కచదేవయాని - పార్ట్ 17
- T. V. L. Gayathri

- Oct 14
- 4 min read
Updated: Oct 18
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 17 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 14/10/2025
కచదేవయాని - పార్ట్ 17 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది.
తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అత్రి మహామునిని ఆహ్వానిస్తాడు యయాతి. ఆ యాగానికి వృషపర్వుడు కూడా వెళ్తాడు. మరీచి మహర్షి దగ్గర యయాతిని ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకోవాలన్న తన అభిమతం చెబుతాడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 17 చదవండి.
దానవరాజు, తన కూతురి వివాహం విషయంలో భయపడుతున్నాడని అర్ధం అయ్యింది మరీచి మహర్షికి.
"వృషపర్వా!దిగులు పడకు!నా ధర్మపత్ని కళ. ఆమె ఎన్నో శాస్త్రాలను చదివింది. గురుకులాన్ని తను కూడా చూసుకుంటూ శిష్యులకు విద్యను బోధిస్తూ ఉంటుంది. నాకు శాస్త్రాధ్యయనంలో చాలా సహాయకారిగా ఉంటుంది.నేను ఆమెను కేవలం ఇల్లు దిద్దడానికో లేక పిల్లలను కనటానికో అన్నట్లుగా చూడటం లేదు.
అత్రి మహామునిని చూడు! ఆయన పత్ని అనసూయమ్మ యొక్క ఖ్యాతి ముల్లోకాల్లోనూ వ్యాపించింది.ఇంకా అరుంధతమ్మ గురించి వేరే చెప్పనక్కర్లేదు.లోపాముద్రాదేవి గురించి మనకు అందరికీ తెలుసు!ఇక్కడ ఉన్న స్త్రీ మూర్తులలో సగం మంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారే! ఎంతో విద్యావంతులే! అయితే నీవు చెప్పే విషయంలో కొంతవరకు నిజం ఉన్నమాట వాస్తవం. అంతఃపురాల్లో ఉండే స్త్రీలు అంతగా ఉన్నతమైన స్థితిని సాధించడం లేదు.
దానికి కారణం రాచరికపు కట్టుబాట్లు,సాంప్రదాయాలు..యుద్ధాల్లో మహిళలు పాల్గొనడం లేదు. యుద్ధవిద్య నేర్చుకునే వారి సంఖ్య మీ రాజపరివారాల్లో తక్కువగా ఉంటోంది.
మా ఋషి సంఘాల్లో ఆడవాళ్లు శాస్త్రాధ్యయనానికి,శిష్యులకు విద్యలను బోధించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే అవి కేవలం సాహిత్యవ్యాకరణ శాస్త్రాలు కానీ, ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ అవుతున్నాయి..ఇంతవరకూ ఆర్థిక శాస్త్రాన్ని గానీ,రాజనీతి శాస్త్రాన్ని గానీ, లేదా న్యాయశాస్త్రాన్ని గాని మహిళలు చదవటం లేదు.. కనీసం వాటి గురించి ఆలోచించడం లేదు. ఎక్కడా ఒక్క మహిళ అయినా మంత్రి పదవిలో ఉండటం కానీ, న్యాయస్థానాల్లో ఉండటం కానీ నేను ఇంతవరకు చూడలేదు. కనీసం లేఖకులుగా కూడా స్త్రీలు లేరు....
మహిళలు వైద్యశాస్త్రం చదివి కాన్పులు చేస్తున్నారు కానీ శస్త్రచికిత్సలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు... ఆలోచిస్తే కొంచెం బాధాకరంగానే ఉంది! స్త్రీలు అన్ని రంగాల్లో నిష్ణాతులు అవ్వాలి!...అయితే అది ఇప్పటికిప్పుడు సాధ్యం అవుతుందని చెప్పలేం!.. ఉన్నత వర్గాల్లో స్త్రీలు బయటికి రావటం లేదు.. వ్యవసాయాధారిత కుటుంబాల్లో స్త్రీలు బయటికి వచ్చి అన్ని పనులను చేస్తున్నారు. అయితే ఆ వృత్తులలో ఆడవాళ్లెవ్వరూ చదువుకోరు..ఇది ఇప్పుడు ఉన్న సంఘంలోని పరిస్థితి. మార్పు అనేది ఒక్క రోజులో రాదు!మెల్లమెల్లగా మనము దృష్టి పెట్టాలి!కొంత కాలానికి వస్తుంది... ఏమైనా నీ ప్రయత్నాన్ని మాత్రం అభినందించ వలసిందే!"

మరీచి మహర్షి చేతిని పట్టుకొన్నాడు దానవరాజు.
"మీరు చెప్పింది నిజం! ఆడపిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా గురుకులాలను పెట్టి అన్ని విద్యలను నేర్పించాలి!అయితే అందులో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. స్త్రీలకు బోధన చేయటానికి తగిన మహిళా సిబ్బంది ఎక్కడ ఉన్నారు? ఆడపిల్లల రక్షణ గురించి కూడా ఎంతో జాగ్రత్త అవసరం! నా లాంటి వాళ్ళు మాత్రం కొంచెం ఆడపిల్లల విద్యాభ్యాసం గురించి ఆలోచిస్తున్నారు. అది సామాన్యులకు సాధ్యం అవుతుందా? ఏమైనా ప్రస్తుతం నా సమస్య మా అమ్మాయి వివాహం. దాని గురించి మీరు మధ్యవర్తిత్వం చేసి, నహుషునితో మాట్లాడి సానుకూలమయ్యేట్లు చూస్తారా! మంచి కుర్రవాడిని వదులుకోవాలని లేదు.. పైగా బంధుత్వం కూడా ఉంది."
నవ్వుతూ వృషపర్వుని భుజం మీద చెయ్యి వేశాడు మరీచి మహర్షి.
"తప్పకుండా రాజా!యజ్ఞం అయ్యాక సమయం చూసుకొని అన్ని విషయాలు మాట్లాడతాను."
వృషపర్వుడు మరీచి మహర్షి రెండు చేతులను పట్టుకొని భక్తిగా కళ్ళకద్దుకొన్నాడు.
"మీరు నా వెనుక ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది మహర్షీ!"
"రాజా! నీకు శుభం కలుగుతుంది! "అంటూ వృషపర్వుడిని ఆశీర్వదించాడు మరీచిమహర్షి.
======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments