కచదేవయాని - పార్ట్ 20
- T. V. L. Gayathri 
- 2 days ago
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 20 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 29/10/2025
కచదేవయాని - పార్ట్ 20 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది.
తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అత్రి మహామునిని ఆహ్వానిస్తాడు యయాతి. ఆ యాగానికి వృషపర్వుడు కూడా వెళ్తాడు. మరీచి మహర్షి దగ్గర యయాతిని ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకోవాలన్న తన అభిమతం చెబుతాడు. నహుషునితో మాట్లాడుతానంటాడు మరీచి మహర్షి. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ అన్యమనస్కంగా ఉండటం గమనిస్తుంది దేవయాని.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 20 చదవండి.
దానవరాజ్యంలో శర్మిష్ఠ పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి. రాచనగరును శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అంతఃపురంలోని గదులన్నింటికీ కొత్త రంగులు వేస్తున్నారు. రాచ సిబ్బంది మొత్తం రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు రాజబంధువులు వస్తూనే ఉన్నారు.
వచ్చినవాళ్లు శర్మిష్ఠను పిలిపించుకొని ఆమెకు అలంకారాలు చేసి ముచ్చటపడుతున్నారు. వాళ్ళల్లో శర్మిష్ఠ ఈడువాళ్ళు చాలామందే ఉన్నారు.నాట్యగానాలతో అంతఃపురం అంతా మార్మ్రోగిపోతోంది.
వాళ్లతో దేవయాని కలవలేక పోతోంది.

'అంతా రాక్షసజాతి!అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు!.. ఆ బంధుజనం మధ్య తను ఒంటరిగా ఏం చేస్తుంది?'అనుకుంటూ సాధ్యమైనంత వరకు దేవయాని తన గదిలోనే గడుపుతోంది.ఇప్పటికి వచ్చిన బంధువులు తెచ్చిన కానుకలతో రెండు మూడు గదులు నిండిపోయాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఐశ్వర్యాన్ని, ఆ వైభవాన్ని, ఆ బంధుజనాల్ని చూస్తూ ఉంటే రాను రాను దేవయాని మనసులోశర్మిష్ఠ పట్ల ఒక రకమైన ఈర్ష్య లాంటి భావన మొలకెత్తింది. అది పెరిగి.... పెరిగి.. పెద్ద వృక్షం అవటానికి పెద్ద సమయం అక్కర్లేదు...
ఇక అక్కడ ప్రతిష్ఠానపురంలో సాయంత్రంగా సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు యయాతి.
యజ్ఞం పూర్తయ్యాక కూడా అతడికి పని భారం ఇంకా తగ్గలేదు.ఇప్పటికి కొద్దిగా తీరిక దొరికింది.
చేతిలో శర్మిష్ఠ చిత్రపటాన్ని పట్టుకొని తదేకంగా దానినే చూస్తున్నాడతడు. ఇంతలో రివ్వుమని ఎగురుతూ అక్కడికి వచ్చింది చారుమతి.
"ఎంత బాగుంది చిత్రం! చాలా సౌందర్యవతి!" అంది మెచ్చుకోలుగా.
"ఇది చిత్రమా! ఎవరో కానీ గీతలు కూడా గీయటం రాని శుంఠ వేసినట్టుగా ఉంది.ఆమె ఇంతకంటే వెయ్యిరెట్లు బాగుంటుంది.! అటువంటి సౌందర్యరాశి ఈ ప్రపంచంలోనే లేదేమో!" అన్నాడు యయాతి తన్మయత్వంతో.
"హి...హి....హి..." వెక్కిరించింది చారుమతి.
"అందగత్తె మాత్రమే కాదు! ఆమె చాలా ధీరవనిత.. ఆ కరవాల విన్యాసం.. ఆ కంఠంలో దర్పం... ఆ రాజసం..పద్నాలుగు భువనాల్లో ఎవరున్నారు?.."
పరవశంతో చెబుతున్నాడు యయాతి.
"కానీ!... కానీ!...! చారుమతికి తమాషాగా ఉంది.
"నీకు వేళాకోళంగా ఉంది కదూ!"
యయాతి కంఠంలో నిష్టూరం ధ్వనించింది.
"లేదు మిత్రమా! దీనిని ప్రేమపైత్యం అంటారు పెద్దలు. ఇది తలకెక్కితే కాకి కూడా హంసలాగా కనిపిస్తుందట!"
"ఛ!.. నేను నీతో మాట్లాడను ఫో!"
"లేదు! లేదు! క్షమించు! ఎప్పుడు వెళుతున్నాము? " మాట మార్చింది చారుమతి.
"ఇంకా పదిహేను రోజులు.. అంటే మూడొందలా అరవై గంటలు.. అంటే ఇరవై ఒక్కవేల ఆరొందల నిమిషాలు... అంటే..."
"ఆపు! ఆపు! ఇలా నిమిషాలు క్షణాలు లెక్క పెట్టుకోవటం మొదలైందంటే పైత్యం పరాకాష్ఠలో ఉన్నట్లు! వైద్యుడిని సంప్రదించాల్సిందే!" అంటూ పకపకా నవ్వింది చారుమతి.
"నిన్నూ!..."అంటూ కోపంగా చిలుకను పట్టుకోబోయాడు యయాతి.
తుర్రుమని దగ్గరలో ఉన్న చెట్టెక్కింది చారుమతి.
ఇంతలో అక్కడికి శక్తిధరుడు, పింగళుడు వచ్చారు.
"చూడు శక్తిధరా! మన మిత్రుడు శర్మిష్ఠ రాకుమారిని చూడటానికి నిమిషాలను లెక్క పెట్టుకుంటున్నాడు.ఈ అవస్థ నేమంటారో చెప్పు!" అంటూ కిలకిలా నవ్వింది చారుమతి.
"ఏదీ! ఎన్ని లిప్తలు ఉన్నాయో లెక్క వేసి చెప్పు! నీ ప్రేమరోగం ఏ స్థాయిలో ఉందో మేము లెక్క వేస్తాము!" అంటూ పింగళుడు పరిహాసం చేశాడు.
ఒక్కసారిగా అక్కడి వాతావరణం అంతా పరిహాసాలతో, ఛలోక్తులతో మార్మ్రోగి పోయింది.
======================================================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 21 త్వరలో
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.



Comments