కచదేవయాని - పార్ట్ 44
- T. V. L. Gayathri

- 1 hour ago
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 44 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 04/03/2026
కచదేవయాని - పార్ట్ 44 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
“ఒక ప్రేమ సందేశం… ఒక రహస్య భేటీ… కానీ ఎవరో ఒకరి హృదయంలో మాత్రం ప్రతీకారాగ్ని జ్వలిస్తోంది…” శ్రీమతి టివి యెల్ గాయత్రి గారి కచ దేవయాని నలభై నాలుగవ భాగంలో ఆ విషయం తెలుసుకోండి. |
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని, తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. వీతిహోత్ర చక్రవర్తి కొంత రాజ్య భాగాన్ని యయాతికి కానుకగా ఇస్తాడు. పొర్ణమినాడు కలుస్తానని చిలుక రూపంలో ఉన్న చారుమతి ద్వారా వర్తమానం పంపుతాడు యయాతి.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని ధారావాహిక నలభై నాలుగవ భాగం చదవండి.
ఉదయం. అప్పుడే తెల్లవారింది. గదిలో కూర్చుని వీణ వాయించుకొంటూ సంగీతాన్ని అభ్యాసం చేసుకొంటోంది శర్మిష్ఠ.
అప్పుడే వెనుక వైపు వరండా లోనుండి చారుమతి వచ్చింది.
సంభ్రమంగా లేభ్యాచి చారుమతిని పట్టుకొని మురిపెంగా ముద్దు పెట్టుకుంది శర్మిష్ఠ.
"యయాతి విమానంతో సహా వచ్చాడు! "అంది చారుమతి.
"తెలుసు తెలుసు సఖీ! వర్తమానం అందింది. పొర్ణమి నాటికి ఇక్కడికి వస్తున్నారని నిన్ననే దూతలు కబురు తెచ్చారు. "
"అదిసరే! నీ కొక సందేశం పంపించాడు."అంది చారుమతి.
"ఏమిటది?"
వీళ్లిలా మాట్లాడుకొంటుండగా అప్పుడే గదిలోకి రాబోతున్న దేవయాని శర్మిష్ఠ చేతుల్లో ఉన్న చిలుకను చూడంగానే ఠక్కున ఆగిపోయింది.
'అదే చిలుక! .....కచుడి దగ్గరికి వస్తూ ఉండే చిలుక....మాట్లాడే చిలుక...అప్పట్లో దీని పేరేదో చెప్పాడు.. గుర్తురావటం లేదు... వసుమతి... ఊహు! .. కాదు.. కాదు.. మనోహరి... అదీ కాదేమో! ప్రభావతి..కాదేమో... ఏదో శుంఠమతి...
చిలుకతో రాయబారం పంపించాడా దుర్మార్గుడు.
కదిలితే తన చేతి కంకణాలు చప్పుడు చేస్తాయేమోనని మెల్లగా చేతులు దగ్గరగా పెట్టుకొని చాటుగా నిల్చుంది దేవయాని.
"నిన్ను ఏకాంతంగా చూడాలని ఉందన్నాడు! "చారుమతి చెప్పింది విని ఆలోచనలో పడింది శర్మిష్ఠ.
కాసేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.
"ఎక్కడ కలుసుకోవాలి?... ఊ... ఎక్కడంటే! ... చెప్తాను! .. ఉండు! .. విను! విను! మా రాజధాని ప్రక్కన తూర్పు వైపు మహాదేవుని దేవాలయం ఉంది. అక్కడయితే పర్వదినాలప్పుడు తప్ప మామూలు రోజుల్లో జనాలు ఎవ్వరూ ఉండరు. నేను అక్కడకు వచ్చి ఉంటాను! "
"ఆలయానికి ఎలా చేరుకోవాలో గుర్తులు చెప్పు! "
"విను! మా సీమకు రావాలంటే కోలాహల పర్వతాన్ని చుట్టి రావాలి. రహదారి వెంట వస్తుంటే పెద్ద పెద్ద ఊడలతో ఉన్న మఱ్ఱి చెట్టొక్కటి ఉంటుంది.అక్కడ రెండు దారులు కనిపిస్తాయి. కుడివైపు వెళితే మా రాజధానిని చేరుకోవచ్చు! ఎడమ వైపు తిరిగి కొంత దూరం వస్తే దేవాలయ గోపురం కనిపిస్తూ ఉంటుంది. "
"ఆలాగే! తప్పకుండా పౌర్ణమికి వస్తాడు. నువ్వు ఉదయమే దేవాలయానికి వచ్చి ఉండు! "అంది చారుమతి.
చారుమతికి ఒక పండిన కదళీఫలాన్ని ఒలిచి తినిపిస్తూ వరండాలోకి వెళ్ళింది శర్మిష్ఠ.
దేవయాని మెల్లగా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వచ్చింది.
'దుష్టుడు ప్రేమ సందేశం పంపించాడు.వాడిని చంపాలంటే ఇదే తగిన సమయం! ఈ అవకాశాన్ని వదలకూడదు! "అనుకొంది దేవయాని ధృఢంగా.
ఆమె తన గది వెనుక ఉండే వరండాలోకి వచ్చింది.
అప్పటికే శర్మిష్ఠ చారుమతిని పట్టుకొని తోటలోకి వెళ్తోంది.
వాళ్ళేం మాట్లాడుకొంటున్నారో దేవయానికి వినిపించలేదు.
'ఏమైనా పౌర్ణమి రోజు ఒక్క నిమిషమయినా శర్మిష్ఠను వదలిపెట్టకూడదు! ' అనుకుంది దేవయాని.
ఆమె మనసులో కచునిపైన ప్రతీకారజ్వాల ఎగసి ఎగసి పడుతోంది.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 45 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments