రురుమహర్షి - ప్రమద్వర
- T. V. L. Gayathri
- Jun 29
- 3 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #RuruMaharshiPramadwara, #రురుమహర్షిప్రమద్వర, #TeluguIDevotionalStories

Ruru Maharshi Pramadwara - New Telugu Story Written By - T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 29/06/2025
రురుమహర్షి - ప్రమద్వర - తెలుగు కథ
రచన: T. V. L. గాయత్రి
భృగుమహర్షి పుత్రుడు చ్యవనమహర్షి. చ్యవనమహర్షి భార్య సుకన్య. వారిరువురికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. ప్రమతి కూడా తండ్రి తాతల వలెనే గొప్ప తపస్సంపన్నుడు. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతంతో పాటు అప్సరసలు కూడా ఆ పాలసముద్రంలో పుట్టారు. వారిలో ఘృతాచి అనే అప్సరస కూడా జన్మించింది. ఆ ఘృతాచికీ, ప్రమతిమహర్షికీ రురుడు అనే కుమారుడు కలిగాడు.
ఆ కాలంలో విశ్వావసుడు అనే గంధర్వరాజు ఉండేవాడు. అతడికీ, మేనక అనే అప్సరసకూ ఒక ఆడబిడ్డ పుట్టింది. అయితే విశ్వావసుడు, మేనక కూడా ఆ ఆడపిల్లను స్థూలకేశుడు అనే మహర్షి ఆశ్రమంలో వదలిపెట్టి, ఎవరిలోకాలకు వాళ్ళు వెళ్లిపోయారు. స్థూలకేశుడు ఆ బాలికకు 'ప్రమద్వర' అని పేరు పెట్టి, ప్రేమగా పెంచుకున్నాడు. పెంపుడు తండ్రి ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను చూచి, ఆమె గుణగణాలకు మురిసి పోవుచు అక్కడ ఋషి సంఘాలలో ఉండే గౌతమ, కణ్వ, భరధ్వాజ వంటి మహర్షులు ఆ బాలికను ఎంతో ముద్దుచేస్తూ ఉండేవారు.
అందరి మధ్య అల్లారుముద్దుగా పెరిగిన ప్రమద్వరకు యుక్తవయసువచ్చింది.
ప్రమద్వరను ప్రమతిమహర్షి కుమారుడైన రురుకుమారునికిచ్చి వివాహం చేయటానికి ఇరువైపుల పెద్దలు నిశ్చయం చేసుకొని ముహూర్తాలు పెట్టుకున్నారు. రురునికి ప్రమద్వర అంటే పంచప్రాణాలు.
ఒకనాడు తండ్రియొక్క ఆశ్రమప్రాంతంలో చెలులతో ఆడుకుంటున్న ప్రమద్వర చూడకుండా పొరబాటుగా ఒక పాముపై కాలువేసింది. వెంటనే ఆ పాము ప్రమద్వరను కాటువేసింది. పాపం!ఆ పిల్ల అక్కడికక్కడే మరణించింది.
ఈ విషాద వార్త తెలిసి ముని సంఘములలోని మునులందరూ వచ్చారు. అచేతనంగా పడివున్న ప్రమద్వరను చూడలేక రురుడు ఒంటరిగా దట్టమైన అరణ్యంలోకి వెళ్లి దేవతలను ఇలా ప్రార్థించాడు.
" ఓ దేవతలారా! నేను నియమనిష్టలతో మిమ్ములను పూజించిన వాడనైతే, యజ్ఞయాగాదులను ఆచరించిన వాడనైతే, వేదాలను శ్రద్ధగా పఠించిన వాడనైతే, జన్మించినప్పటి నుండి అనేక పుణ్యకార్యాలను చేసిన వాడనైతే, గురువులను, పెద్దవారిని సేవించే వాడనైతే నేడు నా ప్రాణేశ్వరి అయిన ఈ ప్రమద్వర మీ దయచేత విషవిముక్తురాలు అగుగాక! విషంచేత ప్రాణాలు కోల్పోయిన ప్రమద్వర ప్రాణాలతో నిలిచి ఉండటానికి నా తపః ఫలాన్ని, వేదాధ్యయన ఫలాన్ని, నా దాన ఫలాన్ని ధారపోస్తాను!" అంటూ రురుడు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు.
అప్పుడు ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చి "నాయనా!రురూ!కర్మను తప్పించడం ఎవరివల్లా కాదు! అయినా ఒక ఉపాయం ఉంది!విను! నీవు నీ ఆయుష్షులో సగం నీ కాబోయే భార్యకు ధారపోయి! ఆమె బ్రతికి వస్తుంది!" అని పలికాడు.
సంతోషంగా రురుడు తన ఆయుష్షులో సగభాగాన్ని ప్రమద్వరకు ధారపోశాడు. వెంటనే నిద్ర నుండి లేచినట్లుగా ప్రమద్వర లేచి కూర్చుంది. అందరూ సంతోషించారు. పెద్దల సమక్షంలో రురునికీ, ప్రమద్వరకు వివాహం వైభవంగా జరిగింది. //
(సమాప్తం )
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comments