top of page

సంతానవతి


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

https://youtu.be/LCAV7PkhUUA

'Santhanavathi' New Telugu Story By Dr. Shahanaz Bathul


రచన : డా: షహనాజ్ బతుల్


లాలీ లాలీ లాలీ లాలీ

వట పత్ర సాయికి వరహాల లాలి..


పాట వినిపిస్తోంది.


'ఎవరు పాడుతున్నారు..?' అనుకున్నది వర్ధనమ్మ.

హాలు లో చూసింది. ఎవ్వరూ లేరు.


'పాట ఎటునుంచి వస్తోంది' అనుకున్నది.

కొడుకు గదిలోనుండి వస్తున్నది.

కొడుకు గది లోకి వెళ్ళింది. కోడలు, సౌమ్య బొమ్మను, భుజాన కూతుర్ని ఎత్తుకున్నట్లు ఎత్తుకొని, అటు ఇటు తిరుగుతూ పాడుతుంది. అత్తను చూడలేదు. పాడుతుంది. కొడుకు ఆఫీసు కి వెళ్ళాడు. భర్త కాలేజీకి వెళ్ళారు. సౌమ్య ని అలా చూసేసరికి కన్నీళ్లు వచ్చాయి.

వర్థనమ్మ భర్త రంగనాథ్ గారు, డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్. కొడుకు సతీష్ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగము చేస్తున్నాడు. కొడుక్కి వివాహము అయ్యి ఆరు సంవత్సరాలు అయ్యాయి.

వీధిలో శ్రీమంతం పేరంటానికి వెళితే గొడ్రాలు, అక్షింతలు వెయ్యటానికి పనికి రాదు అన్నారు.

ఒక బాబు పుట్టిన రోజుకి వెళితే గొడ్రాలు నీడ నా బాబు మీద పడకూడదు. దీవించడానికి పనికి రాదు అన్నారు.

ఇంటికి వచ్చి గది లో కెళ్ళి ఏడుస్తుంది. వర్ధనమ్మా వెళ్ళేసరికి “అత్తమ్మ! నేనేమీ పాపం చేశాను. ఎందుకు నాకీ శిక్ష” అంటూ అత్తను కౌగలించుకొని ఏడ్చింది.

“నువ్వేమీ పాపం చెయ్యలేదు. నిన్ను మాటలు అన్న వాళ్ల మనస్సులు మంచివి కావు.”

"కొంతమంది కి అత్త ఆడ పడుచులే గొడ్రాలు అంటూ మనస్సుని గాయ పరుస్తారు. కానీ మీరు నన్ను అమ్మ లా ఓదారుస్తున్నారు. మీ లాంటి అత్త దొరకటం, నా అదృష్టం." అన్నది. ఇప్పుడు సౌమ్య బొమ్మను కూతురిగా భావించు కుంటుంది. పిచ్చిది అవుతుందేమో. అనుకున్నది. భయం వేసింది. "సౌమ్య" “.........”

జోజో అంటూ చేతితో బొమ్మ మీద తడుతూ తిరుగుతుంది.

"సౌమ్య" “.........”

"సౌమ్య" గట్టిగా అరిచింది వర్ధనమ్మ. అప్పుడు తిరిగి చూసింది.

"ఏమిటమ్మా నీ పరిస్థితి! పిచ్చి దానివవుతున్నావు. అంతకు మునుపు మన అపార్ట్మెంట్ లో చిన్న పిల్లల్ని చేరదీసి, వాళ్ళతో ఆడుకునే దానివి.

పిల్లలందరూ ఆంటీ అంటూ నీ చుట్టూ తిరిగేవారు. వాళ్ళ కోసం చాక్లెట్లు బిస్కెట్లు కొని, పెట్టేదానివి. నీకు చాక్లెట్ ఆంటీ అని పేరు కూడా పెట్టారు పిల్లలు.

కానీ ఇప్పుడు నువ్వు గొడ్రాలువని చెప్పి, పెద్దవాళ్ళు పిల్లల్ని, నీ దగ్గరకు పంపడం లేదు. అది నీ మనస్సు పైన ప్రభావము చూపిందనుకుంటాను. పిల్లలు పుడతారనీ ఇప్పటి వరకు నిరీక్షించాము. ఇప్పుడైనా డాక్టర్. దగ్గరకు వెళ్ళండి- నువ్వు, సతీష్. నీ పరిస్థితి చూస్తుంటే, చాలా భయంగా ఉందమ్మా." చెప్పింది వర్థనమ్మ.

"అత్తయ్య! మీరు భయ పడకండి. నాకు పిచ్చి లేదు.అలాగే డాక్టర్ దగ్గరికి వెళతాం."

"నాకు ఒక ఆలోచన వచ్చింది." "ఏమిటీ అత్తయ్య."

"నువ్వు డిగ్రీ చదివావు. ఉద్యోగము చెయ్యడం లేదు. మనిషికి ఏదైనా వ్యాపకం ఉండాలి. నువ్వు ట్యూషన్లు ఎందుకు చెప్పకూడదు.?"

"నేనా అత్తయ్య"

"డబ్బు కోసం కాదమ్మా వ్యాపకం కోసం. పేద విద్యార్ధులకు ఉచితముగా చెప్పు. నీకు వ్యాపకం ఉంటుంది. ఒక మంచి పని చేసానన్న ఆత్మ సంతృప్తి మిగులుతుంది. పాఠశాల విద్యార్థులకు చెప్పు."

"అలాగే అత్తయ్య"

"భోజన సమయము అవుతుంది. పద భోజనము చేద్దాం."అన్నది వర్ధనమ్మ. *** సాయంత్రం సతీష్ ఇంటికి వచ్చాక "మీరిద్దరూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, చూపించు కోండి" అన్నది వర్ధనమ్మ.

ఇంటిదగ్గర పదవ తరగతి వరకు పేదవాళ్ళకు ఉచితముగా ట్యూషన్ చెప్పబడును అని బోర్డ్ కూడా పెట్టేశారు.

సతీష్, సౌమ్య డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. సౌమ్య కి పిల్లలు పుట్టే అవకాశం ఉందని, ఇద్దరి లో లోపం లేదని చెప్పారు.

ఇంటికి వచ్చి, అదే విషయము చెప్పింది. వర్ధనమ్మ చాలా సంతోషించింది.

"కొంతమందికి ఆలస్యముగా పుట్టవచ్చు. నువ్వు బొమ్మలను తీసుకొని లాలి పాటలు పాడకు. ఒక సంవత్సరము లో లేక రెండు సంవత్సరాలలో పుట్టవచ్చు." అన్నది వర్ధనమ్మ.

కొంతమంది ట్యూషన్ కొరకు వచ్చారు. సౌమ్య రోజూ సాయంత్రం ట్యూషన్లు చెప్పుతుంది. *** ఒక సంవత్సరం గడిచి పోయింది. సౌమ్య కి పిల్లలు పుట్టలేదు. కానీ టీచింగ్ లో మంచి పేరు వచ్చింది. చాలా మంది పేద పిల్లలు వచ్చేవారు. అందరికీ మంచి మార్కులు వచ్చాయి. డబ్బులు ఇచ్చుకో గలిగే వాళ్ళు కూడా పిల్లలను పంపేవారు. అందరితో పాటు అని అందరికీ కాదనకుండా చెప్పేది.

పదవ తరగతి వ్రాసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యారు. వ్యాపకం ఉండటం వలన పిల్లల గురించి ఆలోచించలేదు.

తన దగ్గరకు వచ్చే పేద విద్యార్థులలో ఒక బ్రాహ్మణ కులానికి చెందిన అబ్బాయి, మురళి, చాలా బాగా చదువుతున్నాడు. చాలా మంచి మేధావి అని అర్థము చేసుకున్నది. అతని గురించి అత్తయ్యకు చెప్పింది.

"గవర్నమెంట్ ఎస్.సి, ఎస్.టి లకు ఫీజులు కడతుంది. పుస్తకాలు ఇస్తుంది. స్కాలర్షిప్ ఇస్తుంది. కానీ అగ్రకులం లో పుట్టిన పేదవాళ్ళకు ఏమి ఇవ్వడం లేదు. అగ్ర కులం లో పుట్టిన పేదింటి మేధావులు డబ్బులు లేక చదువుకు స్వస్తి చెప్తున్నారు.

మనం ఇటువంటి వారిని ప్రోత్సహించాలి. ఇతనికి డబ్బు కట్టి, మనం చదివిద్దాము. గవర్నమెంట్ మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తుంది. దానికి అప్లికేషన్ కూడా పెట్టిద్దాము. " అన్నది వర్థనమ్మ.

"అలాగే అత్తయ్య. పదవ తరగతి లో ఉన్నప్పుడు, ఒక పరీక్ష వ్రాయాలి అత్తయ్య. ఆ పరీక్ష బాగా వ్రాస్తే, గవర్నమెంట్ చదివిస్తుంది. చాలా మందికి ఆ పరీక్ష గురించి తెలియదు. మురళి చేత ఆ పరీక్ష వ్రాయిస్తాను."

"అలాగే" అన్నది వర్ధనమ్మ.

మెల్లిగా సౌమ్య తనకి పిల్లలు పుట్టలేదు అన్న బాధను మర్చిపోయింది. అసలు ఆలోచించడం లేదు. ఎవరైనా వీధిలో పేరంటం కి పిలిచినా వెళ్ళటం లేదు.


అడసు త్రొక్కనేల కాలు కడుగ నేల. బురద త్రొక్కితెనే కదా కాల్లుకడగ వలసి వస్తుంది. బురద త్రొక్కక పోతే కాళ్ళు కడుగ వలసిన అవసరం రాదుగా.

వర్ధనమ్మ ఒకటి గమనించింది. ఎవరైతే, వాళ్ళ చిన్న పిల్లల్ని, సౌమ్య ఆడిస్తుంటే, గొడ్రాలు, పిల్లల మీద నీడ పడకూడదు అని చెప్పారో, వాళ్ళే తమ పిల్లల్ని, ట్యూషన్ కి సౌమ్య దగ్గరికి పంపుతున్నారు. వాళ్ళు కొంచెం ఎదిగారు.


చిట్టి మూడవ తరగతి చదువుతున్నది. వాళ్ళమ్మని అడిగింది.

"అంతకు ముందు చాక్లెట్ ఆంటీ ఇంటికి వెళ్ళవద్దు. ఆమె నీడ కూడా పడ కూడదు అన్నావు. ఇప్పుడెందుకు ట్యూషన్ కి వెళ్ళమంటున్నావు"

"మాట్లాడకుండా వెళ్ళు. తను ట్యూషన్ బాగా చెప్తుంది." అని చెప్పింది ఆ తల్లి.

వర్ధనమ్మ తో చిట్టి ఈ విషయం చెప్పినప్పుడు, "అవసరాలు ఆలా మాట్లాడిస్తాయి" అనుకున్నది. *** మరో రెండు సంవత్సరములు గడిచి పోయాయి. మురళి పదవ తరగతి లోకి వచ్చాడు.


మురళి చేత ఎన్.సి. ఇ.ఆర్.టి పరీక్ష తనే డబ్బులు కట్టి, అప్లికేషన్ ఫార్మ్ తనే ఫిల్ చేసి, అతని చేత సంతకము చేయించి, పెట్టించింది. అతనికి స్కాలర్షిప్ వచ్చింది. సౌమ్య, వర్థనమ్మ చాలా సంతోషించారు.

"నువ్వు చాలా మంచి పని చేసావమ్మ. దేవుడు నీకు మంచి చేస్తాడు." అన్నారు రంగనాథ్ కోడలి తో.

కొన్ని రోజుల తర్వాత తెలిసింది. సౌమ్య గర్భవతి అని అందరూ సంతోషించారు.

"అత్తయ్య! ఇంకెప్పుడు, ఎవ్వరూ నన్ను గొడ్రాలు అనరు" అన్నది.

"అవునమ్మా ఎవ్వరూ అనరు."

ఈ విషయము అందరికీ తెలియాలి అని వీధిలో ప్రతి ఇంటికి స్వీట్స్ పంపారు.

తొమ్మిది నెలల తర్వాత సౌమ్య కి కొడుకు పుట్టాడు.

"నేను తల్లినయ్యాను" అని గర్వంగా చెప్పింది.

"నేను నాన్నను అయ్యాను" అన్నాడు సతీష్.

(సమాప్తం) &&&&&&&&&&&&&

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.

నిజాయితీ ఖరీదు

డాక్టర్ పూర్ణిమ

ఆత్మ విశ్వాసము

చెరపకురా చెడేవురచయిత్రి పరిచయం : నా వివరములు:

నేనుబి.ఎస్సీ వరకు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) లో చదివాను. ఎం. ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం లో చదివాను. గణితము లో రీసెర్చ్, ఐ.ఐ. టి (ఖరగ్ పూర్ ) లో చేసాను. జె. యెన్.టి.యు.హెచ్ (హైదరాబాద్) లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసాను.

1980 నవంబర్ దీపావళి సంచిక వనిత, మాస పత్రిక లో మొదటి వ్యాసం ప్రచురింప బడింది. వ్యాసాలూ, కుట్లు అల్లికలు, వాల్ డెకొరేషన్ పీసెస్, గ్రీటింగ్ కార్డ్స్, తయారు చేయడం, వంటలు, కవితలు, కథలు ప్రచురింప బడ్డాయి. 2000 తర్వాత చాలా కాలం వ్రాయలేదు. మళ్ళీ 2021 నుండి ప్రతిలిపిలో చాలా వ్రాసాను. 160 దాకా కథలు, చాలా వ్యాసాలూ, నాన్ ఫిక్షన్, కవితలు చాలా వ్రాసాను.

చాలా సార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.

ఒక సాటి 10 భాగముల సీరియల్ కి బహుమతి వచ్చింది. ఒక సారి డైరీ కి బహుమతి వచ్చింది. ఒక సారి వేరే ఆన్లైన్ వీక్లీ లో ఒక కథ కు బహుమతి వచ్చింది.


షహనాజ్ బతుల్


63 views5 comments
bottom of page