top of page

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు


గడువు తేదీ 15/01/2024 కి పొడిగించబడింది.

Ugadi 2024 Telugu Serial Novel Competition By manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు


విషయ సూచిక:

1. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు

2.కొత్త రచయితల సమాచారం కోసం…

3 .బహుమతులకు సహకరిస్తున్న వారు

4. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )


1. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు


ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-


మూడు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-


మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.


నిబంధనలు :


*సీరియల్ నవల కనీసం పది భాగాలుగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు.


*ప్రతి భాగంలో సుమారు 8౦౦ పదాలు ఉండాలి.


*వారానికి ఒక ఎపిసోడ్ ప్రచురింపబడుతుంది.


*మొత్తం నవల ఒకేసారి పంపాలి.


*రచయితలు తామే ఎన్ని వారాలు ప్రచురించాలనుకుంటున్నారో అన్ని భాగాలుగా విభజించి పంపాలి.


*మరుసటి భాగం కోసం పాఠకులు ఎదురు చూసేలా రాయాలి.


*సీరియల్ నవలలు పంపాల్సిన చివరి తేదీ 31/12/2023.

గడువు తేదీ 15/01/2024 కి పొడిగించబడింది.  

*ఫలితాలు 15/04/2024 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.


ఉగాది 2023 పోటీ నవలల ప్రచురణ మార్చ్ 2023 తో పూర్తి అయింది. కాబట్టి ఏప్రిల్ 2023 నుండి ప్రచురితమయ్యే నవలలు పోటీకి పరిశీలించబడతాయి.


*కాపీ నవలలు, ఇదివరకే ప్రచురింపబడ్డ నవలలు, అనువాద నవలలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న నవలలు పంపరాదు.


*మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.


*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ నవలలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.


*ఒకరు ఎన్ని సీరియల్ నవలలైనా పంపవచ్చును.


*వెంటనే మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే నవలలు పరిశీలింపబడవు.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.


*గమనిక: ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.


*మనతెలుగుకథలు.కామ్ లో ఒకసారి ప్రచురింపబడ్డ కథలు, నవలలు ఎట్టి పరిస్థితులలోను తొలగింప బడవు. ఇందుకు సమ్మతించేవారే తమ రచనలను పంపవచ్చు.


*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.


*బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.


2.కొత్త రచయితల సమాచారం కోసం...

కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.

మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.

అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.


ఏప్రిల్ 2023 నుండి అక్టోబర్ 2023 వరకు ప్రచురింపబడి, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి విజయదశమి 2023 బహుమతులు ఎంపిక చేయబడతాయి.

ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.

మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.

మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.


3 .బహుమతులకు సహకరిస్తున్న వారు:

వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.


రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. కథను మీరే ఎంపిక చేయవచ్చు.


వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.


ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.


*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


4. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )


రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.

బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.

విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.

వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.

June 2023 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు:

వారానికి ఒక బహుమతిని ఎంపిక చేస్తామని ప్రకటించినా చక్కటి కథలు ఎక్కువ రావడంతో మరిన్ని కథలను ఎంపిక చేస్తున్నాము.

( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి )


రచయితలకు, పాఠకులకు మా వందనాలు తెలియజేసుకుంటున్నాము.




895 views0 comments
bottom of page