top of page

ప్రయాణం - పార్ట్ 3

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #ప్రయాణం, #Prayanam, #TeluguAdventureStories, #TeluguSuspenseStories, #సస్పెన్స్, #హర్రర్

ree

Prayanam - Part 3/4 - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 30/09/2025 

ప్రయాణం - పార్ట్ 3/4పెద్ద కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


జరిగిన కథ  : 

శ్రీశైలం టూర్ బయలుదేరుతారు మరీచి, శీతకర్.


దారిలో వీళ్ళ కార్ ను ఓవర్ టేక్ చేసిన కార్ ఆగి ఉండటంతో ఆ కారు దగ్గరకు ఆవేశంగా వెళ్తాడు శీతకర్. ఆ కార్లోవాళ్ళు స్పృహ తప్పి ఉండటంతో అంబులెన్ కు కాల్ చేసి, తిరిగి ప్రయాణం కొనసాగిస్తారు. కొంతసేపటి తరువాత దుర్మధ్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి వీళ్లను అటాక్ చేస్తాడు. శీతకర్ ను గాయపరిచి, మరీచిని తీసుకొని వెళ్తారు. 


 ఇక ప్రయాణం పార్ట్ 3 చదవండి..  


ఇంతలో ఒక అందమైన చిన్న కారు వచ్చి ఆగింది అక్కడ. అందులో నుంచి అందమైన అప్సరసలాంటి అమ్మాయి దిగింది. లేటెస్ట్ మోడరన్ డ్రెస్ లో ఉంది. వాళ్లంతా ఆగిపోయి ఆమె వైపు నోరు వెళ్ళబెట్టుకుని చూడసాగారు. 


 "ఏయ్! ఎవరు మీరు? ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు?" అని అడిగింది కోకిల కంఠంతో.


ఆమె మాటలో కమాండింగ్ ఉంది. కానీ ఏమాత్రం కోపం రాలేదు వాళ్లకు. ఆమె వంక మైమరచి చూస్తున్నారు. ఆమె మళ్లీ రెట్టించి, అడిగింది. 


 మరీచిని పట్టుకుని ఇద్దరు వెనుకగా నిల్చున్నారు. దుర్మధ్, మరొకడు వాళ్లకు అడ్డంగా మరీచి కారులో వచ్చిన అమ్మాయికి కనిపించకుండా నిలబడి, ఆమెకు జవాబు చెప్పారు. 

"ఇక్కడే వీళ్ళ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. బాగా గాయాలు అయ్యాయి. అందుకే జాగ్రత్తగా పట్టుకుని ఈమెను నడిపిస్తూ ఉన్నాం! ఇక్కడే.. ఆ ప్రక్కన ఏదో ఊరు ఉందని హాస్పిటల్ కోసం తీసుకుని వెళుతున్నాం!" అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పాడు దుర్మధ్.

 

మిగతా వాళ్ళు మరీచి నోరు గట్టిగా మూసి ఉంచారు. సౌండ్ బయటకు రాకుండా బలంగా నోరు మూశారు. 


"అయితే పదండి! ఇది మా ఊరే! ఇక్కడే మా బంగ్లా ఉంది. మా మామయ్య డాక్టర్! మీకు కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు!" అని డ్రైవర్ ని తమ కారు తీసుకుని వెళ్ళమని చెప్పిందామె.

 

అతడు సరేనని కారును తీసుకుని అక్కడ్నుంచి వెళ్లాడు. తను ముందుకు నడిచింది. అలవాటు అయిన దానిలా చకచకా ఏమాత్రం తడుముకోకుండా నడిచింది. 

 ఒక ఆడదాని కోసం వెళితే మరో అప్సరస లాంటి ఆడది దొరికిందని లోలోపల సంబరపడ్డారు దుర్మధ్ అండ్ గ్యాంగ్. కానీ పైకి మంచిగా మాట్లాడారు. 


 "మరి మా కారు.. ?" అని అడిగాడు దుర్మధ్ ఆమెను.


 "ఇక్కడే పెట్టేయండి. పర్లేదు! ఇప్పుడు ఈ రాత్రిపూట ఎవ్వరూ ఇటువైపు రారు! మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళవచ్చు!ఎలాగో యాక్సిడెంట్ అయిన కారు కూడా ఉంది కదా! పొద్దున్నే చూసుకోవచ్చు లెండి! ఈ రాత్రికి ట్రీట్మెంట్ అయిపోతే, రేపటికి మీకు క్యూర్ అవుతుంది. అప్పుడు చక్కగా కారు తీసుకుని వెళ్లొచ్చు!" అంది ఆమె.


సరేనని ఆమె వెంట నడిచారు. ఆమె ఏది చెబితే అది కామ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు ఆ గ్యాంగ్. దుర్మధ్ ఆమె వెనుక నడుస్తుంటే, మిగతా వాళ్ళు మరీచిని పట్టుకుని దుర్మధ్ వెనుకగా నడవసాగారు. చీకట్లు కమ్ముకోవడం వలన మరీచి గింజుకోవడం, వీళ్ళు నోరు గట్టిగా మూసేయ్యడం ఆ బంగ్లా అమ్మాయికి తెలియలేదేమో! లేదంటే ఆమె సరిగ్గా గమనించలేదో! కానీ ఆ చీకట్లో ఎంతో చాకచక్యంగా ఆ అడవిలో నడుస్తోంది ఆమె. 


చిన్న దారి కనిపించింది ఆ చెట్ల మధ్యలో! ఆమె వెంట అలా కొద్దిదూరం నడవగానే

ఒక పెద్ద బంగ్లా కనిపించింది దుర్మధ్ అండ్ గ్యాంగ్ కి. లైట్ల కాంతిలో వెలిగిపోతోంది ఆ బంగ్లా. ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ గ్యాంగు. ఎప్పుడూ అలాంటి బంగ్లాను ప్రత్యక్షంగా చూడలేదు, సినిమాల్లో తప్ప!


"రండి! ఇదే మా బంగ్లా!" అని లోపలికి తీసుకుని వెళ్ళింది ఆమె. 


 లోపలికి వెళ్ళాక ఒక గది చూపించింది. 


 "మగవాళ్ళంతా ఈ రూమ్ లోకి వెళ్ళండి! మీకు అందరికీ మా తరపున ప్రత్యేక విందు! మందు, పొందూ కూడా!" హస్కీ వాయిస్ తో అంది అదోరకంగా నవ్వుతూ.


 ఆమె మాట్లాడిన తీరుకు మందు త్రాగకుండానే మత్తుగా అనిపించింది వాళ్లకు. ఆమె చెప్పిన విధంగా ఆ రూమ్ లోకి వెళ్లారు. 


 "మరీచి పోతే పోయింది. ఇంత అందమైన లేడీని ఎప్పుడూ చూడలేదు. ఆమెతో ఎంజాయ్ మెంట్ అంటే! అబ్బో.. ! తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది" అని ఫ్రెండ్స్ తో అంటూ లోపలికి వెళ్ళాడు దుర్మధ్.


 "అవును రా! ఇవ్వాళ నక్క తోక తొక్కి వచ్చినట్టు ఉన్నాం!" అన్నారు మిగతా ఫ్రెండ్స్ కోరస్ గా.


 ***


"నువ్వు ఈ రూమ్ లోకి నడువు!" అన్నది ఆమె మరీచిని ఉద్దేశించి.


తన పరిస్థితి వివరించి చెప్పబోతూ నోరుతెరిచింది మరీచి. ఆమెను నోరు తెరవవద్దని సైగ చేసింది. అది అర్థం చేసుకుని మారు మాట్లాడకుండా ఆ రూమ్ లోకి వెళ్ళింది మరీచి. 

 *****

వర్షం చినుకులు మొదలు అవ్వడంతో, ఆ చినుకులు పడి, ఆ శబ్దానికి, శరీరం అంతా వాన నీళ్లతో తడిసిపోవడంతో స్పృహలోకి వచ్చాడు శీతకర్. తలంతా బరువుగా అనిపించింది. అక్కడ ఉన్న తమ కారును చూడగానే జరిగిన విషయం గుర్తుకు వచ్చింది. 


"అమ్మో! మరీచిని ఎటు తీసుకుని పోయారో ఈ వెధవలు!" అనుకుని భయంతో చుట్టూ చూశాడు. 


తను రోడ్డు పైన ఉన్నాడు. ఆ పక్కనే వాళ్ళ కారు అలాగే ఉంది. ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించి చుట్టూ చూశాడు. మరీచి ఫోన్ అక్కడే పడి ఉంది. అదే రింగ్ అవుతోంది. దగ్గరగా వెళ్లి చూశాడు. మరీచి మామయ్య కాల్. ఫోన్ ఎత్తి విషయం వివరించగానే, పోలీసులను తీసుకుని వస్తానని భయపడొద్దని, లొకేషన్ షేర్ చేయమని చెప్పాడు. అలాగే చేశాడు శీతకర్. 


వీళ్ళ కారు కూడా ఇక్కడే ఉంది. అంటే.. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు. ఇది మెయిన్ రోడ్డు కాబట్టి ఈ అడవిలోకే వెళ్లి ఉంటారు! తనను అక్కడే.. "ఇక ఆపై ఊహించలేకపోయాడు


వాళ్ళు బాగా కొట్టడంతో వొళ్ళంతా నొప్పిగా ఉంది శీతకర్ కి. భార్య పరిస్థితిని తలచుకోగానే లేని శక్తిని తెచ్చుకుని ఆ అడవిలోకి పరుగులు తీశాడు. 


కొద్దిదూరం పరుగులు పెట్టిన తర్వాత ఏదో బంగ్లా కనిపించింది. పరుగుపరుగున అటు వెళ్ళాడు. లైట్లతో వెలిగిపోతోంది ఆ బంగ్లా. రాత్రి టైంలో ఈ బంగ్లా పట్టపగలులా వెలిగిపోతోందని ఆశ్చర్య పడ్డాడు. గేటు తీసుకుని ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. ఇంతలో బంగ్లా పక్కన సందులోనుంచి ఎవరో రావడం కనిపించి, అక్కడే ఉన్న చెట్టు చాటుకు వెళ్ళాడు. 


=======================================================================

ఇంకా వుంది..

ప్రయాణం - పార్ట్ 4/4 త్వరలో..

=======================================================================

సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page