top of page

తుర్రుపప్ప తుర్రుపప్ప ఎహెహె తుర్రుపప్ప


'Turrupappa Turrupappa Ehehe Turrupappa' New Telugu Story

Written By Nallabati Raghavendra Rao

'తుర్రుపప్ప తుర్రుపప్ప ఎహెహె తుర్రుపప్ప' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖరచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఆ ఊరు పేరు మహారాజ గోపాలపురం. బాగా డబ్బు ఉన్న చాలామంది ఆ ఊర్లో ఉన్నారు.


పచ్చని వరిచేలు, ప్రతి ఇంటి దొడ్డి ప్రాంతంలో పాలు సమృద్ధిగా ఇచ్చే ఆవులు, గేదెలు, ఊరంతా కళకళ లాడే పూలమొక్కలు. ఎక్కడపడితే అక్కడ ఏపుగా పెరిగే ఆకుకూరలు, కూరగాయల చెట్లు, రకరకాల పాదులు, ఊరంతా కొబ్బరి చెట్లు, చాలా దేవాలయాలు అందులో పూజలతో, హోమాలతో అలరారు తుంటుంది ఆ ఊరు.


ఆ ఊరిలో సత్యనారాయణ స్వామి గుడి పక్కగా ఆంజనేయ స్వామి గుడి వెనుక సాయిబాబా గుడి ప్రక్కన ఉన్న పెద్ద మండువా లోగిలి ఇల్లు వసుంధరమ్మగారిది. ఆమె ఆజానుబాహురాలు. తెల్లని శరీర ఛాయా గుండ్రని కళ్ళు ఉంగరాల జుట్టు. చూడడానికి దేవతామూర్తి విగ్రహంలా కనిపిస్తుంది.


ఆమెకు 80 ఏళ్ల వయసులో 90 ఏళ్ల ఆమె భర్త చక్ర మహీధరరావు కాలచక్రంలో కలిసిపోయాడు.


ఆమె అక్కలు, చెల్లెళ్లు అన్నలు తమ్ములు, చిన్నాన్నలు పెదనాన్నలు చాలా సుదూర ప్రాంతాల్లో ఉంటున్నారు.


కూతుర్లు ఎవరూ కలగని ఆమె ఒక్కగా నొక్క కొడుకు విజయబాబుని అల్లారుముద్దుగా చూసుకునేది.


విజయబాబు తన ఆస్తిపాస్తులు పుట్టబోయే తన కొడుకుకు మనవాళ్లు కు కూడా సరిపోయేటన్ని ఉన్నవి అని తెలిసినప్పటికీ..ఉద్యోగం చేయాలి అన్న ఉత్సా హంతో ఢిల్లీలో ఉద్యోగం చేయాలి అన్న మోజుతో అది సంపాదించి అక్కడ చేస్తున్నాడు గత 6 సంవత్సరాల నుండి.


ఇక్కడ పాడి పంటల పొలాల వ్యవహారాలు ఇంకా ఇంటికి సంబంధించిన మిగిలిన వ్యవహారాలు అన్ని 30 సంవత్సరాల నుంచి నమ్మినబంటుగా ఉన్న ఆంజనే యులు చూస్తున్నాడు.


విజయబాబు అతి కష్టం మీద సంవత్సరానికి ఒక్క సారి వచ్చి రెండే రెండు రోజులు ఉండి వెళ్ళిపోతుం టాడు అలా గత ఆరు సంవత్సరాల నుండి జరుగు తుంది. అతని వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితమే దగ్గర సంబంధం అమ్మా యితో పెళ్లి కూడా అయ్యింది.


ఒక అబ్బాయి పుట్టాడు. నాలుగో సంవత్సరం కాన్వెంట్లో చేర్చే వయసు. అయితే విజయబాబు ఎప్పుడు తల్లిని చూడడానికి వచ్చిన భార్యను బిడ్డను తీసుకొనిరాడు.


***

ఒక్కగా నొక్క కొడుకు విజయబాబు తనను చూడ డానికి వచ్చి ఇది రెండవ రోజు. సాయంత్రం తిరుగు ప్రయాణమై వెళ్ళబోతున్నకన్న కొడుకుకి పిండివంట తయారు చేస్తుంది వసుం ధరమ్మ. ఆమెకు వెనుకగా వచ్చి నిలబడ్డాడు ఆంజ నేయులు.


''అబ్బాయి విజయబాబు గారు వచ్చి రెండు రోజులు అయ్యింది. ఈ రెండు రోజులలో మిమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని నోరార పిలిచినట్టు నేను చూడలేదు మీకు బాధగా లేదా తల్లి'' అంటూ అడిగాడు.. అక్కడ ఉన్న వెండి సామాను తుడుస్తూ.


''ఆంజనేయులు అవన్నీ నీకెందుకురా పని చూసుకో” అంది ఆమె కొంచెం నర్మగర్భంగా.


''అదికాదమ్మా ఏడాదికి ఓ తూరి వస్తారు. ఉన్న రెండు రోజులలో ఒక్కసారయినా మిమ్మల్ని అమ్మ అని అంటారేమోనని ఆశగా నేను చూస్తుంటాను. నా ఆశ తీరడం లేదు. ప్రొద్దుట నుండి సందేళ దాకా రెండు మూడు మాటలు అతి బలవంతంగా మాట్లాడతారు. ఆ సెల్ ఫోన్ లోనే మిగిలిన టైం అంతా ఉంటారు. నాకు చాలా బాధగా ఉంది మీరు ఎలా తట్టుకుంటున్నా రమ్మా.'' అంటూ మళ్లీ అడిగాడు.


''ఒరేయ్ ఆంజనేయులు వాడికి 90 గొడవలు, సమ స్యలు, ఆలోచనలు ఢిల్లీలో ఉద్యోగం కదా మన సంతా అక్కడే ఉంటుంది. అయినా ఇదో పెద్ద సమస్యటరా. సంవత్సరానికి ఒకసారైనా వస్తున్నాడు కదా అది చాలు.'' అంది వసుంధరమ్మ కొడుకు మీద అతి ప్రేమతో.


''నాకేమీ నచ్చలేదమ్మా మీకు కూడా పెద్ద వయసు వచ్చింది కదా. ఈ ఆస్తిపాస్తులన్నీ చూసుకుంటూ తల్లి తో ఆనందంగా గడపవచ్చు కదా. మీ లోకమే వేరమ్మ. నా చిన్నప్పటినుండి మీ ఉప్పు పులుసు తింటున్న నేను రోజుకి 90 సార్లు అయినా మిమ్మల్ని అమ్మ అని పిలిస్తేనే కానీ ఉండలేను..అలాంటిది మీ కడుపులో నుంచి వచ్చిన మీ కొడుకు ఒక్కసారి కూడా కనీసం అమ్మ అని పిలకపోవడం బాగోలేదమ్మ'' అనుకుంటూ బాధగా బయటకు వెళ్ళిపోయాడు ఆంజనేయులు.

****

ఆంజనేయులు రాజమండ్రి రైల్వే స్టేషన్ వరకు వెళ్ల డానికి తన గిత్తల బండిని రెడీ చేసి సింహద్వారం ముందు ఉంచాడు.


''ఆంజనేయులు నాకు నీ బండి మీద వెళ్లడం ఇష్టం లేదు. మా ఫ్రెండు ని కారుతో రమ్మని ఏర్పాటు చేసు కున్నాను. కానీ నిన్నటి నుండి నువ్వు పట్టు పడుతు న్నావు. గంటల శబ్దం చాలా బాగుంటుందని, గిత్తలు చాలా స్పీడుగా పరుగు పెడతాయని ఏదేదో చెప్పి బలవంతం చేస్తున్నావు కనుక ఈ ఒక్కసారికి వస్తాను. అది కూడా ఎందుకో తెలుసా వీడియో తీసుకొని మా వాళ్ళందరికీ చూపించడానికి. ''


విజయబాబు అలా అంటుండగా ఆంజనేయులు రెండు బ్యాగులు తీసుకెళ్లి తప్పదు బాబు ఈసారి కి రండి అంటూ బండిలో పెడుతున్నాడు.


''నాయనా వెళ్తున్నావటరా మళ్లీ ఎప్పుడు వస్తావు బాబు'' అంటూ దగ్గరకు వచ్చి అడిగింది వసుంధరమ్మ''


''ఖాళీ అవ్వాలిగా'' ముక్తసరిగా చెప్పాడు విజయబాబు


''నీ భార్య, బాబును జాగ్రత్తగా చూసుకో బాబు'' అంది.


''నాకు తెలుసు కదా.. నేను వెళ్తాను'' అన్నాడు మళ్ళీ చిరాకుగా.


''ఆరోగ్యాలు జాగ్రత ఏ కొంచెం తేడా వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. '' అంది భుజం మీద చెయ్యి వెయ్యబోతు..


కొంచెం దూరంగా జరిగాడు విజయబాబు.


''టైముకు తినాలి రా...'''' ఇంకా ఇంకా ఏదో చెప్పబో తోంది వసుంధరమ్మ.


''చిన్నపల్లాడికి చెప్పినట్టు ఎందుకలా చెప్తావు లోపలికి వెళ్ళు'' అంటూ ముందుకు నడిచాడు విజయ్ బాబు.


దగ్గరే ఉండి ఇదంతా చూస్తున్న ఆంజనేయులు ఒక్క సారి వెనక్కు తిరిగి తన భుజం మీద తుండు గుడ్డతో రెండు కళ్ళు ఒత్తుకున్నాడు ఎవరికీ కనబడకుండా.


****


గిత్తల బండి రాజమండ్రి వైపు పరుగు పరుగున వెళుతుంది. ఆంజనేయులు బాధ మరచిపోయి చాలా సరదాగా బండి తోలుతున్నాడు.


''తుర్రు పప్ప తుర్రు పప్ప ఎ హెహె..

తుర్రు పప్ప తుర్రు పప్ప ఎ హెహె..''


అంటూ చాలా హడావిడి చేస్తూ విజయబాబుకు ఆనందం కలిగిస్తున్నాడు.


''ఆంజనేయులు.. ఢిల్లీలో చాలా హ్యాపీగా ఉంటుందోయ్.

ఈ పల్లెటూరి బతుకులు శుద్ధ దండగ''.. అన్నాడు చాలా సరదాగా విజయబాబు.


''అట్టాగా బాబు..'' అంటూ చిత్రంగా ఆలకించం మొదలెట్టాడు ఆంజనేయులు.


''నీకు తెలియదు కానీ అసలు ఈ ప్రపంచం చాలా మారిపోయింది. నీకు అర్థం కాని ప్రపంచం ఇది. ప్లాస్మా టీవీలు ఇంట ర్నెట్లు., రోబోట్ సిస్టం, వేల రకాల సెల్ ఫోన్లు, లాప్టాప్ లు, త్రిడి సినిమాలు, రకరకాల కార్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్..అబ్బా ఇదంతా వివరించి చెబితే నీ బుర్ర బద్దలై పోతుంది. మీ మట్టి బుర్రకు అర్థం కాదు.


అసలు అవన్నీ అనుభవించకుండా ఎప్పుడు చూసినా

''తుర్రు పప్ప తుర్రు పప్ప ఎ హెహె..

తుర్రు పప్ప తుర్రు పప్ప ఎ హెహె..''..

తప్పించి వేరే ప్రపంచం తెలియని మీ బ్రతుకులు అనవసరం. ఇలా ఎలా వేస్ట్ గా బ్రతికేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఢిల్లీ గురించి నీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి.


మళ్లీ ఎప్పుడో కానీ కలవం కదా. అక్కడ ఉంటే తెలివి తేటలు విపరీతంగా పెరుగుతాయి. అభివృద్ధి చెందు తున్న అన్ని రంగాల్లోముందు ఉండవచ్చు. ఒకపక్క షేర్లు వ్యాపారం మరోపక్క ఫ్లాట్స్ బిజినెస్. ఒక్క నెల లోనే కోటీశ్వరుడు కావచ్చు. అది చాలా స్పీడ్ ప్రపంచం ఇక్కడ ఈ పల్లెటూర్లో మీరు టీవీని రిమోట్ తో ఆన్ చేయడమే తెలియకుండా బ్రతికేస్తున్నారు. '' అంటూ

అలా అలా దారి పొడుగునా ఢిల్లీ గొప్పతనాలు ఇంకా చాలా చెప్తుండగా కాసేపటికి గిత్తల బండి రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరింది.


''బాబు మీరు ఎక్క వలసిన రైలు వచ్చి ఆగిందేమో చూసుకోండి. బేగి వెళ్ళండి'' కంగారు పెట్టాడు ఆంజ నేయులు.


''రాలేదు రా. ఐదు నిమిషాలు టైం ఉంది'' అంటూ ప్లాట్ఫారం సిమెంట్ బల్లమీద రెండు బ్యాగులతో కూర్చున్నాడు'.


ఆంజనేయులు విజయ బాబు ఎదురుగా నిలబడి చేతులు కట్టుకొని నెమ్మదిగా ఇలా అన్నాడు..


''బాబు చిన్నప్పటి నుంచి మీతో కలిసి పెరిగాను కదా. ఓ మాట చెప్పాలని ఉంది కోప్పడకండి. ఏం లేదు బాబు.. ఇప్పుడు కుర్ర కారు శానా మంది ఇస్పీడు యుగం మోజులో పడి అమ్మనినాన్నని ప్రేమగా నో రారా అమ్మానాన్న అని పిలవటమే మరిచిపోతున్నారు. ఆ...ఉ....అంటూ పొడి మాటలే. చదువుకునే కాలేజీల్లో కూడా మాస్టార్లు అమ్మని నాన్నని ప్రేమగా పిలవడం నేర్పే పాఠాలు కూడా చెబితే బాగుంటుంది.


ఢిల్లీలో చాలా చాలా ఉంటాయని చెప్పారు కంద. కూతంతా అర్థం అయింది బాబు..కానీ అక్కడ అమ్మని నాన్నని ప్రేమగా అమ్మానాన్న అని పిలుస్తూ అభి మానంగా, ప్రేమగా చూసుకొనడం నేర్పే ఇస్కూలు బళ్ళు ఏమన్నా ఉంటాయా బాబు..అలాంటివి ఎక్క డన్నా ఉన్నాయేమో కనుక్కొని అందులో మీ అబ్బాయి ఉన్నాడు కదా వాడిని చేర్చండి బాబు..పెద్దవాళ్లకు కూడా నేర్పే బళ్ళు ఉన్నట్లయితే ఖాళీ దొరికితే మీరు కూడా చేరండి బాబు. నేను వెళ్తాను''

అంటూ ఆంజనేయులు భుజం మీది తుండు గుడ్డను తీసుకొని కళ్ళు ఒత్తుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్లాట్ఫారం బయట ఉన్న తన గిత్తల బండి దగ్గరికి వెళ్ళిపోయాడు.


విజయబాబు ఎక్కవలసిన ట్రైన్ వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది.


అప్పుడే అనుకోకుండా హోరున వర్షం కూడా మొద లైంది. ట్రైన్ ఎక్కవలసిన వాళ్లు గబగబా ఎక్కేస్తు న్నారు. రెండు నిమిషాలు ఆగి గట్టిగా కూత వేసు కుంటూ ట్రైన్ స్పీడుగా వెళ్లిపోయింది.


ప్లాట్ ఫారం మీద కూర్చున్న విజయబాబుకు ఆంజ నేయులు మాటలతో జ్ఞానోదయం అయింది. అతనికి తను ఎక్కవలసిన ట్రైన్ వెళ్ళిపోతున్నప్పటికి ఎక్క బుద్ధి కాలేదు..ఇప్పుడు అతని కళ్ళల్లోంచి నీళ్లు ధారా పాతంగా కారుతున్నాయి.


బ్యాగులు పట్టుకొని ప్లాట్ ఫారం నుండి బయటికి వచ్చే సాడు విజయబాబు. దూరంగా ఆంజనేయులు గిత్త లకు మేత పెట్టి బండిని సిద్ధం చేసి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు చూశాడు..


''ఆంజనేయులు.. ఆగు. నేను ఇంటికి వచ్చేస్తున్నాను'' అంటూ గట్టిగా పిలిచాడు విజయబాబు.


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు

48 views2 comments

2 Comments


Like

YKVK • 1 hour ago

మనసున్న వారికిది మంచి కథ

Like
bottom of page