కచదేవయాని - పార్ట్ 21
- T. V. L. Gayathri

- Nov 3
- 4 min read
Updated: 5 days ago
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 21 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 03/11/2025
కచదేవయాని - పార్ట్ 21 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ అన్యమనస్కంగా ఉండటం గమనిస్తుంది దేవయాని. శర్మిష్ట ఇంటికి బంధుమిత్రుల రాక ఎక్కువవుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ అన్యమనస్కంగా ఉండటం గమనిస్తుంది దేవయాని. శర్మిష్ట ఇంటికి బంధుమిత్రుల రాక ఎక్కువవుతుంది.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 21 చదవండి.
శర్మిష్ఠ పుట్టినరోజు ఉత్సవానికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నారు నహుషుని పరివారసభ్యులు.
అప్పుడే పుష్కర ద్వీపం నుండి రాయబారులు వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించాడు నహుషుడు. పుష్కర ద్వీపాధిపతి వీతిహోత్ర చక్రవర్తి. అతడు నహుషునికి మిత్రుడు కూడా! ఇంతకు ముందు రెండు మూడు సార్లు తన పరివారంతో ప్రతిష్ఠానపురానికి వచ్చిన వాడు.
"మహారాజా!మీకు జయమగు గాక! మా పుష్కర ద్వీపంలో దేవేంద్రుల వారు వేదగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఆ సభకు ఒక్క రాక్షసజాతివాళ్ళు తప్ప దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుష జాతుల వారితో పాటు సప్త ద్వీపవాసులు, సర్వముని సంఘాల వాళ్ళు కూడా విచ్చేస్తున్నారు. భూలోక చక్రవర్తులైన మీరు, మీ పరివారం అందరూ కలిసి వచ్చిగోష్ఠిలో పాల్గొనాలని మా చక్రవర్తుల వారి ఆకాంక్ష! మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించి రమ్మని మమ్మల్ని పంపించారు " అంటూ ఆహ్వానపత్రాన్ని నహుషునికి అందచేశారు వీతిహోత్ర చక్రవర్తి రాయబారులు.
ఆ సభకు దేవేంద్రుడు అధ్యక్షుడు. కాదనకూడదు! ఎలాగా?
ఆ రాత్రి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యాడు నహుషుడు.
"మనం వీతిహోత్రుని ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు. వెళ్లి తీరవలసిందే!వృషపర్వునికి విషయాన్ని తెలుపుతూ దూతను పంపిద్దాం!" అన్నాడు నహుషుడు.
యయాతికి బాధగా ఉంది. అసలే శర్మిష్ఠ మీద విరహంతో బాధపడుతుంటే ఈ విఘ్నం ఏమిటి?
"పోనీ నేను, యయాతి కలిసి శర్మిష్ఠకుమారి పుట్టినరోజుకి వెళతాము! మీరు చిన్న కుమారులను తీసుకొని పుష్కర ద్వీపానికి వెళ్ళకూడదా!" అంది విరజాదేవి.
" లేదు విరజా! నా తర్వాత కాబోయే చక్రవర్తి యయాతి కదా! పక్కన యువరాజు లేకుండా నేను ఒక్కడినే వెళ్లడం మర్యాద కాదు! అందులో ఎన్నో జాతుల వాళ్ళు వస్తున్నారు. అందరి ముందు ఎన్నో విషయాలు చర్చకు వస్తాయి. ఆ సభలో మన యయాతికి కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. ఇటువంటి గోష్ఠుల వలన మన యువరాజు కున్న పాండిత్యం గురించి అన్ని లోకాలకూ తెలుస్తుంది. ఇక్కడ రాజ్య రక్షణకు యాతి కుమారుని ఉంచి తగిన ఏర్పాట్లు చేసి నీ వెంట సంయాతి కుమారుడిని పంపిస్తాను! అమ్మాయిని ఆశీర్వదించి వద్దువు కానీ!"వివరించాడు నహుషుడు.
"అందరం వెళితే వివాహాన్ని నిశ్చయం చేసుకొని రావచ్చు! మీరు లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళటం వలన ప్రయోజనం ఏమిటి?" నిరాశగా అంది విరజాదేవి.
మౌనంగా వింటున్నాడు యయాతి.
"పుష్కర ద్వీపానికి వెళ్లి రావటానికి ఎంత లేదన్నా నెల పైనే పడుతుంది. నువ్వు వృషపర్వుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తే బాగుంటుంది! వాళ్లు కూడా తృప్తి పడతారు! ఎవరమూ వెళ్లకపోతే వృషర్వుడు నొచ్చుకుంటాడు. పైగా దేవతలకు ప్రాముఖ్యత ఇచ్చామని బాధపడతాడు కూడా! నువ్వు సంయాతి కుమారునితో శర్మిష్ఠకుమారి పుట్టినరోజుకు వెళ్ళిరా!" అంటూ తీర్మానం చేశాడు నహుషుడు.
ఇంక చేసేది ఏమీ లేదు!
దిగులుగా తన గదిలోకి వచ్చాడు యయాతి. బెంగగా ఉంది అతనికి.
తప్పదు! ఈ బాధను భరించాల్సిందే!
అప్పుడే చారుమతి వచ్చింది అక్కడికి.
"ఏమిటి మిత్రమా దిగులుగా ఉన్నావు?" అడిగింది.
విషయం అంతా వివరించాడు యయాతి.
"అయ్యో ఇలా అయిందేమిటి?" అంటూ చారుమతి సానుభూతిగా తన ముక్కుతో యయాతి చేతి మీద గీస్తూ ఉంది.
అప్పుడే శక్తిధరుడు, పింగళుడు వచ్చారు.
"ఇలా జరిగిందేమిటి? హఠాత్తుగా దేవేంద్రుడు సభనేదో పుష్కర ద్వీపంలో ఏర్పాటు చేయటమేమిటి? దానవుల మీదకు యుద్దానికి బయలుదేరుతున్నాడా? ముందుగా అందరిని సిద్ధం చేయటానికి ఇలా గోష్ఠి అంటూ సమావేశం...."
సందేహాన్ని వ్యక్తం చేశాడు శక్తిధరుడు.
"అప్పుడు మనకు దానవరాజుతో శత్రుత్వం వస్తుందంటావా? మనం ఎవరి పక్షం ఉండాలి? "పింగళుడికి కంగారుగా ఉంది.
"అక్కడికి వెళ్తే కానీ ఏ విషయము తెలియదు! కంగారు పడవద్దు!అంతవరకు రాదనే ఆశిద్దాం!" అనునయంగా చెప్పాడు యయాతి.
"అవును మిత్రమా! వృషపర్వుడు రాక్షసజాతిలోనే ఎన్నదగిన వాడు. శాంతి కాముకుడు. అనవసరంగా ఎవ్వరినీ యుద్దానికి కవ్వించడు. చూద్దాం!" ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు శక్తిధరుడు.
"చారుమతీ! నువ్వు కూడా మాతో పాటు పుష్కర ద్వీపానికి వస్తావా!" అడిగాడు యయాతి.
"వస్తాను యయాతీ! మా వాళ్ళను చూసినట్లుగా ఉంటుంది. అందులో నా ప్రియమిత్రుడైన కచుడిని చూచి చాలా కాలం అయ్యింది." అంది చారుమతి.
"మొత్తానికి నీకు ప్రియమైన మిత్రుడు కచుడన్నమాట! ఇంకా నేననుకొని భ్రమ పడుతున్నాను!" నవ్వుతూ అన్నాడు యయాతి.
వెంటనే యయాతి చేతి మీద ముక్కుతో గట్టిగా పొడిచింది చారుమతి.
"అబ్బా!.. చూశావా! నువ్వు నా మీద ఎంత కోపం చూపిస్తావో మీ కచుడికి చెప్పాలి!" అంటూ పెద్దగా నవ్వాడు యయాతి.
"చెప్పుకో! చెప్పుకో! రేపు నీ వివాహమయ్యాక శర్మిష్ఠరాణితో నీ గురించి ఎన్ని చాడీలు చెప్తానో చూడు!" అంటూ ఎగిరిపోయింది చారుమతి.
మిత్రులు ముగ్గురు నవ్వుతూ దానినే చూస్తున్నారు.
======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.



Comments