top of page

శాపవిమోచనం - పార్ట్ 2


'Sapavimochanam - Part 2/2' - New Telugu Story Written By Mohana Krishna Tata

'శాపవిమోచనం - పార్ట్ 2/2' తెలుగు పెద్ద కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రాహుల్, వాళ్ళ నాన్నగారు కార్ లో వెళ్ళి.. ఆక్వేరియం కొన్నారు. దానిలో షాపువాడు ఇచ్చిన రెండు గోల్డ్ ఫిషెస్ వేశారు. ఆక్వేరియం చూసి రాహుల్ చాలా మురిసిపోయాడు. వాళ్ళ నాన్న చిన్నప్పటి ఆక్వేరియం విషయాలు తెలుసుకుంటాడు రాహుల్. ఒక రోజు రాత్రి రాహుల్ బాత్రూం కు బయటకు వచ్చినప్పుడు.. చుస్తే, ఆక్వేరియం లో గోల్డ్ ఫిషెస్ ఉండవు. ఎలాగైనా ఏం జరుగుతుందో.. తెలుసుకోవాలనుకున్నాడు రాహుల్..


ఇక శాపవిమోచనం పెద్ద కథ పార్ట్ 2 చదవండి..రాహుల్ పడుకున్నాకా, రాత్రి 12 అయ్యాకా, చేపలు రెండు ఆక్వేరియం లోంచి మాయమైపోయాయి. ఇలా.. ప్రతిరోజు, రాత్రి 12 కు వెళ్ళి.. మళ్ళీ తెల్లవారు 6 కల్లా వచ్చేస్తున్నాయి.


ఒకరోజు రాత్రి చాటున ఉండి, అంతా గమనించాడు రాహుల్.


రాత్రి 12 కు గోల్డ్ ఫిషెస్ బయటకు రావడం చూసాడు రాహుల్. చేపలు రెండూ అబ్బాయిలుగా మారి, ఇలా మాట్లాడుకుంటున్నాయి.


"సిద్ధి! మనం ఇక్కడ నుంచి రోజూ బయటకు వెళ్లడం ఎవరైనా చుస్తే, మనల్ని చంపేస్తారేమో?.. "


"ఎవరూ చూడరు.. భయపడకు" అన్నాడు బుద్ధి


"ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు మాత్రమే మనల్ని చూడగలరు.. మన మాట వినగలరు.. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ ఉండరు లే.


చాటున ఉన్న రాహుల్.. అంతా చూస్తున్నాడు.. వింటున్నాడు.


"ఇప్పుడు మనం, ఊరి చివరకు వెళ్ళి, అక్కడ ఉండే జంతువులను తిందాం.. పదా..

ఇంతకుముందు మనం, ఆక్వేరియం షాప్ లో ఉన్నప్పుడు, మనల్ని ఎవరూ గుర్తించే వారు కాదు.. కానీ.. ఇప్పుడు రాత్రి చాటుగా వెళ్లాల్సి వస్తోంది. మన ప్రాణం ఈ చేపల్లో ఉన్నటు ఎవరికీ తెలియకూడదు, లేకపోత మనల్ని చంపేయొచ్చు అని అనుకుంటున్నాయి"


ఇదంతా, రాహుల్ విన్న తర్వాత, చేపల సంగతి తెలుసుకోవాలి అనుకున్నాడు..


ఒక రోజురాత్రి, చేపలు బయటకు వెళ్లిన తర్వాత, ఆక్వేరియం లో నీళ్లు బయటకు తీసేసాడు. రాక్షస చేపలు వచ్చేసరికి మళ్ళీ చేపలుగా మారడానికి వీలు లేదు, ఎందుకంటే ఆక్వేరియం లో నీళ్లు లేవు. సూర్యోదయం అయిపోతే, అవి బయట ఉండలేవు. ఈ విషయం కూడా రాహుల్.. చేపలు అనుకున్నప్పుడు విన్నాడు. అవి ఎక్కడనుంచి వచ్చాయో, అక్కడకే మళ్ళీ రావాలి.. ఇంకొక చోటులో ఉండలేవు.


రాక్షసులు చేపలుగా మారి, ఆక్వేరియం లో కి వెళ్ళడానికి అందులో నీళ్లు లేవు.. సూర్యదయం, అయితే బయట ఉండలేవు. అది ఒక సాధువు ఇచ్చిన శాపం. రాక్షసులకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.


ఇదంతా, గమనించిన రాహుల్, వాటి దగ్గరకు వచ్చి..


"ఓ చేప రాక్షసులారా! నేను మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. చేప రూపం లో ఉన్న మీరు, ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. మీరు నేను చెప్పినట్టు చేయకపోతే, మీ ప్రాణాలు పోతాయి.. "


మమల్ని శాప విముక్తుల్ని చేయగలవా?.. అని చేపలు వేడుకున్నాయి.. అప్పుడు మేము ఎవరికి హాని చేయలేము. అప్పుడు నీకు ఏమి కావాలో చెప్పు! చేస్తాము.. అని వాళ్ళ కథ చెప్పాయి చేపలు..


***

"చాలా రోజుల కిందట, మేము విద్య కోసం, మా గురువుగారు దగ్గర ఉండేవాళ్ళము. సిద్ధుడు.. బుద్ధుడు.. మా పేర్లు. అంతా.. సిద్ధి, బుద్ధి అనేవారు. మా గురువుగారు తన శిష్యులందరిని చాలా ప్రేమతో చూసుకునేవారు. మా తోటి శిష్యులు కూడా చాలా స్నేహంగా ఉండేవారు.


కానీ, ఒక అబ్బాయి కాశి మటుకు, గురువుకు ప్రియ శిష్యులం అయినా మేమంటే చాలా ఈర్ష్య తో ఉండేవాడు. ఎప్పుడు మమల్ని గేలి చేస్తూ ఉండేవాడు.


గురువుగారు, అన్నీ మాకు చెప్పేవారు.. కానీ కాశి కు మాత్రం కొన్ని మంత్రాలు చెప్పేవారు కాదు. దీనితో కాశి కు మా మీద ఇంకా కోపం ఎక్కువైంది. ఒక రోజు గురువుగారు బయటకు వెళ్ళినప్పుడు, కొన్ని మంత్రాలను, చూడడానికి కాశి సాహసించాడు.. అంతలో గురువుగారు రావడం గమనించిన కాశి.. ఆ నింద మా మీద వేసాడు.


"మా కేమి తెలియదని ఎంత చెప్పినా.. మా గురువుగారు వినలేదు. కోపావేశంలో మమల్ని శపించారు. మేము నీటిలో ఉన్నంత సేపు చేపలుగా, బయట కొచ్చినప్పుడు రాక్షసులుగా ఉండాలని శపించారు. రాక్షసులము అవడం చేత మేము మాంసాహారం కోసం నీటిలోంచి బయటకు వచ్చేవాళ్ళం. అడవిలో ఉన్న జంతువులను చంపి తినేవాళ్ళము.


సూర్యోదయం అయ్యేసరికి మరల నీటిలోకి వెళ్ళిపోయేవాళ్ళము. ఇలా మా జీవితం చాలా సంవత్సరాలు గడిచింది.


కాలం మారింది.. మేము అలా ఈదుకుంటూ, పెద్ద చెరువులోకి వచ్చేసాము. కొంత మంది చేపలు పట్టి, మా రంగు చూసి షాప్ లకు ఎక్కువ ధరలకు అమ్మేసేవారు. ఇలా ఆక్వేరియం లోకి వచ్చాము.


***


మరి శాపవిమోచనం.. ఏమిటని అడిగాడు రాహుల్.


గురూజీ ని క్షమించమని అడిగినప్పుడు.. చెప్పిన శాప విమోచనం ఏమిటంటే..


"ఎదురుకాళ్లతో.. పుబ్బ నక్షత్రం లో పుట్టిన అబ్బాయి.. పుణ్యనదులలో తెచ్చిన నీళ్లతో.. మేము చేపలుగా ఉన్న ఆక్వేరియం లో వెయ్యాలి.. ఇలాగ.. ఆ నీటిలో మేము కొన్ని రోజులు ఉంటే, మాకు మా నిజరూపం వస్తుంది.


నువ్వు నాతో మాట్లాడుతున్నావు.. అంటే, నువ్వు పుబ్బ నక్షత్రం లో పుట్టి ఉంటావు. ఎదురుకాళ్లతో కూడా పుట్టి ఉంటావు. మాకు నువ్వు సాయం చేయగలవా? చూస్తే, చిన్న వాడివి లాగా ఉన్నావు?"


"మీరు ఏమి అనుమానించకండి. నేను మా ఇంట్లో ఒప్పించి మీకు కావాల్సిన జలం తీసుకుని వస్తాను. జలం ఎక్కడ నుంచి తేవాలో చెప్పండి"


"దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే.. మా గురువుగారి ఆశ్రమం.. ఇక్కడకు దగ్గర్లోనే ఉంది. అక్కడకు వెళ్తే నీకు వివరాలు తెలుస్తాయి. శాపగ్రస్తులం గనుక, మేము రాలేము.


"నేను వెళ్తాను" అన్నాడు రాహుల్.. మీరు ధైర్యంగా ఉండండి..


మర్నాడు రాహుల్ స్కూల్ అయిపోయిన తర్వాత.. చేపలు చెప్పిన గురువుగారి ఆశ్రమము కోసం వెళ్ళాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత, ఆశ్రమం కనిపించింది. లోపలికి వెళ్ళాడు రాహుల్. అక్కడ కొంత మంది శిష్యులు కనిపించారు..


"ఎవరూ బాబు నువ్వు? ఎవరు కావాలి?"


"నేను మీ గురువు గారిని కలవాలి"


"నువ్వు అడిగిన గురువుగారు ఇక్కడ లేరు.. హిమాలయాలకు వెళ్లిపోయారు.. చాలా సంవత్సరాల కిందటి. " అన్నారు అక్కడ శిష్యులు.


"మరి నాకు కావాల్సిన వివరాలు ఎవరు చెబుతారు?" అన్నాడు రాహుల్.


"అంత జ్ఞానులు ఇక్కడ ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు.. అక్కడకు వెళ్తే.. నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి" అన్నారు శిష్యులు.


రాహుల్ తనకు కావాల్సిన సమాధానం దొరికిన తర్వాత, అక్కడ నుంచి ఇంటికి చేరుకున్నాడు.


"ఒరేయ్ రాహుల్! రేపు మనింటికి దూరపు చుట్టం వస్తున్నారు. నీకు అమ్మమ్మ అవుతారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అల్లరి చేయకూడదు" అన్నది రాహుల్ తల్లి.


"అలాగే అమ్మ!"


తల్లి చెప్పినట్టే మర్నాడు ఉదయమే, అమ్మమ్మ గారు వచ్చారు. చూడడానికి చలాకీ గా, హుషారుగా ఉందనుకున్నాడు రాహుల్.


"రాహుల్! ఎలా ఉన్నావ్ రా! ఇదిగో చాక్లెట్లు తీసుకో.. "


"థాంక్యూ అమ్మమ్మ"


లోపలకి వచ్చిన అమ్మమ్మ అనసూయ.. వస్తూనే " అమ్మాయి సంధ్య! ఏమిటే ఇది.. చేపల తొట్టి పెట్టారు హాల్ లో"


"అది తొట్టి కాదు అమ్మమ్మ! దానిని ఆక్వేరియం అంటారు.. అందులో చేపలు వేసుకుంటాం" అన్నాడు రాహుల్.


"వెంటనే తీసి పడేయండి.. వెజిటేరియన్ ఇంట్లో చేపలు ఏమిటి" అంది అనసూయ.


"ఆ మాటలు విన్న రాహుల్ కు చాలా కోపం వచ్చింది".


"లేదు పిన్ని! రాహుల్ ముచ్చట పడ్డాడు. అందుకే అయన కొన్నారు" అంది సంధ్య.


"పోనిలే.. పిల్లోడు కదా" అనుకుంది అనసూయ.


"రండి పిన్ని! కాళ్లు కడుక్కుని, ఫలహారం చేదురు"


"ఫలహారం చేస్తూ! చేపలు బాగున్నాయి రా రాహుల్.. ఎర్ర రంగు లో"


"ఎర్ర రంగు కాదు.. గోల్డ్ కలర్ ఫిషెస్" అన్నాడు రాహుల్.


"ఏమిటి వాటి గొప్పతనం?"


"మన మాటలు అర్ధం చేసుకుంటాయి.. తిట్టకు అమ్మమ్మ"


"నువ్వు వాటిని తిట్టావనుకో.. రాత్రి వచ్చి కొడతాయి అవి"


"రాహుల్ భలే కామెడీ చేస్తున్నాడే సంధ్య.. "


(రాత్రి అయ్యాకా.. చూడు లే అనుకున్నాడు రాహుల్.. )


రాత్రికి ఫలహారం చేసి పడుకుంది అనసూయ..


రాత్రి 12 అయినా తరవాత.. రాహుల్ పక్క నుంచి చూస్తూనే ఉన్నాడు..


చేపలు బయటకు వచ్చి రాక్షసులు గా మారి.. అనసూయ కు కిత కితలు పెట్టి తెగ హడావిడి చేసాయి..


అనసూయ లేచి చూసేసరికి ఎవరూ కనిపించలేదు..


రోజూ.. ఇలానే జరిగేసరికి.. అనసూయ ఇంట్లో ఉండాలనిపించలేదు..


"అమ్మాయి సంధ్య! నేను యాత్రలకు పోతాను.. నాకు టికెట్స్ బుక్ చెయ్యవే.. "

రాహుల్ ఎత్తు పారింది..


"మీరు ఒక్కలే.. ఎలా వెళ్ళగలరు చెప్పండి?.. సమయానికి మా అయన కూడా ఊళ్ళో లేరు.. "

"అయితే రాహుల్ ని తోడుగా తీసుకొని వెళ్ళండి.. వాడికి ఎలాగో సెలవులు ఇప్పుడు"


"పోనీ అలాగే చెయ్యి"


"అమ్మమ తో వెళ్ళు.. చెప్పిన మాట విను.. అల్లరి చెయ్యకు.. నీకు కావలసినవి కొని పెడుతుంది.. " అంది తల్లి.


"అలాగే అమ్మా!"


"మొత్తం మీద తీర్థయాత్రలకు వెళ్తున్నాను.. " అని ఆనందపడ్డాడు రాహుల్.


ఆ రోజు రాత్రి చేప రాక్షసులు..

"మా కోసం ఇంత చేస్తున్నావు?.. ఏమి ఇచ్చి నీ ఋణం తీర్చుకోగలము అన్నాడు సిద్ధి "


"సమయం వచ్చునప్పుడు అడుగుతా!" అన్నాడు రాహుల్.


"నేను లేని సమయంలో.. మీరు బయటకు వెళ్ళకూడదు.. అమ్మ మిమల్ని చూసుకుంటుంది..

మీరు ఇంక మాంసాహారం మానేయాలి.. చేపలుగానే ఉండి.. అమ్మ వేసిన ఫుడ్ మాత్రమే తినాలి" అన్నాడు రాహుల్.


"అలాగే మిత్రమా!.."


"అనుకున్న టైం కు రాహుల్.. అనసూయ.. తీర్థయాత్రలకు బయల్దేరారు..


ఆశ్రమమం లో శిష్యులు చెప్పినట్టుగా..


పుణ్య నదులలో స్నానం కోసం వెళ్ళినప్పుడు.. ఆ పవిత్ర నీటిని రాహుల్ సేకరించాడు..

మొత్తం అన్నీ నదుల పవిత్ర నీటిని జాగ్రత్తగా సేకరించాడు రాహుల్.


మొత్తం మీద రాహుల్ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాడనే చెప్పాలి.. హ్యాపీ గా ఇంటికి చేరుకున్నారు..


ఇంటికి వచ్చిన తర్వాత.. రాహుల్ చేపల్ని చూసి మీకోసం తేవాల్సినది తెచ్చాను అన్నాడు..


"చేపలు.. ఆక్వేరియం లో ఎగిరి డాన్స్ చేసాయి.. "


రాహుల్ వాటర్ మార్చుస్తున్నప్పుడు.. తెచ్చిన ఆ పవిత్ర జలం ఆక్వేరియం నీటితో కలిపాడు.. వెంటనే, చేపలను వేసాడు..


"మీరు ఇందులోనే, ఒక నెలరోజులు ఉండాలి కదా!.. అప్పుడే మీకు శాప విమోచనం అవుతుంది అన్నాడు రాహుల్".


"అలాగే మిత్రమా! అన్నాయి సిద్ధి బుద్ధి.. "


ఒక నెల రోజులు చేపలు రాహుల్ తో చాలా క్లోజ్ గా ఉన్నాయ్..


తర్వాత, ఒక రోజు శాపము తీరిపోయి.. వాళ్ళ అసలు రూపులు వచ్చేసాయి..


సిద్దుడు, బుద్ధుడు.. రూపాలు చూడగానే, రాహుల్ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు..


"మాకు శాపవిమోచనం.. నీ కారణము చేత అయినది మిత్రమా!".. నీకు సదా ఋణపడి ఉంటాం.. నీకు ఏమి వరం కావాలో కోరుకో.. మిత్రమా! మాకున్న మంత్రశక్తులు నీ లాంటి మంచివాళ్లకు ఉపయోగపడక పొతే వృధా!" అన్నాయి సిద్ధి.. బుద్ధి..


ఇదిగో తీసుకో.. ఈ ఉంగరం.. ఇది చాలా మహిమ గలది.. ఈ ఉంగరం దణ్ణం పెట్టుకుని.. నీ కోరిక తలచుకుంటే.. నీ కోరిక తప్పక తీరుతుంది.. అంతా మంచికే ఉపయోగించు మిత్రమా.. !

మీ అందరికి శుభము కలుగు గాకా!.. వెళ్లొస్తాం..************************************************************************************

సమాప్తం

************************************************************************************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
33 views0 comments

Commentaires


bottom of page