top of page

నగుబాటు

Nagubaatu Written By Dr. Ch. Babavali Rao

రచన : Dr. Ch . బాబావలి రావు


నాగేశ్వరరావుగారు ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్రలేచారు. ప్రక్కనే ఉన్న చేతిగడియారాన్ని చూస్తే టైం నాలుగు కావస్తున్నది. అది నిండు వేసవి. శుక్షపక్షం చివరిదినాలు, పండు వెన్నెల, చల్లని మెల్లని పిల్ల వాయువులు. ప్రశాంతమైన గ్రామ వాతావరణం. వాకిటగల వేపచెట్టు క్రింద నవారు పట్టె మంచంమీద గాఢ నిద్రపోతున్న రావుగారు ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేవటానికి అంతగా పెద్ద కారణం బాహ్యమైనది ఏదీ లేదు.

ఇంకా పల్లె నిద్రలేవలేదు. లేవటానికి సన్నద్ధమవుతున్నది. ప్రక్కనే గంపలోగల కోడిపుంజు కూయలేదు. దగ్గరే చావడిలోగల ఎద్దులు, ఆవులు, బఱ్ఱెలు, లేగలు లేచి ఏవి అరవలేదు. జనం తిరుగుతున్న సవ్వడేలేదు.

పోనీ ఆయన పోతున్నది మగత నిద్రాకాదు. గాఢనిద్రే.

రావుగారు హైద్రాబాద్‌ నుంచి సొంత ఊరు వచ్చారు. తమ్ముడు కుమార్తె పెండ్లికి, రెండు రోజులు

క్రితమే పెండ్లి సందడి ముగిసింది. నాలుగు రోజులుండి వెళ్ళమన్న తమ్ముడి అభ్యర్థన మీద ఆగాడు. కన్నఊరు,పెంచి పెద్దచేసిన గ్రామం. ఆయన చదువుకని కొంతకాలం, తర్వాత ఉద్యోగానికి బహుకాలం కన్నతల్లిని

విడిచి బయటే ఉన్నారు. అయినా పండగలకు, శుభాశుభ కార్యాలకు వస్తూనే ఉంటారు. ఇపుడాయన అరవై

ఆరు సంవత్సరాల వయసువారు. పదవీ విరమణ పొందికూడా ఆరేళ్లు అయ్యింది. రిటైర్‌మెంటు ధనంతో

భాగ్యనగరంలో ఒక అపార్టుమెంటు కొనుక్కున్నారు. ఒక కుమార్తె ఒక కుమారుడు. ఇద్దరూ ఉన్నత

చదువులు చదివి, ఉన్నతోద్యోగాలతో అమెరికాలో ఉన్నారు. అల్టుడూ, కోడలు అక్కడే ఉద్యోగిస్తున్నారు.

ఒక సంవత్సరం కావస్తున్నది భార్య కాలంచేసి. ప్రస్తుతానికి ఒంటరిజీవి. అపుడపుడూ అమెరికా వెళ్లిరావడం

తప్పితే అక్కడ ఉండబుద్ది పుట్టదు. తమ్ముడూ తనదగ్గర ఉండమంటాడు. హైదరాబాద్‌ వాతావరణానికి

అలవాటు పడినవారు, సాగరతీరగ్రామాలలో ఉండడం కష్టం. అది ఎంత ప్రీతిపాత్రమైన కన్న ఊరైనా.

ఎండ తీవ్రత, ఉక్కపోత, దోమలబాధ.


ఇంతకీ ఆయన నిద్ర చెరిచిన విషయం ఏమిటి? రెండు రోజులనుంచీ టి.వి. ఛానళ్లలో పదేపదే

చూచినవార్తలు, పత్రికల్లో చదివిన విషయాలు ఎంతగానో కలవరపరిచాయి. ఒక్కసారి డబ్బాటుగా కలలో

కన్పించాయి. మెలకువ వచ్చింది. కల చెదిరింది. ఇటువంటి వార్తలు క్రొత్తగా చూస్తున్నవీ, వింటున్నవీ కావు.

చాలా కాలంగా బాహాటంగా జరుగుతున్న ఉదంతాలే. మాటిమాటికి గాయపర్చిన విషయాలే. అయితే ఈ

సాయంకాలం ప్రాత మిత్రులతో రచ్చబండమీద కూర్చుని హృదయదఘ్నంగా చర్చించుకోవడంమూలాన

కలలోమరీ కలవరపర్పాయి. ఇంకానయం ప్రతిస్పందనగా కేకలేయలేదు.


తండ్రులు ముక్కుపచ్చలారని తమ కూతుళ్లనే చెరచడం, ప్రేమికులు పెద్దల ప్రతిఘటనకు తాళలేక

ఆత్మహత్యలకు పాల్పడడం, పరువుకోసం తక్కువ కులస్టులైన అల్టుళ్లను చంపించడం, పెద్దలే విలువైన

భూముల్ని ఆక్రమించడం, రాజకీయ నాయకులు, అధికారులు అవినీతికి పాల్పడడం, లంచగొండితనం

పెరిగిపోవడం, విచిత్రంగా న్యాయవ్యవస్థకూడా దిగజారడం, కంచెవంటి రక్షణవ్యవస్థ చేను మేయడం, పాలకల్తీ

నూనె కల్తీ నేయి కల్తీ-కల్తీ లేని వస్తువే కన్పించకపోవడం, పరీక్షలు, ఎన్నికలు బూటకం కావడం, ఫోర్త్‌

ఎస్టేటువంటి పత్రికలు దిగజారడం, దగా, మోసం రాజ్యమేలడం, రాజకీయ వ్యభిచారం శ్రుతిమించడం,

భారతీయ ధర్మం మసకబారి పాశ్చాత్యభావనలు పెరగడం, యువత తప్పుదారి పట్టడం, కుటుంబ వ్యవస్థ


కుంటుబడడం, మానమర్యాదలకు విలువతగ్గి ధనానికి [ప్రాధాన్యం పెరగడం వంటి విపరీతపు పోకడలు

ఎంతో కాలం నుంచి చూస్తున్నవే. అయినా ఈమధ్య మరీ అవధులు దాటుతున్నాయి. 1970కి ముందు

ఇంత అన్యాయం, అక్రమం లేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పెరిగి పెరిగి నేటికి (2020) ఏభై

సంవత్సరాలకాలంలో వెజ్జితలలు వేశాయి. లోగడ తరానికి ఎంతో కొంత మార్పు కన్పించేది. తరం అంటే

ఇరవై అయిదు ముప్పై సంవత్సరాలకు నడుమ కాలం. కాని ఇపుడు ప్రతి పది సంవత్సరాలకు మార్పు

కనిపిస్తున్నది. 1970కి నాగేశ్వరరావుగారికి 16 సంవత్సరాలు. అది ఊహతెలిసిన వయసే. నాటి నుంచి తన

కళ్లముందే ఎంత మార్పు జరిగిందో ఆలోచిస్తే భరింపరాని ఆవేదన అతలాకుతలం చేస్తుంది. రావుగారు

'ప్రక్కమీద నుంచి లేచి కాలుమడుచుకుని వచ్చి, కాళ్లు చేతులు కడుక్కుని, తుడుచుకుని మంచంమీద

కూర్చుని ఆలోచనాసముద్రంలో మునిగాడు. ఆయన కొద్దిపాటి కవి, రచయితకూడా. అందుకే అంత

గాఢత.


ఇంతలో ఒకతను దుప్పటి కప్పుకుని వేగంగా రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్నాడు. సాయంకాలం

తమ మాటల్లో దొర్లిన వ్యక్తే ఆతడని గుర్తించాడు. ఒకకుక్క ఆతడిని చూచి కొద్దిగా మొరిగిందికూడా. అది

రావుగారి చెవినిపడింది. పరదార సంగమాన్ని రహస్యంగా జరిపి తెల్దారకముందే కొంప చేరుతున్నాడు

ఆతడు. దాంతో మనసు కలుక్కుమన్నది. వావివరసలు తప్పికూడా వ్యభిచరిస్తుండడం వింటున్నాం. అదే

ఇది. పిన్ని వరసయ్యే ఆమెను పొందివస్తున్నాడు. ఆ శునకం అరవడం కాదు. అది నవ్వడమే. దానికి తెలుసు.

రోజూ వెళ్లివచ్చేవాడే. ఎపుడో భావించి తన బుద్ధిలో నిలుపుకున్న కొద్ది గేయపంక్తులు గుర్తుకు వచ్చాయి.

“రాత్రనక పగలనక / సంధ్యలనక బుతుననక/ వావినరసలు లేక/ న్యభిచరించే మనుషులజూచి/ బుతునందె

పొందెడి / కుక్క నవ్వింద”ని ఎంతపాపం, ఎంత దారుణం అనుకున్నాడు.


వెంటనే ప్రక్కనేగల గంపలోగల కోడిపుంజు కొక్కొక్కరోకో అని కూచింది. ఆకూత అకోడి

నవ్వినట్టున్నదిగాని కూచినట్టు లేదు. మానవదుర్చలతను చూచి అవహేళన చేసినట్టున్నది. పెండ్లిలో తిన్న

ఆహారం అరగక తిప్పలపడ్డవారు ఇద్దరు ముగ్గురు దానికి తెలుసు. చెంబు పట్టుకు తిరగడం చూచింది.

ఇంత తింటే తక్కువ, అంతతింటే ఎక్కువ మీకెందుకురా అంత పొగరని ఈసడించినట్టున్నది. మరల కవి

హృదయం కదిలింది. ప్రాత భావనే నోటివెంట నెమ్మదిగా వెలువడింది. “నమిలి మింగిన దోసగింజరగని/

కాకరగింజరగని/మిరపతొక్కరగని/ ఉదరకోశముతోడ/సతనుతపడియెడి/మూనవులగాంచి/ నడ్డు జొన్నలవంటి

గట్టిగింజల/నమలకే మింగి ఇట్సె అరగించుకొనెడి/కోడి నవ్వింది.” నిజమే కదా! జానెడి పొట్టకు అంతటి

తాపత్రయం ఎందుకో! ఏమి పట్టుకుపోవడానికో! ముందు ఎందరు పట్టుకుపోయారో!


ఇంతలో అయిదు గంటలయ్యింది. ఊరు నిద్రలేచింది. జనసంచారం పెరిగింది. తన చిన్ననాటి

చల్లకవ్యాల మ్రోత విన్సడలేదు. గోవులు అంబా అని అరుస్తున్నాయి. అవి చాలా తక్కువ, గేదెలు ఒకరకంగా

ఎక్కువే. గేదెపాల అమ్మకం లాభసాటిగా ఉన్నందున. నెమ్మదిగా పాలుపితికే సవ్వడి విన్సించసాగింది.

అందొక లయ, శ్రుతి పొందుపడి శ్రవణ సుభగమై ఆనందాన్ని ఇస్తున్నది. రావుగారి మనసు ఎక్కడికో

వెళ్లింది. రావుగారి తమ్ముడి పాలేరు పశువుల్ని చావడినుంచి తీసి బయట కట్టివేస్తున్నాడు. ఒక ఆవు దూడ

SOs చూస్తూ అంబా అన్నది. అది నిజంగా అమ్మా! అన్నట్టే ఉంది. గోవు విశిష్టత రావుగారి మనుఫలకం పై

సాక్షాత్కరించి పెదవులు ఈ పదాల్ని వెలార్వాయి. ప్రక్కవారికి వినీ వినిపించనంతగా.


“తన మూత్రనును తానె /తన పురీషమును తానె

చీదరించెడి నవూనవులజూచి/ తనదుమూత్ర పురీషాలనె

పరనమౌషధాలుగ /భావించి సేవించె /మనుజులచూచి/


కసిలావు నవ్వింది” “ఇటువంటి గోసంపదను సరిగ గుర్తింపలేని, పోషింపలేని ఈ జాతి

క్షమింపరానిదనుకున్నారు.” “కా హగ్గింగని” పరాయివారు చెబుతుంటే సిగ్గుగలుగుతుందని బాధ పడ్డారు.

వారి తాతగారి కాలం నుంచి రెండు మూడు ఆవులు, ఎద్దులు, దూడలు వారి దొడ్డో ఉండేవి, పదిహేను

ఎకరాల ముక్కారు పండే మాగాణి ఉండేది, తాతగారికి వీరి తండ్రి ఒక్కడేగాని వీరి తండ్రికి ముగ్గురు ఆడ

పిల్లలు, ఇద్దరు మగపిల్లలు. సంతానమే సంపదగా భావించే కాలం అది. కుటుంబనియంత్రణ ఆపరేషన్లుకూడా

ఇంకా అంతగా ప్రాచుర్యానికి రాలేదు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత రావుగారు పుట్టారు. ఆ తర్వాత ఒక

కూతురు. చివరగా కుమారుడు కలిగాడు. ఆడపిల్లలకు ఇవ్వగా అయిదు ఎకరాలు మిగిలాయి. తాను

ఉద్యోగం చేస్తున్నాడు. తము శడు కొద్దిగా చదువుకుని తండ్రికి తోడుగా వ్యవసాయంలో దిగాడు. రానురాను

వ్యవసాయం లాభసాటిగాలేదు. అతివృష్టి, అనావృష్టి తుఫానులు, నకిలీవిత్తనాలు, పెరిగిన ఎరువుల ధరలు,

కూలీల కొరత, పెరిగిన కూలిరేటు, గిట్టుబాటు ధరలేకపోవడం మున్నగు బాధలతో రైతులు సతమతపడుతూ

వున్నారు. అతడికి ముగ్గురు పిల్లలు. తనపిల్లలిద్దరూ అమెరికాలో డాలర్జ్హు సంపాదిస్తున్నారు. భార్యకూడా

ఉద్యోగంచేసి రిటైరయ్యింది. అందుకని రావుగారు పిత్రార్జితంలో ఏమీ తీసుకోలేదు. పైగా ఆర్థికంగానూ

ఆదుకునేవారుకూడా. అందుకు తన భార్య, బిడ్డలు సంతోషించారుకూడా. ఆయన పెత్తనం, పెంపకం

అలాంటిది మరి. తల్లిదండ్రుల బాధ్యతలన్నీ తమ్ముడే తీసుకుని వారిని పువ్వుల్టోపెట్టి పూజించి కడతేర్చాడు.

ఆతడి అర్జాంగి అత్తమామల్ని ఎంతో మన్ననలతో సేవించింది. ఆ కృతజ్ఞతకూడా రావుగారిలో ఉంది.

లేకుంటే భాగ్యనగరంలో ముదుసలి తల్లిదండ్రుల్ని సాకడం ఎంతో కష్టం. అందులో ఇల్లాలు ఉద్యోగికూడా,

తమ్ముడి కుటుంబంలో కూడా రావుగారిపై ఆస్తిలో భాగం పంచుకోలేదనే అభిమానం, అవసరానికి

ఆదుకుంటారనే ప్రేమ మెండుగా ఉన్నాయి. గ్రామంలో కూడా ఈ విషయంగా రావుగారిపై గౌరవం

పెరిగింది.


ఇంతలో గడియారంలోని ముల్టులు ఐదున్నర గంటల్ని చూపుతున్నాయి. హైద్రాబాద్‌ నుంచి

మద్రాస్‌ వెళ్తే విమానం రొదచేస్తూ చాలా ఎత్తులో ఆ ఊరిమీద నుంచి ఇదే సమయానికి వెళ్లడం అలవాటు.

ఆ ధ్వని అందరి నిద్రమత్తును దూరం చేస్తుంది. దేవాలయాల మైకులనుంచి ప్రార్ధనా శ్ఞోకాలు

విన్సించసాగాయి. దాంతో ఊరుకు చైతన్యం వస్తుంది. తమ్ముడు గోపాలరావు నిద్రలేచి కన్నులు

నలుపుకుంటూ వచ్చి “ఏమిటన్నయ్యా! అప్పుడే లేచావంటూ” వచ్చాడు. పెండ్తిపనుల బడలికవల్లగాని లేకుంటే

నాలుగున్నరకల్లా నిద్రలేచే అలవాటు అతడిది. ఏమీ లేదులే. ఎందుకో కొంచెం ముందే లేచాలే. రా! కూర్చో

అన్నాడు మంచంమీద ఒక ప్రక్కకు జరుగుతూ. అపుడు అతడు ప్రక్కనే గల కోళ్ల గంపను ఎత్తివేసి వచ్చి

వరండాలోగల రెండు కుర్చీలు తెచ్చి ఎదురెదురుగా వేసి ఒకదానిలో అన్నను కూర్చుండబెట్టి తాను ఒకదాంట్లో

కూర్చున్నాడు, మంచంమీద సౌకర్యంగా ఉండదేమోనని, ఇంతలో ఇంటివెనుక గల పెద్ద నేరేడు చెట్టుమీది

పక్షులు నిద్రలేచి రొదచేస్తూ పొట్ట నింపుకోవటానికై బయలుదేరాయి. ఆ పక్షుల కిలాకిలా రావాలు, పైగా

వెళ్లిన విమానపు రొద విన్న రావుగారి మనసు ఉల్లాసపడి ఇలా తమ్ముడితో ఓ కవితను పంచుకున్నది.


“కోటానుకోట్లతో /నిర్మించి నురి యెంతో /ఇంధనపు ఖర్చుతో /ఎంతో గొప్పగ ఆకసమున ఎగిరెడి

వినూనములజూచి /ఇంధనమించుకైనను లేక /ఏ నూర్లనిర్దేశమును లేక /రెక్కల శక్తితోనే /వేలనేల మైళ్లు

దారి తప్పక /విశ్రాంతి చెందక /సయనించు పక్షి నవ్వింది” అన్నాడు. అన్నయ్యా! చాలా బాగుంది చాలా

బాగుందని తమ్ముడు చప్పట్టు చరిచాడు. ఆ సంబరానికి ఇంటిలోని ఆడవారు లేచివచ్చి పాలు పంచుకున్నారు.

చెల్లి శాంత అడిగి అడిగి మరల మరల చదివించుకున్నది. ఆ అల్సప్రాణుల శక్తిముందు మన శక్తి యుక్తి

స్వల్పమని రుజువు అవుతున్నదని, అందుకే వాటి కిలకిలారావాలు నాకు మనను ఎగతాళి చేస్తూ నవ్వే

నవ్వులుగా కన్పిస్తాయని నాగేశ్వరరావుగారు సంతోషంగా చెప్పారు.


కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి నెమ్మదిగా దైవదర్శనానికి వెళ్ళారు. దేవాలయాలలోగల పెద్ద

పూజార్జు సాదరంగా అహ్వానించి స్వామివారి దర్శనం చేయించి ప్రసాదాలిచ్చారు. అప్పుడప్పుడూ రావటమేగాక

బాల్యంలో ఇక్కడే ఉండడంవల్ల వారికి బాగా తెలుసు. ఇంచుమించు సమవయస్కులు కూడా. పాఠశాలలో

కలిసి చదువకుని ఉంటారు. అందుచేత ఆపాటి ఆదరం ఉండకతప్పదు. పైగా కానుకకూడా ఎక్కువగానే

సమర్పించడం అలవాటు. ఎందుకో రావుగార్కి ఉన్నట్టుండి ఒక ఆలోచన మస్తిష్కంలో తళుక్కుమన్నది.

శ్రీనివాసాచార్యులతోనూ, విశ్వనాథశర్మతోనూ సంతోషంగా ఇలా చెప్పాడు. రెండు దేవాలయాలకు రెండు

పాడి ఆవుల్ని సమర్పిస్తానని. ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థ్టానంవారు దేవాలయాలకు గోవుల్ని

ఇవ్వడం ప్రారంభించారు. ఈ చిన్న గ్రామానికి ఆ గోమాతలు ఎప్పటికి వస్తాయో చెప్పలేం, రావుగారి

నిర్ణయం ఆ పూజారులిద్దర్ని అమితంగా ఆనందపర్శింది. ఎంతగానో స్వామివారి అనుగ్రహాన్ని

ఆశఈపూర్వకంగా అందించారు. సంతోషం మెండుగా నిండిన గుండె బరువుతో నెమ్మదిగా ఇంటికి చేరాడు.

దారి పొడవునా ఎవరో ఒకరు ఆప్యాయంగా పలకరించడం, నమస్కరించడంతో కొద్ది ఆలస్యం కూడా

అయ్యింది. తమ్ముడి కుమారుడు ఎదురెళ్లాడు. ఇద్దరూ కలిసి ఇల్టు చేరారు. మరదలు, చెల్లెలు మంచి

అల్సాహారం అందించగా తృప్తిగా తిని, పాలుత్రాగి వరండాలో మంచంమీద వెన్ను వాల్చాడు. రాత్రి ముందుగా

నిద్రలేవడంవల్ల బాగా నిద్రపట్టింది. రెండు గంటల సమయం అవుతుండడంతో తమ్ముడు తట్టిలేపి

భోజనానికి కూర్చుండజేసి సరసన కూర్చుండి కొసరికొసరి వడ్డించాడు. రావుగారు సంతృప్తిగా తిని తమ్ముడు

చేయి కడిగి తన పంచెతోనే తుడువగా మంచంమీద కూర్చుని అందరి యోగక్షేమాలుగూర్చి అడిగి

తెలుసుకున్నాడు. సోదరి శాంత అయితే అన్నదగ్గర గారాలు పోయింది. తర్వాత భుక్తాయాసం తీరడానికై

పడుకున్నాడు. నిద్రరాలేదుగాని విశ్రాంతి లభించింది. నాలుగున్నర గంటలకు అల్సాహారంతోపాటు టీ

అందించారు. ఆ పని పూర్తిచేసి ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుని ఊరు చుట్టిరావడానికై బయలుదేరాడు.

పెండ్లి సందడిలో ఇంతవరకు తీరలేదు. ఇక రేపోమాపో భాగ్యనగరానికి బయలుదేరాలి. ఎన్నిసార్డు చూచినా

తనివి తీరదు. క్రొత్తగానే ఉంటుంది. పూరిండ్లు పోయి డాబాలు వెలుస్తున్నాయి. ఎడ్డ బండ్లు పోయి ట్రాక్టర్లు

తిరుగుతున్నాయి. సైకిళ్లు పోయి మోటారుసైకిళ్లు పరుగెత్తుతున్నాయి. ఇంకా అంతగా కారులే కన్పించలేదు.

ఇద్దరో, ముగ్గురో ఈమధ్య కార్డు కొన్నట్టు తమ్ముడు చెప్పాడు. నాల్లు బజార్జు చుట్టి చెరువు గట్టుకు

చేరాడు. చెరువులో ముడుచుకోవడానికి సిద్ధపడుతున్న తామరలు, విప్పారడానికి త్వరపడుతున్న కలువలు

చూడముచ్చట గొలిపాయి. బాల్యంలో ఎన్నోసార్లు పండగలకు ఆ పూలను చెరువులోదిగి కోసిన తెచ్చినవిషయం

గుర్తుకు వచ్చింది. ఈమధ్యనే పంచాయితీవారు గట్టుమీద అక్కడక్కడ కూర్చోవడానికి సిమెంటు బల్లలు


ఏర్పాటు చేశారు. వెదురుగుంపు దగ్గరలోగల ఒక బల్లపై కూర్చున్నాడు. వెదురుబొంగులు, బలంగా పొడవుగా

పెరిగి గాలికి ఊగుతూ పిట్టలు చేసిన రంధ్రాలలోకి గాలిపోయి తిరిగి బయటకు వస్తూ శ్రుతి సుభగంగా

శబ్దాలు విన్పిస్తున్నాయి. కవి హృదయం ఉప్పొంగింది. “రంధ్రాలు పొంది వేణువై మోగి/ నుదునుధురగానాల/

హృదయాలు ద్రవియింప/ నేర్చిన ధన్యత మీదెగా!/ బలముగా పొడవుగా సెరిగి/ డొక్కచిల్చినయట్లు రెండుగా

చీల్చబడి /విరగక గట్టిగా వంగి /శార్మమై, పినాకమై, గాండీవమై, విజయమై/హరిహరుల చేతిలో /అర్జునుడి

హస్తాన /భీష్మదోణకర్లాది యోధుల/ కరాల విల్లుగా భాసించి/శిష్టరక్షణ దుష్టశిక్షణ/శ్వతునధచేసిన/శూరత

మీదేగా/ కష్టమూ నష్టమూ వేదనా/అనుభవించినగాని/ మేలిమై నూన్యమై ఉన్నతిని పొందు /స్ఫూర్తి

జగతికిచ్చారు.” అని భావావేశానికి లోనయ్యారు.


తం'డ్రితోపాటు చదువుకుంటూనే వ్యవసాయంలో పడిన శ్రమ గుర్తుకు వచ్చింది. తర్వాత అక్కల,

చెల్లెలి పెళ్లిళ్లు మొదలైన బాధ్యతలు తీర్చడానికి, తనబిడ్డల్ని పెంచడానికి పడిన కష్టం మెదిలింది. ఉద్యోగ

నిర్వహణలో ఏమాత్రం అలసట చూపక పడిన శ్రమ, పలు వ్యామోహాలకు దూరంగా నిలబడి సాగించిన

జీవనంలో ఎదురైన ఒత్తిడి, నష్టం ఇవన్నీ చవిచూచి పొందిన ఉన్నతిని వెదురుల్ని చూచి నెమరు వేసుకున్నారు.

“కష్టే ఫలి అక్షరసత్యం అనుకున్నాడు. ఇంతలో బాగా ప్రొద్దుకూకింది. లేచి రచ్చబండ దగ్గరకు వచ్చాడు.

కూర్చున్న నలుగురు పెద్దలు లేచి నిలబడి నమస్కరించి రావుగార్జ్ని కూర్చుండ జేశారు. రచ్చబండకు

సమీపంలోనే రావుగారి తాతగారు నిర్మించిన చిన్న రామమందిరం శిధిలావస్థలో ఉంది. ప్రస్తుతం అక్కడే

దేవాలయం నిర్మించాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఆ విషయం రావుగారితో చెప్పి ఈ గుడి మీదే

మిక్కిలిగా సహకరించమని అడిగారు. వెంటనే రావుగారు ఐదులక్షలు విరాళం ప్రకటించారు. ఆ పెద్దల

సంతోషానికి అవధిలేకపోయింది. చెక్కు ఇచ్చి పోతాను పని ప్రారంభించమన్నాడు. పాత్రదానం పరమ

పుణ్యసాధకం. పిత్రార్జితం త్యాగం చేయడమేగాక, అన్ని విధాల తన కుటుంబానికి అండగా నిలవడం,

తల్లిదండ్రుల్ని సేవింపజేయడం, పేద విద్యార్థుల్ని కొందర్ని చదవించడం, దేవాలయాల విశేష నిర్వహణకు

గోవుల్ని సమర్పించడం, తన తాత కట్టించిన జీర్ణ రామాలయ పునరుద్ధరణలో అగ్రభాగాన నిలవడం

మున్నగు పనులతో గ్రామోన్నతికి తోడ్పడడం తో రావుగారి జీవితం ధన్యం అయ్యింది. ఇదంతా న్యాయార్జిత

విత్తంతో సాధించింది. ఎక్కడా అవినీతికి తావులేకుండా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగించిన

ఘనత ఆయనిది. వివిధ విధాల దిగజారుతున్న సమాజాన్ని చూచిన ఆయన ఆవేదన అంతా ఇంతా కాదు.

పోనీ మానవులు ఇంతగా విధం చెడినా మన కళ్ళముందు తిరుగాడే పక్షులకన్నా, జంతువులకన్నా ఎంతో

తక్కువ స్టితిలో ఉన్నారుగదా అనే “నగుబాటు” రావుగార్ని కవ్విస్తుంది. బాధిస్తుంది. పకపకా నవ్విస్తుంది.

తమ్ముడికి చెక్కులిచ్చి పూజారులకు, రామమందిర నిర్మాణనిర్యాహకులకు ఇవ్వమని చెప్పి ఆనందం అంబంరం కాగా హైదరాబాదుకు బయలుదేరారు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :





49 views0 comments
bottom of page