"రక్షాబంధన్ రోజు" ఇంటర్వ్యూ రహస్యం!

"Rakshabandhan Roju" Interview Rahasyam! - Telugu Moral Story | P V Padmavathi Madhu Nivrithi
"రక్షాబంధన్ రోజు" ఇంటర్వ్యూ రహస్యం! - తెలుగు నీతి కథ |
పి. వి. పద్మావతి మధు నివ్రితి
Published in manatelugukathalu.com on 27/10/2026
రక్షాబంధన్ రోజు జరిగిన ఓ ఆసక్తికరమైన ఇంటర్వ్యూలో ఖరీదైన రాఖీలను కాదని, సాధారణ పసుపు దారాన్ని కట్టిన శ్రీలేఖ కొత్త మేనేజర్‌గా ఎలా ఎంపికైంది? పొదుపు, నిరాడంబరత, మంచి నిర్వహణ ప్రాముఖ్యతను తెలియజేసే ఈ తెలుగు నీతి కథను చదవండి.
రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) రోజు ఇంటర్వ్యూ... ఆ ఆర్థిక సంస్థలో "కొత్త మేనేజర్" పోస్టుకు!
చాలా సులభమైన ఇంటర్వ్యూ. అభ్యర్థి (పురుషుడు లేదా స్త్రీ) ఆ సంస్థ ముఖ్య మేనేజర్‌కు (రంగారావు గారికి) రాఖీ కట్టాలి... అంతే!
చాలామంది పురుషులు మరియు స్త్రీలు ఇంటర్వ్యూకి వచ్చారు. ఒక్కొక్కరు వేర్వేరు రకాల రాఖీలతో వచ్చారు. ముఖ్య మేనేజర్‌కు (రంగారావు గారికి) రాఖీలు కట్టారు.
ప్రతి రాఖీ ధగధగ మెరిసిపోతోంది... ఒకదాన్ని మించిన రాఖీ ఇంకొకటి! రాఖీ కట్టే కార్యక్రమానికి సుమారుగా ఒక గంట సమయం పట్టింది. ఎందుకంటే ఇంటర్వ్యూ సులభంగా ఉండటం వల్ల చాలామంది అభ్యర్థులు వచ్చారు.
పది నిమిషాల తర్వాత ఆ సంస్థ వారు "కొత్త మేనేజర్" పదవికి ఎంపికైన అభ్యర్థి పేరును ప్రకటించారు.
ఆమె పేరు... శ్రీలేఖ.
అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టి శ్రీలేఖకు స్వాగతం పలికారు, అభినందించారు.
"శ్రీలేఖను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారు, ఇతరులను ఎందుకు చేయలేదు?" అని వారు కుతూహలంతో గట్టిగా అడిగారు.
అక్కడ ఉన్న ముఖ్య మేనేజర్ రంగారావు గారు చిరునవ్వుతో ఇలా చెప్పారు:
"మీరందరూ నాకు ఖరీదైన రాఖీలు కట్టారు. శ్రీలేఖ ఒక చవకైన (తక్కువ ధర గల) పసుపు పూసిన దారాన్ని నాకు రాఖీగా కట్టింది.
నిజమైన నిర్వాహకుడు లేదా మేనేజర్ లేదా వ్యక్తి (లేదా ఏదైనా ఉద్యోగి)... పొదుపుగల వ్యక్తి అయి ఉండాలి.
ఆడంబరాలు, దుబారా ఉండకూడదు. అదే ఈ ఇంటర్వ్యూ రహస్యం... అదే మంచి జీవిత రహస్యం కూడా!" అంటూ ముగించారు.
నీతి:
నిజమైన నిర్వాహకుడు లేదా మేనేజర్ లేదా వ్యక్తి (లేదా ఏదైనా ఉద్యోగి)... పొదుపుగల వ్యక్తి అయి ఉండాలి. ఆడంబరాలు, దుబారా ఉండకూడదు. అదే మంచి జీవిత రహస్యం కూడా!
సర్వేజనా సుఖినో భవంతు... పొదుపుతో!
(అలాగే అద్భుతమైన ఆరోగ్యం, ప్రతిరోజూ వ్యాయామం - కనీసం నడక చేయండి; మంచి మాటలు, చేతల అమలు; సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ; ఇరుపక్షాలకూ ప్రయోజనకరమైన, ఆనందకరమైన విజయ పరిష్కారాలు మరియు నిర్మాణాత్మక స్వభావంతో అందరికీ శాంతి, శ్రేయస్సు, పురోగతిని వ్యాప్తి చేయడం ద్వారా!)
గమనిక:
ఈ జనాదరణ పొందిన ప్రతిష్టాత్మక వెబ్ మ్యాగజైన్ (www.manatelugukathalu.com) లో సుమారు 1.5 సంవత్సరాలలో మేము పంపిన "163వ" ఆర్టికల్ (కథ / వ్యాసం / క్విజ్) ఇది.
ధన్యవాదాలు... ప్రసిద్ధ ప్రతిష్టాత్మక వెబ్ మ్యాగజైన్ www.manatelugukathalu.com కు!
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు:
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).











Comments