top of page

కచదేవయాని - పార్ట్ 19

Updated: 2 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 19 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 24/10/2025

కచదేవయాని - పార్ట్ 19తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. 


తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అత్రి మహామునిని ఆహ్వానిస్తాడు యయాతి. ఆ యాగానికి వృషపర్వుడు కూడా వెళ్తాడు. మరీచి మహర్షి దగ్గర యయాతిని ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకోవాలన్న తన అభిమతం చెబుతాడు. నహుషునితో మాట్లాడుతానంటాడు మరీచి మహర్షి. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. 


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 19 చదవండి. 


పది రోజులుగా రాజు, రాణి రాజ్యంలో లేరు. నహుషచక్రవర్తి చేసే యజ్ఞానికి పరివారంతో సహా వెళ్లారని దేవయానికి తెలుసు గానీ ఆ యజ్ఞసమారోహంలో శర్మిష్ఠ వివాహం గురించి చర్చలు జరిగాయని మాత్రం ఆమెకు తెలియదు. తన తండ్రిగారు కూడా ఆ యజ్ఞానికే వెళ్లారు. ఆయన అక్కడినుండి నాగలోకానికి వెళ్తానని చెప్పారు. ఈ పదిరోజుల్లో శర్మిష్ఠ తన రాజ్యపరిపాలనా విషయాల్లో చాలా చురుకుగా పాల్గొంటూ, మంత్రులతో చర్చిస్తూ ఉండేది. దేవయానికి శర్మిష్ఠకున్న రాజ్యనిర్వహణాసామర్ధ్యాన్ని చూస్తే మటుకు చాలా అబ్బురంగా ఉండేది. తన దగ్గర, చెలుల దగ్గర చాలా చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ ఉండే శర్మిష్ఠ రాజ్య నిర్వహణలో ఇంత పరిణితిని ఎలా సాధించింది? 


ఈ పది రోజుల్లో శర్మిష్ఠ అప్పుడప్పుడూ దేవయాని దగ్గరికి వస్తూ పోతూ ఉంది కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఏదో పరధ్యానం.. ఇంకేదో ఉదాసీనత.. యయాతి గురించిన ఆలోచనలతో మనసులో సతమతమవుతూ ఉంది. 


చివరకు వృషపర్వుడు సుమాలినిదేవి రాచనగరుకు చేరుకున్నారు. రాజు, రాణి రావడంతో అంతఃపురం అంతా మరలా కోలాహలంగా మారింది. ఆ రాత్రి కూతురు దగ్గరికి వచ్చి నహుషచక్రవర్తి గృహంలో జరిగిన సమావేశం గురించి చెప్పారిద్దరు. వాళ్లు శర్మిష్ఠకు కానుకగా పంపించిన నగలను, పట్టువస్త్రాలను ఆమెకు అందజేశారు. 

 అయితే అన్ని విషయాలు సానుకూలమయ్యేదాకా యయాతితో జరుగబోయే వివాహ విషయాన్ని గోప్యంగా ఉంచాలని కూతురిని హెచ్చరించాడు దానవరాజు. 


ఎందుకంటే బృహదారణ్యంలో నూతన రాజ్యనిర్మాణం అనేది కొంచెం భారీ ప్రణాళిక. దానికి రాజ్యంలో ఎవరు సహకరిస్తారో ఇంకెవరు వ్యతిరేకిస్తారో తెలియదు! అలాగే అరణ్యానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు కూడా అంత సులభంగా అంగీకరిస్తాయని చెప్పలేము! పైగా క్రొత్త రాజ్యాన్ని నిర్మించి నహుషునికి కట్టబెట్టటం అంటే దానవులు ఒప్పుకుంటారా? కాబట్టి కొంత సంయమనంగా ఆలోచించాలి! ప్రస్తుతం మౌనంగా ఉండడం మేలు! రాజ్యంలో శర్మిష్ఠ పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా మాత్రమే దానవరాజు ప్రకటించాడు. 


శర్మిష్ఠ ఆనందానికి అవధుల్లేవు. యయాతితో వివాహం అనే ఆలోచన ఆమెలో నూతనోత్సాహాన్ని నింపింది. పుట్టినరోజుకు అతడు వచ్చి తనతో ఏం మాట్లాడతాడు? .. తనేలా మాట్లాడాలి? .. అనే నిరంతరం ఆలోచిస్తూ ఉంది. 

ree

ఆ రోజు సాయంత్రం శర్మిష్ఠ విరజాదేవి తనకు కానుకగా పంపించిన నగలు పెట్టుకొని, క్రొత్త చీరను సింగారించుకొని దేవయాని గదిలోకి వచ్చింది. 


 "అక్కా! మనం పూల తోటలోకి వెళ్దామా! "అంది హుషారుగా. 


 దేవయానికి కూడా సరదా వేసింది. మునుపటిలాగా శర్మిష్ఠ చలాకీగా ఉంది. 

"పద వెళ్దాం! "అంది. 


ఇద్దరూ తోటలో చెట్ల కింద నడుస్తున్నారు. 

దేవయాని అప్పుడు గమనించింది శర్మిష్ఠ పెట్టుకొన్న నగలను. 


"నీ రత్నాలహారం చాలా బాగుంది శర్మిష్ఠా! కొత్తదా? " అడిగింది కుతూహలంగా. 


"ప్రతిష్ఠానపురం మహారాణి విరజాదేవి నాకు కానుకగా పంపించారక్కా! ఈ కంకణాలను కూడా! "అంటూ తన చేతులకున్న కంకణాలను చూపించింది శర్మిష్ఠ. 


"చాలా బాగున్నాయి! "


మామూలుగా అయితే తన చీరలనో, నగలనో దేవయాని బాగున్నాయంటే చాలు శర్మిష్ఠ వెంటనే వాటిని తీసి"పెట్టుకో అక్కా! అంటూ దేవాయనికి ఇచ్చేసేది. దేవయాని మొహమాటపడితే ఊరుకునేది కాదు! .. ఆమె పెట్టుకొనే దాకా వదిలేది కాదు.. 

అలాటి శర్మిష్ఠ ఈ రోజు మౌనంగా ఉంది. 


ఎప్పుడూ శర్మిష్ఠ వస్తువులను వాడుకోవటానికి మొహమాటపడే దేవయాని అందుకు భిన్నంగా

"బాగుందీ హారం! ఏదీ ఇలా ఇవ్వు! నేను పెట్టుకొని చూస్తాను! "అంది. 


 విచిత్రం! 

శర్మిష్ఠ కంగారు పడింది. 


ఈ నగలు, ఈ చీర అత్తగారు పంపించినవి. తనకెంతో ప్రియమైనవి. ఒకవేళ ఈ హారాన్ని యయాతి ఎంపిక చేశాడేమో! .. దాన్ని ఇతరులకు ఎలా ఇస్తుంది? .. తన తండ్రి వివాహాన్ని గురించి సభలో ప్రకటించేదాకా చెలులతో కూడా విషయాన్ని చెప్పరాదు. రహస్యంగా ఉంచాలి. 


"అక్కా! ఈ నగలు కానుకగా వచ్చినవి.. నహుషచక్రవర్తి గారు పరివారంతో సహా నా పుట్టినరోజుకు వస్తారు! వాళ్ళు వచ్చినప్పుడు వీటిని అలంకరించుకోవాలి! ఇంతకంటే మంచి హారాలు రేపటికల్లా నీకు తెప్పించి ఇస్తాను! ఏమీ అనుకోకు! "అంది శర్మిష్ఠ నొచ్చుకొంటూ. 


"అరె! ఫరవాలేదు శర్మిష్ఠా! ఊరికే అడిగాను! అయినా ఈ హారం నీకే బాగుంది! "అంది దేవయాని నవ్వేస్తూ. 


కాసేపు తోటలో తిరిగి ఇద్దరూ అంతఃపురానికి వచ్చేసారు. 

 దేవయానికి చాలా బాధగా ఉంది. అభిమానంగా అనిపించింది. 


'తను ఎంత తప్పు చేసింది! .. పనికిమాలిన హారం కోసం శర్మిష్ఠను దేబిరించింది.. ఎంత లేకిగా ప్రవర్తించింది! .. ఇంకెప్పుడూ శర్మిష్ఠ పెట్టుకొన్నవి తను చచ్చినా పెట్టుకోదు.. అంతా తన ఖర్మ! కచుడిని వివాహం చేసుకొని ఉంటే ఇలాటి హారాలు కోకొల్లలుగా ఉండేవి.. ఏదీ! .. అక్కడ అదృష్టం తనని వెక్కిరించింది. తన తండ్రికి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. తనకు ఏం కావాలోఎలా తెలుస్తుంది?


తల్లి ఉంటే బాగుండు! వదిలేసి పోయింది! అక్కడ కూడా తనని దురదృష్టం జిడ్డులాగా పట్టుకుంది! కూతురికి నగలు నాణ్యాలు చేయించాలని.. మంచి మంచి చీరలు కొనిపెట్టాలని.. మంచి వరుడిని తెచ్చి పెళ్లి చేయాలనే ఊహలు తండ్రికి రానే రావు! .. ఎంతసేపు దేవతల మీద కక్ష పెట్టుకొని ఏవో ఉపాసనలూ సాధనలూ అంటూ చేస్తూ ఉంటాడు..


ప్రక్కన సుమాలినవిదేవి శర్మిష్ఠకు ఎన్నెన్ని విద్యలో నేర్పిస్తూ ఉంటుంది.. కూతురికి ఎప్పుడూ ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది.. నగలు, చీరలు, బొమ్మలు ఒకటేమిటి ప్రపంచంలో ఉత్తమమైనవి ఏమున్నాయో తెలుసుకుంటూ తెప్పించి కూతురు ముందు పెడుతూ ఉంటుంది. తన గురించి ఆలోచించేది ఎవరు? తల్లి లేదు.. తండ్రి పట్టించుకోడు.. '


ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారపాతంగా కారుతున్నాయి. ఆ రాత్రి దిండు తడిసిపోయేటట్లుగా ఏడ్చింది దేవయాని. 

======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments


bottom of page