top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 05/11/2023

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. కానీ తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది వెన్నెల. ఆమె వివాహం చంద్రంతో జరుగుతుంది. వ్యసనపరుడైన చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల.

కనపడకుండా పోయిన చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ గురించి రవళిని ప్రశ్నిస్తాడు ఏసీపీ యాది రెడ్డి. వాళ్ళు పార్టీ చేసుకున్న గెస్ట్ హౌస్ ను పరిశీలిస్తాడు. మనోరమ హత్యకు గురైనట్లు అనుమానిస్తాడు.

మనోరమ చనిపోయినట్లు, ఆమె శవాన్ని మినిష్టర్ గారి తోటలో పూడ్చి పెట్టినట్లు చెబుతాడు వాచ్‌మెన్‌ యాదయ్య.

మినిష్టర్ గోవిందరావు కేసునుండి తన కొడుకును తప్పించే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. చంద్రాన్ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.


ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15 చదవండి.


సైబరాబాద్‍ పోలీస్‌ స్టేషన్‌ కి చంద్రంని తీసుకు వచ్చి రెండురోజులయ్యింది. వచ్చిన రోజు మధ్యాహ్నం యాదిరెడ్డి అతడిని విచారించాడు. ఇంచుమించు రవళి చెప్పిన

విషయాలే అతడు చెప్పాడు కొన్ని మినహా.


పార్టీ మధ్యలో మనోరమ వెళ్ళి పోయిందన్నాడు. కానీ ఊర్మిళ వచ్చి పార్టీ మధ్యలో వెళ్ళిపోయింది. దిలీప్‌ రాలేదని చెప్పాడు. రెండూ తప్పులే. కానీ గెస్ట్‌హౌస్‌ వాచ్‌మెన్‌

చెప్పాడు. ఆ పార్టీకి దిలీప్ వచ్చాడు. మనోరమ చచ్చిపోయిందని యాదిరెడ్డి చెప్పడంతో చంద్రం మొహం భయంతో వణికిపోయింది. అసలీ విషయం దిలీప్‌ తనకు

ఎందుకు చెప్పలేదు? లోలోపల తిట్టుకున్నాడు.


ఈ లోగా సెల్‌లో ఉన్న యాదయ్యను తీసుకురమ్మనాడు యాదిరెడ్డి. యాదయ్య వచ్చి భయం భయం గా నిలుచున్నాడు. మాసిపోయిన బట్టలు, పీక్కుపోయిన

మొహం, గెడ్డం పెరిగిపోయి చింపిరి జుట్టుతో బాగా నీరసం తో ఉన్నాడు.


"పార్టీకి దిలీప్‌ వచ్చాడా ? మనోరమ చచ్చిపోయిందా" అనడిగాడు, యాదయ్యకేసి చూస్తూ యాదిరెడ్డి. ఎదురుగా ఉన్న చంద్రంని, ప్రక్కనే లాఠీతో ఉన్న కానిస్టేబుల్‌ ని, తన కేసి తీవ్రంగా చూస్తున్న యాదిరెడ్డి ని చూశాడు యాదయ్య. అవునన్నట్లుగా తలూపాడు.


"తల ఊపడం కాదు. నోటితో చెప్పు..” సిఐ శేఖర్‌ కసిరాడు. కానిస్టేబుల్‌ లాఠీ పట్టుకుని పైకెత్తి ఉన్నాడు. యాదయ్య వణుకుతున్నాడు.


వాడి నోటి నుంచి ఏమీ సమాధానము రాకపోయే సరికి కానిస్టేబుల్‌ ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు యాదయ్య ‘అమ్మా’ అని గావుక్క పెట్టేసరికి చంద్రం కూడా

వణికాడు. అసలి ఆ దెబ్బ తనకు పడాలి. యాదయ్య అక్కడ లేకపోతే అనుకున్నాడు. అలా అనుకోగానే అతడికి వళ్ళంతా చెమటలు పట్టేసింది.

"దిలీప్‌ బాబు వస్తానన్నాడు.. కానీ రాలేదండీ.. వచ్చాడనుకున్నానండీ.. మనోరమ కిందపడి ఉండే సరికి సచ్చిపోయిదనుకున్నానండీ..” అన్నాడు యాదయ్య భయంభయంగా.


అంతే! శేఖర్‌ సంజ్ఞ చేయడంతో ప్రక్కనే ఉన్న కానిస్టేబుల్‌ టపటపా మని రెండు మూడు దెబ్బలు వేయడంతో యాదయ్య భయంకరంగా అరిచాడు. ఆడవాళ్ళ సెల్‌ లో

ఉన్నఅతడి భార్యకి ఈ అరుపులు వినబడలేదు. వినిపిస్తే ఆమెకు గుండె ఆగినంత పనయ్యేది. ఇంతకు ముందు చంపేశారు, పూడ్చేశారు అని చెప్పాడు. ఇప్పుడు చచ్చి

పోలేదని చెబుతున్నాడు.


అతడే మనోరమ శవాన్ని బయటకు తీసి శవపరీక్ష కు పంపి పోస్ట్‌మార్టమ్ చేయించాడు. కాలి, వేలి ముద్రలు కూడా తీసుకున్నాడు. ఇప్పుడేమంటావ్‌ అన్నట్లు చంద్రం కేసి చూశాడు యాదిరెడ్డి. చంద్రం తల దించుకున్నాడు. చంద్రం ఏమీ మాట్లాడలేదు.


"పార్టీలో దిలీప్‌ ఉన్నాడు సర్‌” చెప్పాడు చంద్రం.


"మనోరమ ఎలా చనిపోయింది?” యాదిరెడ్డి అడిగాడు.


"గోడకు కొట్టుకుని.. చనిపోసింది.. సర్‌”


" ఎలా కొట్టుకంది.. బాగా తాగిందా?”


"అవును సర్‌, .. లేవబోయింది.. అఫుడు గోడ మీద పడింది"


"నిజంగా, మాకు వేరే విధంగా జరిగినట్లు తెలిసింది. మరి?" చీకటిలో ఒకరాయి విసిరాడు యాదిరెడ్డి.


ఇందాక కథ బాగానే చెప్పాడనుకున్నాడు కానీ, ఈ సారి ఏం చెప్పాలో చంద్రంకు తోచలేదు. కథ ఎలా అల్లాలో.


మళ్ళీ ప్రశ్న రెట్టించాడు యాదిరెడ్డి.

"ఎలా చచ్చిపోయింది.. ?” కానిస్టేబుల్‌ కి సంజ్ఞ చేశాడు.

అతడు కానిస్టేబుల్‌ వైపు చూడటం చంద్రం గమనించాడు. ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది, లాఠీ

దెబ్బ తగిలినట్లు.


“అంతేనండీ. గోడకి కొట్టుకుని చచ్చిపోయింది”

గొణిగినట్లుగా చెప్పాడు చంద్రం.


అంతే కాళ్ళమీద లాఠీ దెబ్బ పడేల్‌ మని పడింది.

కెవ్వుమని కేక పెట్టాడు.


ఇంకో దెబ్బ పడుతుందేమోనని టక్కున అనేశాడు "దిలీప్‌ తోశాడు. గోడ మీద పడింది.." అని.


"అతడు తోస్తే.. వెళ్ళి గోడమీద పడి తల పగిలి చనిపోయిందన్న మాట.. ?" శేఖర్‌ అన్నాడు.


"అవును సర్‌" కానిస్టేబుల్‌ కేసి చూస్తూ చెప్పాడు చంద్రం.

ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కోర్టులో హాజరపపరచారు చంద్రాన్ని. కస్టడీకి పది రోజులు ఆదేశించారు జడ్జి. ఒక్కసారిగా హతాశుడయ్యాడు చంద్రం. జీవితంలో మొదటి సారి తను చేసిన తప్పు ఒప్పులను బేరీజు వేసుకున్నాడు. తప్పులే గానీ ఇసుమంతైనా ఒప్పులు కనబడలేదు.


ఇవాళ పోలీస్‌స్టేషన్‌ లో ఎందుకున్నాడు? లాఠీదెబ్బలు ఎందుకు తిన్నాడు? ఎలాంటి జీవితం తను గడిపాడు? ఎందుకు ఇలా కావాలను నాశనం చేసుకున్నాడు?


విచ్చలవిడిగా జీవితం గడిపాడు. హాయిగా

విలాసవంతంగా గడపడము వేరు. తనది దారి తప్పిన బాటసారి. మొదటిసారి పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. ఇటువంటి దురదృష్టాలు కొని తెచ్చుకున్నవే. ఇంత

కన్నా దురదృష్టాలు ఇంకేం ఉండవు.


వెన్నెలని అనవసరంగా నిందించాడు. కానీ, తను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉండేది. ఆమె మాటలు తల పొగరుతో వినక.. ఈ దుస్థితి తెచ్చుకున్నాడు. ఇలా దిగజారాడు. ఈ కేసులో శిక్ష పడితే అప్పుడు ఏమిటీ దారి? జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఊబినుంచి బయలుపడే

దారి ఏదీ? దిలీప్ ఎలాగైనా బయటపడతాడు. వాళ్ళనాన్న మంత్రి. అవసరమైతే సెంట్రల్‌ పలుకుబడి ఉపయోగిస్తాడు. ఎవరినైనా ఇరికించి, బలిపశువును చేసి,చెయ్యగల సమర్థులు.


ఈ ఆలోచన అప్పుడేమైంది. ? ఇప్పుడు ఆలోచించి ప్రయోజనమేమిటీ? ప్రయోజన మాత్రం మేముంది? తప్పుచేశాను.. సరిదిద్దుకోలేని తప్పు చేశాను.. వెన్నెలకి ఈ విషయం తెలుసా? తెలిసే ఉంటుంది. ఈ వార్త అప్పుడే పేపర్లలో న్యూస్‌ గా వచ్చే ఉంటుంది. ఎంత పరువు తక్కువ. ఆఫీసులో అందరికీ తెలిసే ఉంటుంది. తన నీతీ, నిజాయితీలు గంగలో కలిసిపోయాయి.


బూడిద పోసిన పన్నీరైంది. ఇంక ఆఫీసుకు ఎలా వెళ్ళగలను? ఇప్పుడు పోలీసులకునిజం చెప్పినా నన్ను నమ్మడం లేదు. భగవంతుడా! నన్ను ఈ ఊబిలో నుంచి

బయటపడేయ్‌ !.. " మౌనంగా సెల్‌లో రోధించాడు. ఉన్న దేవుళ్ళందరికీ మొక్కుకున్నాడు.


వెన్నెలను పదే పదే తలచుకున్నాడు. తల్లిదండ్రి గుర్తుకు వచ్చారు. వెన్నెలని తిడుతూ, తప్పుపడుతూ తల్లి మాట్లడిన

తీరు పద్దతి గుర్తుకు వచ్చింది. ఆ క్షణం ఎటూ చెప్పలేక అవస్థపడుతున్న మామగారూ, అత్తగారూ గుర్తుకువచ్చారు.


ఇప్పుడనిపిస్తోంది.. అతడికి ఆ రోజు వెన్నెల చెప్పింది సత్యమని, నిజమని.. తను మాట్లాడిన విధం, పద్దతి సరైనదని..


అతని స్నేహితులు గుర్తుకొచ్చారు. ‘నీ స్నేహితులు ఎవరో చెప్పు.. నువ్వేమిటో చెబుతారు’ అన్న నానుడి గుర్తుకొచ్చింది. అవును తన స్నేహితులు ఎవరో చెబితే వాళ్ళు ఎటువంటి వాళ్ళో ఎవరైనా తేలికగా చెప్పగలరు అనుకున్నాడు.


అవును.. ఆ రోజు మనోరమ అలా చనిపోయి ఉండకపోతే రవళి జీవితం నాశనమయ్యేది. ఆమె జీవితం కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. ఆ పాపంలో తనకూ వాటా ఉండేది. ఆ క్షణంలో దిలీప్‌ ను చూస్తే పైశాచికంగా ఆనందం పొందుతూ స్పష్టంగా కనబడింది. దిలీప్‌ పైకి ఎంత సౌమ్యంగా కనిపిస్తడో అంత పరమ దుర్మార్గుడు. మనోరమ తన ప్రాణాలను అడ్డుపెట్టి రవళి మానాన్ని కాపాడింది.


ఇప్పుడనిపిస్తోంది తనకి. అంత ఘోరంగా ప్రవర్తించడానికి తను ఎలా కారణం అయ్యాడు? తను ఎలా సిద్దపడ్డాడు?.. పాపం.. మనోరమ.. ఎంత సరదాని పంచింది. ఆడి పాడింది.. తన జీవితాన్ని ఇలా అర్పించింది. ఇలా ఎందుకు

దిగజారింది? అమె అలా దిగజారిందా? దిగ జార్చుకుందా? తాము దిగజార్చామా?..


రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఇలా తన జీవితాన్ని విస్తరిలా పరచినందుకు తనదీ తప్పే.. ఆ విస్తట్లో ఎవడు పడితే వాడు అందితే చెయ్యి కానీ, బెడ్డూ తీసుకోడమో, పంచుకోడమో చేసేవారు. వాడుకున్నారు. అందుబాటులో ఉంటే ఎవడు కన్నేయడూ? ఎవడు చవి చూడడూ? ఇది మానవ నైజం. అంతేనూ.


తప్పులేదా?.. అలా అని కాదు.. తప్పు తప్పే. ఏదో దొరుకుతుంటే ఉచితానుచితాలు ఆలోచించకుండా ఆ దారిలో వెళ్ళడమేనా? తాను కూడా తప్పు చేశాడు.. అతడు

మెదడంతా ఆలోచనలతో వేడెక్కిపోయింది.

మానసికంగా చాలా కృంగిపోయాడు.. రెండు రోజులకే చంద్రం.


సరిగా ఆ మరునాడు ఆదివారం కావడంతో యమున ని తీసుకుని వెన్నెల పోలీస్‌ స్టేషన్‌ కొచ్చింది. తన భర్త చంద్రంని పలకరించి, పరామర్శ చేసి, రావడానికి.


చంద్రంని చూసి రమ్మనమని యమున సలహా ఇచ్చింది వెన్నెలకు. అంతకు ముందు రోజు ఆఫీసులో.

"నేనా! తనని చూడడానికి వెళ్ళాలా? అసలు వెళ్ళను..” అన్నది.


“కాదు వెన్నూ!.. మనిషికి సుఖాల్లో ఉన్నప్పుడు పోయి ఎవరూ పలకరించనవసరం లేదు.. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించాలి. అదే నిజమైన ఆత్మీయత

అనిపించుకుంటుంది. అతను కట్టుకున్న మొగుడు కదా!” యమున నచ్చజెప్పింది.


"అతడి ఆత్మీయత నాకవసరం లేదే.. "


"తప్పు వెన్నూ!.. మనిషి లో మార్పు రావాలని కోరుకున్నావు కదా! కానీ అతడిని పూర్తిగా వదులుకోవాలని లేదనిని మొన్ననే అన్నావు కదా! అన్నావు నువ్వు - నీ వంతు

ప్రయత్నం కూడా నువ్వు చెయ్యాలిగా.. అతడిలో ఏ మాత్రం మార్పు వచ్చే అవకాశం వున్నా అది ఎంతో ప్రభావం చూపుతుంది. మన కృషి కూడా కలిసి వస్తుంది. అతను

నీ వాడవుతాడు. వెన్నూ.. ఒక సారి ఆలోచించు.. బ్లంట్‌ గా తోసిపుచ్చకు. నా మాట.. " యమున చెప్పింది అనునయంగా.


ఆ మాటలకి వెన్నెల ఆలోచనల్లో పడింది. “సరే.. నువ్వన్నట్టు వెళదాము.. కానీ తనను చూసి అవమానపరచడానికి వచ్చానని అనుకుంటే మాత్రం, నన్ను తిడితే నేను.. !” అనడిగింది వెన్నెల.


"అలా అనుకుటే మాత్రం ఇంక అతడిగురించి నువ్వు శాశ్వతంగా మరిచి పోవచ్చు.. అతడు మారడని అర్థం.. " గంభీర వదనంతో అన్నది యమున.


"సరే వెళదాము.. కానీ నువ్వు కూడా రావాలీ.. వస్తే.. ఏమౌతుందని భయం కాదు.. అతని ప్రవర్తన కూడా నువ్వు చూసిన దానవు అవుతావు "


“తప్పకుండా, నేనూ వస్తానూ.. రేపు ఉదయం వెళదాం..” యమున అన్నది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










65 views0 comments

Comments


bottom of page