top of page
Original.png

ఉగాది 2026 కథల పోటీలు

#UgadiTeluguStoryCompetetition, ఉగాది2026కథలపోటీలు, #హాస్యకథలపోటీలు, #కొసమెరుపుకథలపోటీలు, #వారంవారంకథలపోటీలు


Ugadi 2026 - Telugu Story Competition By manatelugukathalu.com

Published On 01/10/2025

ఉగాది 2026 - కథల పోటీలు

నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్


విషయ సూచిక


1).ముందుమాట

2).ఉగాది 2026 కథల పోటీలు

3).హాస్య కథల పోటీలు

4).కొసమెరుపు కథల పోటీలు

5).వారం వారం కథల పోటీలు 

6).రచయితలకు గమనిక

7).బహుమతులకు సహకరిస్తున్న వారు


1. ముందుమాట

విజయదశమి కథల పోటీల గడువు 28/09/2025 తో ముగిసింది.

ప్రచురణ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. మిగిలిన కథల ప్రచురణ 05/10/2025  తో పూర్తి అవుతుంది.

ఫలితాలు 15 /10 /2025  న మనతెలుగుకథలు.కామ్ లో వెలువడుతాయి.

29 /09 /2025  నుండి మాకు చేరే కథలు ఉగాది 2026 కథల పోటీకి పరిశీలించబడతాయి.

ప్రచురణ 05 /10 /2025 నుండి ప్రారంభమవుతుంది.



2. ఉగాది 2026 కథల పోటీలు 

సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022, విజయదశమి 2022, ఉగాది 2023, విజయదశమి 2023, విజయదశమి 2024, ఉగాది 2025, విజయదశమి 2025 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.


ఇప్పుడు  ఉగాది 2026 కథల పోటీని ప్రకటిస్తున్నాము.

పోటీల కోసం ప్రత్యేకంగా కథలు పంపాల్సిన అవసరం లేదు.


29/09/2025 నుండి 19/03/2026 వరకు మాకు చేరే కథలనుండి (05/10/2025  నుండి 31/03/2026) వరకు ప్రచురితమయ్యే కథల నుండి ఉగాది 2026 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.


కథలు మాకు చేరవలసిన చివరి తేదీ: 19/03/2026

ఫలితాలు: 15/04/2026


ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.


ఉగాది 2026 కథల పోటీ బహుమతుల వివరాలు :


ప్రథమ బహుమతి    : రూ: 5000 /- 


ఐదు విశిష్ట(ప్రత్యేక) బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-


మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.


నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ప్రచురించిన రచనలు తిరిగి తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలు పంపగలరు.

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.

* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


story@manatelugukathalu.com అనేది మాకోసం ప్రత్యేకంగా కేటాయించుకున్న మెయిల్ ID.


కాబట్టి మెయిల్ ID కి చివర @gmaol.com @yahoo.com అని ఉండదు.

కేవలం story@manatelugukathalu.com అనే మెయిల్ ID కి పంపాలి.


*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.


*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 19/03/2026

ప్రచురణ 31/03/2026 నాటికి పూర్తి అవుతుంది.


*ఫలితాలు 15/04/2026 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు         ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం, షార్ట్స్ రూపొందించడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.


3). ఉత్తమ హాస్య కథల పోటీలు


అక్టోబర్ 2025 నుండి మార్చ్ 2026 వరకు ప్రతి నెలా ఒక ఉత్తమ హాస్య కథకు 500/- బహుమతి అందిస్తాము. ప్రతి నెలలో బహుమతి పొందిన కథలు ఉగాది 2026 కథల పోటీకి పరిశీలింపబడుతాయి. ఈ ఆరు కథలలో రెండు కథలకు (విశిష్ట/ప్రత్యేక ) బహుమతి 500/-  కూడా ఉంటుంది.

ఈ కథలకు బహుమతులను కీ.శే. కర్లపాలెం మధుసూదనరావుగారి జ్ఞాపకార్థం, శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు అందిస్తున్నారు. 

( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )


4). కొసమెరుపు కథల పోటీలు

ప్రతి నెలా ఒక కథను 'ఈనెల ఉత్తమ కొసమెరుపు కథ' గా ఎంపిక చేసి 500 /- పారితోషకంగా అందిస్తాము. ఈ పథకం మార్చ్ 2026 వరకు కొనసాగుతుంది.


ఆ సమయంలో నడుస్తున్న (విజయదశమి/ఉగాది) కథల పోటీలలో 'వారం వారం బహుమతులు' గెలుచుకున్న కథలతో పాటు, 'ఈనెల ఉత్తమ కొసమెరుపు కథ' గా ఎంపికైన కథలు కూడా పరిశీలింపబడతాయి.


ఈ కథలు ఎలా ఉండాలో ప్రముఖ రచయితలైన మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక అవగాహన కోసం కొన్ని లింక్స్ ఇస్తున్నాము. (అన్ని కథలు ఇలాగే.. ఇదే మూసలో ఉండాలని కాదు).


అక్టోబర్ నెలకు ఎంపికైన కథ ఫలితం నవంబర్ 15 నాటి మా పోస్ట్ లో ఉంటుంది.


ఈ కొసమెరుపు కథల పోటీని శ్రీమతి కర్లపాలెం రుక్మిణమ్మ గారి స్మారకార్థం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు.


( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )


5). వారం వారం కథల పోటీలు

అత్యంత జనాదరణ పొందిన వారం వారం కథల పోటీలను మార్చ్ 2026 వరకు పొడిగిస్తున్నాము.

రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.

బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.

విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.

వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.


ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15  వ తేదీ ప్రచురిస్తాము. 


6). కొత్త రచయితలకు గమనిక


*కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.

మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.


అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.


*కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు. 


మీ బ్రౌసర్ లో  www.manatelugukathalu.com అని టైపు చేస్తే  మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.


*మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com 


మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.


7). బహుమతులకు సహకరిస్తున్న వారు

*శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు కొసమెరుపు కథల పోటీని, కొత్తగా ప్రారంభిస్తున్న ఉత్తమ హాస్య కథల పోటీని స్పాన్సర్ చేసి బహుమతులు అందిస్తున్నారు.


వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.

రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు.

వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.


*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


*పెండేకంటి లావణ్య కుమార్తె జె.సాయినిధి తన దివంగత అమ్మమ్మ(పెండేకంటి లక్ష్మిపద్మావతి), నానమ్మ (జొన్నలగడ్డ పద్మావతి)ల ఙ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


*కొందరు రచయితలు తమ పారితోషకం మొత్తాన్ని ఇతర రచయితల బహుమతుల కోసం వెచ్చించమని కోరుతున్నారు.

***


పాఠకులకు, రచయితలకు మరొకమారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.


మల్లవరపు సీతారాం కుమార్



5 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Good lucky
Good lucky
15 hours ago
Rated 5 out of 5 stars.

Khi tìm hiểu sâu hơn về cách các nền tảng giải trí trực tuyến tối ưu giao diện, sc88 khiến mình chú ý bởi sự rõ ràng trong cách xây dựng hệ thống nội dung. Những chuyên mục như casino trực tuyến, thể thao, đá gà, bắn cá, game bài và nổ hũ được sắp xếp khoa học, hỗ trợ người dùng dễ dàng khám phá theo nhu cầu cá nhân. Mình nhận thấy cách trình bày tại đây hướng đến sự đơn giản, giảm cảm giác phức tạp khi có nhiều lựa chọn cùng lúc. Trong lúc trải nghiệm thực tế, tốc độ xử lý khá tốt, khả năng hiển thị ổn định và sự đồng bộ giữa các thiết…

Like

Good lucky
Good lucky
7 days ago
Rated 5 out of 5 stars.

While spending time on Sunwin, I appreciated how the platform separates different entertainment formats into areas that are relatively easy to recognize. The available sections include jackpot slots, card games, live casino, fish shooting, mini games, and other gaming options, giving users several ways to explore the content. The organized structure helps reduce visual clutter and makes the position of major categories easier to remember. I explored the card game and jackpot sections during my session, where navigation remained responsive and the page layout stayed consistent between different areas. The interface also maintained a straightforward visual hierarchy that supported quick scanning. Overall, the combination of diverse content, organized menus, and dependable page behavior creates a convenient browsing environment for regular…

Like

Rated 5 out of 5 stars.

เมื่อผมลองพิจารณา F168 ในมุมของผู้ใช้งานจริง สิ่งที่เห็นได้ชัดคือการจัดวางหมวดเกมค่อนข้างเป็นระเบียบ หมวดกีฬา คาสิโนสด และสล็อตถูกแยกออกจากกันอย่างชัดเจนทำให้การค้นหาข้อมูลไม่ซับซ้อน หน้าตาเว็บดูสะอาดและไม่แน่นจนเกินไป ปุ่มสำคัญมองเห็นง่ายช่วยให้เริ่มต้นใช้งานได้ไว แม้จะสลับระหว่างหมวดต่าง ๆ หลายครั้ง ระบบก็ยังตอบสนองได้ค่อนข้างนิ่ง ความเร็วการโหลดสม่ำเสมอจึงทำให้การใช้งานไหลลื่นพอสมควร

Like

Rated 5 out of 5 stars.

Khi đánh giá trải nghiệm từ góc độ khả năng tìm kiếm thông tin, tôi thấy 33win xây dựng cấu trúc nội dung khá dễ theo dõi. Những khu vực như thể thao, casino live, slot và xổ số được chia thành các cụm riêng, giúp người dùng nhanh chóng xác định đúng phạm vi mình quan tâm. Cách trình bày này đặc biệt hữu ích khi cần chuyển đổi liên tục giữa nhiều sản phẩm khác nhau. Trong quá trình sử dụng, tốc độ phản hồi tương đối ổn định và các bước điều hướng không tạo cảm giác rườm rà. Bên cạnh đó, cách hiển thị đồng bộ giữa các khu vực giúp người dùng dễ ghi nhớ vị…

Like

Rated 5 out of 5 stars.

Trong quá trình truy cập và theo dõi RR88 ở nhiều lần khác nhau, mình thấy nền tảng duy trì cách tổ chức nội dung khá nhất quán. Các danh mục như game bài, đá gà, xổ số và casino trực tuyến được đặt ở những vị trí dễ nhận biết, nhờ đó việc tìm kiếm trở nên nhanh chóng hơn. Mình nhận thấy cách phân nhóm chuyên mục khá hợp lý, giúp giảm số bước khi muốn chuyển từ khu vực này sang khu vực khác. Khi trải nghiệm game bài và đá gà, tốc độ phản hồi tương đối đều, thao tác chuyển trang diễn ra mượt nên quá trình sử dụng không tạo cảm giác bị gián đoạn.

Like
bottom of page