'Sampath Cinema Kathalu - 4' New Telugu Web
Series Written By S. Sampath Kumar
రచన : S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
తనను వెంబడిస్తున్న కుర్రాళ్లను తప్పించుకోవడానికి కిరణ్ ను ‘బావా’ అని పిలుస్తుంది కావ్య.
సుజాతకు కాల్ చేసి పలకరిస్తాడు రాజారావు.
ఆమె అతనితో మాట్లాడటానికి ఇష్టపడదు.
కావ్యను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు కిరణ్.
ఇక 'సంపత్ సినిమా కథలు’ నాలుగవ భాగం చదవండి.
తనను ఫాలో అవుతూ సైకిల్ ఆపిన కిరణ్ను చూస్తూ కావ్య తల బాదుకుంటూ "ఆ రాజు టార్చర్ ప్రేమ వదిలింది అనుకుంటే ఈ కొత్త టార్చర్ ప్రేమ ఒకటి మొదలు అయ్యింది." అంది.
"కావ్యా! నీవు ఆ రాజు గాడి ప్రేమతో పోల్చకు. నేను నిన్ను చూసిన తొలి చూపులోనే నీ అందానికి దాసుడ్ని అయిపోయాను. "
"అబ్బా ఈ డైలాగ్స్ మా కాలేజీ లో ఇప్పటికీ వంద మంది చెప్పారు. కొత్త డైలాగ్ ఏదైనా చెప్పు".
"ఏందే.. నీవు ఏమైనా పెద్ద అందగత్తె అనుకుంటున్నావా, ఆ కళ్ళు చూడు అబ్బా.. గుడ్లగూబల ఉన్నాయి.. ఆ పెదవులు చూడు.. అచ్చం గాడిద పెదలలా ఉన్నాయి.. ఆ మెడ చూడు కొంగలా.. ఇంకకా కిందకు పోతే.."
"చాలు చాలు.. ఆపు" అంటూ సైకిల్ మీద ఉన్న కిరణ్ను చేతితో ఒక్క తోపు తోసి, సైకిల్ మీదనే వుంది కదా అక్కడ నుంచి పోదామని స్పీడ్గా సైకిల్ మీద రయ్యి మంటూ పోతుంది. అప్పుడే ఆ రోడ్డులో పోతున్న ఒక కారు కావ్యను డీ కొట్టబోతుంటే ఆమె వెనకాల ఆదే స్పీడ్గా సైకిల్ మీద వస్తున్న కిరణ్ ఆమెను పక్కకు తోసేసరికి ఇద్దరు పట్టు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడి పోయారు. ఇదే అదనుగా నీళ్లలో తేలిపోతూన్న కావ్యను అలా వడిసి పట్టుకోగానే సిగ్గుతో ముడుచుకొనిపొయి అక్కడి నుంచి తడిసి ఉన్న బట్టలతోనే వెళ్ళి, పడిఉన్న సైకిల్ను లేపుకొని దాని మీద వెళ్ళిపోయింది.
కావ్యను అలా చూస్తు కిరణ్ కూడ సంతోషం పట్ట లేక గట్టిగా నవ్వుతూ అలా నీళ్లలో స్విమ్మింగ్ చేసుకుంటూ ఉండిపోయాడు.
ఇంటికి సైకల్ మీద వచ్చిన కావ్య తడి గుడ్డలతో కనపడగానే సుజాత "ఏమైంది అలా తడిసిపోయి వచ్చావు" అని అడిగింది.
"ఏమీ లేదమ్మా! కారు వాడు కాస్త మీదికి వస్తుంటే కంట్రోల్ తప్పి పక్కల ఉన్న చెరువు లో పడిపోయా"
"దెబ్బలు ఏమీ తగలలేదు కదా"
"నాకేమీ కాలేదు"
"బట్టలు మార్చుకొని వస్తా" అంటూ రూంలో కి వెళ్ళింది కావ్య
బట్టలన్నీ విప్పుకుంటూ అక్కడే ఉన్న అద్దంలో తన అందాలను చూసుకుంటూ, వయస్సు వచ్చాక తొలిసారి ఒక పురుషుడు తనను నీళ్ళలో వడిసి పట్టుకునే దృశ్యం గుర్తుకు వచ్చి వళ్ళు ఊహల్లో తేలిపోతూ ఏదోలా అయ్యింది కావ్యకు.
***
గెస్ట్ హౌస్
నారాయణ, రంగ భీమ ముగ్గురూ మందు మీద జోరుగా వున్నారు.
"ఒరే.. అది మందురా.. నీళ్లు తాగినట్లు తాగుతున్నారు. ఇప్పటికే ఫుల్ బాటిల్ అయ్యి రెండో బాటిల్ సగం అయ్యింది". తలబాదుకున్నా డు నారాయణ మళ్ళీ మాట్లాడుతూ.
"ఇంకా ఆ నరసింహ నుంచి తప్పించుకునే ప్లాన్ చెప్పలేదు."
"డోంట్ వర్రీ నారాయణ " మత్తు లో ఊగుతూ అన్నాడు రంగ.
"ఆరే ఇంకా మత్తు ఎక్కవైతే ప్లాన్ గుర్తుకురాదు. త్వరగా ఆ ప్లాన్ ఏదో చెప్పారా. "
"ఏమీ లేదు నారాయణ.. సింపుల్"
" ఆ సింపుల్ కే కదరా మీకు ఫుల్ మందు తాగిపిస్తుంది. "
"అవును అవును" అన్నాడు భీమ.
"ఏముంది నారాయణా.. ఈ సారి ఆ నర్సింహ వస్తె నీవు, అవతారం హాస్పిటల్ లో కనిపించకుండా పొండి" అన్నాడు రంగ.
"కనిపించకుండా పోతే.." అన్నాడు నారాయణ.
"పిచ్చి నారాయణ.. అప్పుడు నరసింహతో మేము. నారాయణ ఇవ్వవలసిన 5 కోట్లు ఇచ్చాడు. ఆ అవతారానికి పిచ్చి కుదిరింది " అని చెబుతాం.. అన్నాడు బీమా.
"ఒరేయ్, ఆ నరసింహ అంత తేలికగా నమ్ముతాడా, ఒకవేళ నమ్మిన తర్వాత ఆ అవతారం ఇప్పుడు ఎక్కడ అంటే "
"కొడుకు ఇక్కడ లేడుగా, ‘వాడు ఎప్పుడో హైదరాబాద్ పోయాడు కొడుకు దగ్గరకు’ అని చెబుతాం. "
"హైదరబాద్లో అవతారం కొడుకు అడ్రస్ అంటే..?”
“మళ్ళీ వస్తాం అన్నారు అని చెబుతాం" అన్నాడు రంగ.
"ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా" నారాయణ అనుమానంగా అడిగాడు.
"మాకు వదిలెయ్యి. నీవు, అవతారం ఆ రోజు కనపడకుండా ఉంటే చాలు" అన్నాడు భీమ.
" ఓకే, కాస్త డౌట్ అయితే ఉంది కానీ మళ్ళీ ఆ నరసింహ ఎప్పటికీ రాకుండా చెస్తే మళ్ళి మందు పార్టీ ఈ గెస్ట్ హౌస్ లో "అన్నాడు నారాయణ.
అంతలొ వాచ్ మెన్ వచ్చి, నారాయణ వంక చూస్తూ "సార్! ఎవరో నరసింహ అంటా.. వచ్చాడు" అన్నాడు.
నారాయణ ఒక్క సారి గా ఉలిక్కి పడుతూ
"అమ్మ బాబోయ్ ఆ నరసింహకు ఇక్కడ ఉన్నాం అని ఎవ్వరు చెప్పారు, ఈ గెస్ట్ హౌస్ అడ్రస్ ఎలా తెలుసు" అన్నాడు.
"ఎందుకు సార్ టెన్షన్. మన గెస్ట్ హౌస్ లో గడ్డి పీకే నరసింహ పేరు చెబితే అలా ఉలిక్కి పడ్డారు. " అని వాచ్ మెన్ అనగానే
"ఒరే నీ బొంద.. ఆ నరసింహగాడ.... రేపు ఇంటికి రమ్మని చెప్పు పో. " కోపంగా అన్నాడు నారాయణ..
***
సుజాత ఇల్లు..
ఇంటిముందు కార్ ఆగింది.
కారలో నుంచి శివమ్మ తన మనుమడుతో దిగింది.
కార్ శబ్దం విని బయటకు వచ్చింది కావ్య.
శివమ్మను చూసిన వెంటనే కావ్య “అమ్మా... అమ్మా.. ఎవరోచ్చారో చూడు” అంది.
అంతలో సుజాత కూడ బయటకు వచ్చి
"ఓ శివమ్మ దర్శనమా... ఏమీ ఇక్కడ ఉండలేను, పట్నం లో మనమడు రమ్మంటున్నాడు.. అని మూట ముల్లె సర్దుకొని పోయావు. నీ వాలకం చూస్తుంటే మళ్ళి మూటముల్లెతో వచ్చినట్టు ఉన్నవే"
"ఊరుకో అమ్మా! శివమ్మ నన్ను చూడకుండ ఉండలేదు అందుకే వచ్చింది" అంది కావ్య.
"నా బంగారు తల్లే.. నా మనసులో మాట కరెక్ట్ చెప్పావు. అక్కడకి పోయాను అన్న మాటే కాని మనసంతా నీవే ". అంది శివమ్మ
"ఎందుకే పోతా పోతా అని పోయావు.. ఇప్పుడేమో సినిమా డైలాగ్స్ చెబుతున్నావు". శివమ్మ వంక కాస్త కోపంగా చూస్తూ అంది సుజాత.
మళ్ళీ సుజాత శివమ్మ మనవడు వంక చూస్తూ
"మీ నాన్నమ్మ మీతో పట్నంలో ఉన్నందుకు మాటలు బాగా నేర్చింది" అంది.
'"ఏమో అమ్మా! తెలియదు. అక్కడకి వచ్చినప్పటి నుంచి మీ గురించి, కావ్య అమ్మ గురించే.. రోజూ అక్కడ ,ఇక్కడికి తీసుకెళ్ళు అంటే ఈ రోజు కుదిరింది తీసుకుని రావడానికి" అన్నాడు శివమ్మ మనవడు.
"ఔనమ్మా! ఇందాకటి నుంచి చూస్తున్న.. ముసలిదాన్ని, వచ్చింది కదా, ఎలా ఉన్నావు.. ఆరోగ్యం ఎలా ఉందో అడగకుండా, యక్ష ప్రశ్నలు వేస్తున్నావు. అయినా హాస్పటల్ లో కావ్య పుట్టినప్పటినుంచి పెంచిన ఆయాను. ఈ ఇంటికీ ఎప్పుడైన రావచ్చు, పోవచ్చు.. అది నా హక్కు" అంది శివమ్మ.
"అమ్మ ముసలి.. ఎన్నో మాటలు నేర్చావే, ఏదో నీవు నా మాట వినకుండా పోయవని అలా అన్నాను కాని, నేను కావ్య అనుకున్నాము.. ఎక్కువ రోజులు పట్నంలో ఉండవని " అని సుజాత అంటున్న లోపల కావ్య అందుకొని
"ఔను ఆయా అమ్మమ్మా! నీవు ఎలాగైనా వస్తావని తెలుసు, పద పద.. నీ చేత గోరు ముద్దలు తిని చాలా రోజులైంది. " అంటూ కావ్య హడావిడి చేసింది.
వెంటనే శివమ్మ "చిటికెలో స్నానం చేసి వస్తా" అని, మనవడి వంక చూస్తూ “మన లగేజ్ లోపల పెట్టు" అంది.
"సరే, లగేజ్ లోనపెట్టీ పోతాను" అన్నాడు మనవడు.
"సరే” అంది శివమ్మ.
అంతలొ సుజాత "నీవు, ఆ కారు డ్రైవర్ తిని వెళ్ళండి” అంది.
“అలాగే అమ్మా!” అన్నాడు శివమ్మ మనవడు.
హాస్పటల్ ముందు కారు ఆగింది
లింగస్వామి కారులో నుంచి దిగి సరాసరి సుజాత రూములోకి వెళ్ళాడు.
లింగస్వామిని చూసిన వెంటనే "రండి రండి" అంటూ నవ్వుతూ పలకరించింది సుజాత.
"బాగున్నావా"
"ఈ మధ్య కాల్ లేదు. నేను రెండుసార్లు చేస్తే రెస్పాన్స్ లేదు. తర్వాత మీరే చేస్తారనుకున్నా. సడన్గా మీరే వచ్చారు. చాలా సంతోషం"
"ఏమిలేదు అమ్మ, మన రాజారావు, కొడుకు కనపడటంలేదని బెంగతో బిజినెస్స్ వ్యవారలు మొత్తం నేనే చూడవలసివస్తుంది. అందుకే నీ కాల్ చూసిన తర్వాత, చేద్దాం అనుకుని పనివత్తిడితో చేయలేకపోయాను. ఇప్పుడేమో ఇక్కడ బిజినెస్ కి సంబందించిన బోర్డ్ మీటింగ్ ఉంటే వచ్చాను. ఎలాగూ వచ్చాను కదా.. మన కిరణ్ ఎలా ఉన్నాడో చూద్దామని ఇలా వచ్చాను. కిరణ్ ఎలా ఉన్నాడు. బాగయ్యిందా?"
"బాగయింది. అది చెబుదామని కాల్ చేశా. తర్వాత కాల్ ఎందుకు చేయలేదో ఇప్పుడే విడమరచి చెప్పారుగా"
" అయినా కిరణ్ను ఉంచింది ఎవరి దగ్గర కాదు కదా!"
"చాలు... నేను కిరణ్ను రాజారావు కొడుకుగా చూడలేదు. నా దగ్గరకు వచ్చిన పేషెంట్గానే చూసాను. మరి మీ మాట విని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకున్నా. ఇక రాజారావుకు నాకు వున్న పాత అనుబంధాలు దయచేసి గుర్తు చేయకండి"
"సరే సరే, ... సారి, .... కిరణ్ దగ్గరకు వెళ్లుదాం పద" అన్నాడు లింగస్వామి.
ఇద్దరు కలసి కిరణ్ ఉన్న రూములోకి వచ్చారు.
బెడ్ మీద ఆపిల్ పండు తింటూన్న కిరణ్ వీళ్ల అలకిడి విని "రండి రండి అంకుల్, మా డాడీ ఎలా ఉన్నాడు" అన్నాడు.
"నేనూ అనుకున్నా.. ఇక్కడ నీకు డాడీ గురించి బెంగ. అక్కడ మీ డాడీకి నీ గురించి బెంగ. పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడా ఉన్నా సేఫ్ గా నీవు ఉన్నావని చెప్పాను. కాబట్టి మీ డాడీ నీవు సేఫ్గా ఉన్నావనే నమ్మకంతో ధైర్యంగా ఉన్నాడు."
"అవును. మీలాంటి నమ్మకమైన స్నేహితుడు దొరకడం మా నాన్న చేసుకున్న అదృష్టం "
"సరే కాని బాగానే ఉన్నావు కదా.. మీ నాన్నకు కాల్ చేయాలనిపించలేదా!"
'సుజాత ఆంటీ మాట తీసుకుంది లింగస్వామి అంకుల్, నేను చెప్పినంత వరకు చేయవద్దు అని. అందుకే చేయలేదు. "
"వెరీ గుడ్, ఇప్పుడు నీవు పర్ఫెక్ట్. ఇంక రెండు రోజులు ఓపిక పట్టు. మీ నాన్నకు కనపడి మీ నాన్నను సర్ప్రైజ్ద్ చేద్దాం "
"అలాగే అంకుల్"
"మరి ఆ డ్రగ్ మాఫియా డాన్ సంబందిచినవి వివరాలు సెల్లో వీడియో తీశావు కదా.. ఆ సెల్ ఎక్కడా పడేశవో గుర్తుకు వచ్చిందా"
"అది ఒక్కటే ఎంత గుర్తుకు తెచ్చుకుందాం అన్నా గుర్తుకు రావటం లేదు"
"అవునా, అది గుర్తుకు వస్తే ఆ డ్రగ్ మాఫియా రాకెట్ డాన్ గుట్టురట్టు అయ్యేది. అతన్ని పట్టిచ్చినందుకు ప్రపంచమంతా నీపేరు మారుమ్రోగేది. "
రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. కిరణ్ తర్వాత కళ్ళు తెరచి, "ఎంత గుర్తుకు తెచ్చుకుందాం అనుకుంటే కూడ గుర్తుకు రావటం లేదు. " అన్నాడు.
"ఏదో ఒక రోజు సడన్ గా గుర్తుకు వస్తుంది దాని గురించి ఎక్కువగా ఆలోచించకు" అంది సుజాత.
నరసింహ జీప్లో తన అనుచరులతో హాస్పిటల్ కాంపౌండ్లోకి వచ్చాడు.
నరసింహను చూసిన వెంటనే రంగ, బీమలు నారాయణ దగ్గరికి వెళ్లి “ఆ నరసింహ వచ్చాడు. ఆ పిచ్చి అవతారాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న రూంలో దాక్కోండి” అన్నారు.
"సరే.. నేను ఇప్పుడే ఆ పిచ్చి అవతారాన్ని తీసుకొని పొయి ఇద్దరం ఆ రూమ్ లో దాగుకుంటాము. " అని నారాయణ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
"ఆరే.. ఈ రోజు మనం ఇంతకు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం నారాయణ ఇవ్వాల్సిన 5 కోట్ల బాకీ తీర్చాడు. ఇంక పిచ్చికుదిరి ఆ అవతారం హైదబాద్లో వుండే కొడుకు దగ్గర పోయాడని చెబుతాం. అలా చెప్పటం వలన మళ్ళి ఈ హాస్పటల్ దగ్గరికి మళ్ళి ఈ నర్సింహ రాడు. మరి నారాయణ ఒక్కసారే మందు పార్టీ ఇస్తాడు. తర్వాత మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. " అన్నాడు బీమ.
"ఒరేయ్. భీమ.. నీకు కండబలం ఉంది బుద్ది బలం లేదు. నారాయణ ముందర అలా చెప్పాను కాని ఆ నరసింహ మన దగ్గరా రాగానే. నీవు వచ్చింది చూసి భయపడి ఆ పిచ్చి అవతారాన్ని తీసుకొని వెళ్ళి ఆ రూములో దాగున్నారు అని చెబుతాం. "
"నారాయణకు మనమే పట్టించమని తెలుస్తుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. " అన్నాడు భీమ
"నారాయణ ఇప్పుడు నరసింహకు దొరుకుతే ఇంక మనకు నారాయణ పీడ విరగడ అవుతుంది. ఎందుకంటే నారాయణ ను ఆ పిచ్చి అవతారాన్ని.. ఇద్దరినీ ఎత్తుకొనిపొయి తన డబ్బులు వసూలు అయ్యేంత వరకు వదలి పెట్టరు"
"ఏమో.. ఈ సారి నీ బుద్దిబలం బెడిసి కొడుతుందేమో.. అనుమానం ఉంది"
"నీ అపశకునం మాటలు నీవును.. నీవు చూస్తుండు" అని రంగ అన్న వెంటనే నరసింహ వచ్చి
"ఏరా రంగా.. మీ నారాయణ ఎక్కడా కనపడటం లేదు"
"నీవు వస్తునవని ఆ అవతారాన్ని తీసుకొని పోయి, ఇద్దరు ఆ రూంలో దాకొన్నారు. "
"అవునా ఈ రోజు ఆ నారాయణ పని అయిపోయినట్టే. " అంటూ నరసింహ తన అనుచరులతో వాళ్లు దాకొన్న రూమ్ దగ్గరికి వస్తున్నాడు. వాడు వచ్చేది కిటికీ లో నుండి చూసిన నారాయణ ‘అమ్మో! వీడు రూము దగ్గరికి వస్తున్నాడు.. ఎలా” అనుకున్నాడు.
ఇంకా వుంది...
సంపత్ సినిమా కథలు ధారావాహిక ఐదవ భాగం త్వరలో..
S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : S. సంపత్ కుమార్
చదువు M.A. Archeology
కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.
Comments