Bhallamudi Nagaraju
writer
Profile
About
భళ్లమూడి నాగరాజు ఒడిశా రాష్ట్రం రాయగడ కు చెందిన కవి ,రచయిత . వీరు విజయనగరం జిల్లా బొబ్బిలి లో 1962 లో జన్మించి విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేశారు.బొబ్బిలి రాజా ఆర్ ఎస్ ఆర్ కే రంగారవు కళాశాలలో చదువుతున్న సమయం లోనే కళాశాల వార్షిక సంచిక కోసం తొలి “యు వతా మేలుకో”కవిత రాయగా,వార్షిక సంచికలో ప్రచురితం అయింది . ఉద్యోగ రీత్యా 1987 నుంచి రాయగడ లో ఉంటున్న వీరు స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ, రాయగడ రచయితల సంఘం వంటి సంస్థల్లో కీలక సభ్యులు గా ఉన్నారు. ఇప్పటివరకూ 37 కథలు వివిధ వార, మాసపత్రికల్లో ప్రచురితం అయ్యాయి. బామ్మ మనసు, సుబ్బారావు పెళ్లి ,విజిటింగ్ కార్డు కథలు మంచి గుర్తింపు తెచ్చాయి.పలు కవితలు ,వ్యాసరచనల పోటీల్లో బహుమతులు పొందారు. 118 కవితలు దిన ,వార ,మాస ,వెబ్ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.వీరిని గురజాడ ఫౌండేషన్ (అమెరికా)రాయగడ శాఖ వారు “సాహితీరత్న” అవార్డు తో సత్కరించారు. కవి, రచయిత గానే కాక వీరు నటుడు గా గుర్తింపు పొందారు. 2017 లో విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియం లో జరిగిన నంది నాటకోత్సవాల్లో నటించి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే ప్రశంసాపత్రం అందుకున్నారు.
భళ్లమూడి నాగరాజు,
కవి ,రచయిత ,
రాయగడ
