top of page

Profile

Join date: 29, డిసెం 2024

About

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Overview

First Name
Madhu Nivrithi
Last Name
P. V. Padmavathi
e mail
pvmadhu39@gmail.com

Posts (54)

30, ఏప్రి 202510 min
తేలికైన విద్యా విధానం
తేలికైన - సమర్థవంతమైన - ప్రయోజనకరమైన - విద్యా విధానం  (25 సూచనలు - అభిప్రాయాలు - ఉపాయాలు - పరిష్కారాలు) Telikaina Vidya Vidhanam - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 30/04/2025 తేలికైన విద్యా విధానం - తెలుగు వ్యాసం రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి

18
0
3
28, ఏప్రి 20257 min
కృతిమ అవయవాలు - వైద్య పరికరాలు
Krutrima Avayavalu - Vaidya Parikaralu - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 28/04/2025 కృతిమ అవయవాలు - వైద్య పరికరాలు - తెలుగు వ్యాసం రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి

35
0
3
26, ఏప్రి 20257 min
నరకాపురంలో వార్తలు..
Narakapuramlo Varthalu - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 26/04/2025 నరకాపురంలో వార్తలు - తెలుగు కథ రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి

21
0
3
P. V. Padmavathi Madhu Nivrithi

P. V. Padmavathi Madhu Nivrithi

Writer
More actions
bottom of page