ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు మరియు కథల పోటీలు


Ugadi Novel And Story Competition By manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ వారి ధారావాహిక నవలలు

మరియు కథల పోటీలు





విషయ సూచిక

1. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు

2. ఉగాది 2023 కథల పోటీలు

3. ఉగాది 2023 జోక్స్ పోటీలు

4. విజయదశమి కథల పోటీ ఫలితాలు

5. ప్రముఖ రచయిత ( Popular Writer ) పోటీ ఫలితాలు

6. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

7. రచయితలకు సన్మానం



1. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు


ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-


ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-


మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.


నిబంధనలు :


*సీరియల్ నవల కనీసం పది భాగాలుగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు.


*ప్రతి భాగంలో సుమారు 8౦౦ పదాలు ఉండాలి.


*వారానికి ఒక ఎపిసోడ్ ప్రచురింపబడుతుంది.


*మొత్తం నవల ఒకేసారి పంపాలి.


*రచయితలు తామే ఎన్ని వారాలు ప్రచురించాలనుకుంటున్నారో అన్ని భాగాలుగా విభజించి పంపాలి.


*మరుసటి భాగం కోసం పాఠకులు ఎదురు చూసేలా రాయాలి.


*సీరియల్ నవలలు పంపాల్సిన చివరి తేదీ 31 /12/2022.


*కాపీ నవలలు, ఇదివరకే ప్రచురింపబడ్డ నవలలు, అనువాద నవలలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న నవలలు పంపరాదు.


*మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.


*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ నవలలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.


*ఒకరు ఎన్ని సీరియల్ నవలలైనా పంపవచ్చును.


*వెంటనే మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.


* మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే నవలలు పరిశీలింపబడవు.


*ఫలితాలు 15/04/2023 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.


*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.


*గమనిక: ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.


*మనతెలుగుకథలు.కామ్ లో ఒకసారి ప్రచురింపబడ్డ కథలు, నవలలు ఎట్టి పరిస్థితులలోను తొలగింప బడవు. ఇందుకు సమ్మతించేవారే తమ రచనలను పంపవచ్చు.


*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.


*బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.


2. ఉగాది 2023 కథల పోటీలు


సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022 మరియు విజయదశమి 2022 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము


ఇప్పుడు ఉగాది 2023 కథల పోటీని ప్రకటిస్తున్నాము.


ఉగాది 2023 కథల పోటీ బహుమతుల వివరాలు :


ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-


ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-


మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.


నిబంధనలు :


*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.


*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.


*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.


*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.


మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.


*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.


* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.


*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.


*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 20 /03/2023


*ఫలితాలు 15/04/2022 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.


*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.


*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.


*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.


*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.



3. ఉగాది 2023 జోక్స్ పోటీలు

16/09/2022 నుండి 20 /03 /2023 వరకు ఎక్కువ జోక్స్ పంపిన వారికి రూ: 1000 /- బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.


విజయదశమి జోక్స్ పోటీ ఫలితాలు:

పోటీ కాలంలో అత్యధికంగా జోక్స్ పంపి విజేతగా నిలిచిన వారు:

ఓట్ర ప్రకాష్ రావు


బహుమతి మొత్తము Rs: 1000/- వీరికి పంపడం జరుగుతుంది.




4. విజయదశమి కథల పోటీ ఫలితాలు


మనతెలుగుకథలు.కామ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజయ దశమి కథల పోటీలో రచయితలు విరివిగా పాల్గొన్నారు.

పోటీ మధ్య కాలంలోనే వారం వారం బహుమతుల రూపంలో దాదాపు యాభై మంది రచయితలకు Rs: 12500/- అందించాము.

ఇప్పుడు బహుమతి పొందిన కథల వివరాలు తెలియజేస్తున్నాము.


కథ చదవడానికి కథ పేరుమీద క్లిక్ చేయండి.

రచయిత/రచయిత్రి ప్రొఫైల్ కోసం రచయిత/రచయిత్రి పేరు మీద క్లిక్ చేయండి.



ప్రథమ బహుమతి రూ: 5000/- పొందిన కథ


సందెపొద్దు గూటిలోకి : B. లక్ష్మీ శర్మ


విశిష్ట ( ప్రత్యేక ) బహుమతి రూ: 500/- పొందిన కథల వివరాలు:


సర్వేంద్రియాణాం నయనం ప్రధానం : మద్దూరి బిందుమాధవి


ఊహకందని నిజం : యశోద పులుగుర్త

శుభమస్తు : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి


ఒక దీపం వెలిగిన వేళ : కొత్తపల్లి ఉదయబాబు


ఆమె పేరు శైలజ : వెంకు సనాతని


విజేతలను అభినందిస్తూ మెయిల్ చేశాము. e - ప్రశంసా పత్రాలు పంపించాము.

బహుమతి మొత్తాన్ని 23/10/2022 లోగా అందజేస్తాము.


5. ప్రముఖ రచయిత ( Popular Writer ) పోటీ ఫలితాలు

మనతెలుగుకథలు.కామ్ కి ఎక్కువ మంది చదివేలా రెగ్యులర్ గా రచనలు పంపే వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రముఖ రచయిత ( పాపులర్ రైటర్ ) పోటీని ప్రకటించాము.

ఈ అవార్డును ఒక రచయిత/రచయిత్రి మొత్తం రచనలను పరిగణించి ప్రకటించడం జరుగుతుంది.


1. మనతెలుగుకథలు.కామ్ వెబ్ సైట్ www.manatelugukathalu.com


2. మనతెలుగుకథలు.కామ్ పోడ్ కాస్ట్ https://linktr.ee/manatelugukathalu


3. మనతెలుగుకథలు.కామ్ యూ ట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


ఈ మూడింటిలో కలిపి, రచయిత/రచయిత్రుల మొత్తం రచనలకు కలిపి పాఠకుల జనాదరణ ఎంత వుందో పరిగణించి బహుమతిని ప్రకటించడం జరిగింది.


పాఠకుల జనాదరణ శాస్త్రీయ పద్ధతిలో పరిశీలింప బడింది.


రచయిత పేరు మీద క్లిక్ చేస్తే వారి ప్రొఫైల్ చేరుకోవచ్చు.

ప్రథమ బహుమతిని ఇద్దరు రచయితలకు సంయుక్తంగా ఇవ్వడం జరిగింది.

బివిడి ప్రసాద రావు

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


మరో ఐదుగురు రచయితలకు విశిష్ట ( ప్రత్యేక ) బహుమతి అందించడం జరుగుతుంది.


వసుంధర

దాసు రాధిక

M R V సత్యనారాయణ మూర్తి

జీడిగుంట శ్రీనివాసరావు

నల్లబాటి రాఘవేంద్ర రావు


విజేతలను అభినందిస్తూ మెయిల్ చేశాము. e - ప్రశంసా పత్రాలు పంపించాము.

బహుమతి మొత్తాన్ని 23/10/2022 లోగా అందజేస్తాము.


6. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )


అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 31/03/2023 వరకు పొడిగిస్తున్నాము.


రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.

బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.

విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.

వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.


సెప్టెంబర్ 2022 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు:

( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి ).


ఓ ఇంటి కథ : లక్ష్మి మదన్


చెదిరిన స్వప్నం : కిడాల శివకృష్ణ


సరికొత్త నడక : మొహమ్మద్ అఫ్సర వలీషా


సొట్టలు : భాగవతుల భారతి


విజేతలను అభినందిస్తూ మెయిల్ చేశాము. e - ప్రశంసా పత్రాలు పంపించాము.

బహుమతి మొత్తాన్ని 23/10/2022 లోగా అందజేస్తాము.


7. రచయితలకు సన్మానం


30 /10 /2022 న రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్ లో జరిగే రచయితలకు సన్మానం కార్యక్రమంలో ఈ క్రింది రచయితలకు సన్మానం చేయడానికి నిశ్చయించాము.

ఆయా రచయితలకు మెయిల్ ద్వారా ఆహ్వానం పంపాము.


1. అన్నపూర్ణ ఏ.

2. బిందుమాధవి మద్దూరి

3. భారతి భాగవతుల

4. ధనలక్ష్మి N.

5. కిరణ్ విభావరి

6. లావణ్య కుమారి పెండేకంటి

7. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

8. నీరజ హరి ప్రభల

9. ప్రసాదరావు బివిడి

10. రాఘవేంద్ర రావు నల్లబాటి

11. రాధిక దాసు

12. శివకృష్ణ కిడాల

13. సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల

14. సీత మండలీక

15. శ్రీనివాసరావు జీడిగుంట

16. శిరిప్రసాద్

17. సత్యనారాయణ మూర్తి M R V

18. సుబ్రమణి పాండ్రంకి

19. శ్రీనివాసులు రెడ్డి కనుపూరు

20. వాణిశ్రీనివాస్ గొర్తి

21. వసుంధర

22. వెంకు సనాతని

23. యశోద పులుగుర్త


మనతెలుగుకథలు.కామ్ పాఠకులకు, రచయితలకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.










358 views0 comments