top of page
Original.png

ప్రయాణం - పార్ట్ 1

Updated: Oct 18

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #ప్రయాణం, #Prayanam, Telugu Adventure Stories, Telugu Suspense Stories, #సస్పెన్స్, #హర్రర్

వారంవారం కథల పోటీలో బహుమతి పొందిన కథ

ree

ప్రయాణం - పెద్ద కథ ప్రారంభం

Prayanam - Part 1/4 - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 25/09/2025 

ప్రయాణం - పార్ట్ 1/4పెద్ద కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


"అన్నీ సర్దేసుకున్నారా? జాగ్రత్తగా వెళ్లి రండి! ఆరు లోపు అడవి బయటకు చేరాలి. లేదంటే గేటు మూస్తారట! అక్కమహాదేవి గుహలు కూడా మర్చిపోకుండా చూడండి. చాలా బాగుంటుంది.. " ఇలా చెప్పుకుపోతూ ఉంది ప్రమద.


"అబ్బా అమ్మా! ఎన్నిసార్లు చెప్తావు? జాగ్రత్తగానే ఉంటాం! వీలైనవి అన్నీ చూస్తాం! ఒక్కరోజే కదా లీవ్ పెట్టాం. ఇవ్వాళ చేరుకోవాలి ఎలాగైనా! రేపు అక్కడ చూసుకుని ఎల్లుండి కల్లా అంటే సండే రోజు రిటర్న్ అయి పోవాలి. మండే మళ్లీ ఆఫీస్. కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవుతాయని లీవ్ ఇంకా ఇవ్వలేదని చెప్పాను కదా! అక్కడికి చేరాక కాల్ చేస్తాను! బై!"అని ఠక్కున పెట్టేసింది మరీచి.


మరీచి, శీతకర్ ఇద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఒకే ఊరు వారు అవ్వడంతో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి, ప్రేమానురాగాలు ఏర్పడ్డాయి. పెద్దలకు చెప్పి, ఒప్పించారు. పెద్దల ఆశీస్సులతో రెండు నెలల క్రితం వారి పెళ్లి జరిగింది. హానీమూన్ షార్ట్ ట్రిప్ గా వెళ్ళేసి వచ్చారు. పెళ్లి జరిగిన వేళా విశేషం ఏమో కానీ ఆఫీసులో ఇద్దరికీ ప్రమోషన్స్ కూడా కలిసి వచ్చాయి. 


ఆఫీసులో వర్క్ బిజీ, వీకెండ్స్ కలిసి బయటకు వెళ్లి రావడం అంతా ఆనందంగా గడిచిపోతోంది. ఇలా ఉండగా శీతకర్ తల్లి కాల్ చేసింది. 


 "నీ పెళ్లి అయ్యాక దంపతులను శ్రీశైలం వెళ్లి, దర్శనం చేసుకుని రమ్మని చెప్పమని మన శాస్త్రి గారు చెప్పారురా! మంచిదట! ఈ హడావుడిలో మర్చిపోయాను. ఇప్పుడైనా వెళ్లి రండి!" అని చెప్పింది.


 లాంగ్ డ్రైవ్స్ వెళ్లడం అంటే ఇద్దరికీ సరదానే ఉండడంతో సరేనని చెప్పాడు తల్లితో. వీకెండ్ లో హైదరాబాద్ నుంచి కార్ లో వెళ్లి రావాలని అనుకున్నారు. ఇప్పుడు అందుకే ఈ ప్రయాణం. కావాల్సిన వస్తువులు కార్ డిక్కీలో పెట్టేశారు. 

 "ఇంకా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టనా?" అని అడిగింది మరీచి.


 "ఏమీ వద్దు! దారిలో బోలెడు హోటల్స్ ఉంటాయి కదా! ఎక్కడ అవసరం అయితే అక్కడే వెళ్లి తినవచ్చు! త్వరగా పదా! త్వరగా చేరుకుంటే, కాస్త టైం ఉంటుంది అన్నీ చూడడానికి" అన్నాడు శీతకర్.


 సరేనని అనుకుని బయలుదేరారు. ప్రయాణం ఆహ్లాదంగా సాగిపోతూ ఉంది ఇద్దరికీ. నచ్చిన కొత్త సినిమా సాంగ్స్ పెట్టాడు శీతకర్. ఇద్దరూ హాయిగా వింటూ, పాడుకుంటూ, మాట్లాడుకుంటూ వెళుతున్నారు. 


 "ఈ మధ్య మా ఫ్రెండ్ తన భర్తతో కలిసి రీల్స్ చేసి పోస్ట్ చేస్తోంది. మనం కూడా చేద్దామా? శ్రీశైలంలో నేచర్ చాలా బ్యూటీఫుల్ గా ఉంటుందట కదా! అక్కడ రీల్స్ చేస్తే చాలా బాగుంటుంది" అంది మరీచి.


 "ఛా! నాకు అవేమీ ఇష్టం ఉండదు. పర్సనల్ గా మనం ఎంజాయ్ చేస్తూ అందరికీ చూపించడం ఏంటి?" అన్నాడు అయిష్టత వ్యక్తం చేస్తూ.


 "ఓకే! కానీ ఫోటోలు ఒక్కటే కాదు వీడియో కూడా తీసుకుందాం! ఫర్ అవర్ మెమోరీ! రీల్స్ వద్దులే!" అంది వెంటనే మరీచి.


 "కొన్ని పర్టిక్యులర్ విషయాల్లో నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు! థాంక్యూ సో మచ్! ఐ లైక్ ఇట్! కొన్ని న్యూస్ లో చూసి, ఇలా స్ట్రిక్టుగా ఫాలో అవుతాను!" తను ఎందుకు అయిష్టత వ్యక్తం చేశాడో కారణాన్ని వివరిస్తూ అన్నాడు.

 

 "నువ్వు కూడా ప్రతి విషయంలో ఇలా అనవు కదా! నేను చెప్పేవి కూడా చేస్తావు! నా ఆలోచనకు కూడా విలువ ఇస్తావు! అదే నాకు నీలో ఎప్పుడూ నచ్చే విషయం! అందుకే ఐ లవ్ యూ సో మచ్! పెళ్లికి ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు! ఐయాం సో హ్యాపీ ఫర్ దట్!" అంది తను సంతోషంగా.


 అతను కూడా "ఐ టూ లవ్ యూ! నాది కూడా నీ విషయంలో సేమ్ ఫీలింగ్!" అన్నాడు సంతోషం, గర్వం తొణికిసలాడుతుండగా.


 మధ్యాహ్నం లంచ్ కి ఓ మంచి దాభా చూసుకుని తినేసి బయలుదేరారు. ఇద్దరూ డ్రైవింగ్ మార్చుకుంటూ వెళుతున్నారు. 


ఇద్దరికి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుని వింటూ వెళుతున్నారు. ఆ రోడ్ అంతా ప్రశాంతంగా ఉంది. జనాల సందడి లేదు. వచ్చే పోయే వాహనాలు తప్ప! ఇరువైపులా చెట్లు, తుప్పలూ మాత్రమే ఉన్నాయి. 


 ""రోప్ వే ఉందట అక్కడ! బోట్ రైడ్ కి కూడా తప్పకుండా వెళదాం!" అంది మరీచి సంబరంగా.


 "ఓ తప్పకుండా! రేపు ఉదయం దర్శనం చేసుకున్నాక, అవన్నీ వెళదాం!" అన్నాడు శీతకర్ కూడా సంతోషంగా

 అలా హాయిగా సాగుతున్న వారి ప్రయాణానికి అంతరాయం కలిగిస్తున్నట్టుగా రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న అడవిలోనుంచి నాలుగైదు నక్కలు అడ్డుగా వచ్చాయి. అవి రోడ్డు దాటి మరోవైపుకు వెళ్లాయి. కారు సడెన్ బ్రేక్ వేసి ఆపాడు శీతకర్. 


అవి వెళుతుంటే సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంది మరీచి. 

 తిరిగి మళ్లీ ప్రయాణం కొనసాగించారు. అలా కొద్దిదూరం వెళ్లారో లేదో ఒక కారు అడ్డంగా వచ్చి ఆగింది. కారును సడెన్ బ్రేక్ తో ఆపేసి, ఆ కారులో ఉన్న డ్రైవర్ ని తిట్టాడు శీతకర్. ఆ కారు కూడా కాస్త ముందుకు వెళ్లి ఆగిపోయింది. 


"పోనీలే! పదా! మనకు మళ్లీ లేట్ అవుంతుంది!" అని మరీచి చెబుతున్నా వినకుండా కోపంగా తమ కారు డోర్ తెరిచి, విసురుగా దిగి, ఆగిన కారు వైపుకు వెళ్లాడు శీతకర్!

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page