కచదేవయాని - పార్ట్ 77

Kachadevayani - Part 77 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 77 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 12/11/2026
కచ దేవయాని – 77వ భాగం | దేవయాని కళ్లెదుటే యయాతి రహస్య ప్రేమ!
ప్రతిష్ఠానపురంలో దేవయానికి రాజవైభవం, విలాసవంతమైన భవనం, వందమంది దాసీలు సమకూరాయి. కానీ భర్త యయాతి మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాడు. చుట్టూ బంధువులు, పరివారం ఉన్నా దేవయాని ఒంటరితనంతో బాధపడుతోంది.
మరోవైపు శర్మిష్ఠను రహస్యంగా కలుసుకునేందుకు యయాతి మయాచార్యుడితో ఒక అద్భుతమైన సొరంగ మార్గాన్ని నిర్మింపజేశాడు. ఆ మార్గం యయాతి కార్యాలయాన్ని శర్మిష్ఠ భవనంతో కలపడమే కాకుండా, నగరం చివర ఉన్న ఉద్యానవనానికి కూడా దారి తీస్తుంది.
టి. వి. యెల్. గాయత్రి గారి ఆసక్తికరమైన పౌరాణిక ధారావాహిక కచ దేవయాని – 77వ భాగం చదవండి.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని.
తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని సహాయం కోసం దేవయానిని వివాహం చేసుకుంటాడు యయాతి.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 69 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 70 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 71 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 72 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 73 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 74 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేవయాని కోసం ఒక అందమైన భవనాన్ని ఏర్పాటు చేశాడు నహుష చక్రవర్తి.
అందులో కనీసం పాతిక గదులు ఉన్నాయి. బలిష్ఠమైన వీరవనితలు కాపలా కాస్తూ ఉంటారు. విడిగా ఒక పాకశాల కూడా ఉంది. అక్కడి నుంచే యువరాణికి భోజనం వస్తుంది. వంద మంది దాకా దాసీలు ఉన్నారు.
శర్మిష్ఠను, ఆమె చెలికత్తెలను ఎక్కడ ఉంచాలి అన్నది సమస్య.
ఆ సాయంత్రం విరజాదేవి దేవయాని దగ్గరికి వచ్చింది.
"నీ వెంట వచ్చిన దాసీలను వేరే భవనంలోకి పంపిస్తావా? ఇక్కడ రాత్రిపూట భవన రక్షక దళం మాత్రమే ఉంటుంది" అంది.
ఆమెతో పాటు వెళ్లి అక్కడ ఉన్న ఖాళీ భవనాలను చూసి వచ్చింది దేవయాని.
దేవయాని భవనానికి ఎదురుగా పెద్ద తోట ఒకటి ఉంది. దానిలో రెండు మూడు భవనాలు ఉన్నాయి.అందులో ఒక భవనాన్ని ఎంపిక చేసింది దేవయాని.
శర్మిష్ఠ, ఆమె చెలికత్తెలకు రాత్రిపూట అక్కడ బస ఏర్పాటు చేసింది దేవయాని.
శర్మిష్ఠ తన దాసీజనంతో అందులోకి చేరింది.
దేవయాని గది వరండా నుంచి చూస్తే శర్మిష్ఠ భవనం కనిపిస్తుంది.
రెండో రోజు యయాతి మయాచార్యుడిని పిలిపించాడు.
"ఒక నెల రోజుల్లో శర్మిష్ఠ ఉంటున్న భవనం నుంచి నా కార్యాలయ భవనంలోకి రహస్య మార్గాన్ని ఏర్పాటు చేయండి, ఆచార్యా!" అని ఆదేశించాడు.
"తప్పకుండా, యువరాజా!" అని తన పనిని మొదలుపెట్టాడు మయాచార్యుడు.
నాలుగు రోజులు గడిచాయి.
దేవయానికి యయాతి కనిపించలేదు.
చుట్టూ బంధువులు ఉన్నారు. అంతటా ఉత్సవ వాతావరణం. కానీ భర్త జాడ లేదు.
చివరకు తనకు అలంకారం చేసే దాసీని అడిగింది.
ఆమె వెళ్లి కనుక్కొని వచ్చింది.
"యువరాజు రాచకార్యార్థం పొరుగు రాజ్యానికి వెళ్లారట! పది రోజుల్లో వస్తారట!" అని చెప్పింది.
ఉసూరుమంటూ కూర్చుంది దేవయాని.
అతడు తనకు భర్త.
పెళ్లిలో తనతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. అంతకు ముందు అసలు మాట్లాడనే లేదు. ఆ రోజు బావిలో నుంచి బయటికి తీసినప్పుడు మాట్లాడడమే!
పెళ్లయింది. కార్యం ఎప్పుడో తెలియదు. సిగ్గు విడిచి ఎలా అడుగుతుంది?
చుట్టూ బంధువులు, పరివారం ఉన్నా దేవయాని ఒంటరితనాన్ని అనుభవిస్తోంది.
రాజభోగాలకు తక్కువ లేదు. మర్యాదకు తక్కువ లేదు.
ఎటొచ్చి భర్త మాత్రం పక్కన లేడు.
పగలంతా శర్మిష్ఠ, ఆమె చెలికత్తెలు కూడా దేవయాని పక్కనే ఉంటున్నారు.
పది రోజులు గడిచిపోయాయి.
అయినా యయాతి దర్శనం కలగలేదు.
మళ్లీ దాసీని పంపించింది.
"యువరాజు నగరంలోనే ఉన్నారు. అయితే సామంత రాజులు వచ్చారు. వాళ్లతో చర్చలు చేస్తున్నారు" అనే సమాచారాన్ని తీసుకొచ్చింది దాసి.
బాధగా కూలబడింది దేవయాని.
ఆ రోజు రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది దేవయానికి.
'ఒకవేళ యయాతి రాత్రిపూట రహస్యంగా శర్మిష్ఠను కలుసుకుంటున్నాడేమో!' అనే అనుమానం వచ్చిందే తడవుగా తోటలోకి పరిగెత్తింది.
వెంట కాపలా కాసే దాసీలు కూడా పరిగెత్తుకొచ్చారు.
భవనంలోకి వచ్చింది.
నారాచి తలుపు తెరిచింది.
"శర్మిష్ఠను చూడాలి!" అంది దేవయాని.
"లేపుతాను!" అని నారాచి లోపలి గదిలోకి వెళ్లబోయింది.
"వద్దు! నేనే వెళ్తాను!" అని గదిలోకి వెళ్లింది.
శర్మిష్ఠతో పాటు కణిక, మదనికలు కూడా అక్కడే నిద్రపోతున్నారు.
నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది దేవయాని.
నారాచి ముఖంలో సన్నని చిరునవ్వు తళుక్కుమంది.
నాలుగు రోజుల తర్వాత విరజాదేవి కోడలి దగ్గరికి వచ్చింది.
"దేవతలతో యుద్ధం వచ్చింది కదా! విజయం సిద్ధిస్తే యజ్ఞం చేస్తానని మీ మామగారు మొక్కుకున్నారు. యజ్ఞం పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుంది. అందరూ ఆ సన్నాహాల్లో ఉన్నారు. ఈ లోపల కార్యం గురించి తొందర లేదని యువరాజు చెప్పాడు. అందుకని దూరంగా ఉంటున్నాడు" అంది.
"దైవకార్యం కంటే ముఖ్యమైనది ఏముంటుంది? అలాగే కానివ్వండి!" అంది దేవయాని సిగ్గుపడుతూ.
'అసలు మామగారు యజ్ఞాలు చేయనిది ఎప్పుడంట ? ఎప్పుడూ యజ్ఞదీక్షలోనే ఉంటారు. తనను దూరంగా పెట్టడానికి యయాతి చూపిస్తున్న సాకు కాదు కదా!' అనిపించింది ఆమెకు.
అయినా చేసేది ఏముంది?
భర్తతో సమాగమం కోసం ఎదురుచూడడమే!
నెల రోజులకు మయాచార్యుడు రహస్య మార్గాన్ని పూర్తి చేశాడు.
యయాతి కార్యాలయ భవనం సభాభవనం పక్కనే ఉంటుంది.
చాలా విశాలమైన ఆ భవనంలో మంత్రులు, లేఖకులు, గణికుల దగ్గర నుంచి అధికార యంత్రాంగం మొత్తం ఉంటుంది.
అక్కడ దాదాపు వందకు పైగా గదులు ఉన్నాయి.
అటువంటి భవనంలో ముఖ్యమైన పత్రాలను పెట్టే గదులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక గదిలోకి శర్మిష్ఠ భవనం నుంచి వచ్చే మార్గాన్ని కలిపాడు మయాచార్యుడు.
ఆ మార్గం కేవలం యయాతికి మాత్రమే తెలుసు.
మయాచార్యుడితో పాటు వెళ్లి దారంతా పరిశీలించాడు.
దారి చీకటిగా లేకుండా గోడలకు ప్రకాశవంతమైన మణులు తాపడం చేసి ఉన్నాయి. మయాచార్యుడి పనితనానికి సంతృప్తి చెందాడు యయాతి.
"ఈ మార్గానికి రెండు దారులు ఏర్పాటు చేశాను, యువరాజా! ఒకటి మీ కార్యాలయానికి, మరొకటి రాజకుమారి విహరించడానికి నగరం చివర ఉన్న ఉద్యానవనానికి" అని ఆ దారిని కూడా చూపించాడు మయాచార్యుడు.
అటువైపుకు కూడా వెళ్లి వచ్చాడు యయాతి.
సంతోషంగా మయాచార్యుడి చేతులను పట్టుకున్నాడు.
"ఆచార్యా! మీరు మాత్రమే ఇంత అద్భుతంగా నిర్మించగలరు. మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది" అని అభినందించాడు.
"మా రాజకుమారి కోసం ఏమైనా చేస్తాను, యువరాజా! అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి!" అని వెళ్లిపోయాడు మయాచార్యుడు.
నగరం చివర ఉన్న ఉద్యానవనానికి ఎవ్వరూ వెళ్లరాదని, అక్కడికి కేవలం యయాతి యువరాజు మాత్రమే వస్తుంటాడని ఆజ్ఞను జారీ చేశాడు నహుషుడు.
ఆ రాత్రి రహస్య మార్గం ద్వారా శర్మిష్ఠ భవనంలోకి వచ్చాడు యయాతి.
అతడిని చూసి నెలరోజులయింది.
"శామూ!" అంటూ దగ్గరికి వచ్చిన యయాతిని సంభ్రమంతో చూస్తూ ఉంది శర్మిష్ఠ.
ప్రేమికులిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
మరొక నెల రోజులకు దుర్జయుడు దేవయాని దాసీలను తీసుకొని వచ్చాడు.
పదిమంది దాసీలు. మధ్యవయస్సులో ఉన్నవాళ్లు.
వాళ్లకు రాజభవనాల్లో ఉండడం అలవాటు లేదు.
"మీరు తోటలో ఉన్న పర్ణశాలలో ఉండండి. రాత్రి పగలు శర్మిష్ఠ భవనానికి కాపలా కాయడమే మీ పని. ఆమె దగ్గరికి యువరాజు వస్తే వెంటనే నాకు చెప్పాలి!" అని ఆదేశించింది దేవయాని.
ఇప్పుడు కాపలా కట్టుదిట్టంగా ఉంది.
గతజల సేతుబంధనం అంటారు దీన్నే.
రహస్య మార్గం ద్వారా యథేచ్ఛగా యయాతి శర్మిష్ఠను చూసి వెళ్తున్నాడు.
పాపం దేవయాని!
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 78 త్వరలో
===============================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు టి. వి. యెల్. గాయత్రి. పూర్తి పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి. మా పుట్టిల్లు నెల్లూరు జిల్లాలోని మొగలిచర్ల గ్రామం.నేను గృహిణిని. మా అమ్మగారు ప్రముఖ రచయిత్రి పవని నిర్మల ప్రభావతమ్మ గారు. మా నాన్నగారు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహ స్వామి మరియు మొగలిచర్ల దత్తాత్రేయస్వామి దేవస్థానములకు ధర్మకర్తగా ఉండేవారు.
నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం అలవాటు. అలా చదువుతూ, పద్యాలు కథలు వ్రాద్దామని అనుకున్నాను.
2009 లో పునాకు వచ్చాను.
2019 లో శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ గారి 'అనంతఛందస్సు' అనే పద్యశిక్షణా సమూహములో చేరి పద్యాలు వ్రాయడం నేర్చుకొని వ్రాస్తున్నాను.
అలా 2019 నుండి పద్యాలు, కవితలు వ్రాస్తున్నాను.2023 నుండి కథలు వ్రాయటం మొదలు పెట్టాను.మా గురువుగారు మా చేత క్రొత్త వృత్తాలతో "అనంత ఛందస్సౌరభం "అనే గ్రంథమును వ్రాయించారు.
అందులో నేను కూడా 100 పద్యాలు వ్రాసాను.
నేను వ్రాసిన "పల్లె పిలిచింది "అనే స్వతంత్ర కావ్యము "మన తెలుగు కథలు డాట్ కామ్ "పత్రికలో దారావాహికంగా వచ్చింది.
మా గురువుగారు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వివిధ ప్రక్రియలు నేర్పిస్తూ ఉంటారు. అందులో గర్భ కవిత్వం ఒకటి. దానిలో కూడా కొన్ని పద్యాలను వ్రాయడం జరిగింది.
నేను వ్రాసిన పద్యములను , కవితలను పోటీలకు పంపిస్తూ ఉంటాను. విజేతగా చాలా ప్రశంసా పత్రాలు లభించాయి.
కథలు వ్రాయటానికి నాకు ప్రేరణ మా అమ్మగారు.
నా మొదటి కథ 'పరివర్తన 'గో తెలుగు డాట్ కామ్ అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది.
నేను కవితలు శతకాలు, కావ్యాలే కాకుండా కథలు వ్రాయగలను అన్న విశ్వాసం కలిగింది.
నా మొదటి కథకు పారితోషికం ఏమీ లేదు.
ఇప్పటి వరకు నేను 112కథలు,"క్రొత్త నీరు "అనే నవల వ్రాసాను.' కచ దేవయాని ' సీరియల్ గా "మన తెలుగు కథలు డాట్ కామ్ "అంతర్జాల. పత్రికలో వస్తోంది.నేను వ్రాసిన కథల్లో సగం కథలు వివిధ పోటీల్లో బహుమతులు తెచ్చుకున్నాయి.
మా పిల్లలతో నేను వ్రాయబోయే కథల గురించి చర్చిస్తూ ఉంటాను. ఒక్కోసారి కథాంశాన్ని వాళ్ళు చెప్పినట్లుగా మార్చుతాను.
సాధారణంగా నేనే కథలు వ్రాసి చూసుకొని పత్రికలకు పంపిస్తాను.
నాకు నచ్చిన కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. చిన్నప్పటి నుండి వారి సాహిత్యాన్ని చదువుతూ పెరిగాను.
నేను సమాజానికి మేలు చేసే రచనలను ఇష్టపడతాను.
నేను వ్రాసిన రచనల్లో బాగా పేరు తెచ్చిన కథ 'కప్పు తేనీరు '.ఇంటికి దీపం, నీ అడుగు జాడలో, సర్దుబాటు లాంటివి.
నావి రెండు కథాసంపుటాలు వచ్చాయి.అవి "నవ్య కథా సౌరభం -1"మరియు "నవ్య కథా సౌరభం :2 "అనేవి.
మూడు కావ్యాలు, ఐదు శతకాలు కలిపి '1.శతక విజయం. 2. కవన త్రివేణీ సంగమం 'అనే పుస్తకాలు ప్రింట్ అయ్యాయి.
ఇంకా వందల సంఖ్యలో పద్యాలు వ్రాసాను.
2024లో తానావారి పద్య కావ్యపోటీలో పాల్గొని తొమ్మిదవ స్థానం పొందాను.
2022 లో స్టోరీ మిర్రర్ వారు "ది ఆథర్ ఆఫ్ ద ఇయర్ "అవార్డు ఇచ్చారు.
2024 లో సాయివనంలో సాహిత్యం వ్వాట్సాప్ సమూహం వారు "కవనమణి "బిరుదు ఇచ్చారు.
2026 జనవరిలో శ్రీ గౌతమేశ్వర సాహితీ సంస్థ. మంత్రపురి వారు నిర్వహించిన 100 రోజుల కవితా పండుగలో పాల్గొని విజేతగా నిల్చినందుకు స్వర్ణకంకణమును ఇంటికి పంపించారు. అనారోగ్య కారణాల వలన నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను.
2026 ఏప్రిల్ లో మహారాష్ట్ర ప్రభుత్వము మరియు మహారాష్ట్ర తెలుగు అకాడమీ సంయుక్తంగా పూణే లో ఉగాది సన్మానం చేసారు.
2026 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూణే " ఆంధ్రా సంఘం "వారు సన్మానం చేసారు.












Comments