Profile
About
నా పేరు శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు,M.A.
ఓ మంచి తెలుగు సాహిత్యాభిమానిని. నిరంతరమూ సాహిత్యాన్ని అధ్యనం చేయడమంటే చాలా ఇష్టం. రాయడం కన్నా, చదవడానికే ఎక్కువగా ఇష్టపడతాను.
నా మొట్టమొదటి కథ 'సామాజిక స్పృహ' ఆంధ్రభూమిలో ముద్రితమైంది.
నా కథలు ఆంధ్రభూమి తదితర వార, మాస పత్రికలపాటు, మొన్న ఈనాడు ఆదివారం అనుబంధం అనుబంధంలో నా కథ 'స్నేహితుడు' ముద్రితమైంది. అలాగే బాలమిత్ర, బుజ్జాయి, బాలభారతం, ఆటవిడుపు పిల్లల పత్రికల్లో కథలన్నీ కలిపి ఓ అరవై రచనలు దాకా ప్రచురింపబడ్డాయి.
'విశాఖ రచయితల సంఘం' ఆధ్వర్యంలో వెలువడిన "విశాఖ కథా తరంగాలు" కథా సంకలంలో నా కథ 'అమ్మ' ముద్రితమైంది. ప్రముఖ సాహితీ మాసపత్రిక 'సాహో' సంపాదకులు శ్రీ ఇందూ రమణగారి నేతృత్వంలో వెలువడిన "ప్రియమైన రచయితలు'వాట్సప్ సాహితీ సమూహంతో విడుదలైన 'నూరుకథలు' సంకలనంలో నా కథ స్థానం సంపాదించుకుంది. అలాగే ప్రసన్నబారతి వాట్సప్ కథల పోటీల్లో నా కథ 'జీవనవేదం' బహుమతితో పాటూ సంకలనంలో చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో వచ్చిన సహరి క్రైమ్ కథల పోటీల్లోనూ, 'ప్రసన్నభారతి- ఓసారి చూడండి అంతే'వారి వాట్సప్ కథల పోటీల్లోనూ, డా. రామశర్మ సౌజన్యంతో జరిగిన హాస్యానందంవారి హాస్యకథల పోటీల్లోనూ, సాలూరు మిత్రబృందం మరియు బి.ఎస్.ఎన్.మూర్తి స్మారకార్ధం నిర్వహించిన కథల పోటీల్లోనూ, 'సుమతి' అంతర్జాల మాసపత్రికవారి కథల పోటీల్లోనూ నా కథలకు బహుమతులు వచ్చాయి.
నా సాహితీమిత్రులు శ్రీయుతులు కాండ్రేగుల శ్రీనివాసరావు, శ్రీచరణ్ మిత్ర మరియు నంద త్రినాథరావు, కోరికాన అనంద్ మరియు కోరాడ నరసింహారావుగార్లు!