుకుని ఖర్చు చేయండి. ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.'' అన్నాడు.
హరి శంకర్ కూడా రాజేంద్రని సమర్ధించారు. అనవసర ఖర్చు లిస్ట్ తయారు చేశారు.
''మా ఆవిడ సురేఖ ఖర్చు నా చేతిలో లేదు. అదెలా కంట్రోల్ చేయాలి?” అడిగాడు హరి.
''ఏముంది.. నెలకి కొంత మనీ ఇవ్వు.’అంతకు మించి ఇవ్వను’ అని చెప్పు.
ఆవిడకి ప్రతి నెల ఒకే ఖర్చు ఉండదు కనుక మిగులు పొదుపు చేస్తుంది.....” అన్నాడు శంకర్.
''చూడాలి ఆచరణలో ఎంత సాధ్యమో!అన్నాడు హరి.
''అందరు ఆడవాళ్లు ఒకేలా ఆలోచించరు. బాధ్యతలు తీరి, ఈ వయసులోకూడా పొదుపుగా ఉండాలా… అనే బాధ వాళ్లకి వుండకూడదు. కనుక ఏడాదికి కొంత మనీ పెంచడం అవసరం ''అన్నాడు రాజేంద్ర.
'' నీ సలహా బాగుంది. ఉపయోగకరం కూడాను. మన అర్ధాంగుల మనసుకి కష్టం కలగకుండా నడచుకుందాం. మనవెంట ఉండేది సతీమణి మాత్రమే. వాళ్ళ సంతోషం మనకు రక్ష.'' అన్నాడు హరి.
''ఏమాటకి ఆ మాట. నా భార్య నేను ఎలా చెబితే ఆలా చేస్తుంది. నాకు ఇంత కావాలి అని అడగదు. అమాయకురాలు'' అన్నాడు శంకర్.
''అలాటి వారిని మరీ కనిపెట్టి ఉండాలి…
నాకు తెలిసిన భార్య భర్తల గురించి చెబుతాను.
భర్త చాలా చండ శాసనుడు. ప్రతీ పైసాకి లెక్క అడిగేవాడు. లేదా కూడా వెళ్లి 'అది ఎందుకు..అనో, ఇదిచాలనో..... చాలా ఖరీదు. తర్వాత కొనచ్చు…’
అంటూ అడ్డుపడేవాడు.
ఆవిడ విసిగిపోయి ఫ్రెండ్స్తో ఆయన వినేట్టు ..... ‘మా ఆయన పెంక్షన్ సగం నాకు ఎప్పుడు వస్తుందో..... అప్పటిదాకా నాకు స్వతంత్రం లేదు. నేను నీతో షాపింగ్ చేయలేను ..’ అని చెప్పేది.
భర్త చనిపోయినప్పుడే గా ఆవిడకి సగం పెంక్షన్ వచ్చేది!
సో....ఆ పరిస్థితి రాకూడదు. భార్య వుద్యోగం చేసినప్పుడు అదీ తీసుకుని .. ఆంక్షలు పెడితే వాళ్ళు భరించరు. అన్యోన్యంగా, అర్ధం చేసుకుని సుఖ సంతోషాలు పంచుకోవాలి'' అన్నాడు రాజేంద్ర.
''అనకూడదు కానీ కృష్ణమూర్తి కొడుకు అత్తమామలకు ఫేవర్ చేయడం, తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేయడం ఏమిటి?” అన్నాడు హరి.
''వాళ్ళు అన్నారట. ‘మా అమ్మయిని పెళ్లి చేసుకోవాలంటే ...మా బాధ్యత పూర్తిగా నీదే!’ అని .
ప్రేమపెళ్లి మహత్యం. జనరేషన్ ఆలోచనలు ఇప్పుడు అలాగే వున్నాయి.
పిల్లలు ఆదుకుంటారు అనే ఆలోచన మనకి వుండకూడదు. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ''
''అవును....ఇప్పటికే చాలామంది ఆ నిర్ణయానికి వచ్చారు.ఒక విచారకరమైన వార్త… మా అబ్బాయి నన్ను అమెరికా వచ్చేయమని ఒకటే గొడవ చేస్తున్నాడు. నా భార్యకి అక్కడ ఉండటం చాలా ఇష్టం....ఆవిడ ఇష్టాన్ని గౌరవించడం నాకు మనశ్శాన్తి. మిమ్మల్ని విడిచి వెళ్లడం విచారకరం!’ అన్నాడు హరి దిగులుగా.
''ఎవరి మజిలీకి వాళ్ళు చేరుకోడం జీవిత ధర్మం. నిజమే మనం కలిసి ఇలా కబుర్లు చెప్పుకోడం.... ఇక ఫోనులోనే . పిల్లలు మనవలతో ఆనందంగా వుండండి. ఎవరైనా కోరుకునే చివరి మజిలీ ఇది.' 'అన్నాడు రాజేంద్ర.
''మనిద్దరం మిగిలాం రాజేంద్రా.. నువ్వు కూడా లండన్ వెళ్లేవరకూ ! అన్నాడు శంకరం.
''నేను వెళ్ళను. రేవతికి ఇష్టం లేదు. వాళ్ళ మదర్ వున్నారు. ఆవిడకు రేవతి ఒక్కటే కూతురు. బోలెడు ఆస్తి వుంది.''.......అదంతా పెద్ద సమస్య. డోంట్ వర్రీ శంకర్ …” అన్నాడు.
''జస్ట్ దూరంగా ఉంటాం తప్పితే ఫ్రెండ్షిప్కి అవరోధం ఉండదు. అప్పుడప్పుడు రెండేళ్లకు ఒకసారి వస్తాలే.... అంటూ వాళ్ళ దగ్గర వీడుకోలు తీసుకున్నాడు హరి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments