విజయ దశమి 2026 కథల పోటీలు
- Mana Telugu Kathalu - Admin
- 1 day ago
- 3 min read

Vijaya Dasami 2026 Telugu Story Competition By manatelugukathalu.com Published On 31/03/2026
విజయ దశమి 2026 కథల పోటీలు
నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్
విషయ సూచిక
విజయదశమి 2026 కథల పోటీలు
ఉగాది షడ్రుచుల కథల పోటీలు
వారం వారం బహుమతులు: 30/09/2026 వరకు పొడిగింపు
ఉగాది 2026 కథల పోటీ ఫలితాలు: 15/04/2026
రచయితలకు గమనిక
బహుమతులకు సహకరిస్తున్న వారు
1. విజయదశమి 2026 కథల పోటీలు
సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022, విజయదశమి 2022, ఉగాది 2023, విజయదశమి 2023, విజయదశమి 2024, ఉగాది 2025,విజయదశమి 2025, మరియు ఉగాది 2026 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఇప్పుడు విజయదశమి 2026 కథల పోటీని ప్రకటిస్తున్నాము.
పోటీల కోసం ప్రత్యేకంగా కథలు పంపాల్సిన అవసరం లేదు.
01/04/2026 నుండి 31/10/2026 వరకు ప్రచురితమయ్యే కథల నుండి (20/03/2026 నుండి 18/10/2026 వరకు మాకు చేరే కథలనుండి) విజయదశమి 2026 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.
వారం వారం బహుమతులు పొందిన కథలతో పాటు ఉగాది షడ్రుచుల కథల పోటీలో బహుమతులు పొందిన కథలు కూడా విజయదశమి 2026 కథల పోటీలో ప్రథమ బహుమతి, విశిష్ట బహుమతులకు పరిశీలింప బడతాయి.
కథలు మాకు చేరవలసిన చివరి తేదీ: 18/10/2026
ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.
విజయదశమి 2026 కథల పోటీ బహుమతుల వివరాలు :
ఏకైక ప్రథమ బహుమతి : రూ: 5000 /-
ఐదు విశిష్ట(ప్రత్యేక) బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-
మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.
నిబంధనలు :
*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.
*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.
*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.
*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.
మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.
*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.
* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.
*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 18/10/2026
*ఫలితాలు 15/11/2026 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.
*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.
*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు (పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం, షార్ట్స్ రూపొందించడం లాంటివి) ఉంటాయి.
*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.
2. ఉగాది షడ్రుచుల కథల పోటీలు
కొసమెరుపు కథల పోటీ, ఉత్తమ హాస్యకథల పోటీలు ఈ నెలతో ముగిసాయి. ఇప్పడు కొత్తగా కీ.శే కర్లపాలెం మోహనరావు గారి స్మారక పురస్కారంగా
ఉగాది షడ్రుచుల కథల పోటీలు
ప్రకటిస్తున్నాము. పూర్తి బహుమతులు ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంత రావు గారు స్పాన్సర్ చేస్తారు.
ఈ పోటీలు ఏప్రిల్ 2026 నుండి మార్చ్ 2027 వరకు కొనసాగుతాయి. పూర్తి వివరాలు ఈ క్రింది పోస్ట్ లో చూడండి.
3. వారం వారం బహుమతులు పథకం 31 /03 /2026 తో ముగిసింది. విశేష ఆదరణ పొందిన ఈ పథకాన్ని ఈ పథకాన్ని 30 /09 /2026 వరకు పొడిగిస్తున్నాము.
4. ఉగాది 2026 కథల పోటీ ఫలితాలు:
ముందు ప్రకటించినట్లుగానే ఉగాది 2026 కథల పోటీ ఫలితాలు 15 /04 /2026 నాటి మా పోస్ట్ లో చూడండి.
5. రచయితలకు గమనిక:
కొత్త రచయితల సమాచారం కోసం...
కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.
మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.
ఉగాది షడ్రుచుల కథల పోటీనుండి ప్రతి నెలా 3 కథలను బహుమతికి ఎంపిక చేస్తాము.
అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.
ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు, ఉగాది షడ్రుచుల కథల పోటీలో ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.
కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.
మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.
మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com
మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.
6. బహుమతులకు సహకరిస్తున్న వారు
*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*శ్రీ భళ్ళముడి నాగరాజు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*G. S. S. కళ్యాణి గారు తమ అమ్మమ్మాతాతయ్యలు కీ. శే. ఉప్పలూరి సత్య ఫల్గుణ వెంకట అప్పారావు మరియు కీ. శే. ఉప్పలూరి లలిత నాంచారమ్మ దంపతుల జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాక బహుమతుల ఎంపికలో కూడా మాకు సహకరిస్తున్నారు.
*పెండేకంటి లావణ్య కుమార్తె జె.సాయినిధి తన దివంగత అమ్మమ్మ(పెండేకంటి లక్ష్మిపద్మావతి), నానమ్మ (జొన్నలగడ్డ పద్మావతి)ల ఙ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
గతంలో కొసమెరుపు కథల పోటీలు, హాస్య కథల పోటీలు స్పాన్సర్ చేసిన శ్రీ కర్లపాలెం హనుమంత రావు గారు ఇప్పుడు ఉగాది షడ్రుచుల కథల పోటీలు స్పాన్సర్ చేస్తున్నారు.
( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )
*M. K. కుమార్, భళ్ళముడి నాగరాజు, Dr. లక్ష్మీ రాఘవ కామకోటి, Dr. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, Dr. M. N. బృంద, పివి పద్మావతి మధు నివ్రితి, శ్రీపతి లలిత, కర్లపాలెం హనుమంత రావు ఇంకా మరికొందరు రచయితలు తమ పారితోషకం మొత్తాన్ని ఇతర రచయితల బహుమతుల కోసం వెచ్చించమని కోరుతున్నారు.
తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే మా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నందుకు వీరందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




Comments