ప్రయాణం - పార్ట్ 4
- Sudha Vishwam Akondi
- 1 day ago
- 4 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #ప్రయాణం, #Prayanam, #TeluguAdventureStories, #TeluguSuspenseStories, #సస్పెన్స్, #హర్రర్

Prayanam - Part 4/4 - New Telugu Story Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 03/10/2025
ప్రయాణం - పార్ట్ 4/4 - పెద్ద కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
జరిగిన కథ :
శ్రీశైలం టూర్ బయలుదేరుతారు మరీచి, శీతకర్.
దారిలో వీళ్ళ కార్ ను ఓవర్ టేక్ చేసిన కార్ ఆగి ఉండటంతో ఆ కారు దగ్గరకు ఆవేశంగా వెళ్తాడు శీతకర్. ఆ కార్లోవాళ్ళు స్పృహ తప్పి ఉండటంతో అంబులెన్ కు కాల్ చేసి, తిరిగి ప్రయాణం కొనసాగిస్తారు. కొంతసేపటి తరువాత దుర్మధ్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి వీళ్లను అటాక్ చేస్తాడు. శీతకర్ ను గాయపరిచి, మరీచిని తీసుకొని వెళ్తారు.
ఇక ప్రయాణం పార్ట్ 4 చదవండి..
ఆ ఆకారం నెమ్మదిగా వచ్చి, ఆగి వెనక్కి చూసి చేయి ఊపింది. తిరిగి ఇటువైపు తిరిగినప్పుడు ఆకాశంలో వస్తున్న మెరుపుల కాంతి ఆమె ముఖంపై పడింది. అప్పుడు ఆ ముఖం చూసిన వెంటనే తనను మరీచిగా పోల్చుకుని పరుగెత్తుతూ దగ్గరకు వెళ్ళాడు శీతకర్.
"మరీచీ!.. మరీచీ.. " అని పిలిచాడు.
తను కూడా చూసి, దగ్గరకు వెళ్లి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది. వీపుపై నిమిరి ఓ నిముషం ఓదార్చి, బయటకు వెళ్లిపోవాలని అనుకున్నాడు.
"పదా! వెళ్లిపోదాం!" తన చేయి పట్టుకుని కారు వైపుకు పరుగులు తీశాడు.
కారు ఎక్కి కొద్దిదూరం వెళ్ళాక అడిగాడు.
"ఇంతకీ ఆ బంగ్లా ఎవరిది? వాడిదేనా? ఎలా తప్పించుకున్నావు?"
"వాడిది కాదు. ఒక అందమైన అమ్మాయిది. మమ్మల్ని వాళ్ళ బంగ్లాలోని ఒక రూమ్ లోనికి నన్ను తీసుకుని వెళ్ళింది. వాళ్ళందరినీ ఓ రూమ్ లోకి పంపించి, నన్ను వేరే డోర్ గుండా బయటకు పంపించి, రక్షించింది!" అని చెప్పింది మరీచి
"విచిత్రంగా ఉందే! అదృష్టం! మొత్తానికి క్షేమంగా బయటపడ్డావు! థాంక్స్ టు దట్ లేడీ!" అన్నాడు శీతకర్
*****
దుర్మధ్ అండ్ గ్యాంగ్ ఆ రూంలో కూర్చుని, అక్కడున్న పదార్థాలు తింటూ టివి పెట్టారు. అందులో బ్లూఫిల్మ్ వస్తోంది.
"ఇదేందిరా? ఇంత ఎంజాయ్ మెంట్ ఎప్పుడూ చూడలేదు" అన్నాడొకడు.
కాసేపటికి తమను తీసుకొచ్చిన యువతి ఆ టీవీ స్క్రీన్ లోకి వచ్చింది.
ఈలలు వేస్తూ వెర్రెక్కి పోయారు.
"మీకు మందు తాగడం.. ఇంకా మాట్లాడితే డ్రగ్స్ అంటే ఇష్టం కదా! లేడీస్ తో ఎంజాయ్ చేయడం పిచ్చి. నచ్చినవి తినడం, తాగడం, తిరగడం జంతువులకు మాత్రమే ఉంటుంది. మీరు మనుషుల్లా కనిపించే జంతువులు. కనిపించిన ప్రతి స్త్రీని ఎంజాయ్ చేయాలని అనుకోవడం రాక్షస లక్షణం.
మనిషిగా పుట్టి అలాంటి పనులు చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? ఈ శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ పైకి కనిపించేవి మాత్రమే! లోపల ఎలా ఉంటుందో తెలుసా!" అంటూ తన శరీరం పైన ఉన్న తోలు వాడిగా ఉన్న తన చేతి వేళ్ళతో తీసి చూపించింది. ఎముకలు, పేగులు అన్నింటితో ఒక అస్థిపంజరం కనిపించింది.
ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు. బయటకు వెళదామని డోర్ వద్దకు పరుగెత్తారు. కానీ అది మూసుకుపోయింది.
"మీకు బుద్ధి వచ్చేవరకు ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఇదిగో ఇటు చూడండి. వీడు అదే మీకు ఫుడ్ తెచ్చి ఇచ్చినవాడు. వీడు కూడా ఇలాగే కనిపించిన స్త్రీని నాశనం చేయడం, పొగరుగా తిరగడం చేశాడు. కానీ చివరికి చచ్చి, ఇప్పుడు ఇలా అయ్యాడు. ఇప్పుడు మీ రూమ్ లోనే ఉన్నాడు. చూడండి!" అని చూపించింది
అక్కడే పక్కనే నిలబడిన అతడు మాములు మనిషి నుంచి దయ్యం ఆకారంలోకి మారాడు.
"మీరు కూడా పని మానేసి, బేవర్సుగా తిరుగుతూ ఇలాంటి పనులు చేస్తే ఇలాగే అవుతారు" అని ఆగింది ఆమె.
"మాకు బుద్ధి వచ్చింది. ఎప్పుడూ అలా చెయ్యం. మమ్మల్ని వదిలిపెట్టు!" అన్నాడు దుర్మధ్, తప్పించుకుంటే చాలు అని మనసులో అనుకుంటూ.
"మీరు చెప్పే అబద్ధాలు నాకు తెలుస్తాయి. అంతేకాదు మీరు బుద్ధి వచ్చిందని చెప్పి, బయటకు వెళ్ళాక ఇలాంటి పనులు చేస్తే నాకు తెలిసిపోతుంది. నేను అక్కడికి వస్తాను. మీరు ఇందాక తిన్న వాటిలో నాతో కనెక్ట్ అయ్యే చిప్స్ ఉన్నాయి. మీరు మంచిగా వున్నంతకాలం ఏమీ కాదు. లేదంటే మళ్లీ మీరు ఇక్కడికి తీసుకుని రాబడతారు.
ఏ మంత్రగాడిని తెచ్చినా ఏ ప్రయోజనం లేదు. ఆ మంత్రగాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు!" అని గట్టిగా భయంకరంగా నవ్వింది
మళ్లీ టీవీలో వరుసగా అవే సీన్స్ రిపీట్ గా వస్తున్నాయి. మనుషులు రావడం, దయ్యాలుగా మారిపోవడం వస్తోంది కంటిన్యూగా. టీవీని రిమోట్ తో ఆఫ్ చెయ్యాలని ప్రయత్నం చేసి చూశారు. కానీ సాధ్యం కాలేదు. పోనీ పడుకుందామని చూస్తే భయంతో నిద్రనే రావట్లేదు. ఒక రెండు గంటలు కంటిన్యూగా అవే చూసేసరికి పిచ్చి పుట్టింది వారికి. తల బాదుకోవాలని అనిపించింది.
దెబ్బకు దిగివచ్చారు. మారిపోయామని ఏడుస్తూ చెప్పారు. ఇంచుమించు తెల్లవారుతుండగా డోర్ ఓపెన్ అయ్యింది. మళ్లీ హెచ్చరిక చేసి పొమ్మని చెప్పింది ఆమె.
బ్రతుకుజీవుడా అనుకుంటూ రోడ్డు పైకి పరుగుపెట్టారు. అక్కడ తమ కారు ఉంది. కానీ మరీచి వాళ్ళు లేరు.
తమ కారెక్కి పోదామని అనుకునేలోపు పోలీసులు వచ్చారు. వాళ్లకు జరిగింది చెబితే అటు వైపు వెళ్లి చూశారు. అక్కడ ఏ బంగ్లా లేదు. అటువైపుగా వస్తున్న ఆ ఊరివాడిని అడిగారు.
"ఇక్కడ ఒక బంగ్లా ఉండాలి కదా! రాత్రి వీళ్ళు చూశారు. రాత్రంతా వీళ్లు అక్కడే వున్నారు. ఒక అందమైన స్త్రీ తీసుకెళ్లి, భయపెట్టిందట"
"మీకు కనిపించిందా? మేమెవ్వరం చూడలేదు. కానీ మా పెద్దవాళ్ళు చెబుతుండగా విన్నాను. ఒక కథ ప్రచారంలో ఉంది.
చాలా ఏండ్ల క్రితం జరిగిన సంగతి. ఇక్కడే ఒకామె పెద్ద బంగ్లాలో వేశ్యా గృహం నడిపేదట!అప్పట్లో ఆ బంగ్లాలో వచ్చిన మంటల్లో తగలబడిపోయి, అందులో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారట! ఊరికి పీడాబోయిందని అనుకున్నారు అందరూ. కానీ ఆ మధ్య ఒకడు ఎవరో అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి పాడు చేయబోతే, ఎవరో ఒకామె రక్షించిందని విన్నా! అప్పుడు చనిపోయిన అవిడనే ఇలా వచ్చి, రక్షించిందని చెప్పుకున్నారు. రెండు, మూడు సంఘటనలు జరిగాయి అంటారు.
"ఆమె ఎన్నో సంసారాలు నాశనం చేయడం వల్ల వచ్చిన పాపం, ఆడపిల్లలను రక్షిస్తే పోతుందని ఎవరో మంత్రవేత్త ఆమెకు చెప్పాడనీ, ఆ పాపం పోగొట్టుకుంటే ఈ రూపం పోయి, మళ్లీ మనిషి జన్మ వస్తుందని ఆ మంత్రవేత్త చెబితే విని, అప్పట్నుంచి అలా స్త్రీలని రక్షిస్తుందని చెప్పగా విన్నాను. ఏమైంది సార్?" అని చెప్పి ఏమైందని పోలీసులను అడిగాడు.
"ఈ వెధవలు అలాంటి పనే చేయబోయారు. నువ్వు చెప్పిన కథ నిజమే! ఆమె ఒకమ్మాయిని రక్షించింది" అని పోలీసులు దుర్మధ్ వాళ్ళను తీసుకుని పోయారు.
కానీ ఈసారి మళ్లీ అలా చేయకూడదని, మంచిగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకునే పోలీసులతో వెళ్లారు దుర్మధ్ అండ్ గ్యాంగ్.
"నిజంగా నమ్మలేకపొతున్నా! ఏది ఏమైనా నువ్వు క్షేమంగా బయటపడ్డావు! గాడ్ సేవ్డ్ యూ!" అన్నాడు మరీచి మామయ్య.
"ఆ ప్రయాణం తలుచుకుంటేనే భయం వేస్తోంది!" అన్నారు మరీచి, శీతకర్.
"ఈసారి అందరం కలిసే వెళ్లి, ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుందాం! ఆయనే పిల్లల్ని కాపాడాడు!" అన్నది శీతకర్ తల్లి
"వచ్చేనెల వెళదాం! ఓ నాలుగు రోజులు ఉండి, చక్కగా దర్శనం చేసుకుని, వద్దాం! మీరిద్దరూ లీవ్స్ ముందే శాంక్షన్ చేయించుకోండి! మళ్లీ డ్రాప్ ఆయితే ఊరుకోను!" అన్నాడు శీతకర్ తండ్రి.
ఓకేనని బుద్ధిగా తలలు ఊపారు ఇద్దరూ.
=======================================================================
*** శుభం ***
=======================================================================
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments