కచదేవయాని - పార్ట్ 16
- T. V. L. Gayathri

- Oct 10, 2025
- 4 min read
Updated: Oct 14, 2025
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 16 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 10/10/2025
కచదేవయాని - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది.
తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అత్రి మహామునిని ఆహ్వానిస్తాడు యయాతి. శర్మిష్ట గీచిన చిత్రాన్ని బట్టి, ఆమెతో తలపడింది, ఆమె ఇష్టపడింది యయాతి అని గ్రహిస్తాడు ఆమె తండ్రి వృషపర్వుడు. యయాతి గుణగణాలు పరిశీలించి, తగినవాడైతే శర్మిష్ఠతో వివాహం జరిపిస్తానని ఆమెతో చెబుతాడు వృషపర్వుడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 16 చదవండి.
ప్రతిష్ఠానపురంలోకి అడుగు పెట్టగానే వృషపర్వునికి ఘనమైన స్వాగత సత్కారాలు లభించాయి. నహుష చక్రవర్తి తానే స్వయంగా వచ్చి దానవరాజును కౌగిలించుకొని, కుశల ప్రశ్నలు వేసి అతడిని పరివారంతో సహా విడిదికి తీసుకొని వెళ్ళాడు. ఇక నహుషుని పట్టమహిషి అయిన విరజాదేవి తన అంతఃపురస్త్రీలందరితో వచ్చి తన స్నేహితురాలయిన సుమాలినీదేవికి, ఆమె పరివారానికి ఎంతో ఘనంగా మర్యాదలు చేసింది.
బంధువులందరూ కలుసుకొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరికీ సమయం ఎలా గడుస్తుందో తెలియటం లేదు.
యజ్ఞవాటికను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అక్కడికి నారద, అగస్త్య, వశిష్ట, విశ్వామిత్ర, వామదేవ, జాబాలి, అంగీరస, కాశ్యప, మరీచి, భృగు, బృహస్పతి, శుక్రాచార్యుల వంటి గొప్ప మహర్షులు వాళ్ళ వాళ్ళ శిష్య, ప్రశిష్య గణాలతో వచ్చి యున్నారు.
వచ్చిన వారందరికీ యయాతి తన సోదరులతో కలిసి మర్యాదలు చేస్తున్నాడు. ఎన్నో లక్షలమంది పాల్గొన్న ఆ యజ్ఞంలో ఎవరికీ ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంటున్నారు నహుషుని పరివార సభ్యులు. ఒకవైపు అందరితో మాట్లాడుడుతూ మధ్యమధ్యలో యయాతి రెండు మూడు సార్లు వృషపుర్వుని దగ్గరికి వచ్చి 'ఏర్పాట్లు ఎలా ఉన్నాయని?ఏమన్నా కావాలంటే అడగమని' చెప్తున్నాడు.
" నేనేమన్నా కొత్త వాడినా రాజకుమారా! మీ నాన్నగారికి చిన్నప్పటి స్నేహితుడని. మీ కార్య నిర్వహణ చాలా బాగుంది! మాకు ఏమన్నా అవసరం వస్తే నిన్ను పిలిచి చెప్పేంత అధికారం కూడా నాకు ఉంది!నువ్వు మిగిలిన వాళ్ళని చూడు!నేనేమన్నా సహాయం చేయనా!"అన్నాడు నవ్వుతూ వృషపర్వుడు.
ఆ మాటలకు తను కూడా నవ్వేసి అక్కడే ఉండి కదిలాడు యయాతి.

"ఏమిటి విషయం దానవరాజా! యయాతి రాకుమారుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు? " అంటూ సరదాగా అడిగాడు అక్కడే కూర్చుని ఉన్న మరీచి మహర్షి. మరీచి మహర్షి వయసులో అత్రి మహామునితో సమానమైనవాడు.
"ఏమీ లేదు మహర్షీ! మీ దగ్గర దాపరికం ఎందుకు? నా కుమార్తెను యయాతి రాకుమారుడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను. అతడు యోగ్యుడైతే నహుషునితో సంబంధం గురించి మాట్లాడదామని!"విషయాన్ని చెప్పాడు వృషపర్వుడు.
"అలాగా!అయితే చాలా మంచిది!యయాతి రాకుమారుడు చాలా బుద్ధిమంతుడు. నేను చాలాసార్లు నహుషుని యజ్ఞాలకు వచ్చాను. మంచి కుర్రవాడు. మీ అమ్మాయిని నిరభ్యంతరంగా అతడికి ఇచ్చి వివాహం చేయవచ్చు. భద్రంగా చూసుకుంటాడు. " అని మరీచి మహర్షి యయాతి గురించి ప్రశంసిస్తూ చెబుతుంటే సంతోషం వేసింది వృషపర్వునికి.
"మహర్షీ నా రాజ్యానికి వారసురాలు నా కూతురు శర్మిష్ఠ ఒక్కతే!నా కూతురునే సింహాసనం మీద కూర్చోబెడతాను. దానికి వరుడు ఒప్పుకోవాలి! ఇదీ నా కోరిక!" అంటూ తన మనసులోని మాట చెప్పాడు వృషపర్వుడు.
"నీకు ఇల్లరికం వచ్చే అల్లుడు కావాలా? అయితే యయాతి గురించి ఆలోచించకు!సంప్రదాయం ఏమిటంటే మీఅమ్మాయికి పుట్టే కొడుకుని నీ రాజ్యానికి వారసుడిగా తీసికొనిరా!ఆడపిల్ల పెళ్లి అయ్యాక నీ రాజ్యంలోనే ఎలా ఉంటుంది? ఒక పని చెయ్యొచ్చు!ఆమెను రాణిగా ప్రకటించి, ప్రతినిధిని పెట్టి రాజ్యాన్ని పరిపాలించటం మంచి పధ్ధతి. ఏమంటావు? నీ రాజ్యానికి ఎలా అయినా మీఅమ్మాయి, ఆమె బిడ్డలే వారసులే కదా!"
మరీచిమహర్షి చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు దానవరాజు. అతడు మౌనంగా ఉండటం చూసి మళ్ళీ మాట్లాడ సాగాడు మరీచి మహర్షి.
"ఆడపిల్లను అత్తగారింటికి పంపిస్తే ఆమెను తక్కువగా భర్త చూస్తాడని, ఆమెకు తగిన స్వాతంత్రం ఉండదని నీ భావన. నీకు మంచివాడు, సమర్ధుడు అయిన అల్లుడు కావాలా లేక నీ దగ్గరే ఉండే ఇల్లరికం అల్లుడు కావాలా? చెప్పు!నీ దగ్గర ఉండి, మీ అమ్మాయికి రాజ్య పాలనలో సహాయంగా ఉండే అల్లుడు కావాలంటే మాత్రం ఆలోచించాల్సిందే!.. దీనికి నహుషుడు ఎంత మాత్రమూ ఒప్పుకోడు. అతడి మనస్తత్వం నాకు బాగాతెలుసు!"
మహర్షి చెప్పింది వింటుంటే తన కోరిక తీరటానికి మార్గం అంత సుగమంగా లేదని పించింది వృషపర్వునికి.
"మహర్షీ!భార్యని కేవలం ఆడపిల్లగా మాత్రమే భావించి అంతఃపురంలో జీవమున్న బొమ్మ లాగా చూడకూడదని నా భావన. ఆడపిల్లల్లో శక్తి, చైతన్యం, జ్ఞానం అన్నీ ఉంటాయి. వాటిని వెలికి తీసినప్పుడే జాతికి భద్రత కలుగుతుంది. ఆడపిల్లలు ఎదగాలి. వివాహం చేసుకొన్న భర్త భార్య కున్న స్వాతంత్ర్యాన్ని హరించకూడదు!.. ఈ విషయాన్ని నహుషుడితో మాట్లాడాలి! యయాతికి అర్ధం కావాలి!"
మరీచి మహర్షికి వృషపర్వుని ఆవేదన అర్ధం అయ్యింది.
======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments