కచదేవయాని - పార్ట్ 29
- T. V. L. Gayathri

- 3 days ago
- 5 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 29 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 17/12/2025
కచదేవయాని - పార్ట్ 29 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
పుష్కర ద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు కచుడు. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి.
ఇక కచదేవయాని ధారావాహిక ఇరవై తొమ్మిదవ భాగం చదవండి.
శర్మిష్ఠ చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు యయాతి.
"ఎంతవరకు చెప్పాను?"
" విమానం కోసం భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్ళటం వరకు "అంది శర్మిష్ఠ.
"ఆ తర్వాత ఏముంది? మహర్షి విమానాన్ని ఏర్పాటు చేశారు.మేము తయారయ్యి విమానంలో ఇక్కడికి వచ్చాము! చారుమతిని నీ దగ్గరికి పంపించాము! కచుడు తన దివ్యాస్త్రాలతో మీ కాపలా వాళ్ళను నిద్రబుచ్చాడు.... ఇలా మేము యువరాణి వారి దగ్గరకు వచ్చాము! "
"కచుడు నమ్మదగ్గ వాడేనా? అతడు మాకు శత్రువు... మాయోపాయంతో గురువుగారి దగ్గర చేరాడని.... "
"తాతలకు తండ్రులకు ఉన్న శత్రుత్వాలను వారసత్వంగా మనం కూడా కొనసాగించాలా? కొంచెం విశాల హృదయంతో ఆలోచించు శర్మిష్ఠా! మన తరంలో నయినా వీటికి ముగింపు పలుకుదాం! నువ్వు నా కాబోయే భార్యవు. అతడికి ఇక్కడ ప్రమాదమని తెలిసి కూడా సాహసంగా నీ దగ్గరికి నన్ను తీసికొని వచ్చాడు. అతడెంతో స్నేహశీలి. అతడికి ఎక్కువ తక్కువలు లేవు. కచుడు ప్రాణాలు పోసే వైద్యుడు మాత్రమే కాదు మహా యోధుడు. అంతేనా ఇంకా ఎన్నో విద్యల్లో నిష్ణాతుడు.అంత మేధావి అయ్యుండి ఇసుమంతైనా అహంకారం లేనివాడు. అతడి నుండి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఒకమాట చెప్తాను విను! శుక్రాచార్యులవారు మృతసంజీవని విద్యను కచుడికి కాకుండా ఇంక ఎవరికైనా నేర్పించాడా? లేదు కదా! కచుడు తన దగ్గర ఉన్న విద్యను ఇప్పటికి కనీసం పదిమందికైనా బోధించి ఉంటాడు. ఎందుకని? దాని వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని! ... అదీ అతడిలో ఉన్న జీవలక్షణం! ... జాతి మత భేదాలు చూపని సార్వజనీనమైన ప్రేమ అతడిది."
శర్మిష్ఠ ఆలోచిస్తోంది.
ఒక రకంగా చూస్తే యయాతి చెప్పింది ఒప్పుకోవలసిన సత్యం.
అతడు తనకు కాబోయే భర్త. అతడు ఏమి చెప్పినా సమంజసమే అనిపిస్తోంది.కొత్తగా పరిచయమైనవాడు కానీ ఇప్పుడు అందరికంటే ఆత్మీయుడయ్యాడు. కారణం ఏమిటి? వివాహమనే బంధం ఇద్దరు అపరిచితులను ఇంతగా దగ్గర చేస్తుందా? ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళను ఒకే ఆత్మలాగా కలిపేస్తుందా? ఎంత విచిత్రం!
"అందరూ నిన్ను ఏమని పిలుస్తారు? " అడిగాడు యయాతి.
"శర్మిష్ఠా! అని "
"నేను మాత్రం నిన్ను శాము అని పిలవనా?"
చిన్నగా నవ్వింది శర్మిష్ఠ.
"అడవిలో నన్ను చూసినప్పుడు నా గురించి ఏమనుకున్నారు?" కుతూహలంగా అడిగిందామె.
"ఊ... అందం తెలివితేటలతో పాటు ధైర్యం కూడా ఉన్న రాజకుమారి అని.... నన్ను చూచి నువ్వు ఏమనుకున్నావు? "
" ఏమీ అనుకోలేదు! .....పట్టి బంధించాలని అనుకున్నాను. అయినా మీరు నా చేతిలో కావాలని ఓడిపోయారు కదూ! "బుంగమూతి పెట్టింది శర్మిష్ఠ.
పెద్దగా నవ్వాడు యయాతి.
"నీ జ్ఞాపకంగా అప్పటి మచ్చ ఇంకా ఉంది చూడు! "అంటూ చెయ్యి చూపించాడతడు.
"అయ్యో! గట్టిగా తగిలిందా! "అంటూ అతడి చెయ్యి పట్టుకొంది శర్మిష్ఠ.
ఆమె చేతిని తన చేతితో భద్రంగా పట్టుకొని పెదవులకు ఆనించుకొన్నాడతడు.
వాళ్ళిద్దరు మౌనంగా ఊసులాడు కొంటున్నారు.సమయం గడుస్తోంది.
కాసేపటికి స్పృహ వచ్చిన వాడిలాగా లేచాడు యయాతి.
"శామూ! ఇంక వెళ్ళిరానా! ఆలస్యమయితే నా మిత్రులకు ప్రమాదం! "
దిగులుగా మొహం పెట్టింది శర్మిష్ఠ.
"తప్పదు వెళ్ళాలి! "
ప్రేమగా ఆమె ముంగురులను సవరించాడతడు.
విధిలేక కదిలింది శర్మిష్ఠ.
"పద! తోటలో ఉన్న నా మిత్రులకు పరిచయం చేస్తాను. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు! "
ఇద్దరు కలిసి క్రిందకు వచ్చారు.
తోటలో మిత్రులందరూ పచార్లు చేస్తున్నారు. వీళ్లిద్దరిని చూడంగానే అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చారు. శరావతి రెండు పూలమాలలను తెచ్చింది.
"ఇవి పుష్కర ద్వీపంలోని పూలమాలలు. రెండు నెలల దాకా వాడిపోవు.మా ఇద్దరి వైపు నుండి మీ కోసం తెచ్చాము. మీరు మాలలు మార్చుకోండి! మేము చూస్తాము! "అంది పెద్దరికంగా.
శరావతి కచుడికి కాబోయే భార్య అని శర్మిష్ఠకు అర్థం అయింది.

యయాతి నవ్వుతూ శర్మిష్ఠ మెడలో పూలమాల వేశాడు.
శర్మిష్ఠ సిగ్గుపడుతూ మెల్లగా యయాతి మెడలో పూలమాలను వేసింది.
"మీరు అలాగే నిల్చోండి! ఒక్క నిమిషంలో మీ చిత్రాన్ని గీస్తాను! మా గంధర్వ జాతి వాళ్లకు రాని విద్యలేదు."అంటూ సారంగదేవుడు అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుని యయాతి, శర్మిష్ఠల చిత్రాన్ని గీయసాగాడు.
తన గదిలోకి వచ్చిన దేవయానికి ఏమి చెయ్యాలో తెలియటం లేదు. కసిగా ఉంది. తట్టుకోలేనంత బాధగా ఉంది. ఏదన్నా చెయ్యాలి?ఇద్దరినీ చంపెయ్యాలి.... ఎంత ద్రోహం! నంగనాచిలాగా అక్కా అక్కా అంటూ తిరుగుతూ ఎంత గ్రంథం నడుపుతోంది... రాక్షసి పిల్ల. కచుడు మాత్రం! ...... గుండెలు తీసిన బంటు..ఇద్దరూ తన గురించి చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు...తనని తన తండ్రిని మోసం చేసి మృత సంజీవనిని నేర్చుకొన్నాడు. నక్కవినయాలు చూపించి నాటకాలాడి ఎంత చేశాడు! ... ఈ ప్రేమ గురించి దానవరాజుకు తెలుసా? తెలిసుండదు! ... అందుకే దొంగచాటుగా వచ్చాడు. చూడాలి! వీళ్ళ వేషాలు!
మనసులో ప్రళయం.... దేవయాని లేచి వరండాలోకి వచ్చి తోటలోకి చూసింది.
నవ్వుతూ కచుడు కనిపిస్తున్నాడు. అతడి పక్కన దాదాపు పదిమంది దాకా యువతీ యువకులు కనిపిస్తున్నారు.
'అంటే స్నేహ బృందాన్ని తీసుకొచ్చాడన్నమాట! '
శర్మిష్ఠ కనిపిస్తోంది.
శర్మిష్ఠ మెడలో పూలమాల కనిపిస్తోంది.
కొందరమ్మాయిలు శర్మిష్ఠ భుజాలు పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతున్నారు.
'పూలమాల కూడా వేశాడన్నమాట! ' దేవయాని కళ్ళు మండుతున్నాయి.
చెట్లు అడ్డం ఉండటం వలన ఆమెకు యయాతి కనిపించటం లేదు.
చిత్రాన్ని పూర్తి చేసి సారంగదేవుడు అందరికీ చూపించాడు.
అద్భుతం! ....అదీ అంత త్వరగా వేసినా సజీవంగా ఉన్నట్లుగా ఉందా చిత్రం.
తాము తెచ్చిన బహుమతులనన్నింటిని ఒక బుట్టలో పెట్టి శర్మిష్ఠ కిచ్చి కదిలారు మిత్రబృందం.
శర్మిష్ఠ వాళ్ళకు వీడ్కోలు చెప్పటానికి తోట ద్వారం దాకా వచ్చింది.
దేవయాని చూస్తోంది కానీ ఎత్తైన చెట్ల మధ్య వాళ్ళు సరిగ్గా కనిపించటం లేదు.
అలాగే చూస్తూ వుంది.
కాసేపటికి శర్మిష్ఠ బుట్ట పట్టుకొని నృత్యం చేస్తున్నట్లుగా గిరుక్కున తిరుగుతూ, అక్కడున్న పూలమొక్కలతో మాట్లాడుతూ, మధ్యలో కూనిరాగం తీసుకుంటూ తోటంతా కలియతిరుగుతోంది.
ఆ ఉషోదయాన కాంతిని వెదజల్లుతూ వేగంగా విమానం ఆకాశానికి ఎగిరిపోయింది. కొంతమంది జనాలు ఆ వెలుగును చూశారు కానీ అదేమిటో వాళ్ళకేమీ అర్ధం కాలేదు.
దేవయానికి దుఃఖం పొంగుకొని వచ్చింది.
క్రోధంతో గదిలోకి వచ్చి మంచం మీద పడుకొని భోరున ఏడవసాగింది.
కాసేపటికి బయట రణగొణధ్వనులు వినిపించసాగాయి.
మంగళ వాయిద్యాలతో శర్మిష్ఠ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 30 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments