top of page

ఇల్లు అద్దెకు ఇవ్వబడును

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link


'Illu Addeku Ivvabadunu' New Telugu Story




(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అది ఆరు ఫ్లాట్స్ కలిగిన అపార్ట్మెంట్. మంచి డిమాండ్ వున్న ఏరియా లో వుంది. అందులో ఒక ఫ్లాట్ అమెరికాలో వున్న ప్రవీణ్ ది. దాని బాధ్యతలని హైదరాబాద్ లో వున్న మామగారు కుమార్ కి అప్పగించారు. రెంట్ కి యివ్వడం, రిపేర్స్ వుంటే చూడటం కుమార్ పని. పక్క ఫ్లాట్ లో వున్న రాజేష్ కి మా ఫ్లాట్ కూడా చూసుకోమని చెప్పి, కుమార్ రెంట్ పడిందో లేదో చూసుకునే పని పెట్టుకున్నాడు.


కరోనా టైం లో ఖాళీ అయిన ఫ్లాట్ కరోనా తగ్గిన చాలా రోజులకి ఒక బిజినెస్ మ్యాన్ కి యిచ్చి, అమ్మయ్య అనుకున్నాడు. మొదటి నెల నుంచే అద్దె యివ్వడం లేట్ చేయడం, ఆలస్యం కి ఏదో కారణం చెప్పడం మొదలుపెట్టాడు టెనంట్.


ప్రతీ నెలా అడుకుంటే గాని అద్దె రావటం లేదు. అమెరికా నుంచి కూతురు 'అటువంటి వాడికి ఎలా యిచ్చారు డాడీ, ఇల్లు కదలకుండా ఎవడికి పడితే వాళ్ళకి యిస్తే యింతే', అంటూ నిష్ట్ఠురం గా మాట్లాడటం తో, అద్దెకు వున్న అతనికి నోటీసు యిచ్చి ఖాళీ చేయమని చెప్పి, మళ్ళీ అద్దెకు ఇవ్వబడును బోర్డు తగిలించాడు.


బోర్డు పెట్టిన రోజు నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువ అయిపోయాయి. రాజేష్ వచ్చిన వాళ్ళకి చూపించడం, చూసిన వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పడం, రాకపోవడం..


మొత్తానికి ఒక ఆదివారం, ఒకళ్ళు ఇల్లు చూసి, కుమార్ కి ఫోన్ చేసి ఇల్లు నచ్చింది మాకు, మీ అడ్రస్ యిస్తే వచ్చి వివరాలు మాట్లాడి అడ్వాన్స్ యిస్తామని చెప్పారు.


మొత్తానికి ఎవరో తీసుకుంటామని ముందుకు వచ్చారు అనుకుని, వాళ్ళని రమ్మన్నాడు కుమార్.


ఒక గంట తరువాత కారులో నుంచి యిద్దరు ఆడవాళ్లు, ఒక మొగతను దిగి లోపల కి వచ్చి కూర్చున్నారు.


"మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ వివరాలు చెప్పండి" అన్నాడు కుమార్.


ఆ వచ్చిన అతను ఒక స్త్రీ ని చూపించి, "ఈవిడ నా భార్య, రెండవ ఆమె నా చెల్లెలు. నేను అమెజాన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని" అన్నాడు.


"మేము మా ఇల్లు ఫ్యామిలీ కే యిస్తాము. మీరు ఫ్యామిలీ కాబట్టి మీకు యివ్వడానికి యిబ్బంది లేదు. అద్దె ప్రతీ నెల 5 వ తేది కి యివ్వాలి. లేట్ చేయడానికి వీలులేదు" అని చెప్పాడు కుమార్.


వాళ్ళు కుమార్ చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకుని, అడ్వాన్స్ యిచ్చి, "ఫస్ట్ కి వచ్చి జాయిన్ అవుతాము. ఇల్లు క్లీన్ చేయించండి" అని చెప్పి వెళ్లిపోయారు.


వాళ్ళు వెళ్లిన ఒక అర గంటకి, ఒకతను ఫోన్ చేసి, "కుమార్ గారితో మాట్లాడాలి" అన్నాడు.


"చెప్పండి నేనే,, మీరెవ్వరు?" అన్నాడు కుమార్.

"అయ్యా! నేను ప్రాపర్టీ ఏజెంట్ ని. మీ ఇల్లు చూపించి ముగ్గురు ని మీ దగ్గరికి పంపించాను, వాళ్ళు వచ్చారా?" అని ఆడిగాడు.


"అవును. ఫ్యామిలీ అని చెప్పి, ముగ్గురు వచ్చారు. అడ్వాన్స్ కూడా యిచ్చారు" అన్నాడు.


"నేను పంపిన వాళ్ళు ఫ్యామిలీ కాదు సార్, బ్యాచలర్స్. యిద్దరు ఆడవాళ్లు, ఒక మొగతను" అన్నాడు.


"కొంప ముంచారు! వాళ్ళు నాతో ఫ్యామిలీ అని చెప్పి అడ్వాన్స్ యిచ్చారు. అయినా నీకు వుండొద్దూ.. ఎక్కడైనా యిద్దరు ఆడపిల్లలు, ఒక మగాడు ఎలా ఉంటారని పంపించావు? ఫోన్ పెట్టేసేయ్. వాళ్ళతో మాట్లాడి వాళ్ల అడ్వాన్స్ వాపస్ యిస్తాను. మేము ఇల్లు బ్యాచలర్స్ కి ఇవ్వం" అని ఫోన్ పెట్టేసాడు.


అడ్వాన్స్ యిచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి, అర్జెంటు గా రమ్మని పిలిచాడు కుమార్.


ఏమైందో అనుకుని ఆ యిద్దరు ఆడవాళ్లు, అతను వచ్చి "ఏమైంది సార్ పిలిచారు.. డబ్బు సరిగ్గానే వుందిగా" అన్నారు.


"వన్ మినిట్.." అంటూ కుమార్ లోపలికి వెళ్లి, వాళ్ళు యిచ్చిన అడ్వాన్స్ తీసుకొని వచ్చి, "యిదిగో మీ డబ్బు, మా ఫ్లాట్ బ్యాచిలర్స్ కి ఇవ్వం, మీరు ఫ్యామిలీ అని అబద్దం చెప్పడం బాగోలేదు" అన్నాడు.


దానితో అందులో ఒక అమ్మాయి, "ఎవరైతే మీకు ఏమిటండి, మీకు కావలిసింది రెంట్ సరిగ్గా యివ్వడం. యింత చాదస్తం గా వుంటే ఇల్లు ఖాళీ గా వుంచుకోవాలి" అంటూ బయటకు నడిచారు.


యింకొంత సమయానికి ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి, "మీ ఫ్లాట్ చూసాను, మా హాస్పిటల్ కి దగ్గరగా వుంది. మీరు యిస్తామంటే, అడ్వాన్స్ యిస్తాము" అని అంది.


సరే.. మళ్ళీ వాళ్ళకి కండిషన్స్ అన్నీ చెప్పి, వాళ్ళు ఒప్పుకున్న తరువాత అడ్వాన్స్ ని గూగుల్ పే చేయమని చెప్పి, ఎందుకైనా మంచిది, ఒకసారి స్వయంగా కలిసి మాట్లాడి అప్పుడు అడ్వాన్స్ తీసుకుంటానని చెప్పి, వాళ్ల హాస్పిటల్ కి వెళ్ళాడు కుమార్.


కొండాపూర్ లో పెద్ద హాస్పిటల్ లో మొగుడు, పెళ్ళాం యిద్దరూ డాక్టర్స్. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. చాలా మర్యాదగా మాట్లాడి అడ్వాన్స్ క్యాష్ యిచ్చి, డిసెంబర్ ఫస్ట్ నుంచి వచ్చి ఫ్లాట్ లో జాయిన్ అవుతాము అని చెప్పారు డాక్టర్స్ ఇద్దరు. అడ్వాన్స్ తీసుకుని, పోనీలే మంచి టెనంట్ దొరికాడు అనుకుని, ఈ విషయం రాజేష్ కి చెప్పి 'బోర్డు తీసివేయండి' అన్నాడు కుమార్.


"అయ్యో అంకుల్! పదినిమిషాల క్రితం ఒక బ్యాంకు ఆఫీసర్ వచ్చి ఇల్లు నచ్చింది అని, వాళ్ల అబ్బాయి ని ఇక్కడకి దగ్గర లో వున్న స్కూల్ లో చేరిపించాం అని, అడ్వాన్స్ యిచ్చి వెళ్ళాడు. యిప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటే మీరే ఫోన్ చేసారు. యిప్పుడు ఎలా అంకుల్?" అన్నాడు రాజేష్.


"చచ్చాము, యిప్పుడు ఎలా? నేను అడ్వాన్స్ తీసుకున్నది డాక్టర్స్ దగ్గర. రేపు ఎప్పుడైనా ఉపయోగపడతారు. బ్యాంకు అతనికి ఫోన్ చేసి సారీ చెప్పి, అడ్వాన్స్ వెనక్కి యిచ్చేద్దాం" అన్నాడు కుమార్.

"సరే అంకుల్, మీరు కూడా రండి ఇక్కడకి, వాళ్లని పిలిపించి సర్ది చెప్పి డబ్బు తిరిగి యిచ్చేద్దాం" అన్నాడు రాజేష్.


ట్రాఫిక్ ని తప్పించుకుని, రాజేష్ దగ్గరికి చేరేసరికి గంట పట్టింది. రాజేష్, కుమార్ ని చూడగానే, "రండి అంకుల్, వీళ్ళే ఆ బ్యాంకు ఆఫీసర్ మనుషులు. వాళ్ళకి జరిగిన సంగతి చెప్పి, డబ్బు తీసుకుని వెళ్ళమన్నాను. ఒక్క నిమిషం డబ్బు తెస్తాను" అంటూ లోపలికి వెళ్తున్న రాజేష్ వెంటే కుమార్ కూడా వెళ్లి, "రాజేష్, ఆ వచ్చిన వాళ్ళని చూస్తోవుంటే, ఎవరో బ్రోకర్స్ లాగా వున్నారు. అడ్వాన్స్ తీసుకుంది వీళ్ళదగ్గర నుంచేనా?" అన్నాడు.


"లేదు అంకుల్! ఆ బ్యాంకు ఆఫీసర్ నుంచి తీసుకున్నాను. ఆయన కి ఫోన్ చేసి, ఇల్లు వేరే వాళ్ళకి యిచ్చేసారుట, వచ్చి అడ్వాన్స్ తీసుకొని వెళ్ళండి అని అంటే, అతను బ్యాంకు లో బిజీ గా వున్నాను, నా స్టాఫ్ కి మీరు యిచ్చిన రిసీట్ యిచ్చి పంపుతాను, డబ్బు వాళ్ళకి ఇమ్మన్నాడు" అన్నాడు రాజేష్.


"సరే కానీ, ముందు వాళ్ళని వదులుచుకుని, ఆ 'ఇల్లు అద్దెకు' అనే బోర్డు తీసేయాలి. లేకపోతే మళ్ళీ ఎవరు వస్తారో" అన్నాడు కుమార్.


డబ్బు తీసుకుని, రాజేష్ యిచ్చిన రసీదు యిచ్చేసి, వేగంగా వెళ్లిపోయారు ఆ ఇద్దరు.



నవంబర్ 30 వ తేది, ఉదయం వాకింగ్ చేస్తో వుండగా, రాజేష్ నుంచి ఫోన్ రావడం, అతను కంగారు పడుతూ, "అంకుల్! ఆ రోజు మనం బ్యాంకు ఆఫీసర్ మనుషులకి అడ్వాన్స్ వాపస్ యిచ్చేసాం కదా. యిప్పుడు ఆ బ్యాంకు ఆఫీసర్ వచ్చి, రేపు మార్నింగ్ సామాన్లు తీసుకొని వచ్చి ఫ్లాట్ లో చేరతాను. తాళం చెవులు ఇమ్మంటున్నాడు. మీరు ఒకసారి అర్జెంటు గా రండి అంకుల్" అని పిలిచాడు కుమార్ ని.



కుమార్ వెంటనే బయలుదేరి వెళ్లేసరికి రాజేష్ తో ఒక లావుపాటి మనిషి ఆవేశం గా మాట్లాడుతున్నాడు.

కుమార్ "హలో.. ఈ ఫ్లాట్ మాది. నీతో మాట్లాడి, మీ మనుషులు కా అడ్వాన్స్ తిరిగి యిచ్చేసాము. మేము యిచ్చిన రసీదు కూడా యిచ్చేసారు వాళ్ళు" అన్నాడు కుమార్.


"నేను ఎవ్వరిని పంపలేదు, మీరు యిచ్చిన రసీదు యిదిగో" అంటూ జేబులోనుంచి రసీదు తీసి చూపించాడు.


"అదేంటి.. నా రసీదు నాకు యిచ్చి అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నారు. వుండండి ఆ రసీదు చూపిస్తా" అని లోపలకి వెళ్లి రసీదు తెచ్చి చూపించాడు రాజేష్.


"సరిగ్గా చూడు రాజేష్. అది నీ సంతకమేనా?" అన్నాడు కుమార్.

అప్పుడు సంతకం చూసి "అరే.. యిది నాది కాదే! మోసం.." అని అరిచాడు రాజేష్.

ఇంతలో కుమార్ అడ్వాన్స్ తీసుకున్న డాక్టర్ గారు కూడా వచ్చారు కీస్ తీసుకోవడానికి.

ఆవిడ అంతా విని బయటకు వచ్చి కొండాపూర్ పోలీసులకి ఫోన్ చేయడం, అయిదు నిమిషాలలో పోలీస్ వ్యాన్ వచ్చి ఆగటం జరిగింది. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్, డాక్టర్ గారికి బాగా తెలిసిన వాడు అవడం తో, ఆ వచ్చిన బ్యాంకు ఆఫీసర్ ఫోన్ తీసుకొని రాజేష్ ఫోన్ చేసాడా లేదా check చేసి, అతని ఐడి కార్డు ఆడిగాడు.


దానితో అతను కంగారు పడి లేచి వెళ్ళిపోతోవుంటే అతనిని ఆపి తనతో వచ్చిన పోలీసులకి అప్పగించి, "ఈ మధ్య యిటువంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి డాక్టర్ గారు. వీళ్ళు ఒక ముఠా లాగా చేరి, అద్దెకు వున్న యజమాని ని మోసం చేసి దొంగ రసీదులతో డబ్బులు వసూళ్లు చేసుకుంటారు. వీడి సంగతి నేను చూసుకుంటా. అవసరం అయితే రసీదు యిచ్చిన వాళ్ళు స్టేషన్ కి రావలిసి వుంటుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్.


'బాబోయ్ ఎంత మోసం!..' అనుకుని, డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి, కీస్ యిచ్చి పంపించేసాక, "ఇదేమిటి రాజేష్..మా ఫ్లాట్ కి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? తాగుబోతు ని వదుల్చుకుంటే, యిప్పుడు ఈ మోసగాడు తయారు అయ్యాడు. అదివరకు ఎవరో అన్నట్టుగా తెలివి తక్కువ వాడు ఇల్లు కొంటాడు, తెలివైన వాడు అందుట్లో అద్దె కు వుంటాడని" అన్నాడు కుమార్.


"నిజమే అంకుల్! కానీ అందరూ మోసగాళ్లు వుండరు. మనమే జాగ్రత్త గా వుండాలి అన్నాడు రాజేష్.

శుభo

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



109 views0 comments
bottom of page