top of page

పోటీ ముగిసింది-ధన్యవాదాలు


సంక్రాంతి కథల పోటీలో పాల్గొన్న రచయితలకు, పాఠకులకు మా వందనాలు.కథల పోటీ గడువు ముగిసింది.15/01/2021 వరకు మాకు అందిన కథలను పోటీకి పరిగణిస్తున్నాము. ప్రచురణ దాదాపు పూర్తి అయింది. మిగిలిన కథలను 17/01/2021 లోగా ప్రచురిస్తాము. ఫలితాలు ముందు నిర్ణయించినట్లుగా 26/01/2021 తేదీన ప్రచురింప బడతాయి.ఇందులో ఎటువంటి మార్పు లేదు.

మన తెలుగు కథలు .కామ్ లో కథల ప్రచురణ యధావిధిగా కొనసాగుతుంది.రచయితలు ఎప్పటిలాగే తమ కథలను పంపవచ్చు.తదుపరి కథల పోటీ విధి విధానాలు ఇంకా నిర్ణయించలేదు. అయితే 18/01/2021 నుండి ప్రచురింపబడే కథలన్నీ ఆ పోటీకి పరిగణించబడతాయి.

ఇక పోటీ కథల పరిశీలన శాస్త్రీయంగా జరుగుతుంది.రచయిత తీసుకున్న కథాంశం, కథ చెప్పిన తీరు, భావ వ్యక్తీకరణ, సామాజిక ప్రయోజనం, పాఠకులను ఏ మేరకు ఆకట్టుకున్నారు, ఎంతమంది పాఠకుల చేత చదివించారు, చదివినవారిని ఎంతలా ఆకట్టుకున్నారు - మొదలైన అంశాలను పరిగణిస్తాము.

రచయితలకు ఒక విజ్ఞప్తి.

మాకు రచనలు పంపేవారు వివిధ ఫార్మాట్ లలో పంపిస్తున్నారు.వాటిని ప్రచురణకు అనుగుణంగా మార్చడంలో కొన్ని అక్షరాలు రూపాంతరం చెందుతున్నాయి.కాబట్టి వీలయినంత వరకు మీ రచనలను అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.అలాగే మాకు పంపేముందే మీ రచనను మరొకసారి పరిశీలించి తప్పులు లేకుండా పంపండి.కొంతమంది పంపే కథల్లో దాదాపు ప్రతి వాక్యంలో తప్పులు ఉంటున్నాయి.ఓ మోస్తరు కథలో దాదాపు రెండు మూడు వందల సవరణలు చేయాల్సి వస్తోంది.మా కన్నుగప్పి కొన్ని తప్పులు ప్రచురణలోకి వచ్చేయడం మీరు గమనించే ఉంటారు.ప్రింట్ కాబడ్డ పత్రికలలో/వెబ్ మాగజైన్లలో ప్రచురింపబడే పదాలనే పాఠకులు ప్రామాణికంగా తీసుకుంటారు.ఉదాహరణకు 'బాధ' అని వ్రాయాలో 'భాద' అని వ్రాయాలో 'భాధ' అని వ్రాయాలో సందేహం వచ్చిన వ్యక్తి అందుబాటులో ఉన్న పత్రికలోగానీ,వెబ్ మ్యాగజైన్ లో గానీ వెతుకుతాడు.సదరు పత్రికలో ఉన్న పదాన్నే సరయినదిగా తీసుకుంటాడు. కాబట్టి రచయితలు వీలయినంత వరకు తప్పులు దొర్లకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాము.


773 views4 comments
bottom of page