కచదేవయాని - పార్ట్ 14
- T. V. L. Gayathri

- Oct 1
- 4 min read
Updated: Oct 6
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 14 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 01/10/2025
కచదేవయాని - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. చెలికత్తెలతో పురుష వేషంలో వేటకు వెళుతుంది శర్మిష్ఠ. అక్కడ ఆమెకు నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి తారస పడతాడు.
తనపై దాడికి దిగిన శర్మిష్ఠ అనుచరులను ఓడించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు యయాతి. తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి ఆయనను ఆహ్వానిస్తాడు. శర్మిష్ట గీచిన చిత్రాన్ని బట్టి, ఆమెతో తలపడింది యయాతి అని గ్రహిస్తాడు ఆమె తండ్రి వృషపర్వుడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 14 చదవండి.
తోటలోకి వచ్చి, అక్కడ ఉన్న సరస్సు ఒడ్డున కూర్చుంది శర్మిష్ఠ.
ఆమె మనసంతా చిత్ర విచిత్రమైన భావనలతో ఊగిసలాడుతోంది. చుట్టూ ఉన్న పరిసరాలు ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నాయి. ప్రతి రోజూ వినిపించే పక్షుల కిలకిలా రావాల్లో ఏదో తెలియని మధురనాదం వినిపిస్తోంది. ఆ నాదం మనసును మృదువుగా తట్టి లేపుతోంది.
ప్రకృతి అంతా నూతనంగా వర్ణమయంగా కనిపిస్తోంది. ప్రతి చెట్టూ పుట్టా కూడా తనతో ఏదో చెప్పాలను కొంటున్నాయనిపిస్తోంది. పూవులన్నీ తనను చూచి గుసగుసలాడు కొంటున్నాయేమో!.. చివరకు సరస్సులోని తామరలు కూడా తన వైపు చూచి నవ్వు కొంటున్నాయని భావిస్తోందామె.
అయితే ఈ కొంగ్రొత్త ఊహలను ఆమె ఎవరితోనూ పంచుకోవాలని అనుకోవడం లేదు. ఇంతకుముందు అయితే ఆమె ఏ కొత్త విషయాన్ని తెలుసుకున్నా వెళ్లి తన చెలులందరితో చెప్పేసేది. పరిగెత్తుకుంటూ వచ్చి దేవయానితో చెప్పి సందడి చేసేది. అయితే ఇప్పుడు కలిగిన భావనని ఆమె తన మనసులోనే దాచి పెట్టాలనుకుంటోంది.
ఆ ప్రేమ పరిమళాన్ని తానొక్కటే అనుభవించా లనుకుంటోంది.

దీనికంతటికీ కారణం ఆ యువకుడు! అతడి దరహాసం ఆమె లేత మనసును గిలిగింతలు పెడుతోంది. అతడి చూపుల్లోని సమ్మోహనత్వం ఆమె నిర్మలమైన హృదయాన్ని ఆకర్షిస్తోంది. ఆమె మనసులో అతడి రూపం కలకలాన్ని రేపుతోంది. దీని అర్ధం ఆమె బాల్యావస్థను దాటి యవ్వనం లోకి అడుగు పెడుతోందని! యవ్వనంలో కలిగే ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
శర్మిష్ఠ వాళ్లు వేట నుండి వచ్చారని దేవయానికి తెలిసింది. మామూలుగా అయితే శర్మిష్ఠ పరిగెత్తుకుంటూ దేవయాని దగ్గరికి వచ్చిఏకబిగిన అన్ని విశేషాలు చెప్పేసేది. కానీ ఈరోజు ఆమె తోటలో కూర్చొని ఆ యువకుడి గురించే ఆలోచిస్తోంది.
తోటలో శర్మిష్ఠ ఉందని తెలిసి అక్కడికే వచ్చింది దేవయాని. దేవయాని రాకను గమనించలేదు శర్మిష్ట. ఆమె దగ్గరగా వచ్చింది దేవయాని.
"ఏమిటి శర్మిష్ఠా! అంత పరధ్యానంగా ఉన్నావు?"
ఉలిక్కిపడింది శర్మిష్ఠ.
" ఏం లేదు.. ఏం లేదక్కా!.. " అంది తడబడుతూ.
" వేట ఎలా సాగింది? "
"బావుందక్కా!.. చాలా ఠీవిగా.. అందంగా.. వీరోచితంగా.. "
"నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అడిగింది వేట గురించి!.. అందంగా ఠీవిగా ఉండటమేమిటి?"
దేవయాని నవ్వుతూ ప్రశ్నిస్తుంటే అప్పుడు స్పృహలోకి వచ్చింది శర్మిష్ఠ.
"అదే.. అది.. ఒక పెద్ద పులి.. చాలా బాగుందని చెప్తున్నా!" నసిగింది శర్మిష్ఠ.
"చంపేశావా మరి?"
" ఊ!.. చంపేశాను!" అని శర్మిష్ఠ బదులిచ్చింది కానీ వేటలో జరిగిన విషయాన్ని దేవయాని దగ్గర దాచి పెట్టాలని అనుకుంటోందామె. పైగా ఈ సమయంలో దేవయాని వచ్చి తన ఆలోచనలను భగ్నం చేయటం అస్సలు నచ్చటం లేదు శర్మిష్ఠకు. ఆమె మనసు ఏకాంతాన్ని కోరుకొంటోంది.
' ఈ రోజు శర్మిష్ఠ ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది' అనుకుంది దేవయాని.
ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ పెద్దగా సాగలేదు.
నీరెండ శర్మిష్ఠ బుగ్గల మీద ప్రతిఫలిస్తోంది.
కాసేపటికి లేచి “ఇంక వెళదామా అక్కా!” అంది శర్మిష్ఠ.
"సరే పద!" అంటూ ఆమె వెంట కదిలింది దేవయాని.
ఆ రోజు రాత్రి దేవయాని గదిలోకి రానేలేదు శర్మిష్ఠ.
'ఈ పిల్ల కేమైంది? వేటకు వెళ్లి వచ్చిన దగ్గర్నుంచి అంత ఉదాసీనంగా ఉంది? ఆ అరణ్యంలో ఏదో జరిగి ఉంటుంది.' అనుకుంది దేవయాని.
ఎంతసేపు ఆలోచించినా ఏమి జరిగుంటుందనే విషయాన్ని ఆమె కనిపెట్టలేక పోయింది. ఆమె ఊహకు ఏమీ తట్టడంలేదు.
======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments