పంచలింగాల క్షేత్రం: కర్నూలు
- Sudha Vishwam Akondi

- Aug 4
- 2 min read

Panchalingala Kshetram: kurnool - Telugu Devotional Article | Sudhavishwam Akondi
పంచలింగాల క్షేత్రం: కర్నూలు - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 04/08/2026
కర్నూలు నగరానికి సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున వెలసిన పంచలింగాల క్షేత్రం అరుదైన శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఒకే పానవట్టంపై ఐదు శివలింగాలు కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. మహాభారత కాలంతో అనుబంధం ఉన్న ఈ క్షేత్రం భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షిస్తూనే, నేటి ఆలయ పరిస్థితి ఆవేదన కలిగిస్తుంది. స్థల పురాణం, క్షేత్ర విశిష్టత, రచయిత్రి ప్రత్యక్ష అనుభవాలను ఈ వ్యాసంలో తెలుసుకోండి.
మొదటగా పంచలింగాల క్షేత్రానికి వెళ్లాం! ఇది కర్నూలుకు దాదాపు అయిదు కిలో మీటర్ల దూరంలో తుంగభద్ర నది తీరాన పంచలింగాల గ్రామం ఉంది. ఇక్కడ ఒకే పానవట్టంపై ఐదు శివలింగాలు కొలువై ఉండటం అరుదైన విశేషం!
ఒకప్పుడు గొప్ప క్షేత్రంగా విలసిల్లిందని చుట్టూ ఉన్న కోట బురుజుల అవశేషాలు సాక్షిగా నిలిచాయని అనిపిస్తుంది. కోట ద్వారం వద్ద రోడ్డు మధ్యలో బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం దర్శనం ఇచ్చింది. అందరూ అలా వెళ్ళిపోతున్నారు. చూస్తూ వెళ్ళకపోతే తొక్కినా ఆశ్చర్యం లేదు. గుడి ఆవరణలో కూడా ఇటువంటిదే మరో లింగం ఉంది. ప్రధాన ఆలయంలో ఒకే పానవట్టం పైన అయిదు లింగాలతో వెలసిన ఈ క్షేత్రం సరియైన పూజలు చేస్తున్నట్లు లేరు!
ఊరిలోని ఒకాయన బిందెతో నీళ్లు పోసి కడిగి గంధం, కుంకుమ బొట్టు పెడుతున్నాడు అంతరాలయంలో. అంతరాలయ ద్వారానికి కుడివైపున అమ్మ వారు, గణపతి మూర్తులు ఉన్నాయి. అక్కడ కూడా ఇలాగే ఉంది. శాస్త్రోక్త విధి విధానాలు లేనట్లుంది. ఇక్కడ ప్రశస్తి చెందిన ఆలయమే కానీ ఇక్కడి పరిస్థితికి బాధ అనిపించింది. ప్రముఖుల దృష్టికి వెళితే ఏమైనా బాగు చేస్తారేమో!
ఆలయానికి దగ్గరగా ఇళ్ళు కట్టుకుని ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఎనభై శాతం ముస్లింలే ఉన్నట్టున్నారు! మరి ఆ ఈశ్వరుడే అనుగ్రహించి ఆలయ వైభవం వచ్చేలా చేయాలని ప్రార్థన చేశాను. ఓ పక్కన కోదండరామాలయం ఉంది. అది కూడా అంతే!
స్థల పురాణం:
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది తీరాన పంచలింగాల క్షేత్రం ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం మహాభారత కాలంలో భీముడు కాశీ నుంచి శివలింగాలను తీసుకుని వస్తుండగా ఆలస్యం జరిగింది. అప్పటికే వేప మొద్దును ప్రతిష్టించడాన్ని చూసి ఆగ్రహించిన భీముడు, కాశీ లింగాలను దూరంగా విసిరేశాడు. అలా విసిరిన లింగాలు సోమేశ్వరం, సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరంగా రూపొందాయని చెబుతారు. ఇక్కడ పూజలు చేయడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
శివార్పణం
🙏🙏🙏🙏🙏
సుధావిశ్వం
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం









Comments