top of page

అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 1



'Appu Tachhulu Vakyarana Doshalu - 1' - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

'అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు


(అదేనండీ..

అచ్చు తప్పులూ వ్యాకరణ దోషాలూనూ..)



టైటిల్ చూసాక మీకు నవ్వు రాకపోతే మరోసారి చూడండి..


'అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు..' అని వుంది కదూ!


ఇప్పుడర్థమైంది కదా.. అసలు మేము చెప్పాలనుకున్నది ‘అచ్చు తప్పులు వ్యాకరణ దోషాలు..’ అని! కానీ అచ్చు తప్పుల వల్లో వ్యాకరణ దోషాలవల్లో ఆ వాక్యం అలా తయారయ్యింది.


ప్రింట్ మీడియా తగ్గి ఆన్లైన్ పత్రికలు పెరుగుతున్న ఈ రోజుల్లో అప్పు తచ్చుల స్థానాన్ని.. సారీ! అచ్చు తప్పుల స్థానాన్ని టైగింప్.. అదేనండీ..టైపింగ్ తప్పులు ఆక్రమించాయి.


ఈ క్రింది వాక్యాలు చూడండి..


అమ్మ అమ్మ అంటు కోపం గ వచ్చాడు బాలు

నాన్న కోపం ఎందుకు అంది బారతి.

నా ఛార్జర్ ఎక్కడ పెట్టవని అరిచాడు.

మీ నాన్న ని అడుగుతే కదా నన్ను ఎందుకు ఆడుతావానింది అమ్మ.

నాన్న నాన్న అంటు మల్లి ఆవెషంగ వెళ్ళడు బాలు.

నాన్న ఇంక అవేసంగా కొడుకుని అమ్మని అరుస్తాడు.


ఇవి ఒక కథలోని వాక్యాలు.


చదివే వారికి అర్థం కాక ఈ వాక్యాలనే మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుంది.


భాష మీద పట్టున్నవారికి ఇలా రాస్తున్నారేమిటని బాధ కలుగుతుంది.


సాధారణ పాఠకులకైతే విసుగు పుట్టి ఆ కథను చదవడం మానేస్తారు.


కానీ కథను పూర్తిగా చదివిన మా భావాలు మరోలా ఉన్నాయి.


ఈ కథలో కొడుకు తనకు ఎంత బాధ కలిగించినా ఆ తల్లికి కోపం రాలేదు. చివరి వరకూ అతడి బాగు కోసమే ఆలోచిస్తుంది. ఆ తల్లి ప్రేమ గురించి ఆ రచయిత చెప్పాలనుకున్నాడు.


అతని మనసులోని భావాలను సరైన వాక్యాల రూపంలో తప్పులు లేకుండా వ్యక్తపరిస్తే ఇది ఒక మంచి కథే అవుతుంది.


ఈ కథను తిప్పి పంపితే ఆ యువ రచయిత నిరుత్సాహంతో రచనలు మానుకోవచ్చు. అలాగని సవరించి ప్రచురించాలంటే ఎంతో సమయం వెచ్చించాలి.


టైపింగ్ తప్పుల వరకు సవరించినా, రచయిత భావ వ్యక్తీకరణ తీరును మార్చాలంటే కథలో వాక్యాలను కూడా చాలావరకు మార్చి ప్రచురించాలి.


పాత తరం రచయితలు తగ్గిపోతున్న ఈ తరుణంలో కొత్త రచయితల ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాఠకులను మెప్పించే విధంగా కొత్త రచయితలు తమ రచనలను మెరుగుపరచుకోవాలి.


కానీ రచయిత చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేనప్పుడు పాఠకులు తగ్గిపోతారు. పాఠకులు తగ్గితే పత్రికలూ తగ్గిపోతాయి.


అందుకే కొత్త రచయితలకు మెరుగులు దిద్దడం కోసం ఈ ధారావాహికను ప్రారంభిస్తున్నాము.


ఇందాకటి వాక్యాలనే మరొకసారి పరిశీలిద్దాం.


'అమ్మ అమ్మ అంటు కోపం గ వచ్చాడు బాలు

నాన్న కోపం ఎందుకు అంది బారతి.

నా ఛార్జర్ ఎక్కడ పెట్టవని అరిచాడు.

మీ నాన్న ని అడుగుతే కదా నన్ను ఎందుకు ఆడుతావానింది అమ్మ.

నాన్న నాన్న అంటు మల్లి ఆవెషంగ వెళ్ళడు బాలు

నాన్న ఇంక అవేసంగా కొడుకుని అమ్మని అరుస్తాడు.’




ముందుగా పై వాక్యంలో అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు మాత్రం సవరిస్తే ఇలా వ్రాయవచ్చు.


"అమ్మా! అమ్మా.. !" అంటూ కోపంగా వచ్చాడు బాలు.

"నాన్నా! కోపం ఎందుకు?" అంది భారతి.

"నా ఛార్జర్ ఎక్కడ పెట్టావని అరిచాడు.

"మీ నాన్నని అడిగితే కదా.. నన్ను ఎందుకు అడుగుతా"వనింది అమ్మ.

"నాన్నా.. నాన్నా.. " అంటూ మళ్ళీ ఆవేశంగా వెళ్ళాడు బాలు.

నాన్న ఇంకా అవేశంగా కొడుకుని భార్యని అరుస్తాడు.


ఇప్పుడు ఈ వాక్యాలు ముందుకంటే మెరుగయ్యాయని తెలుస్తోంది కదా! కాస్త శ్రద్ధగా టైపు చెయ్యడంతో పాటు వ్యాకరణ చిహ్నాలు సరిగ్గా వాడటంవల్ల చదివేవారికి చాలా సులభంగా ఉంటుంది.


ఇక తరువాత తెలుసుకోవలసింది భావ వ్యక్తీకరణ.


ఇక్కడ రచయిత చెప్పాలనుకున్నది- మొబైల్ ఛార్గర్ కనపడలేదని కొడుకు కోపంగా తల్లిని ప్రశ్నించడం.

ఇప్పుడు మనం రచయిత భావాన్ని మరింత మెరుగ్గా చూపించడానికి ప్రయత్నిద్దాం. సినిమాలో హీరో విలన్ ని కాలితో తంతాడు. ఇది హీరో చేసిన యాక్షన్. విలన్ గాల్లోకి ఎగిరి నాలుగైదు పల్టీలు కొడతాడు. ఇది రియాక్షన్. విలన్ అలా పడడం వల్లే హీరో బలంగా కొట్టినట్లు మనకు అనిపిస్తుంది.


మన కథలో కూడా బాలుకి వచ్చిన కోపానికి అతని తల్లి రియాక్షన్ చూపిద్దాం.


"అమ్మా! అమ్మా.. !" అంటూ కోపంగా వచ్చాడు బాలు.

వంటింట్లో గిన్నెలు సర్దుతూ ఉన్న అతని తల్లి భారతి ఆ అరుపులకు ఉలిక్కిపడింది. ఆమె చేతిలో ఉన్న గిన్నె కింద పడిపోయింది. తేరుకొని హాల్లోకి వస్తూ "ఏమైంది నాన్నా" అంటూ కొడుకుని అడిగింది.


ఈ విధంగా రాసినప్పుడు కొడుక్కి ఛార్జర్ కనపడలేదని బాగా కోపం వచ్చిందని, ఆ కోపాన్ని తల్లి మీద చూపాడని పాఠకులు సులభంగా గ్రహిస్తారు.


ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. ప్రతి సందర్భంలో ఇలానే రాయాలని కాదు.


కథ ప్రకారం కొడుకు తనని తిట్టినా, విసుక్కున్నా ఆ తల్లి భరిస్తుంది.

అలాంటప్పుడు

"మీ నాన్నని అడిగితే కదా.. నన్ను ఎందుకు అడుగుతా"వనింది అమ్మ. అనే వాక్యం సరికాదు. కానీ కథ ప్రకారం బాలు తండ్రిని అడగడానికి వెళ్ళాలి.


ఆ తల్లి మాటల్ని ఇలా మార్చి చూద్దాం..


"స్టవ్ మీద నీకిష్టమైన ఆలు ఫ్రై చేస్తున్నాను. అయ్యాక వెతుకుతాను. ఈలోపల మీ నాన్నగారేమైనా తీసారేమో.. ఒకసారి అడిగి చూడు. లేదా మరీ అర్జెంట్ అయితే స్టవ్ ఆపేసి వస్తాను" అంటుంది అతని తల్లి.


ఇలా చెబితే ఆమెది సర్దుకుపోయే స్వభావమని పాఠకులు సులభంగా గ్రహిస్తారు.


తరువాత బాలు తండ్రి దగ్గరకు వెళ్లి "నాన్నా! నా ఛార్జర్ ఏమైనా చూసావా?" అని అడుగుతాడు.


ఆ తండ్రి కోపంతో "నీ చార్జరేమిటి? నీ ఫోను, ఛార్జర్ నేను కొనిచ్చిందే కదా.. నాది సరిగ్గా పని చేయడం లేదని ఇది తీసుకున్నాను" అంటూ వంటిట్లోకి వెళ్లి, "ఏమిటీ.. కొడుకుని నా మీదకి ఎగదోలుతున్నావ్? ఇద్దర్నీ తన్ని తరిమేస్తాను, జాగ్రత్త" అంటాడు.


ఇక్కడ తండ్రి స్వభావం తెలుస్తుంది.


కొడుకు కోప్పడ్డందుకు బాధ పడ్డ భార్యను ఓదార్చక పోగా తాను కూడా అరుస్తాడు.


కొడుకుని సరిదిద్దాలని ఏమాత్రం అనుకోడు. ఆ స్వభావం పై వాక్యాల్లో అర్థమవుతుంది.


ఇలా ఒక పేరా కోసం మేము ఎంతో శ్రద్ధ తీసుకొని కథలు సవరించి ప్రచురిస్తున్నాము.


కానీ యువ రచయితలకు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తే వారు భవిష్యత్తులో మంచి రచయితలుగా రూపు దిద్దుకుంటారనేది మా ఆశ. పాత తరం రచయితలు తగ్గి పోతున్న తరుణంలో యువతరాన్ని సాన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అందుకోసం తప్పులు లేకుండా ఎలా రాయాలి అనేదానితో మొదలు పెట్టి మంచి రచయితలుగా ఎదగడానికి ఉపయోగ పడే సూచనల వరకు ఒక ధారావాహికలా అందించాలని సంకల్పించాము.


ఈ ధారావాహిక ను యువ రచయితలందరూ తప్పకుండా చదివి, తమ నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకుంటారని ఆశిస్తున్నాము.


యువ రచయితలు తమకు ఏ విషయాలపైన సందేహాలున్నాయో కామెంట్ల రూపంలో తెలియజేస్తే తదుపరి ఎపిసోడ్ లలో వాటికి వివరణను అందిస్తాము.


ఎవరూ ఏ రంగంలో పూర్తిగా నిష్ణాతులమని అనుకోకూడదు. మేము కూడా అందుకు మినహాయింపు కాదు. కాబట్టి సీనియర్ రచయితలు మేము అందించే విషయాలలో పొరపాట్లు వుంటే మాకు తెలియజేయండి. తదుపరి ఎపిసోడ్ లలో సవరిస్తాము.


వ్యాకరణ పాఠాలు చెప్పే ఉద్దేశం మాకు లేదు. కానీ రచయితలందరూ వీలైనంతవరకు ఒక పద్ధతిని పాటిస్తే పాఠకులకు చదవడం సులభమవుతుంది. రచయితలకు సహాయకారిగా ఉండేలా ఈ వ్యాస పరంపరను రూపొందించడంలో సీనియర్ రచయితలు, తెలుగు భాషా ప్రవీణులు సహకరిస్తారని ఆశిస్తున్నాము. వీలైనంతవరకు ప్రతి పది రోజులకు ఒక ఎపిసోడ్ అందేలా ప్రయత్నిస్తాము.


రచయితలు, పాఠకులు తమ సూచనలను ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

========================================================================

ఇంకా వుంది..

అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 2 త్వరలో..

========================================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).






























66 views2 comments
bottom of page