top of page

సంక్రాంతి కథల పోటీ ఫలితాలు


మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీకి అసంఖ్యాకంగా తమ రచనలను పంపిన ప్రియమైన రచయితలకు,ఆ కథలను ఓపికగా చదివి,తమ అభిప్రాయాలను మాకందించిన ప్రియాతి ప్రియమైన పాఠకులకు మా ధన్యవాదాలు.


మా ఊహకు మించిన రచనలు రావడమే కాకుండా దాదాపు ప్రతి కథ బహుమతికి అర్హమయ్యే స్థాయిలో ఉండటం మమ్మల్నీ,న్యాయ నిర్ణేతలనీ సంభ్రమానికి గురి చేసింది.


కానీ ఫలితం లేని పోటీకి అర్థం లేదనీ, ఫలితాల ప్రకటన మా బాధ్యతనీ తెలుసు కాబట్టి, మా న్యాయ నిర్ణేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలకు పాఠకుల ఆదరణ, అభిప్రాయాలూ జోడించి ఫలితాలు ప్రకటిస్తున్నాం.


ఇక బహుమతుల విషయంలో స్వల్పమైన మార్పులు చేశాం.


మొదటి,రెండవ, మూడవ బహుమతులలో ఏ విధమైన మార్పూ లేదు.


అయిదు ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కటి రూ : 500 /- అని గతంలో ప్రకటించాము.


ప్రస్తుతం 'ప్రోత్సాహక బహుమతులు' పేరును 'ప్రత్యేక బహుమతులు' గా మారుస్తున్నాము.


అయిదు బహుమతుల స్థానంలో పదిహేను ( 15 ) కథలకు ప్రత్యేక బహుమతులు అందిస్తున్నాము.


ఒక సభ ఏర్పాటు చేసి,విజేతలకు బహుమతులు అందించాలని మొదట భావించాము.


కానీ కోవిడ్ కారణంగా రచయితలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో బహుమతులను నేరుగా వారి ఖాతాలకు జమ చేయాలని భావిస్తున్నాం.


బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలు కూడా మెయిల్ ద్వారా పంపిస్తున్నాము.

విజేతలందరికీ వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాము.


ఇక మిగిలిన కథలన్నీ 'మంచి కథలు' గా పరిగణింపబడతాయి.


ఆయా రచయితలు కోరితే వారికి అభినందన పత్రాలు పంపబడతాయి.


బహుమతుల ప్రకటన :


బహుమతి పొందిన కథల వివరాలు ఈరోజు ( 26/01/2021 ) సాయంత్రం 6 .00 గంటలకు మనతెలుగుకథలు.కామ్ లో . ప్రచురిస్తాము.

మా పేస్ బుక్ పేజీలో ఉదయం 9 గంటలనుండి ప్రత్యేక బహుమతులతో మొదలు పెట్టి ప్రధమ బహుమతి వరకు వరుసగా ఫలితాలు ప్రతి అరగంటకు ప్రచురితమయ్యేలా షెడ్యూల్ చేసాము.

ఈ క్రింది లింక్ ద్వారా మా పేస్ బుక్ పేజీ ని చేరుకోవచ్చు.

623 views1 comment

1件のコメント


sunadh kappala
sunadh kappala
2021年1月26日

తెలుగు భాష..

తెలుగుదనం..

అమ్మ ఒడిలో ఉద్భవించిన మన తెలుగు కథలకు జీవంపోస్తూ పాఠకులకు అందిస్తున్న "మన తెలుగు కథలు" నిర్వహకులకు ప్రత్యేక అభినందనలు🙏 మాలాంటి రచయితలను ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు🙏🙏


いいね!
bottom of page