కచదేవయాని - పార్ట్ 34
- T. V. L. Gayathri

- 1 day ago
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 34 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 08/01/2026
కచదేవయాని - పార్ట్ 34 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృష పర్వుడిని కలిసి, కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని. అతనితో కలిసి, దుర్మిలుడనే మంత్రవేత్త వద్దకు వెళ్లాలనుకుంటుంది.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి.
ఇక కచదేవయాని ధారావాహిక ముప్పై నాలుగవ భాగం చదవండి.
రెండో రోజు ఉదయం ఇంకా తెల్లవారలేదు.
దానవరాజు దగ్గర్నుండి కబురు వచ్చింది. అప్పటికే తయారుగా ఉంది దేవయాని.
రథంలో దేవయాని కూర్చుంది. మహారాజు గుర్రం మీద ప్రక్కనే వస్తున్నాడు. వీళ్ళ వెంట ఓ పదిమంది అంగరక్షకులు బయలుదేరారు.
రెండుగంటల ప్రయాణం తర్వాత త్రిశూల పర్వతం దగ్గరికి చేరారందరు.
కొంత దూరం పర్వతాన్ని ఎక్కవలసి ఉంటుంది.
దేవయాని ఎక్కడ కష్టపడుతుందో అన్నట్లుగా మెల్లగా ఎక్కుతున్నాడు దానవరాజు.
కాసేపటికి అక్కడొక పెద్ద గుహ కనిపించింది.
భటులు గుహ లోపలికి వెళ్లి మహారాజు వచ్చాడనే సమాచారాన్ని దుర్మిలునికి చేరవేశారు.
తన శిష్యులతో కలిసి పరుగున వచ్చి మహారాజుకు వంగి నమస్కారం చేశాడు దుర్మిలుడు.
అతడొక రాక్షసుడు. నల్లగా ఉన్నాడు. వెడల్పాటి ముఖం. గుండ్రంగా ఉండే పెద్ద కళ్ళు. ఎత్తుగా బలిష్ఠంగా ఉన్నాడు. జుట్టు జటలు కట్టి ఉంది. పిక్కల దాకా పులిచర్మం వేలాడుతూ ఉంది. ఆచ్ఛాదన లేని గుండె మీద పెద్ద పెద్ద రుద్రాక్ష మాలలున్నాయి.
నుదుటి మీద భస్మరేఖలు. మధ్యలో ఎర్రటి కుంకుమ. అతడి ఆకారాన్ని చూడంగానే ఎవరికైనా కొంచెం భయం పుడుతుంది.
కుశల ప్రశ్నలు వేస్తూ అందరినీ గుహ లోపలికి తోడ్కొని వెళ్ళాడు దుర్మిలుడు.
గుహ అంతా పచ్చి రక్తపు వాసన. చీర చెంగుతో ముక్కు మూసుకుంది దేవయాని.
గుహ మధ్యలో హోమ గుండం ఉంది. కొంచెం దూరంగా కొన్ని మేకలు, గొర్రెలు, దున్నపోతులు కట్టి వేయబడి ఉన్నాయి.బహుశా బలుల కోసం కావచ్చు.
'వీళ్ళు కాపాలికులలాగా ఉన్నారు ' అనుకొంది దేవయాని.
"ఈ అమ్మాయి మన గురువుగారి కుమార్తె." అంటూ దుర్మిలునికి దేవయానిని పరిచయం చేశాడు దానవరాజు.
దుర్మిలుని కళ్ళల్లో భక్తి భావం కనిపించింది.
వినయంగా ఆమెకు నమస్కరించాడతడు.
"నాన్నగారి శిష్య పరమాణువును. ఏదో కొద్దిగా సాధనలు చేస్తూ ఉంటాను. వారు దివ్యశక్తి సంపన్నులు. మా బోంట్లకు వారి పాదధూళులే రక్ష "అంటూ ఆసనాలను చూపించాడు.
కూర్చున్నారిద్దరు.
"గురువుగారు ఇక్కడలేరు.ఒక చిన్న సమస్య వచ్చింది."అంటూ కచుడి విషయం దుర్మిలునికి వివరించాడు దానవరాజు.
"మహారాజా! నా దగ్గర మాయాదర్శని ఉంది. కానీ అవతలి వ్యక్తి నా కంటే తపశ్శాలి అయితే మాత్రం అతడిని,అతడి పరివారాన్ని స్పష్టంగా చూడటం కష్టం! దేవతల దివ్య శక్తుల ముందు మన అసురీ శక్తులు అంతగా పని చెయ్యవు. వాళ్ళు మన సీమలోకి వచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే అదృశ్యరూపంగా సంచరిస్తారు. ఈ మధ్య అటువంటి శక్తులను వాళ్ళు సాధించారని విన్నాను. అయినా ప్రయత్నిస్తాను!"అంటూ మాయాదర్శనిని తీసుకుని వచ్చి కొన్ని మంత్రాలు చదివాడు.
మాయాదర్శనిలో సాయుధులైన యువకులు కొందరు, స్త్రీలు కొందరు నీడల్లాగా కనిపిస్తున్నారు.
చిత్రాలు స్పష్టంగా లేవు.
నిరాశగా మొహం పెట్టింది దేవయాని.
అసంతృప్తిగా తలను విదిల్చాడు దానవరాజు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 34 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments