top of page

పంచవన్నెల రాజకళ్యాణీ అశ్వం - 2



'Panchavannela Panchakalyani Aswam - Part 2' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 18/03/2024 

'పంచవన్నెల రాజకళ్యాణీ అశ్వం - పార్ట్ 2' తెలుగు పెద్ద కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




పంచవన్నెల రాజకళ్యాణీ అశ్వం - 2 చదవండి


వెంటనే రుద్రసింహ మాయఉంగరాన్ని తట్టి లేపాడు. 

''ఇదేమిటి మా సైన్యం మొత్తం చచ్చిపడి ఉంది వాళ్ల ను వెంటనే బ్రతికించు. '' అంటూ గట్టిగా అరిచాడు. 


''యువరాజా నా వల్ల కాదు మూడు కోరికలు వరకు మాత్రమే నీకు నాకు ఒప్పందం అని చెప్పాను కదా. అయినా నువ్వు "యంత్రాన్ని" కోరావు. యంత్రం అన్నాక చిన్ని చిన్ని లోటు పాట్లు ఉంటాయి. అన్న విషయం అందరికీ తెలుసు కదా. ఆ దోషం ఉందో లేదో చూసుకుని అప్పుడు నువ్వు ప్రయోగించవలసింది. ఇది నీ బాధ్యత. అలా చేయకుండా నువ్వు కంగారు పడి ఉపయోగించావు. యంత్రం తిరుగుముఖంగా పనిచేసింది. మరో విషయం.. నువ్వు యంత్రాన్ని తికమక పెట్టావు. నీ సైనికులును చూపించి శత్రు సైనికులుగా భావించ మన్నావు. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. శత్రు సైనికులు అన్నాక చంపాలి కదా అదే చేసింది. మొత్తం అందరు చచ్చిపోయారు. ఇది నా తప్ప కాదుకదా. '' తిరగబడి అడిగింది మాయాఉంగరం. 


''చి.. జిత్తులమారి నువ్వు నాకు వద్దు పో.. '' అంటూ దూరంగా గిరాటేశాడు ఆ మాయాఉంగరాన్ని రుద్ర సింహ. 


''సరే నన్ను వదిలించుకుంటున్నావు అన్నమాట. అయితే ఒప్పందం పూర్తిగా రద్దు చేసుకుందాం నీ దగ్గర తీసుకున్నవన్నీ నీకు ఇచ్చేస్తాను. నావల్ల నీకు జరిగే నష్టం ఏమి ఉండదు అన్నాను కదా అందు కనే ఈ సైనికులను కూడా నా శక్తితో బ్రతికించి నీకు ఇవ్వవలసి నవన్ని ఇచ్చి వెళ్లిపోతాను.. 


కానీ ఒక్క మాట నీకు విలువైన విషయం జ్ఞానబోధ చేసి వెళ్ళాలి అనుకుంటున్నాను. యువరాజా.. 

ఏవేవో పనికిరాని కోరికలు కోరావు కానీ నిజంగా నీ చేతి బొటనవేలే ఇవ్వమని నువ్వు నన్ను అడిగి ఉంటే తప్పకుండా ఇచ్చి ఉందును.. నీకు ధైర్య సాహసాలు కూడా ఇమ్మంటే తప్పకుండా ఇచ్చి ఉందును.. ఆశకు అత్యాశకు పోయిన నువ్వు రాజ్యాన్ని పరిపాలించడం కూడా కష్టమే. ఇక సెలవు నీ దారి నీది నా దారి నాది అంటూ వెళ్లిపోయింది ఆ మాయాఉంగరం. 


అంతవరకు తన చెవులకు చేతులు అడ్డంగా పెట్టు కున్నాడు కనుక యువరాజు రుద్రసింహకు ఇవేవీ వినపడలేదు. 


ఉంగరం బాధ వదలడంతో జీవితం ప్రశాంతమై నట్టుగా అనిపించింది కానీ పరిస్థితి యధాతధంగా మారిపో యింది.


***


కొడుకు పరిస్థితి పూర్తిగా అర్థం అయిన మహారాజు వీరభట్టారకుడు కోపంతో తన కొడుకు మందిరానికి వచ్చాడు. 


''నీ ప్రయోగాలు ఆపుచేసే సమయం వచ్చింది రుద్ర సింహ. రాజ్యంలో జరుగుతున్న అల్లకల్లోలాలు చుట్టు పక్కల రాజులు గ్రహించి పసిగట్టి మనపై దండయాత్ర సన్నాహాల్లో ఉన్నట్టు మన వేగుల ద్వారా సమాచారం అందింది. నాకా వయసు మీద పడింది. ఈ పరిస్థితుల లో వానప్రస్థమే నాకు సరైన మార్గం. అందుకోసం తక్షణమే రాజ్యాధికారాన్ని చేతబట్టే రాజు కావాలి. మన హితులు, పెద్దలు, మేధావులు, మంత్రులు మాట ను అనుసరించి నేనొక నిర్ణయం తీసుకోక తప్పలేదు. రేపే కొత్త మహారాజు పట్టాభిషేకం. 


తండ్రి చెప్పేది అర్థం కాక ఆశ్చర్యంగా వింటూ నిలబడిపోయాడు రుద్రసింహ. 


''అవును జాగ్రత్తగా విను రేపు సూర్యోదయం అనంతరం మన రాజ్యం చివర గంటాలమ్మ చెరువు నుండి ఒక పోటీ ప్రారంభం అవుతుంది. మన రాజ్య సైనిక అధికారుల పర్యవేక్షణలో రాచగుర్రాలు 10 సిద్ధంగా ఉంటాయి. అక్కడనుండి ఈ పోటీలో పాల్గొని గుర్రం స్వారీ చేస్తూ ఎవరు రాజ్యపు సింహ ద్వారాన్ని ముందుగా చేరుకుంటారో వారే మహా రాజు. ఈ పోటీ నీకు కూడా. యువరాజువు కనుక స్వయంగా వచ్చి చెప్పాను. ఆ ప్రయత్నంలో ఉండు. '' అంటూ మహారాజు వీరభట్టారకుడు చెప్పటం ఆపి జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. 


యువరాజు ఆలోచనలో పడ్డాడు. తన అవిటి తనంతో ఈ విజయం ఎలాగూ సాధించలేనని అర్థం అయిపోయింది. అయితే తాను బ్రతికుండగా మరో రాజు తన రాజ్యాన్ని పరిపాలించడమా.. అసంభవం. అందుకనే తను చావాలి.. ఈ రాత్రి చావాలి.. అందుకోసం ఆత్మ హత్య శరణ్యమని నిశ్చయానికి వచ్చేసాడురుద్రసింహ.

 

 ఆ పని తన మందిరంలో చేస్తే రేపటి పోటీ ఆగిపోవచ్చు. చివరికి ఆలోచించి ఘంటాలమ్మ చెరువు దాటాక దూరంగా ఉన్న మహాసముద్రంలో మునిగి కలిసిపోవాలని నిశ్చయానికి వచ్చేసాడు. అంతే.. చీకటి పడ్డాక ఒక్క నిమిషం ఆలోచించలేదు. వేగంగా నడుచు కుంటూ భయంకర సముద్రం దగ్గరికి చేరిపోయాడు. మహా వేగంగా ఒడ్డుకు చేరుతున్న అలలను చూసి రెండు చేతులు జోడించి సముద్రానికి నమస్కారం పెట్టాడు. 


 పెద్ద పెద్ద బండ రాళ్ళను దాటుకుని అతి దగ్గరలో కనిపిస్తున్న సముద్రంలో సంగమించాలని అడు గులు వేస్తున్నాడు. వేస్తూ వేస్తూ ఒక పెద్ద బండ రాయిపై దృశ్యం చూసి ఆగిపోయాడు. 


ఆ వెన్నెలలో ఒక చీమ తనకన్నా 100 రెట్లు పెద్ద తీపి పదార్థాన్ని తోసుకుంటూ వెళ్తుంది. ఒక ప్రక్క అలలు బండ రాయిని ఒక క్షణంలో ముంచేయవచ్చు. లేదా పెనుగాలి తనను, ఆ తీపి పదార్థాన్ని దూరంగా గిరాటు వేయవచ్చు. అయినా చీమ ఇదేదీ ఆలోచించ కుండా, భయపడకుండా.. తను అనుకున్నది సాధించడం కోసం తన ప్రయత్నం తాను చేసుకుంటూపోతుంది. ఇంకొకసారి గాలికి ఆ తీపి పదార్థం చాలా దూరంగా పడిపోతుంది మళ్ళీ ఆ చీమ అదే ప్రయత్నం చేస్తుంది. అదంతా చిత్రంగా అనిపించింది రుద్రసింహకు. ఆ వెన్నెలలో ఆ దృశ్యాన్ని అలాగే చూస్తుండిపోయాడు చాలాసేపు చాలాసేపు.. చివరికి తెల్లవారింది. 


**

ఆ బండ ఎత్తు పల్లాల వల్ల ఆ చీమ పడుతూ లేస్తూ అలా విశ్వప్రయత్నం.. విసుగులేని ప్రయత్నం చేయడం చివరికి.. చిట్టచివరికి తెలివిగా ఆ పదా ర్థాన్ని దొర్లించి ఆ బండ క్రిందకు చేర్చి తన సమూ హానికి చేరువగా ఉంచడం ఇదంతా ఆనందంతో ఆశ్చర్యంతో గమ నించాడు రుద్రసింహ. అతనిలో ఇప్పుడు లక్ష కోట్ల ఉరుముల మెరుపు మెరిసినట్టు అయింది. శరీరం జలదరించి కళ్ళలో 1000 కోట్ల కాంతి పుంజం వెలుగు ప్రకాశించిపోతుంది. ఇప్పుడు రుద్రసింహకు సముద్ర సంగమానికి వెళ్లాలనిపిం చడం లేదు. అతనిలో ఒక నూతన ఉత్సాహం పెల్లుబికింది.. ఆ సముద్రుడు నుండి వెనక్కు తిరగాడు. 


''చి చి నేను ఇంతవరకు ఇంత పిరికిగా జీవించానా.. నాకన్నా అల్పమైన ఒక చీమ జీవితమే గొప్పదా.. ?!


 దాని ప్రయత్నం, మొక్కవోని దీక్ష, పట్టుదల అవే గొప్పవా. ఈ చీమను చూసి నేను సిగ్గుపడాలి. తల దించుకోవాలి. దేవుడు మనిషికి మానవ జన్మ ఎందుకు ఇచ్చాడో అర్థం కాకుండా బ్రతికాను. నేను అతిి సూక్ష్మమైన ఈ చీమ కన్నా అల్పుడను కాదు. 

కాకూడదు. మనిషిగా పుట్టినందుకు నా జీవిత ధ్యేయం సాధించి తీరాలి.. సాధిస్తాను.. '' మనసులో అనుకున్నాడు రుద్రసింహ. 


***


తెల తెల్లగా తెల్లవారబోతుంది. సూర్యోదయం కాబోతోంది. 


రుద్రసింహ తన జీవిత ధ్యేయం సాధించడం కోసం సముద్రం నుండి వెనక్కు తిరిగి వేగంగా నడుచు కుంటూ గంటాలమ్మ చెరువును సమీపించేశాడు. అప్పటికే అక్కడ పోటీ ప్రారంభం కాబోతోంది. గుడి ఎదురుగా ఉన్న పది రాచగుర్రాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరులు 9 గుర్రాలను అధిరోహించేశారు

మరొక రాజకళ్యాణి గుర్రము మాత్రమే ఖాళీగా ఉంది. ఆ పోటీలో సైనిక అధికారులు పోటీ ప్రారంభ పచ్చ జెండా చూపడానికి సిద్ధంగా ఉన్నారు. చుట్టూ వేలాది జనసమూహం. మరికొంత దూరంలో మహారాజు వీరభట్టారకుడు ఉన్న రథం. పరిస్థితి గ్రహించాడు యువరాజు రుద్రసింహ. 


ముందుగా అప్పుడే ఉత్తేజపరితమైన వెలుగులు వెదజల్లబోతున్న సూర్యభగవానునికి శతకోటి నొక్క నమస్సుమాంజలు అర్పించాడు. తదుపరి తనపై తాను గట్టి నమ్మకం ఏర్పాటు చేసుకున్నాడు. తనకు బొటనవేలు లేదే అన్న ఆత్మన్యూనతా భావాన్ని పక్కన పెట్టాడు. దూరాన రథం పై కనిపిస్తున్న తండ్రికి వందనం చేశాడు. 


రాజకళ్యాణి అశ్వం దగ్గరకు వచ్చి దానికి కూడా నమ స్కరించి.. చిరుత వేగంతో దానిని అధిరో హించాడు. అంతా గమనిస్తున్న మహారాజు, సైనిక అధికారులు

, ప్రజలు హర్షధానాలు చేశారు. ఆ పరిసర ప్రాంతం మహా కోలాహాలంగా మారిపో యింది. ఒకపక్క విజయ వాయిద్యాలు.. మరోపక్క గరగ మేళాలు.. ఈ పక్క బుట్ట బొమ్మల ఆటలు.. ఆ పక్క కోలా టలు.. కర్రసాములు.. పిక్క బలప్రదర్శ నలు.. అంతే సైనిక అధికారులు పోటీ ప్రారంభ పచ్చ జెండా చూపించేశారు. 


వేగంగా పరిగెత్తుతున్నాయి 10 రాచగుర్రాలు. పది గుర్రాలు కూడా పది రకాల వేగాలతో పరిగెడుతూ అవన్నీ కలిపి ఒకే మార్గంలో సాగిపోతున్నాయి. కానీ యువరాజు రుద్రసింహ ఎక్కిన పంచవన్నెల రాజ కళ్యాణి అశ్వం మాత్రం విజయమార్గం వైపు మహావేగం గా దూసుకుపోతున్నట్టు అక్కడ చేరిన ప్రజలందరికీ అనిపించింది. అవును అతని దీక్ష, కృషి, పట్టుదల, మనోనిబ్బరం అలాంటిది ఇప్పుడు. 

========================================================================

సమాప్తం

========================================================================


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు


51 views0 comments
bottom of page