top of page

ఆత్మ ఘోష


'Athma Ghosha' New Telugu Story

Written By Pitta Gopi

'ఆత్మ ఘోష' తెలుగు కథ

రచన: పిట్ట గోపి(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

వేకువ ఝామున గాలులు, మెరుపులతో.. ఒక్కసారిగా భయంకరమైన వాతావరణం నెలకొంది.


ఆ మెరుపులు మధ్య నుండి చాలిచాలని ఒక రెండు గదుల ఇంట్లో రెండు సోఫాలకు మధ్యలో యమభటులు ప్రత్యేక్షమయి విక్రం ఆత్మని నిద్రలేపినట్లు లేపారు.


విక్రం లేస్తూ.. ఒక్కసారిగా గావుకేక పెట్టి "ఎవరు మీరు" అని అడిగాడు.


"యమభటులం " అన్నారు వాళ్ళు.


"ఏంటి.. నేను చచ్చిపోయాననుకున్నారా.. పొరపాటున వచ్చారేమో.. చూడండి" అంటాడు విక్రమ్.


"యముడు కానీ, యమ భటులు కానీ పొరపాటు పడ”రంటు లాక్కెళ్తుంటారు భటులు. అప్పుడు చనిపోయానని అర్థం చేసుకున్న విక్రం తెగ బాధ పడుతుంటాడు.


ముందు భటులను తన శవం వద్దకు తీసుకెళ్ళండని బ్రతిమాలుతాడు.


ఇంతలో తెల్లారుతుంది. తన శరీరాన్ని చూడ్డానికి భటులతో వచ్చిన విక్రం కి మరో షాక్..

భార్యకు తెలియకుండా వేరే అమ్మాయి రాధతో కాపురం కొనసాగించాడు విక్రమ్.


తన స్నేహితుడు పురుషోత్తం భుజం పై రాధ చెయ్యి వేసి

"వీడు 35 ఏళ్ళకే చచ్చాడు. త్వరగా వాడి ఇంటికి పంపేయ్ డెడ్ బాడిని" అంటూ విక్రమ్ జేబులో ఉన్న డబ్బులు తీసుకుని తన జాకట్ లో పెడుతుంది.


అది చూసిన విక్రంకి తన కుటుంబం గుర్తొస్తుంది. తలదించుకుని బయటకు వెళ్తాడు. అది చూసి జాలిపడి భటులు మెల్లగా విక్రమ్ ఆత్మని అనుసరిస్తారు.


కొండ పైకి చేరుకుంటారు.


"మా దగ్గర ఉన్న సమాచారం మేరకు నువ్వు తప్పు చేశావ్.. అందుకే యమదర్మరాజు నిన్ను తీసుకు రమ్మన్నారు" అంటాడు భటుడు.


"తప్పు కాదు భటులారా.. చాలా పెద్ద తప్పు చేశా" అంటాడు విక్రమ్.


"కన్నవాళ్ళ కష్టంతో పెరిగి,పెద్ద ఉద్యోగం సాదించి ఉద్యోగం, బిజీ పేరుతో బార్యని, పిల్లలను కూడా కన్నవాళ్ళు దగ్గర ఉంచి, ఉద్యోగం చేసే చోట కొత్తగా పరిచయం అయిన అమ్మాయి తో చక్కగా కాలం గడిపాను.


నాకు ఏమైనా అయితే నా అనేవారే ముందు బాదపడతారని అలాంటి వారు ఎంత ఫోన్ చేసి.. నన్ను చూడాలని ఉందని, నన్ను రమ్మని, లేకపోతే తమను అక్కడికి తీసుకెళ్ళండని ఎంతో వేడుకున్నారు. అయినా అక్రమ కొంపలో పడి నా వాళ్ళని నేను మిస్స్ అయ్యాను. " అంటూ..

"నన్నుఒక్కసారి నా కుటుంబం దగ్గరకు తీసుకెళ్ళండని" అంటాడు.


భటులు విక్రమ్ ని అర్థం చేసుకుని మరుక్షణం ఇంటిముందు ఉంచుతారు.


తన శవం ఇంటికి చేరుకుంది. తన కుటుంబం ఆర్తనాదాలు చూస్తూ విక్రమ్ ఆత్మ కుమిలికుమిలి ఏడుస్తుంది. చివరిగా తన వాళ్ళతో జరిగిన సంభాషణలు గుర్తు చేసుకున్నాడు.


డ్యూటీ నుంచి వచ్చాక ఒకసారి తండ్రి ఆవేశంతో..

"ఆగరా ఆగు.. అసలు నీకు కుటుంబం ఉందనుకునే వచ్చావా.. కష్టపడి పెంచాము.. మేము గుర్తుకు రాలేదు సరే.. భార్యాపిల్లలు కూడా గుర్తు లేరా నీకు"

"నాన్న.. పిచ్చి పిచ్చి గా మాట్లాడకు. మీ కోసమే కదా కష్టపడి ఉద్యోగం చేస్తుంది " అంటాడు విక్రమ్.


"మా కోసమే అయితే ఏది.. నువ్వు సంపాదించిన డబ్బు? చూపించు".. అడిగాడు తండ్రి.


కోపంతో "హే.. చూపించాల్సిన అవసరం నాకు లేదు. అయినా నువ్వు ఎవడివి నాకు చెప్పేది"


ఇంతలో తల్లి కలుగజేసుకుని "ఒరేయ్ ఏంట్రా ఆ మాటలు” అంటుంది.


"చూడండి.. నాకు ఎదురు చెప్పేవాళ్ళు అయితే మర్యాదగా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఇంకోసారి నా గూర్చి పిచ్చి గా వాగితే".. అని తండ్రికి చెయ్యి చూపించి లోపలికి వెళ్తాడు.

డ్యూటీ కి బయలుదేరుతున్న క్షణంలో


"మమ్మల్ని కూడా తీసుకెళ్తే బావున్ను కదండి.. మీరు అక్కడ, మేము ఇక్కడ.. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అనే వస్తుంది. ఎలాగో ఫోన్ రింగ్ చేశారు అనుకుంటే.. ఇంతలోనే ఆఫీసు పని ఎక్కువ ఉందని ఆపేస్తారు".. అని భార్య అడుగుతుంది.


"ఈ సారీ అలా జరగదు బంగారం.. మళ్ళీ వచ్చి తీసుకెళ్తా " అని చెప్తాడు.


తల్లిదండ్రులకు కనీసం చెప్పకుండా బయలుదేరుతాడు.

అలా చివరిగా ఇంటి నుంచి బయలుదేరిన విషయం భటులతో చెప్పి రోదిస్తాడు విక్రమ్.


మరలా..


"అంతేనా.. ఉద్యోగం లో ఉండగా నా భార్య నా యేగక్షేమాలు గూర్చి లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసింది. పిల్లల చదువుల కోసం నా తల్లిదండ్రుల డబ్బులు చాలటం లేదని, డబ్బులు పంపండని అడిగింది. జీతం రావటానికి ఆలస్యం అవుతుంది అని, రెంట్ కూడా కట్టలేదని, త్వరలోనే పంపిస్తానని ఏదో చెప్పేసేవాడిని"


"నా పిల్లలతో గడపలేదు, నా బార్య ఆశలను నెరవేర్చలేదు.

నా తల్లి మాట వినలేదు. అన్నీంటికి మించి కాయా కష్టం చేసుకుని పెంచి ఈ స్థాయి కి తెచ్చిన నా తండ్రిని అన్న మాటలు బాధిస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే.. నా తండ్రి పాదాల పై పడి, ఒక చెంపదెబ్బ తిని క్షమించమని వేడుకుని వస్తా”నని భటులను వేడుకుంటాడు.

"అలా కుదర”దని భటులు అంటారు.


"నా పాపాలకు భగవంతుడే కారణం" అని నిందిస్తాడు విక్రమ్.


"నువ్వు ఇప్పటికే పెద్ద పాపాలు చేశావ్.. భగవంతుడిని నిందిస్తు తప్పు చేయకు. నీకు భగవంతుడు బతకటానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు" అని ఒక భటుడు చెప్తాడు.


"నువ్వు మాత్రం పరాయి ఆడదాని మోజులో పడి నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావ్. నువ్వు నమ్మిన ఆ ఆడదే నిన్ను ఆహరం లో విషం కలిపి చంపింది"


"పాపాలు చేయమని నీకు భగవంతుడు రాత రాయడు. మంచి జీవితం అనుభవించు అని రాశాడు. నువ్వు దానిని నాశనం చేసుకున్నావు. పద పదా.. " అని తొందర పెడతాడు మరో భటుడు.


వెళ్తూ వెళ్తూ.. కిందకి చూసిన విక్రమ్ తాను ఎంత తిట్టినా.. చెయ్యి ఎత్తినా..

తనపై ప్రేమతో కుమిలిపోతు అంతిమ సంస్కారాలు చేస్తున్న తన తండ్రి కి ఎలా క్షమాపణ చెప్పాలో తెలియక చేతులు జోడిస్తూ.. యమభటులు వెంట నడిచి వెళ్ళాడు.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.
74 views0 comments

Comments


bottom of page