'Thodpatu' New Telugu Story
Written By M. Bhanu
'తోడ్పాటు' తెలుగు కథ
రచన: M. భాను
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఇలా నువ్వు వoటచేయటానికి వెళ్తుంటే నాకు ఎoత ఇబ్బంది గా ఉoదో తెలుసా" అన్నాడు శ్రీధర్ తన భార్య మాలతి తో.
మాలతి: నాకు మాత్రం ఇష్టమా చెప్పoడి, ఇప్పుడు మనకి డబ్బులు అవసరం చాలా ఉoది. నాకు ఈ పని తప్ప వేరే ఏమీ రాదు. అయినా మనము ఎవరినీ యాచించడం లేదు. కష్టపడి సoపాదిస్తున్నాము. ఎవరు ఏమన్నా బాధ అవసరం లేదు. మీ ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం చాలా కష్టం. సంపాదించే మామగారు మంచం పట్టారు. ఆడబడుచుకి పెళ్ళి చెయ్యాలి. మీ ఒక్కరివల్లా అయ్యే పనికాదు.
పైగా మన పిల్లల చదువులు ఉన్నాయి. అందుకే ఇవేమీ మనసులో పెట్టుకోకుండా మీ ఉద్యోగం మీరు ప్రశాంతంగా చెయ్యoడి. అయినా ఇప్పుడు వంట చెయ్యడం ఒక హోదాగా భావిస్తున్నారు అందరూ, ఇందులో తప్పేమీ లేదు.
పైగా నేను వెళ్ళేది వృద్ధ దంపతులకు సహాయం చెయ్యటానికి. పైగా వాళ్లు మన దగ్గర బంధువులు కూడా. వారికి సహాయం చేసినట్లు ఉంటుంది, మనకి కాస్త సంపాదన పెరుగుతుంది. వేరే ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా హాయిగా ఉండండి
శ్రీధర్ మాట్లాడుతూ “నువ్వు చెప్పింది నిజమే కానీ ఇంటి పని, నాన్నగారి పని చేస్తూ బయటికి వెళ్లి వంట చేయడం అంటే కాస్త కష్టమేమో ఆలోచించు. పైగా పిల్లలను చూసుకోవాలి. నాది ఒక సమయం సందర్భం లేని ఉద్యోగం. ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళాలి రావాలి. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది మాలతీ!” అన్నాడు.
మాలతి: అన్ని విషయాలు ఆలోచించాను, మీరా విషయాల గురించి గాబరా పడకుండా అందరికీ సమయానికి అన్ని ఉండేలా ఏర్పాటు చేసుకున్నాను అదీకాకుండా నేను వెళ్లే సమయానికే జానకి ఎటూ వస్తుంది, తను చూసుకుంటుంది మిగతా విషయాలు.
జానకి: అన్నయ్యా! ఇంటి పనుల గురించి ఎక్కువ ఆలోచించకు, వదిన నాతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. నాకు ఉదయం క్లాసులే కాబట్టి వదిన వెళ్లే సమయానికి ఇంటికి వచ్చేస్తాను. మిగతా సమయం ఇంట్లోనే ఉంటాను నాన్న గురించి పిల్లల గురించి ఎటువంటి బాధా లేదు అoది.
శ్రీధర్: సరే మీరు ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నాకేమీ భయం అని వెళ్ళిపోయాడు.
శ్రీధర్ మనసులో ఇలా అనుకున్నాడు ;కరోనా రావడంతో నాన్నకు ఉద్యోగం పోయి బెంగతో పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. తనది ప్రైవేటు ఉద్యోగం రావడంతో పెన్షన్ ఉండదు. తనది కూడా ప్రైవేటు ఉద్యోగమే ఒక నెల జీతం వస్తే మరొక నెల రావటం లేదు. నాన్నకి మందులవీ, పిల్లలు చదువులు, చెల్లి పెళ్లి అన్ని భయపెడుతుండగా మాలతి ఈ నిర్ణయం తీసుకుంది.
తను వంట చేసే వాళ్లు తమకు బoధువులే, దగ్గరివాళ్ళే. ఈ కరోనా టైములో బయటి తిండి తింటే పడదని తెలిసి మాలతిని అడిగారు. మాలతి చేయడానికి ఒప్పుకున్నా తనకి మనస్సంగీకరించటం లేదు, ఇన్నాళ్లూ గడప దాటని తను ఇప్పుడు బయటికి వెళ్తుంటే కాస్త ఇబ్బందిగా అనిపించి ఆ మాటే మాలతితో అన్నాడు. చెల్లీ ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. ప్రైవేటుగా చదువుతోంది. ఉదయమే ప్రైవేటుకు వెళ్లి వస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదని నిట్టూర్చాడు శ్రీధర్.
ఇల్లు గడవాలంటే భార్యాభర్తలిద్దరూ వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా కష్టపడాలి అనుకున్నాడు
|
***
M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.
ధన్యవాదములు 🙏
Hindu Dharma Margam • 11 hours ago (edited)
కథ ఎప్పుడూ నాటకం లా వ్రాయగూడదు. పాత్రల చేత రచయిత పలికించాలి. కథలో ఒక మలుపు ఉండాలి. ముగింపు పాఠకులను సస్పెన్స్ లో పెట్టగలగాలి.