top of page

ఆంజనేయ మహాకాయ

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆంజనేయమహాకాయ, #AnjaneyaMahakaya


Anjaneya Mahakaya - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 06/06/2025

ఆంజనేయ మహాకాయ - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


అంజనీ దేవి, పవన  

సుతుడు ఆంజనేయుడు

రక్కసుల పాలిటీ 

రణరంగ శూరుడు 

బాల్యం లో నే భాస్కరుని 

పండనుకుని ముద్దాడిన థీశాలి 

తన కర్తవ్యం తెలుసు

కొన చేసెను ధ్యానం


చేయాలి రామునకు సేవ 

యని చేరెను హనుమ

శ్రీరాముని శీఘ్రముగా  కలిసి

 సీతాదేవిని కనుగొన ఆనవాలు తో 

వాయు వేగమునలంకను చేరి

మహా పతివ్రత సీతా దేవి

కనుగొన్న సూక్ష్మ శరీ రుడు 


విశాల వృక్ష వాటిక లో  

అశోక వృక్ష చెట్టు నీడలో , 

మనసులోరామునితలుస్తూ ,

రావణుని సంహరించి తనను  ఎప్పుడు వచ్చి తీసుకుపోతాడో 

నని ఎదురుచూస్తూ న్న సీత అనుమానిoచగా 


"రాముడు ప్రేమిస్తున్నది ఈమెనే.

సీతను కనుగొన్నo దుకు సంతసించి,

హనుమంతుడు ఆనందాశృవులను రాల్చి రాముని అనవాల్లిచ్చే చూడామణి తీసుకుని

లంకా దహనం చేసిన శూరుడు


రామ రావణ యుద్ధం లో  

లక్ష్మణ మూర్ఛ పోగా

దిక్కులకు సంజీవిని 

తెచ్చిన ధీరుడు

అక్కజ మైనట్టి ఆకారుడు

మహా కాయ ఆంజనేయా!

***

-యశోద గొట్టిపర్తి





Comments


bottom of page